Karthika Deepam 2 November 11th: జ్యోత్స్నను ఓడించిన దీప.. కార్తీక్‌, శివన్నారాయణలకు షాకిచ్చిన వంటలక్క

Photo Courtesy: JioHotstar

కార్తీక్, దీపలు భోజనం ఏర్పాట్లు చేస్తుండగా సుమిత్ర, పారిజాతంలను ఆఫీసులో చూసి షాక్ అవుతారు. మీతో నేను విడిగా మాట్లాడాలని శివన్నారాయణను పక్కకి తీసుకెళ్తుంది పారిజాతం. ఆ వెనుక కార్తీక్, జ్యోత్స్నలు కూడా వెళ్తారు. సొంత మనవరాలిని కాదని పనిమనిషి దీపను సీఈవోగా చేయడానికి నేను ఒప్పుకోనని మండిపడుతుంది పారు. దీపను సీఈవోగా చేయాలని మాకు లేదని, కానీ నువ్వు చెప్పిన తర్వాత నాకు ఆలోచన వచ్చిందని అంటాడు శివన్నారాయణ. దీపను కనుక సీఈవోగా అనౌన్స్ చేస్తే దానిని పొడిచి పొడిచి చంపుతానని జ్యోత్స్నకి చెబుతుంది పారు.

బోర్డ్ మీటింగ్‌లో కంపెనీ కొత్త సీఈవోగా సమర్ధులైన వారికే బాధ్యతలు అప్పగించమని చెబుతుంది సుమిత్ర. ఆ మాటలతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. కంపెనీ లోపల ఉన్నా, బయట ఉన్నా నా సేవలు ఈ సంస్థకు ఉంటాయని.. కానీ ప్రస్తుతానికి తాను సీఈవోగా కొనసాగలేనని చెబుతాడు కార్తీక్. ఈ కంపెనీ కొత్త సీఈవోగా తన భార్య దీపను ప్రపోజ్ చేస్తున్నానని కార్తీక్ చెప్పడంతో బోర్డు మెంబర్స్, జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 11వ తేదీ 512వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 512 November 11th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

కొత్త సీఈవోగా దీపను అనౌన్స్ చేయడంతో జ్యోత్స్న, పారులతో పాటు బోర్డ్ మెంబర్స్ షాక్ అవుతారు. ఆ నిర్ణయంతో దీప అలిగి వెళ్లిపోతుంది. దాంతో కార్తీక్ ఆమెను ఆపాలని ప్రయత్నిస్తాడు. నేను లోపలికి కూడా రాను అన్నాను, నువ్వే నా పక్కన నిలబడమన్నావని మండిపడుతుంది. ఈ కుటుంబం కోసం ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు నేనే కాదు, నువ్వు కూడా బలంగా నిలబడాలని చెప్పాను కదా అంటాడు కార్తీక్. నిర్ణయం ఏదైనా కావొచ్చు.. నీతో నేను ఉన్నాను అని భార్యకు ధైర్యం చెప్పి లోపలికి తీసుకొస్తాడు. జ్యోత్స్నకు అన్యాయం జరుగుతోందని అడ్డుపడాలని సుమిత్రను రెచ్చగొడుతుంది పారిజాతం. అక్కడ మనకంటే పెద్దవాళ్లు ఉన్నారని చెబుతుంది సుమిత్ర.

నా తరపున నా భార్యను సీఈవో స్థానానికి ప్రపోజ్ చేస్తున్నానని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న చప్పట్లు కొడుతుంది. భర్త తరపున భార్యను ఎన్నికల్లో నిలబెట్టడం రాజకీయాల్లో మాత్రమే చూశాం.. ఇప్పుడు ఆ ఆచారాన్ని మన మాజీ సీఈవో గారు బోర్డ్ మీటింగ్స్‌కి కూడా తీసుకొచ్చారని సెటైర్లు వేస్తుంది. నిలబడటానికి అర్హత ఉండాలని అలాంటి మనిషి సీఈవోగా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. ఈ వంటలక్క మీకు కాబోయే సీఈవో అంటూ బోర్డ్ మెంబర్స్‌తో వెటకారంగా మాట్లాడుతుంది. ఒక చిన్న మిస్టేక్ జరిగినా, నా వల్ల కంపెనీకి నష్టాలు వచ్చాయని దండయాత్ర చేశారు కదా అని మండిపడుతుంది జ్యోత్స్న.

