Karthika Deepam 2 November 13th: శ్రీధర్ సీఈవో కావడం వెనుక..కార్తీక్‌కి షాకిచ్చిన శివన్నారాయణ, పగతో జ్యోత్స్న

Photo Courtesy: JioHotstar

బావ, దీప, నేను కాకుండా కొత్త సీఈవోగా ఎవరినీ ఎంపిక చేశావని శివన్నారాయణని నిలదీస్తుంది జ్యోత్స్న. ఇందలో సూట్ బూట్‌లో స్టైల్‌గా శ్రీధర్ ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాక్ అవుతారు. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌కి కొత్త సీఈవోగా శ్రీధర్‌ని నియమించానని, నువ్వు రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. బయటకు వెళ్తున్న శివన్నారాయణకు పారు కూర్చొన్న దగ్గర కత్తి దొరకడంతో దానిని జాగ్రత్తగా దాయమని కార్తీక్‌తో చెబుతాడు.

శ్రీధర్‌ను సీఈవో చైర్‌లో కూర్చోబెట్టి ఆల్ ది బెస్ట్ చెబుతాడు శివన్నారాయణ. నన్ను నా కొడుకు గెలిపించాడని కార్తీక్‌ని మెచ్చుకుంటాడు కార్తీక్. జ్యోత్స్నకి కూడా ఈ కంపెనీలో ఏదో ఒక పోస్ట్ ఉండాలని చెబుతాడు శ్రీధర్. తనకు ఘోర అవమానం జరగడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి జ్యోత్స్న సిద్ధమవుతుంది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆపడానికి ట్రై చేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 13వ తేదీ 514వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 514 November 13th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

ఇల్లు వదిలి వెళ్లిపోతానన్న జ్యోత్స్నని ఆపడానికి ప్రయత్నిస్తాడు శ్రీధర్. నీ మీద నాకేం కోపం లేదు, ఏదో సాధించానన్న గర్వం లేదు.. నీ కోసమే ఇక్కడికి వచ్చానని చెబుతాడు. నువ్వు సీఈవోగా లేకపోయినా కంపెనీలో ఉండాలని చెబుతాడు శ్రీధర్. నా భార్యను పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టినప్పుడు తప్పించి నేను ఎప్పుడైనా కోప్పడ్డానా? అని అడుగుతాడు. బావ, దీపలు వెనకుండి చేసుకుంటూ పోతుంటే మీరు అనాల్సింది ఏం ఉంటుందని ప్రశ్నించింది జ్యోత్స్న. ఇప్పుడు మీ కోపం ఎవరి మీదో చెప్పండి అని దీప అడగ్గా.. అది నీకు చెప్పినా అర్ధం కాదని, చేతులు కట్టుకుని నిలబడటానికి అలవాటు పడ్డ జీవితానికి కూర్చోవడానికి చోటిస్తే ఎగిరి గంతేస్తారు. కానీ శాసించే స్థాయిలో ఉండి జీవితానికి చిన్న అవమానం అడవిలో నిప్పు రవ్వ లాంటిదిని అంటుంది జ్యోత్స్న. అది చెట్టునే కాదు.. అడవినే తగలబెడుతుందని చెబుతుంది.

నా మీద ఎవ్వరూ జాలి చూపించాల్సిన అవసరం లేదు, జరిగిన అవమానం చాలు, నేను ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటుంది జ్యోత్స్న. దాంతో వెళ్లిపోమ్మని కోపంగా చెబుతాడు శివన్నారాయణ. ఆయన మాటలతో అందరూ షాక్ అవుతారు. వెనుకా ముందు ఆలోచించని తొందరపాటే నీ చేత ఈరోజు మరో తప్పు చేయిస్తోందని, మేం ఎవ్వరూ నీకు వద్దు అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కటేనని అంటాడు. అది బాధలో వెళ్లిపోతానంటే మీరు కూడా అలా మాట్లాడాతారా? అని పారిజాతం సీరియస్ అవుతుంది. నేనూ బాధలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటానని, జ్యోత్స్న భవిష్యత్ ఏమవుతుందోనని సుమిత్ర బాధపడుతోందని చెబుతాడు.

