Karthika Deepam 2 November 17th: స్వప్నకి దొరికిపోయిన కాశీ... శ్రీధర్‌ని అవమానించిన జ్యోత్స్న, పారు
Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే తనకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టడంతో శ్రీధర్‌కు కాల్ చేసి మండిపడుతుంది. ఇంతలో కార్తీక్ రావడంతో ఫోన్‌ని పక్కనపెట్టేసి వెళ్లిపోతుంది. దీప జడలో కార్తీక్ పూలు పెట్టి రొమాన్స్ చేస్తుండగా వారి మాటలను శ్రీధర్ వింటాడు. రోడ్డుపై వెళ్తున్న సైకిల్ చూసి దీపకి ఒక ఐడియా వస్తుంది. జ్యోత్స్న రెస్టారెంట్స్‌నే ప్రజల్లోకి తీసుకెళ్దామని... నగరంతోని అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీస్ వద్ద ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తే తక్కువ ధరకు నాణ్యమైన ఫుడ్ దొరుకుతుందని దీప తన ఐడియా చెబుతుంది. ఇది విన్న శ్రీధర్.. ఆ ఐడియా అదిరిపోయిందని కోడల్ని మనసులోనే మెచ్చుకుంటాడు.
కాశీ ఉద్యోగం చేయకుండా నన్ను, నా ఫ్యామిలీని మోసం చేస్తున్నాడని స్వప్నకి అనుమానం వచ్చి నిలదీయడంతో కాశీ షాక్ అవుతాడు. ఉదయాన్నే శివన్నారాయణ ఇంటికి వెళ్లిన శ్రీధర్.. తన వద్ద కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చే ప్లాన్ ఉందని దీప- కార్తీక్‌లు మాట్లాడుకున్న మాటలే చెబుతాడు. అది విన్న శివన్నారాయణ ఫ్యామిలీ మెచ్చుకోగా.. తన ప్లాన్ ఎలా లీక్ అయ్యిందా? అని దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఈ ఐడియా నాది కాదు.. దీపదేనని చెప్పడంతో అంతా ఆమెను మెచ్చుకుంటారు. మీ నాన్నని సీఈవోని చేశాక మీ అమ్మ రియాక్షన్ ఎలా ఉంది? అని కార్తీక్‌ను అడుగుతాడు శివన్నారాయణ. ఇంట్లో వాళ్ల భవిష్యత్‌లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి పంతులుగారిని పిలిపించినట్లు చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 17వ తేదీ 517వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కాశీ ఉద్యోగం చేయకుండా ఉద్యోగం చేస్తున్నట్లు నటిస్తుండటంతో స్వప్న పసిగట్టేస్తుంది. బయటకు హడావుడిగా వెళ్తున్న కాశీని ఆపి విష్ణు ఎవరు? ఎందుకు నీ కోసం వెయిట్ చేస్తున్నాడు? మీ ఇద్దరూ ఏం చేస్తున్నారని నిలదీస్తుంది. ఆన్‌లైన్‌లో చూసి మీ ఆఫీస్‌కి కాల్ చేశానని.. నీ పేరుతో అక్కడ ఏ ఎంప్లాయ్ లేడని స్వప్న చెప్పడంతో కాశీ షాక్ అవుతాడు. నా మీద ఒట్టు వేసి నిజం చెప్పమని స్వప్న అడగటంతో నేను జాబ్ చేయడం లేదని చెబుతాడు. దాంతో స్వప్న షాక్ అవుతుంది. నాకు ఈ విషయం నిన్న సాయంత్రమే తెలుసని నువ్వు చెబుతావని వెయిట్ చేశానని అంటుంది. ఐ హేట్ యూ నువ్వు నాతో మాట్లాడొద్దని ఏడుస్తూ వెళ్లిపోతుంది.
శివన్నారాయణ ఇంటికి వచ్చిన గురువుగారు అందరి జాతకాలు పరిశీలించి.. మీ కూతురి కుటుంబం గురించి తర్వాత మాట్లాడుకుందామని చెబుతాడు. మీ కుటుంబానికి ఒక మంచి ఉంది, ఒక చెడు కూడా ఉందని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అది ఎవరి జాతకం అని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. అది ఎవరి జాతకమో తెలియక పారిజాతం కంగారు పడుతుంది. అది ఎవరి జాతకమో చెప్పలేను.. ఈ ఇంట్లో మనుషులకు ఎవ్వరికి బాలేదని చెబుతాడు గురువు గారు. ఈ ఇంటి వారసురాలికి ఒక మంచి జరుగుతుందని చెప్పడంతో అంతా జ్యోత్స్న వంక చూస్తారు. ఈ ఇంటికి విపత్తు ఉంది, చాలా పెద్ద ప్రమాదమే రాబోతోందని గురువు గారు చెప్పడంతో శివన్నారాయణ కుటుంబం చెబుతుంది.