ఐదో తరగతి చదువుకున్న పల్లెటూరి మొద్దు.. మన కంపెనీకి సీఈవో అయితే మనం దివాళా తీయడం కాదు, మన రెస్టారెంట్స్‌ని వేలం పాటలో అమ్ముకోవాల్సిందేనని అంటుంది. ఆ మాటలతో కార్తీక్ సీరియస్ అవుతాడు. సీఈవో పోస్ట్ అంటే ఏంటో, దాని బాధ్యతలు ఏంటో ఒక మాజీ సీఈవోగా మీకు తెలియదా అని నిలదీస్తుంది జ్యోత్స్న. వంటగదిలో గరిటె తీప్పడం తప్పించి దీపకు ఏం తెలుసు? ధైర్యంగా బోర్డ్ మీటింగ్‌లో మాట్లాడగలదా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. లాప్‌టాప్ ఆపరేట్ చేస్తుందా? ఇంగ్లీష్ చదవడం కూడా రాని ఈ మనిషి ఎలా సీఈవోగా ఓకే చేస్తామని అంటుంది. బోర్డ్ మెంబర్స్ దీనిని ఒప్పుకోరని చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారిజాతం సంబరపడిపోతుంది.

సీఈవో జ్యోత్స్నగారు చెప్పింది కరెక్టే.. అన్ని తెలిసి కూడా నా భార్యను ఈ పోస్ట్‌కు ప్రపోజ్ చేశానంటే తన మీద నాకెంత నమ్మకం ఉండాలని అంటాడు కార్తీక్. అసలు దీప ఎవరో తెలిస్తే ఈ మనిషికి ఉన్న అర్హత, యోగ్యత ఏంటో తెలుస్తాయని చెబుతాడు. జరిగిన అవమానంతో తాను వెళ్లిపోతానని దీప చెబుతుంది. నా భార్య కోసం నేను నిలబడతాను, నీ భర్త కోసం నువ్వు నిలబడవా? అని ప్రశ్నిస్తాడు కార్తీక్. ఓ మారుమూల ప్రాంతంలో పుట్టిన దీప 5వ తరగతి వరకే చదువుకుంది. తన తండ్రి కోసం చదువును వదిలేసి హోటల్‌లో పనులు చేసింది.. ఆటలు ఆడుకునే వయసులోనే వంటలు చేయడం మొదలుపెట్టింది, కస్టమర్స్‌ని హోటల్‌కి రప్పించడానికి రకరకాల స్కీమ్స్‌ని పెట్టిందని చెబుతాడు కార్తీక్. ఆ వూళ్లో వంటలక్కగా, అన్నపూర్ణగా పిలుచుకునే దీపకు వంటలు ఎలా చేయాలో? ఆదాయం ఎలా పెంచాలో? తెలుసని అంటాడు కార్తీక్.

ఇదంతా దీపకు ఓ వైపే.. దీవాళా తీసిన సత్యరాజ్ రెస్టారెంట్‌ని నేను తీసుకున్నాను, అది సాధించిన విజయం మీ అందరికీ తెలిసిందేనని చెబుతాడు కార్తీక్. కస్టమర్ల టేస్ట్‌కి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త వంటకాలను ప్రయత్నిస్తూనే ఉందని అంటాడు. అవార్డ్ రావడానికి కారణం దీపే.. టీమ్‌తో రెగ్యులర్‌గా మాట్లాడుతూ, రెస్టారెంట్ ఎలా క్లీన్‌గా ఉండాలి, ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి? ఇలా ప్రతి విషయంలోనూ దీపకు లోతైన అవగాహన ఉందని చెబుతాడు కార్తీక్. దీప సరిపోవడానికి ఇవన్నీ సరిపోవా? అని ప్రశ్నించగా.. సరిపోవని, దీపను సీఈవోగా నేను ఒప్పుకోనని అంటుంది జ్యోత్స్న. నాకున్న చదువు, నాకున్న హోదాయే అర్హత అని చెబుతుంది జ్యోత్స్న. మరి మీరెందుకు రెస్టారెంట్‌కు ఈ గతి పట్టించారని కార్తీక్ నిలదీస్తాడు.

