Karthika Deepam 2 November 12th: జ్యోత్స్నకి షాకిచ్చిన శివన్నారాయణ..సీఈవోగా శ్రీధర్, కత్తితో దొరికిపోయిన పారు

Photo Courtesy: JioHotstar

కొత్త సీఈవోగా దీపను అనౌన్స్ చేస్తూ కార్తీక్ తన ప్రపోజల్‌లను చెప్పడంతో బోర్డ్ మెంబర్స్ అంతా షాక్ అవుతారు. ఊహించని పరిణామంతో ఖంగుతిన్న దీప అలిగి వెళ్లిపోతుండగా కార్తీక్‌ ఆమెను తిరిగి తీసుకొస్తాడు. సీఈవో అవ్వడానికి అర్హత కావాలని జ్యోత్స్న చెప్పడంతో.. దీప వల్లే తాను సత్యరాజ్ రెస్టారెంట్‌ను నెంబర్ వన్‌గా నిలబెట్టానని చెబుతాడు కార్తీక్. వంట చేయడంతో పాటు బిజినెస్‌ను ఎలా డెవలప్ చేయాలో దీపకు తెలుసని చెబుతాడు.

అయినప్పటికీ జ్యోత్స్న, పారులు ఒప్పుకోకపోవడంతో కొత్త సీఈవో ఎంపిక కోసం జ్యోత్స్న, దీపలకి ఓటింగ్ పెడతాడు శివన్నారాయణ. ఓట్లన్నీ దీపకే పడటంతో కొత్త సీఈవోగా ఆమెను ప్రకటిస్తారు. అయితే తనకు ఈ బాధ్యతలు వద్దని.. మా బావ డ్రైవర్‌గా ఉంటే, నేను సీఈవోగా ఉండలేనని తిరస్కరిస్తాడు. మరి కంపెనీకి కొత్త సీఈవో ఎవరు? అని జ్యోత్స్న అడగ్గా.. ఓ వ్యక్తి ఆఫీసులోకి నడుచుకుంటూ వస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 12వ తేదీ 513వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 513 November 12th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

సీఈవోగా దీప ఉండకపోవడంతో బావ కాక, నేను కాక, దీప కాక మరి కొత్త సీఈవో ఎవరని అడుగుతుంది జ్యోత్స్న. ఎప్పుడైతే దీప సీఈవోగా ఉండను అన్నదో ఆ క్షణమే మేం అనుకున్న వ్యక్తికి మెసేజ్ వెళ్లిపోయిందని అంటాడు శివన్నారాయణ. ఎవరా మనిషి? అని జ్యోత్స్న అడగ్గా.. ఆయన వచ్చారని మేనేజర్ చెబుతాడు. అందరూ కాబోయే సీఈవో ఎవరా అని చూస్తుండగా శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఎప్పుడూ పంచెలో కనిపించే శ్రీధర్.. సూటు బూటుతో కనిపించడంతో పారు షాక్ అవుతుంది. ఇప్పటికైనా కొత్త సీఈవో ఎవరో చెబుతారా? అని అడుగుతుంది జ్యోత్స్న. ఎదురుగా మనిషిని పెట్టుకుని ఎవరు? అని అడుగుతావేంటీ? అని మండిపడతాడు శివన్నారాయణ.

మావయ్య సీఈవో కావడానికి అర్హత ఏంటీ? అని జ్యోత్స్న నిలదీస్తుంది. ఈ కంపెనీకి సీఈవో కావాలంటే రెండేసి పెళ్లిళ్లు చేసుకుని ఉండాలా అని అనడంతో శివన్నారాయణ సీరియస్ అవుతాడు. ఇది పర్సనల్ లైఫ్ డిస్కస్ చేసే ప్లేస్ కాదని అంటాడు. బిజినెస్‌మెన్‌గా శ్రీధర్ సక్సెస్‌ఫుల్ పర్సన్ అని.. ఆయన జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌కి సీఈవోగా ఉంటారని చెబుతాడు శివన్నారాయణ. అలాగే కార్తీక్‌ని ఈ బోర్డుకు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మాజీ సీఈవోని వెంటనే రాజీనామా చేయాల్సిందిగా చెబుతాడు శివన్నారాయణ. జ్యోత్స్నతో సీఈవోగా రాజీనామా చేయించి శ్రీధర్‌కు అపాయింట్‌మెంట్ ఇస్తాడు.

