Karthika Deepam 2 November 14th: కాంచన మాటలతో శ్రీధర్ కంటతడి.. కుమిలిపోతోన్న కార్తీక్

Photo Courtesy: JioHotstar

నువ్వు సీఈవోగా లేకపోయినా కంపెనీలోనే ఉండాలని జ్యోత్స్నతో చెబుతాడు శ్రీధర్. నా మీద ఎవ్వరూ జాలి చూపించొద్దు.. జరిగిన అవమానం చాలని నేను ఇంట్లో ఉండనని అంటుంది జ్యోత్స్న. అయితే వెళ్లిపో అని తేల్చేస్తాడు శివన్నారాయణ. జ్యోత్స్నను పెళ్లికూతురిగా చూడాలని, ఆమె భవిష్యత్ ఏమైపోతుందోనని సుమిత్ర బాధపడినందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతాడు పెద్దాయన. జ్యోత్స్నే సీఈవోగా ఉండాలంటే తాతని నేను ఒప్పిస్తానని, నీ నిర్ణయం చెప్పమని కార్తీక్ అడగ్గా.. జ్యోత్స్న పెళ్లి చేసుకుంటే చాలని అంటుంది సుమిత్ర.

వెనుక నుంచి నడిపించి మీ నాన్నని సీఈవోని చేశావని కార్తీక్‌పై పారిజాతం మండిపడుతుంది. ఇందులో వాడి ప్రమేయం లేదని, ఇదంతా నా నిర్ణయమేనని చెబుతాడు శివన్నారాయణ. కార్తీక్ డ్రైవర్, దీప పనిమనిషి, శ్రీధర్ సీఈవో.. కాంచన, కావేరి, కాశీలకు కూడా ఏదో ఒక పోస్ట్ ఇచ్చేయమని మండిపడుతుంది పారు. కాంచన- శ్రీధర్‌లని కలపాలనే నేను ఇదంతా చేశానని కార్తీక్‌తో చెబుతాడు శివన్నారాయణ. బోర్డ్ మీటింగ్‌లో దీప సీఈవో పోస్ట్ వద్దు అనడం, శ్రీధర్‌ను సీఈవోగా చేయడం గురించి తల్లికి చెబుతాడు కార్తీక్. ఇది మనం సెలబ్రెట్ చేసుకోవాల్సిన విషయమని నాన్నకి ఫోన్ చేసి విష్ చేయమని అంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 14వ తేదీ 515వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 515 November 14th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

బోర్డ్ మీటింగ్‌లో తనకు జరిగిన అవమానంపై జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో పారిజాతం వచ్చి జరిగిందేదో జరిగిపోయింది వదిలేయ్ అంటుంది. ఏంటీ వదిలేసేది ఒక పనికిమాలిన పనిమనిషి ముందు నాకు అవమానం జరిగిందని మండిపడుతుంది జ్యోత్య్స. బావ చేసే ప్రతి పని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని.. దీనికి కూడా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుందని, అదేంటో తెలుసుకోవాలని చెబుతుంది. నీ చేతగానితనం వల్ల కంపెనీ బాధ్యతలు నీ చేతికి ఇస్తే నాశనం చేశావు.. మీ తాత, మీ నాన్న లాంటి తెలివైనవాళ్లు ఉండి కూడా కంపెనీని నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడుకోలేకపోయారని చెబుతుంది పారిజాతం.

నేను అనుకున్నది చేశాను, అందులో ఫెయిల్ అయ్యాను, దానికి ఇంత అవమానించాలా? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నేను తప్పు చేశానన్న బాధ నీలో కొంచెం కూడా లేదు కదా అని అంటుంది పారిజాతం. నేను చేసిన తప్పుల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాను.. సరిదిద్దేలోపే సెండాఫ్ ఇచ్చారు. నన్ను ఓడించాలని అనుకున్న ఎవ్వరినీ వదిలిపెట్టను, దీపని, బావని ప్రశాంతంగా ఉండనివ్వను.. ఈ జ్యోత్స్న ఎంత డేంజరో త్వరలోనే వాళ్లిద్దరికీ అర్ధమయ్యేలా చేస్తానని అంటుంది. ఆ మాటలతో పారిజాతం షాక్ అవుతుంది.