నా మనవరాలిని అవమానిస్తున్నాడని పారిజాతం మండిపడుతుంది. దీపకున్న అర్హత ఏంటో చెప్పాడని అంటాడు. బోర్డ్ మెంబర్స్ అంతా కలిసి సీఈవోని ఎన్నుకోవాలి? కానీ ఈ మనిషిని తీసుకొచ్చి సీఈవో అంటే అదెలా కుదురుతుందని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. ఎంపిక న్యాయంగా జరగాలంటే ఓటింగ్ పెడదామని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ పోటీకి నేను సిద్ధమని.. తేల్చుకుందామని అంటుంది. ఈ ఓటింగ్‌లో కార్తీక్, దీప, జ్యోత్స్న, సుమిత్ర, పారిజాతానికి ఓటు హక్కు లేదని చెబుతాడు శివన్నారాయణ. నీ కూతురి పేరు రాయమని దశరథకు చెప్పమని పారు రెచ్చగొట్టినా సుమిత్ర లెక్కచేయదు. చివరికి ఓటింగ్‌లో దీప గెలవడంతో ఆమెను సీఈవోగా ప్రకటిస్తాడు శివన్నారాయణ.

ఈ సంస్థను నడిపించే సమర్ధత నీకుందని అందరూ నమ్ముతున్నారని, నువ్వు కూడా నమ్మాలని.. నీ వెనుక నేనున్నానని దీపతో చెబుతాడు కార్తీక్. ఈ సంస్థను సమర్ధవంతంగా నడిపించగలనని నమ్మి నాకు ఓటేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలని, మా బావ లేకపోతే నేను లేనని, మీ నమ్మకాన్ని నేను గౌరవిస్తానని చెప్పలేకపోతున్నందుకు క్షమించండి అంటుంది దీప. నీ భర్త నిన్ను సీఈవోని చేశాడు, న్యాయబద్ధంగా నిన్ను సీఈవోగా ఎన్నుకున్నారని అంటాడు శివన్నారాయణ. నాకు ఈ స్థానం వద్దని తేల్చేస్తుంది దీప. ఇక్కడ సీఈవోగా నువ్వుండాలని, కానీ కొందరు అవమానించి నిన్ను పంపించారని చెబుతుంది. నిన్ను రెండుసార్లు అవమానించిన ఈ స్థానంలో నేనుండలేనని, నేను సీఈవో స్థానంలో ఉంటే నీ స్థానమేంటీ? అని ప్రశ్నిస్తుంది దీప. డ్రైవర్ పోస్టే కదా అని జ్యోత్స్న అంటుంది. నిన్ను మించిన స్థానం నాకొద్దు.. నాకు నువ్వు చాలని చెబుతుంది దీప. దాంతో దీపను శివన్నారాయణ ప్రశంసిస్తాడు.

అర్హత లేకపోయినా అధికారం కోసం ఆశపడేవాళ్లు ఒకరు, అర్హత ఉన్నా చేతికొచ్చిన అధికారాన్ని వదిలేసిన వాళ్లు మరొకరని చెబుతాడు శివన్నారాయణ. సమస్యను తట్టుకోవాలంటే ధైర్యం కావాలి, భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే తన మీద ఎక్కడ నిందపడుతుందని ముందుగానే జాగ్రత్త పడుతోందని అంటుంది పారిజాతం. ఇదే మాట నేను ముందు చెబితే నా భర్తను అవమానించిన దాన్ని అవుతానని అంటుంది దీప. వెనకుండి ఈ నాటకాలన్నీ నువ్వే నడిపిస్తున్నావని కార్తీక్‌పై మండిపడుతుంది పారు. నువ్వు సీఈవోగా అవ్వడానికి జ్యోత్స్న ఒప్పుకోలేదని నీ భార్యని అడ్డుపెట్టుకుని జ్యోత్స్నని ఇలా ఓడించావని అంటుంది. దీప సీఈవోగా ఉండను అంటోంది కాబట్టి జ్యోత్స్ననే ఆ స్థానంలో ఉంచండి అని చెబుతుంది పారు. ఒక్క ఓటు కూడా పడని మనిషికి అధికారం ఎలా ఇవ్వమంటావని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. నేను, దీప, బావ కాక ఈ సంస్థకు కొత్త సీఈవో ఎవరు అని జ్యోత్స్న ప్రశ్నించగా.. ఓ వ్యక్తి స్టైల్‌గా ఆఫీసులోకి వస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X