Karthika Deepam 2 November 15th: దీప తిరుగులేని స్ట్రాటజీ.. కోడల్ని మెచ్చుకున్న శ్రీధర్, షాక్‌లో జ్యోత్స్న

Photo Courtesy: JioHotstar

బోర్డ్ మీటింగ్‌లో తనకు జరిగిన అవమానంపై రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతం వచ్చి అయ్యిందేదో అయ్యింది ఇకపై జరగాల్సినది చూడు అని చెబుతుంది. ఒక పనిమనిషి ముందు నాకు అవమానం జరిగింది.. నన్ను ఓడించిన ఎవ్వరినీ వదిలిపెట్టనని జ్యోత్స్న శపథం చేస్తుంది. పాలు తీసుకొచ్చిన దీపపై కార్తీక్ అలుగుతాడు. మీ అమ్మానాన్న బాగుండాలని ఎంత తాపత్రయపడ్డావో.. మా అమ్మానాన్న కూడా బాగుండాలని అనుకున్నానని చెబుతాడు కార్తీక్. నాన్నని తాత క్షమించాడు.. అమ్మ కూడా క్షమించాలని చెబుతాడు.

శ్రీధర్, కాంచన ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తుంటారు. నేరుగా కాంచనకి ఫోన్ చేసిన శ్రీధర్.. నా కాల్ గురించి ఆలోచిస్తున్నావా? అని అడుగుతాడు. అలాంటిదేం లేదని చెబుతుంది శ్రీధర్. మీతో బతకాలని ఆశపడుతున్నానని ఈ జన్మకి నన్ను క్షమిస్తావా? అని అడుగుతాడు. అది ఎప్పటికీ జరగదని కాంచన తేల్చేయడంతో శ్రీధర్ బాధపడతాడు. వారిద్దరి మాటల్ని విన్న కార్తీక్.. తల్లిని ఓదార్చి, నాన్న గురించి ఒకసారి ఆలోచించమని చెబుతాడు. నీకు ఎవరున్నా లేకపోయినా నేను ఉన్నానని అంటాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 15వ తేదీ 516వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 516 November 15th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

ఉదయాన్నే శ్రీధర్ తనకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టడంతో కాంచన రగిలిపోయి వెంటనే భర్తకి ఫోన్ చేస్తుంది. జ్యోత్స్న రెస్టారెంట్స్ సీఈవోగా మొదటి రోజు ఆఫీసుకు వెళ్తున్నానని చెబుతాడు శ్రీధర్. అయితే మీ ఆవిడకి చెప్పి వెళ్లండి అని విసుక్కుంటుంది కాంచన. ఈ మాటల్ని విన్న కార్తీక్.... మాష్టారు ఫోన్ చేశారా అని అడుగుతాడు. ఆమె కాదు అని చెప్పడంతో లైనులో ఉన్న శ్రీధర్ వింటాడు. ఇంతలో దీప రావడంతో ఆమెకు పూలు పెడతాడు కార్తీక్. కొడుకు, కోడలు మాట్లాడుకుంటుంటే వినకూడదని శ్రీధర్ అనుకుంటాడు. కానీ ఏం జరుగుతుందో చూద్దామని భావిస్తాడు. రోజు మీద వెళ్తున్న ఇడ్లీ బండి చూస్తుంటే నా పాత రోజులు గుర్తొచ్చాయని ఎమోషనల్ అవుతుంది దీప.