బెడ్‌రూంలో పాలు తీసుకొచ్చిన దీపపై కార్తీక్ మండిపడతాడు. అత్తని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని నేనొక మాట అడిగానని, సాధిస్తున్నావా? అని ప్రశ్నిస్తుంది దీప. అమ్మానాన్నల మధ్య ఏం జరిగింది? ఎందుకు వాళ్లిద్దరూ దూరంగా ఉండాల్సి వచ్చింది? పిల్లలు తల్లిదండ్రులు కలిసుండాలని కోరుకుంటారు కదా అని అంటాడు కార్తీక్. మీ అమ్మానాన్న విడిపోతే నువ్వు చూడగలిగావా? వాళ్లిద్దరినీ కలిపేంత వరకు సరిగా నువ్వు నిద్రపోలేదని చెబుతాడు కార్తీక్. నేను కూడా అలాంటి ఓ సాధారణ కొడుకునే, మా మాష్టారు సరిదిద్దలేని తప్పులు చేశాడు... వాటిని ఎలా సరిదిద్దాలో కూడా తెలియడం లేదు. మా నాన్నని తాత క్షమించాడు... మా అమ్మ ఎప్పుడు దగ్గరికి తీసుకుంటుందో తెలియదని చెబుతాడు కార్తీక్. మనం అందరినీ కలుపుతున్నాం.. వారిలో మా అమ్మానాన్న కూడా ఉండాలని అంటాడు. దాంతో కార్తీక్‌ని క్షమాపణలు అడుగుతుంది దీప. పైకి చెప్పుకోకపోయినా అమ్మానాన్న ఒకరినొకరు తలచుకుంటూనే ఉంటారని చెబుతాడు కార్తీక్.

ఫోన్‌లో కాంచన ఫోటో చూస్తూ బాధపడతాడు శ్రీధర్. అటు కాంచన కూడా భర్తను తలచుకుని ఏడుస్తుంది. ఇద్దరూ ఫోన్ చేయాలని అనుకుంటూ ఉండగా కాంచనకి శ్రీధర్ ఫోన్ చేసి నా కాల్ కోసమే వెయిట్ చేస్తున్నావా అని అడుగుతాడు. మీ కాల్ కోసం చూడటం లేదని అంటుంది కాంచన. నా కాల్ కోసం కాకపోతే ఫస్ట్ రింగ్‌కే ఎందుకు లిఫ్ట్ చేశావని ప్రశ్నిస్తాడు శ్రీధర్. వాడి కాల్ కలవక నాకు చేశారేమో అనుకున్నానని చెబుతుంది కాంచన. కొన్ని జీవితాలు అనుకోవడంలోనే తెల్లారిపోతాయని.. కంపెనీలో ఏం జరిగిందో కార్తీక్ చెప్పే ఉంటాడుగా అని అంటాడు కార్తీక్. నన్ను విష్ చేయాలని అనిపించలేదా? ప్రశ్నిస్తాడు. ఎవరి శుభాకాంక్షల కోసమో ఎదురుచూడాల్సిన అవసరం మీకేం ఉందని అడుగుతుంది కాంచన. నీకు అవసరం లేదేమో నేను ఎదురుచూస్తాను కదా అని అంటాడు శ్రీధర్.

