Karthika Deepam 2 November 18th: కార్తీక్ యాక్షన్ ప్లాన్ ... జ్యోత్స్న, పారిజాతంలకు షాకిచ్చిన శివన్నారాయణ
Photo Courtesy: JioHotstar
కాశీ ఉద్యోగం చేయడం లేదని తెలుసుకున్న స్వప్న అతనితో గొడవ పడుతుంది. గదిలో ఏడుస్తున్న స్వప్నని కావేరి ఏం జరిగిందని ప్రశ్నించగా.. కాశీ నన్ను మోసం చేశాడు, ఉద్యోగం చేస్తున్నాని చెప్పి ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటున్నాడని అంటుంది. ఈ విషయం మావయ్య గారికి ఎప్పుడో తెలుసు అని కాశీ చెప్పడంతో స్వప్న, కావేరీలు షాక్ అవుతారు. శివన్నారాయణ ఇంటికి వచ్చిన గురువుగారు.. అందరి జాతకాలు పరిశీలించి ఈ కుటుంబానికి ఆపద రాబోతోందని, కానీ ఈ ఇంటి వారసురాలికి మంచి జరగబోతోందని చెబుతాడు. ఆ మాటలు విన్న శివన్నారాయణ షాక్ అవుతాడు.
మీకు రాబోయే గండం నుంచి గట్టెక్కడానికి హోమం చేయాలని ఇందుకు మీ బంధువులంతా రావాలని అంటాడు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని చెబుతాడు. గురువు గారు చెప్పడంతో ఎవరెవరినీ గెస్ట్‌లుగా పిలవాలో రాస్తుంటాడు కార్తీక్. ఇంతలో శ్రీధర్ రావడంతో కావేరి, స్వప్న, కాశీలను కూడా పిలవాలని చెబుతాడు శివన్నారాయణ. వాళ్లని పిలిస్తే మేం ఊరుకోమని పారు, జ్యోత్స్నలు గొడవ చేయడంతో శ్రీధర్ బాధపడి వెళ్లిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 18వ తేదీ 518వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
శ్రీధర్‌ను జ్యోత్స్న, పారిజాతం అవమానించి పంపడంతో దీప బాధపడుతుంది. దాంతో భార్యను కార్తీక్ ఓదారుస్తాడు. జ్యోత్స్నలో ఎప్పటికీ మార్పు రాదని నిరూపించుకుంటూనే ఉంటుంది. మావయ్య గారి పెళ్లిళ్ల గురించి అడిగే హక్కు తనకేం ఉంది, ఒక మనిషిని పట్టుకుని అంతలా అవమానించాలా? అని అంటుంది. మామూలుగా అయితే మావయ్య గారు ఊరుకునేవారే కాదు... కానీ ఆయన నీకోసం పూర్తిగా మారిపోయారని చెబుతుంది దీప. తాతయ్య గారు కావేరి అత్తయ్యని పిలవమని చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది.. ఈ రకంగానైనా ఈ కుటుంబాలు కలిసిపోతున్నాయని సంతోషించాను. ఆ ఆనందాన్ని కాసేపు కూడా లేకుండా చేసిందని మండిపడుతుంది దీప.
వాళ్లిద్దరూ అనుకుంటున్నది జరగడం లేదు.. జ్యోత్స్న ఉండాల్సిన ప్లేస్‌లో మా నాన్న ఉన్నాడు. నువ్వు చెప్పిన బిజినెస్ ప్లాన్ వాళ్లకి చెంపదెబ్బలా తగిలింది. ఇవన్నీ మనసులో పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని అంటాడు కార్తీక్. హోమానికి అందరూ రావాలని గురువుగారు చెప్పారు, బంధువుల్ని పిలవాలని తాతయ్య ఆశపడ్డారని ఈ రెండూ జరగవని అంటుంది దీప. అన్నీ జరుగుతాయి.. నువ్వేం టెన్షన్ పడొద్దని మాటిస్తాడు కార్తీక్. పారు, జ్యోత్స్నలు అలా రెచ్చిపోతారని ఎవ్వరూ ఊహించలేదని, తాతని అడ్డుపెట్టుకుని వాళ్లకి బుద్ధి చెబుతానని అంటాడు కార్తీక్.