ఈ విషయం నాన్న నాకు ఎప్పుడో చెప్పాడని అంటాడు దశరథ. ఇటు బిజినెస్ చూసుకోలేక, అటు పర్సనల్ లైఫ్ సరిగా లేక నా కూతురి జీవితం ఏమైపోతుందోనని భయంగా ఉందని సుమిత్ర నాన్న దగ్గర బాధపడిందని అందుకే నాన్న కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారని చెబుతాడు దశరథ. నీ సంతోషాన్ని మించి నేను కోరుకునేది ఏం లేదు, జ్యోత్స్న సీఈవోగా ఉండాలని ఒక్క మాట చెబితే నేను తాతని ఒప్పిస్తానని కార్తీక్ అంటాడు. నీ కోసం ఏదైనా వదులుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెబుతాడు. నా నిర్ణయంలో ఎప్పుడూ మార్పులేదని, బాధ్యతలన్నీ భుజాన వేసుకుని నిరంతరం ఏదో ఒక సమస్యతో పరిగెత్తే జీవితంలో ఉండాలని నేను కోరుకోవడం లేదని జ్యోత్స్నతో చెబుతుంది సుమిత్ర.

మీ తాత, మీ నాన్న నీకు మంచి సంబంధం చూస్తారు పెళ్లి చేసుకోమని చెబుతుంది. ఒక తల్లిగా ఇంతకుమించి నేనేం కోరుకోవడం లేదని జ్యోత్స్న బ్యాగ్‌ని లోపలికి తీసుకెళ్తుంది సుమిత్ర. రేపటి నుంచి నువ్వు నాతో పాటు వస్తున్నావు.. కంపెనీ లాభనష్టాలు, ఇతర వివరాలన్నీ నాకు నువ్వే చెప్పాలని జ్యోత్స్నతో అంటాడు శ్రీధర్. నువ్వు ఆఫీస్‌లో అసిస్టెంట్‌వి కాదు.. ఛైర్మన్‌గారి మనవరాలి పోస్ట్ అంటాడు కార్తీక్. నువ్వు పెద్ద మాయలోడివి, పైకి ఏం తెలియనట్లు ఉంటావు కానీ అన్నీ వెనుక నుంచి నడిపించేది నువ్వేనని అంటుంది పారిజాతం. నువ్వు పనిమనిషివి, కార్తీక్ డ్రైవర్, మీ మావయ్య సీఈవో.. మిగిలిన మూడు కాలను కూడా తీసుకొచ్చి ఏదో ఒక పోస్ట్ ఇవ్వమని సెటైర్లు వేస్తుంది పారు. కాంచన, కావేరి, కాశీలని అంటుంది.

అందరూ కలిసి నా మనవరాలికి అన్యాయం చేశారు.. శ్రీధర్ సీఈవో అవ్వడానికి కారణం కార్తీక్ కాదా అని ప్రశ్నిస్తుంది పారిజాతం. ఇది పూర్తిగా నా నిర్ణయమని అంటాడు శివన్నారాయణ. కంపెనీ విషయాలు, లాభనష్టాలు తప్పించి ఏం మాట్లాడరా? అని ప్రశ్నిస్తుంది పారు. అలాగైతే నా కొడుకుతో అగ్రిమెంట్ రాయించుకోవడం కూడా తప్పేకదా అని అంటాడు శ్రీధర్. 400 మంది ఉద్యోగులున్న కంపెనీని నడిపించే నా కొడుకు, నాలుగు టైర్లున్న కారును నడుపుకుంటున్నాడు. వీడిని ఇలా బంధించారు కాబట్టే ఇంకా జ్యోత్స్న రెస్టారెంట్ మిగిలి ఉందని లేదంటే నా కొడుకు స్పీడుకు సత్యరాజ్ రెస్టారెంట్ మరో నాలుగు బ్రాంచ్‌లు విస్తరించేవని చెబుతాడు శ్రీధర్.