కొన్ని రావు అని తెలిసినప్పుడు ఎదురుచూడటంలో అర్ధం లేదని అంటుంది కాంచన. ఒకప్పుడు నా పక్కన నిలబడటానికి రావాలని అడిగితే మీరు వచ్చారు కదా అని చెబుతుంది. నా మాట మీరు మన్నించినప్పుడు, మీ మాటను నేనెందుకు మన్నించను అని అడుగుతుంది. మన్నించే మనిషివి క్షమించలేవా? అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. క్షమించడానికి మనసు కావాలి? అది చనిపయే సంవత్సరం అవుతోందని, ఇప్పుడు మిమ్మల్ని క్షమించాలంటే మీరు కట్టిన సమాధిలోంచి నా మనసు లేచి బయటకు రావాలని చెబుతుంది కాంచన. చివరికి మావయ్యగారు కూడా నన్ను అర్ధం చేసుకుని క్షమించి దగ్గరికి తీసుకున్నారు.. నువ్వు ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తాడు శ్రీధర్. నా తండ్రి కంటే మిమ్మల్ని ఎక్కువగా నమ్మాను కాబట్టి అని చెబుతుంది కాంచన. ఈ రోజు నేను సాధించాను, కానీ ఆనందం లేదు.. నాకు మీరు కావాలి, మీతో బతికే అవకాశం ఇవ్వమని అడుగుతాడు శ్రీధర్.

ఇప్పుడు మీ భార్య మీ ఇంట్లోనే ఉందని అంటుంది కాంచన. మరీ నీ భర్త ఎవ్వరు అని శ్రీధర్ అడగ్గా.. ఏం సమాధానం చెప్పాలో తెలియక కాంచన సైలెంట్ అయిపోతుంది. బ్రహ్మదేవుడు నా తలరాతని ఎడమ చేతితో రాశాడని బాధపడుతుంది కాంచన. అందుకే అక్షరాలన్నీ వంకరగా వచ్చాయి.. సిరిగల ఇంట్లో పుట్టాను, అన్నీ ఉన్నాయి, అమ్మలేదు.. పెళ్లి చేసుకున్నాను కొడుకు పుట్టాడు, వాడిని ఎత్తుకుని తిరగడానికి కాళ్లకు నడిచే యోగ్యత లేదు. నేను ఇప్పుడు ముత్తయిదవనే కానీ భర్త లేడు... జీవితంలో నేనెప్పుడూ ఒంటరిదాన్నే అని చెబుతుంది కాంచన. మళ్లీ మనం ఒక్కటి కాలేమా అని శ్రీధర్ అడగ్గా.. భర్తకి శుభాకాంక్షలు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కాంచన. నీ కంట్లో కన్నీళ్లు ఈ జన్మకు తుడవగలనా? అని బాధపడతాడు శ్రీధర్. తల్లిదండ్రుల మాటల్ని విన్న కార్తీక్... కాంచనని ఓదారుస్తాడు.

అమ్మానాన్నలు కలిసుండాలని పిల్లలు కోరుకుంటారు కదా? అని అడుగుతాడు కార్తీక్. నా భర్త నా తల తీసేశాడని.. నా పొగరుని చంపేశాడని, నా గెలుపుని పాతిపెట్టాడని చెబుతుంది కాంచన. నలుగురితో మాట్లాడాలన్నా భయం, భర్త చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆడదాన్నని అంటుంది. నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టడానికి నా కొడుకు ఉన్నాడు కాబట్టి.. ధైర్యంగా బతుకుతున్నానని చెబుతుంది కాంచన. నాన్న చాలా తప్పులు చేశాడు కానీ మారాడు, నా కోసం 10 కోట్లు కట్టడానికి క్షణం కూడా ఆలోచించలేదు, ఆ మనిషిలో మార్పుని చూశానని చెబుతాడు కార్తీక్. మన మీద ఆయనకి ఏ కోపం లేదని, ఆయన కోపమంతా దీప మీదేనని.. ఆమె నా ప్రాణదాత అని తెలిశాక ఆ కోపంలో సగం పోయిందని అంటాడు. కోపమైనా, ద్వేషమైనా ఏదో ఒక రోజు పోతుందని చెబుతాడు, నా తల్లి ఎప్పుడూ తలెత్తుకునే ఉంటాడని చెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X