మీలో ఎవరికైనా నా నిర్ణయాల మీద అభ్యంతరాలుంటే చెప్పొచ్చని అడుగుతాడు శివన్నారాయణ. శ్రీధర్ గారు కార్తీక్ సార్ ఫాదర్.. పైగా కార్తీక్ సార్ కూడా మనతోనే ఉన్నాడని అంటారు బోర్డు మెంబర్స్. మళ్లీ మీటింగ్ పెట్టుకుందామని అందరితో చెబుతాడు శివన్నారాయణ. శ్రీధర్‌కి అందరూ కంగ్రాట్స్ చెప్పగా.. ఇక్కడ నా అవసరం ఏం లేదని కోపంగా వెళ్తుంది జ్యోత్స్న. అందరూ ఇంటికి వెళ్తుండగా మీటింగ్ హాల్‌లో కత్తి కనిపించడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. దానిని జాగ్రత్తగా పెట్టమని కార్తీక్‌తో చెబుతాడు. శ్రీధర్‌ని తీసుకెళ్లి సీఈవో ఛైర్‌లో కూర్చోబెడతాడు శివన్నారాయణ. జ్యోత్స్న మాజీ సీఈవో, పైగా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఆమె కూడా కంపెనీలో ఉంటే మంచిదని అంటాడు శ్రీధర్.

అంతా హ్యాపీయా.. నువ్వు సాధించావని శ్రీధర్‌తో చెబుతాడు కార్తీక్. ఇదంతా నువ్వు ఇచ్చినదే.. కార్తీక్ ఫాదర్‌వి కాబట్టే నీకు పదవి ఇచ్చానని తాతయ్య చెప్పాడని అంటాడు శ్రీధర్. నా కొడుకు నన్ను గెలిపించాడు, నేను తన కూతురికి అన్యాయం చేశానని నన్ను కొట్టి మరి ఇంట్లోంచి గెంటేశాడని గుర్తుచేస్తాడు శ్రీధర్. ఇప్పుడు అదే మనిషి గౌరవమైన స్థానంలో కూర్చోబెట్టాడని అంటాడు శ్రీధర్. నాలో మార్పుకు కారణం నువ్వే, ఇది తండ్రిని గెలిపించిన కొడుకు కథ అని చెబుతాడు. తల్లికి అన్యాయం చేసినందుకు తండ్రిని కొట్టాలి, కానీ నువ్వు కొట్టలేదు, జీవితంలో నా ముఖం చూడకూడదు.. కానీ నువ్వు అలా చేయలేదు. నా మీద పగని కాకుండా ప్రేమని పెంచుకున్నాడని అంటాడు శ్రీధర్.

తండ్రిని మించి ఎదిగిన కొడుకువి నువ్వు.. తండ్రి చేతే జీవిత పాఠాలు దిద్దించిన కొడుకువి నువ్వు అని అంటాడు. తలకొరివి పెడితేనే తండ్రి రుణం తీరుతుందని అంటారు, కానీ నీ రుణం ముందే తీరిపోయిందని చెబుతాడు శ్రీధర్. ఏ తండ్రైనా కొడుక్కి ఓ కుటుంబాన్ని ఇస్తాడు, కానీ నా కొడుకే నాకు కుటుంబాన్ని ఇచ్చాడని అంటాడు. నేను పొగొట్టుకున్న కుటుంబాన్ని నాకు తిరిగి ఇచ్చాడు. నువ్వు నా కొడుకువి కాకపోయుంటే చిన్న వాడివైనా నా కాళ్లు పట్టుకునేవాడిని అంటాడు శ్రీధర్. నువ్వు ఇచ్చిన ప్రాణం.. మనందరం కలిసి ఉండాలని చెబుతాడు కార్తీక్. మనందరం అనే మాటలో మీరుంటే, మీతో పాటు నేను కూడా ఉంటానా? మీ అమ్మ నన్ను క్షమిస్తుందా? అని అడుగుతాడు శ్రీధర్. కొన్ని ప్రశ్నలకు సమాధానం వెంటనే దొరకదని టైం పడుతుందని అంటాడు కార్తీక్. ఈరోజు మనింట్లో కాంచనతో నేను భోజనం చేశానని శ్రీధర్ అనగా.. నువ్వు కార్తీక్ తండ్రివి కాబట్టి అని ఆన్సర్ ఇస్తాడు కార్తీక్. కాంచన క్షమిస్తుందనే ఆశతో ఎదురుచూశానని మనసులో అనుకుంటాడు శ్రీధర్.