మా రెస్టారెంట్ మిగిలి ఉందంటే జ్యోత్స్న తెలివితేటలే అని మెచ్చుకుంటుంది పారిజాతం. ఈ ఒక్క కారణం చాలు .. జ్యోత్స్నకు సీఈవో పోస్టే కాదు, ఎండీ పోస్ట్ ఇవ్వొచ్చని అంటుంది. ఆమె మాటలకు అందరూ వింతగా చూస్తారు. చావుబతుకుల మధ్య ఉన్న మనిషిని నిలబెట్టి అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకోవడాన్ని తెలివితేటలు అనరు... అలాంటి పని చేయడాన్ని స్వార్ధం అంటారు, మానవత్వం లేకపోవడం అంటారని దీప అంటుంది. సంతకం చేయించుకోవడమే గొప్పతనమైతే, సంతకానికి కట్టుబడి మేరు పర్వతం లాంటి నా బావ.. చిన్న రాళ్ల గుట్ట ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడని చెబుతుంది దీప. శ్రీధర్ అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్తుండగా ఈ ఆనందంలో ఏ ఇంటికి వెళ్తావోనని అంటుంది పారిజాతం.

నన్నెవరూ లోపలికి రమ్మనలేదని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. మీ అమ్మ లగేజీ లోపల పెట్టింది అంటే నిన్ను ఉండమన్నదని అర్ధమని చెబుతుంది పారు. ఇంత ఆస్తిని వదిలేసి ఎక్కడికిపోతావు అని అంటుంది. ఆ తర్వాత కార్తీక్‌ను తీసుకుని విడిగా మాట్లాడతాడు శివన్నారాయణ. మీ నాన్న సీఈవో కావడం పూర్తిగా నా నిర్ణయమేనని వీళ్లకి అర్ధం కావడం లేదని అంటాడు. ఎందుకు? ఏమిటీ? అని నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాదేనని అంటాడు పెద్దాయన. నువ్వు సీఈవో అయితే బాగుండు.. కానీ జ్యోత్స్న అడ్డుపడుతుందని నాకు ముందే తెలుసు.. అనుకోకుండా దీప పేరు వచ్చింది.. దీప అవకాశం వదులుకుందని చెబుతాడు. అందుకే మీ నాన్నని సీఈవో చేయాలని ముందే అనుకున్నాను కాబట్టి అదే చేశానని అంటాడు శివన్నారాయణ. మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడనే.. మీ అమ్మ ముందు మీ నాన్నని కొట్టాను, ఇంటి నుంచి గెంటేశాను.. నేను చేసిన తప్పే నా కూతురు కూడా చేసిందని చెబుతాడు.

నేను తొందరపడకుండా ఉంటే నా కూతురు భర్త లేని ఆడదానిలా ఉండేది కాదు... నా కూతురికి న్యాయం చేయాలంటే నీ తండ్రిని క్షమించాలి, మీ నాన్నని సీఈవోని చేసినట్లు తెలియగానే మీ అమ్మ ఎంతో కొంత ఆలోచిస్తుందని చెబుతాడు శివన్నారాయణ. మీ అమ్మ నాన్న కలవడానికి మనమే ఏదో ఒకటి చేయాలని అంటాడు కార్తీక్. నాన్నని సీఈవోని చేసినట్లు ఇంటి దగ్గర కాంచనకి చెబుతాడు కార్తీక్. మా ఆయనని సీఈవోని చేయడానికి కారణం వేరే అయ్యుంటుందని అంటుంది కాంచన. మంచి కొడుకుని కన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులని దీప అనగా.. ఆ అదృష్టాన్ని ఇద్దరికీ కలిపి అంటకట్టొద్దని చెబుతుంది కాంచన. నాన్నని సీఈవో చేయాలా వద్దా? అని తాత అడిగితే నువ్వు ఏం చెప్పేదానివి అని కార్తీక్ అడుగుతాడు. దాంతో నువ్వెందుకు సీఈవోగా ఉండను అన్నావని దీపను ప్రశ్నిస్తుంది కాంచన. నా భర్తకు మించిన అధికారం, గౌరవం నాకు అక్కర్లేదని అంటుంది. దీని ప్రకారం పూర్తిగా సీఈవో ఎంపిక అనేది నా తండ్రి నిర్ణయమేనని అంటాడు. దీనిని మనం సెలబ్రెట్ చేసుకోవాలని కార్తీక్ అనగా... ఫోన్ చేసైనా విష్ చేయాలని చెబుతాడు కార్తీక్. దాంతో కాంచన టాపిక్‌ని డైవర్ట్ చేస్తుంది. ఇంతటిలో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X