నేను సైకిల్ మీద టిఫిన్ అమ్మినట్లు.. జ్యోత్స్న రెస్టారెంట్స్ నుంచి చిన్న చిన్న బండ్ల మీద జనాలు ఎక్కువగా ఉన్న చోట పెడితే బాగుంటుందని చెబుతుంది దీప. అదే బ్రాండ్ అదే టేస్ట్... రెస్టారెంట్‌కి వచ్చి తినే దాని కంటే 10 రూపాయలు తక్కువకి ఇస్తే ప్రజలు వస్తారని చెబుతుంది. ప్లాన్ బాగానే ఉంది కానీ వర్కవుట్ అవుతుందా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న రెస్టారెంట్స్ పాత టేస్ట్ మళ్లీ జనాలకి తీసుకెళితే చాలు ఆటోమేటిక్‌గా నచ్చుతుందని అంటుంది. దీని వల్ల అపార్ట్‌మెంట్‌లో వాళ్లకి ఆన్‌లైన్‌లో టిఫిన్ ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతుంది దీప. భార్య ఆలోచన బాగుందని ఆమెకు కంగ్రాట్స్ చెబుతాడు. రెస్టారెంట్‌కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సింది మా నాన్న.. ఆయన ఏ ఐడియాతో వస్తాడోనని అంటాడు కార్తీక్. మావయ్య గారికి ఈ ఐడియా బాగా నచ్చుతుందని చెబుతుంది.

మరోవైపు... కాశీకి అతనికి ఫ్రెండ్ నుంచి పదే పదే ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది స్వప్న. ఇంతసేపు పడుకునేంత లగ్జరీ మనకి లేదని, ఎందుకంటే మనిద్దరికీ జాబ్ లేదు కదా అని అనడంతో స్వప్న షాక్ అవుతుంది. ఇంట్లో మనిద్దరం మేనేజ్ చేస్తున్నామని, అర్జెంట్‌గా జాబ్ వెతుక్కోవాలని చెప్పడంతో రగిలిపోతుంది. ఈరోజు ఎందుకు ఆఫీస్‌కు వెళ్లలేదని కాశీని అడగ్గా.. ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల సిస్టమ్స్ వర్కవుట్ కావడం లేదని చెబుతాడు కాశీ. మరి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావని స్వప్న అడగటంతో కాశీ షాక్ అవుతాడు. మరోసారి అతని ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడుతుండగా ఎందుకు కాల్ కట్ చేశావని అడుగుతాడు. నేను నీతో మాట్లాడలేదని ఆన్సర్ ఇస్తాడు కాశీ. వీరి మాటలను దొంగచాటుగా విన్న స్వప్న.. జాబ్ ఉన్నట్లు కాశీ ఎందుకు మేనేజ్ చేస్తున్నాడని ఆలోచిస్తుంది.

మరోవైపు.. శివన్నారాయణ ఉదయాన్నే గురువు గారికి ఫోన్ చేసి ఇంట్లో అందరికీ జాతకాలు చెప్పడానికి పిలుస్తాడు. ఇది విన్న పారిజాతం ఇప్పుడు అందరి జాతకాలు ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నిస్తుంది. ఇంతలో కార్తీక్, దీప, శ్రీధర్ రావడంతో ఇన్నాళ్లు ఇద్దరే వచ్చేవారు.. ఇక మీదట ముగ్గురూ కలిసొస్తారని సెటైర్లు వేస్తుంది పారు. నాకు కారు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటే కంపెనీ లాభాల్లోకి వచ్చాక ఇవ్వమని చెబుతాడు శ్రీధర్. అనుకుంటేనో, చెప్పుకుంటేనో లాభాలు రావని దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేయాలని అంటుంది జ్యోత్స్న. రెస్టారెంట్ ఎదుగుదల కోసం ఎన్నో ప్లాన్స్ అమలు చేశానని.. అన్ని వర్కవుట్ కాకపోవచ్చు, కానీ ఐడియా ఉండాలని అంటుంది. మీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? అని దీప అడగ్గా...... ఐడియా అంటే వంట చేసినంత తేలిక కాదని అంటుంది జ్యోత్స్న.