పారిజాతం తీసుకొచ్చిన కత్తి గురించి ఇంట్లో పంచాయతీ పెడతాడు శివన్నారాయణ. నువ్వు మా ఆవిడని ఏసేద్దామని తెచ్చావు కదా అని పారిజాతంను అడుగుతాడు కార్తీక్. ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి తీసుకొచ్చానని పారు చెప్పగా.. ఫ్రూట్స్ ఎక్కడ అని నిలదీస్తాడు కార్తీక్. ఇంతలో జ్యోత్స్న వచ్చి ఆ కత్తిని లాక్కొని .. ఇక్కడ జీవితాలు తలకిందులు అయిపోతుంటే మీరు కత్తి, సుత్తి అని పంచాయతీలు పెట్టుకుంటారా? అని మండిపడుతుంది. జ్యోత్స్న చేతిలో లగేజ్ ఉండటంతో ఎక్కడికి అని అడుగుతుంది పారిజాతం. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని చెబుతుంది జ్యోత్స్న. నాకు ఇక్కడ ఎవరూ లేరు? అందుకే వెళ్లిపోతున్నానని అంటుంది.

నా ఫ్రెండ్స్ కెనడాలో ఉన్నారు? నేను అక్కడికే వెళ్లిపోతున్నానని చెబుతుంది. నువ్వు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావని సుమిత్ర అడగ్గా.. మీరు ఎవరిని అడిగి శ్రీధర్ మావయ్యని సీఈవోని చేశారని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. పెద్దవాళ్ల నిర్ణయాల్ని పిల్లలు గౌరవించాలని సుమిత్ర అనగా.. పిల్లల మనసుల్ని కూడా పెద్దవాళ్లు అర్థం చేసుకోవాలని అంటుంది జ్యోత్స్న. నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వెందుకు నిరూపించుకోలేకపోయావని ప్రశ్నిస్తాడు దశరథ. నచ్చిన మనిషి ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తామని, అదే నచ్చని మనిషి అయితే ఎప్పుడు తప్పుకుంటాడా అని ఎదురుచూస్తామని అంటుంది జ్యోత్స్న. ఒకప్పుడు ఈ ఇంట్లో నాకేం కావాలని అడగటానికి నాకు నలుగురు ఉండేవారని, ఇప్పుడు నాకు ఇది కావాలని అడిగినా నాకు ఇచ్చేవాళ్లు ఎవరూ లేరని చెబుతుంది. నా ఇంటి వారసుడు ఎవరి ముందు తలదించుకోకూడదన్న తాత... ఈరోజు నన్ను మెడ పట్టుకుని గెంటేశాడని అంటుంది జ్యోత్స్న.

సీఈవోగా నేను ఉంటానంటే కాదని బావకి ఇచ్చావు.. మీరు అనుకున్నది జరగలేదు, దీపకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నా భర్తను అవమానించిన స్థానం నాకు అక్కర్లేదని సీఈవో పోస్ట్‌ని పడేసి పక్కకు పోయిందని చెబుతుంది జ్యోత్స్న. ఈసారి ఎవరొస్తారా? అని అనుకుంటే ఇంటి అల్లుడిని పిలిచి ఆ పోస్ట్‌లో కూర్చోపెట్టారని మండిపడుతుంది. వీరందరి ముందు తలదించుకుని నేను ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తుంది. మేమంతా నీకు లేమా? అని దశరథ ప్రశ్నించగా.. నువ్వు నాకు ఓటేశావా? దీపకు ఓటేశావా? అని నిలదీస్తుంది జ్యోత్స్న. వ్యాపారాన్ని, వ్యక్తిగతాన్ని వేరుగా చూడొద్దని తాతయ్య ఎప్పుడో చెప్పాడు కదా అని అంటాడు దశరథ. అందుకే నేను దేశాన్ని వదిలి వెళ్లిపోతానని చెబుతుంది జ్యోత్స్న. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని కార్తీక్ చెబుతాడు. నిన్ను ఎండీని, ఆ తర్వాత దీపని ఛైర్మన్‌ని చేస్తారని... ఇక్కడే ఉండి ఈ ఘోరాల్ని చూడలేనని జ్యోత్స్న వెళ్లిపోతుండగా శ్రీధర్ వస్తాడు. గుర్తింపు, గౌరవాన్ని నేను కోరుకోవడం లేదని.. నాకు మీ ప్రేమ కావాలని చెబుతాడు శ్రీధర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X