దీనికి పరిష్కారం ఏంటీ? అని శివన్నారాయణ అడగ్గా.. ఈ ఇంట్లో ఓ హోమం చేయించాలని, దానికి ముందు మీరంతా ఒక పనిచేయాలి.. మీ కుటుంబంలోని ముత్తయిదువులంతా ఈ హోమానికి రావాలని అంటాడు. ఈ ఇంటి రక్తంతో ముడిపడిన ప్రతిబంధం హోమానికి రావాలి, అందరి సమక్షంలో ఈ హోమం జరగాలని చెబుతాడు. రేపే హోమం జరుగుతుందని, దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని దీపకు చెప్పడంతో ... పనిమనిషికి ఎందుకు చెబుతున్నారని జ్యోత్స్న మండిపడుతుంది. పనిమనిషే కదా అన్ని పనులు చూసుకోవాల్సిందని అంటుంది పారిజాతం.
అది పనిమనిషి కాదు.. ఈ ఇంటి వారసురాలు, గురువు గారు చెప్పిన మంచి జరగబోయేది దీపకేనా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నిజం ఎక్కడ బయటపడుతుందోనని మరదలి గుండె అదురుతుందని అనుకుంటాడు కార్తీక్. నా కూతురు జాతకం గురించి కూడా చెబుతానని అన్నారు కదా అని శివన్నారాయణ అడగ్గా.. హోమం పూర్తయిన తర్వాత చెబుతానని గురువుగారు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఈ ఇంటికి దోషం.. వారసురాలికి శుభం అని గురువుగారు ఎందుకు అన్నారు? అని శివన్నారాయణ ఆలోచిస్తుంటాడు. పారు కంగారు పడుతుండటంతో హోమం చేయిస్తానని గురువుగారు చెప్పారు కదా కంగారు పడొద్దని అంటాడు కార్తీక్.
గదిలో ఏడుస్తున్న స్వప్నని ఓదార్చాలని కాశీ రాగా.. నువ్వు నన్ను ముట్టుకోవద్దు, బయటకు వెళ్లిపో అంటుంది. ఇంతలో కావేరి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది. మీరిద్దరూ గొడవ పడ్డారా? మీరు నా కూతురిని కొట్టారా? అని నిలదీస్తుంది కావేరి. తనంటే నాకు ప్రాణం.. నేను చేయి చేసుకుంటానా? అని అంటాడు కాశీ. నీ కూతురిని మోసం చేశాను, అది బయటపడింది. అందుకే ఏడుస్తోందని చెప్పు అని అంటుంది స్వప్న. మీ అల్లుడికి జాబ్ వచ్చిందని చెప్పింది అంతా అబద్ధమని స్వప్న చెప్పడంతో కావేరి షాక్ అవుతుంది. తను జాబ్‌కు వెళ్తున్నాడని హడావుడిగా రెడీ అవుతాడు, లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు. ఇన్ని అబద్ధాలు ఎవరి కోసం అని స్వప్న ప్రశ్నిస్తుంది. నాకు అబద్ధం చెప్పే వాళ్లంటే అసహ్యమని... నాన్న వచ్చాక ఆయన ముందే తేలుస్తానని అంటుంది స్వప్న. ఈ విషయం మావయ్యగారికి తెలుసని కాశీ చెప్పడంతో స్వప్న ఏడుస్తుంది. కాశీ నా దగ్గర ఏమీ దాచడని అనుకున్నాడని, కానీ నన్ను మోసం చేశాడని బాధపడుతుంది స్వప్న. ఆ మనిషిని నేను క్షమించలేనని అంటుంది.
హోమం కోసం పిలవాల్సిన పేర్లని రాస్తుండటంతో శ్రీధర్ వచ్చి ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నట్లుంది కదా అని అడుగుతాడు. రేపు మా ఇంట్లో హోమం జరుగుతుందని శివన్నారాయణ అంటాడు. మీ ఫ్యామిలీలో శ్రీధర్ పేరు రాశావా? అని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. శ్రీధర్, కావేరి, కాశీ, స్వప్నల పేర్లు కూడా లిస్ట్‌లో రాయమని చెప్పడంతో పారిజాతం మండిపడుతుంది. రేపటి హోమానికి శివన్నారాయణ బంధువులంతా వస్తారని చెబుతాడు పెద్దాయన. ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్ల ఉందని.. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారని మండిపడుతుంది పారు. నా ఫ్యామిలీని పిలవొద్దని, కాంచనతో రమ్మంటే వస్తానని చెబుతాడు శ్రీధర్. మీ పరువు పోతుందని మీకు అనిపిస్తే నేను కూడా రాను అని చెబుతాడు శ్రీధర్. రావడానికి మానేయడానికి నువ్వు ఎవరు? అని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ.
కావేరి వస్తే ఆవిడని నేను ఏమని పిలవాలి? అని జ్యోత్స్న మండిపడుతుంది. ఆవిడకి పారిజాతం కూడా సపోర్ట్ చేస్తే అందరి మీదా అరుస్తుంది. కావేరి ఈ ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదని తేల్చేస్తుంది పారిజాతం. అడ్డమైన వాళ్లంతా రావడానికి ఇది బజారు కాదు.. కావాలంటే మీ ఇంటికి తీసుకెళ్లండి అని అంటుంది జ్యోత్స్న. నా వల్ల మీరంతా గొడవ పడటం నాకు ఇష్టం లేదని, హోమానికి నా ఫ్యామిలీ రాదని బాధపడి వెళ్లిపోతాడు శ్రీధర్. మనుషుల్ని ప్రేమించడం కష్టం.. బాధపెట్టడం ఈజీ అని జ్యోత్స్నపై మండిపడుతుంది దీప. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