ఇప్పుడు మీ నాన్న సీఈవో ..... ఏదైనా ప్లాన్ చెప్పమను అని సెటైర్లు వేస్తుంది పారిజాతం. నాకు సలహా ఇస్తున్నారా? సవాల్ చేస్తున్నారా? అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. మన రెస్టారెంట్‌ని షార్ట్ టైంలో ఎలా డెవలప్‌ చేయాలో నా దగ్గర ఒక ఐడియా ఉందని చెబుతాడు శ్రీధర్. జనం మనం రెస్టారెంట్‌కి వచ్చి టిఫిన్ చేయాలి, భోజనం చేయాలి.. అదే మనం జనం దగ్గరికి వెళ్లామనుకోండి అంటాడు శ్రీధర్. ఎలా అని దశరథ అడగ్గా.. ఫుడ్ కోర్ట్ పెట్టి అని అంటాడు. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. రెస్టారెంట్ పేరు మీద ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసి మనమే పబ్లిక్‌లోకి వెళ్దామని చెబుతాడు శ్రీధర్. రెస్టారెంట్ మూసేసి రోడ్ల మీదకి వెళ్లడం ఏంటీ? అని సెటైర్లు వేస్తుంది పారిజాతం.

ఫుడ్ కోర్డ్ ప్లాన్ బాగానే ఉంది కానీ ఇంకా డిటెయిల్డ్‌గా చెప్పమని అంటాడు శివన్నారాయణ. ఈ ఐడియా బాగుందని సుమిత్ర, దశరథలు కూడా అంటారు. మీ అందరికీ నచ్చింది కదా .. కానీ ఈ ఐడియా నాది కాదని చెబుతాడు శ్రీధర్. ఎవరిది అని అని జ్యోత్స్న అడగ్గా.. దీపది అని శ్రీధర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఈ ఐడియా తను చెబితేనే బాగుంటుందని అంటాడు. మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు వీరి మాటల్ని విన్నానని, ఇంటి దగ్గర కూడా వీరిద్దరూ రెస్టారెంట్ డెవలప్‌మెంట్ కోసమే ఆలోచిస్తున్నారన చెబుతాడు శ్రీధర్. వీళ్ల ఆలోచనలు ఎప్పుడూ మా ఇంటి చుట్టూ, మా ఆస్తి చుట్టూనే ఉంటాయని అంటుంది జ్యోత్స్న. మాకు అన్నం పెట్టే చేతులు, ఆశీర్వదించే మనుషులు బాగుండాలని కోరుకుంటామని సెటైర్లు వేస్తాడు కార్తీక్.

ఐడియా చెప్పడానికి కూడా ఒక స్థాయి ఉండాలని అంటుంది పారిజాతం. మాటలు ఆపి ఐడియా చెప్పమని శివన్నారాయణ అడగటంతో మొత్తం ప్లాన్ వివరంగా చెబుతాడు కార్తీక్. ఫుడ్ కోర్ట్ వల్ల మనకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని, షేర్ వాల్యూ కూడా పెరుగుతుందని చెబుతాడు. దాంతో అందరూ చప్పట్లు కొడతారు. మీ ప్రశంసలన్నీ దక్కాల్సింది నాకు కాదు, నా భార్యకి అంటాడు. నీలో ఉన్న తెలివితేటలు చూసే కార్తీక్ నిన్ను సీఈవోగా నిలబెట్టాలని అనుకున్నాడని చెబుతాడు శివన్నారాయణ. ఇంత అద్భుతమైన క్రియేటివ్ ఐడియా చెప్పింది వంట చేసే మనిషేనని అంటాడు కార్తీక్. లేట్ చేయకుండా ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయమని చెబుతాడు శివన్నారాయణ. నా కూతురు ఎలా ఉంది? అని కార్తీక్‌ని అడుగుతాడు శివన్నారాయణ. అమ్మ హ్యాపీయే కానీ నాన్నకి జస్ట్ విష్ చేసిందని చెబుతాడు కార్తీక్. అందుకే గురువు గారిని రమ్మన్నాను.. మీ జాతకాలు కూడా రాసివ్వు చూపిస్తాను. అందరూ కలిసిపోతే చూడాలని ఉందని, నా కోరిక ఏ దేవుడు తీరుస్తాడోనని అంటాడు శివన్నారాయణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X