జ్యోత్స్న రోజురోజుకు మొండిదానిలా మారిపోతుండటంతో సుమిత్ర బాధపడుతుంది. దానిని ఇలాగే వదిలేస్తే.. అత్తయ్యగారి మాటలు విని ఎందుకూ పనికిరాకుండా పోతుందని దశరథతో చెబుతుంది. దానికి అర్జెంట్‌గా మంచి సంబంధం చూడాలని అంటుంది. నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ తొందరపడితే గౌతమ్ విషయంలో జరిగినట్లే మోసపోతామని అంటాడు దశరథ. పెళ్లి విషయంలో మరోసారి పొరపాటు జరిగితే జ్యోత్స్న జీవితానికి మంచిది కాదని చెబుతాడు. గురువుగారు ఇంటి వారసురాలికి ఏదో విపత్తు అని చెప్పారు.. హోమానికి శ్రీధర్ అన్నయ్య రాకపోతే ఎలా అని ప్రశ్నిస్తుంది సుమిత్ర. నాన్న, కార్తీక్ ఏదో ఒకటి చేస్తారులే అని చెబుతాడు దశరథ.
గురువు గారు చెప్పినట్లు ఏదో ఆపద ఎవరి ప్రాణాలనైనా తీస్తే అని సుమిత్ర అనడంతో దశరథ షాక్ అవుతాడు. జ్యోత్స్న గురించి, హోమం గురించి నువ్వేం బాధపడొద్దు అన్ని కార్యక్రమాలు జరిగాక జ్యోత్స్న విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని అంటాడు. ఇంతలో దీప రావడంతో ఆమెతో విడిగా మాట్లాడతాడు దశరథ. నువ్వు నా కూతురిలాంటి దానివి.. కన్నకూతురు కంటే నువ్వే మా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావని అంటాడు. జ్యోత్స్నని నీ చెల్లెలు అనుకో.. తను ఏమైనా అంటే బాధపడొద్దని చెబుతాడు. గురువు గారు చెప్పిన విపత్తు ఏ రూపంలో రాబోతోందోనని సుమిత్ర బాధపడుతుంది. ఆమెకు ధైర్యం చెబుతున్నా.. లోపల నాక్కూడా భయంగానే ఉందని, సుమిత్ర బాధ్యత నీకు కార్తీక్‌లకి అప్పగిస్తున్నా.. హోమం మాత్రం నిర్విఘ్నంగా జరగాల్ని అంటాడు దశరథ. నేనుండగా ఏ ఆపద ఈ ఇంటి గడపదాటి లోపలికి రాదని కార్తీక్ బావ చెప్పాడని దీప అనగా.. ఇక దీనిని ఎవ్వరూ ఆపలేరని దశరథ చెబుతాడు.
చాలారోజుల తర్వాత ఈ ఇంట్లో మన వాయిస్ డామినేట్ చేసిందని గర్వంగా చెబుతుంది పారిజాతం. ఇంతలో కార్తీక్ వచ్చి తాత పిలుస్తున్నాడు, రమ్మని చెబుతాడు. మీ తాతకు భయపడే రోజులు పోయాయని మేం మాట్లాడమని అంటుంది పారిజాతం. ఇప్పుడే లోపలికి వెళ్లి ఆయన అంతు చూస్తానని అంటుంది పారిజాతం. నువ్వు, జ్యోత్స్న వెళ్లి శ్రీధర్ కుటుంబాన్ని హోమానికి పిలవాలని చెబుతాడు. వాళ్లు ఈ ఇంటికి రావాలన్నది నా నిర్ణయం.. నేను పిలిచాను, నువ్వు అవమానించావు.. అందుకే నువ్వు, జ్యోత్స్న వెళ్లి వాళ్లని పిలవాలని చెబుతాడు శివన్నారాయణ. పిలవకపోతే అని పారిజాతం అడగ్గా.. నువ్వు ఈ క్షణమే నీ వస్తువుల్ని తీసుకుని వెళ్లిపోవచ్చని పెద్దాయన చెప్పడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు.
జ్యోత్స్న రాను అని చెప్పడంతో ఆ బాధ్యత నీ గ్రానీది అని చెబుతాడు శివన్నారాయణ. దాంతో జ్యోత్స్న, పారిజాతంలు శ్రీధర్ ఇంటికి వెళ్తారు. జరిగింది తలచుకుని శ్రీధర్ బాధపడుతుండగా కార్తీక్ తలుపుకొడతాడు. పారిజాతం, జ్యోత్స్నలు కూడా రావడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. మా అత్తగారు ఏనాడో చనిపోయారు.. ముక్కు ముఖం తెలియనివాళ్లతో పిలిపించుకునే అలవాటు నాకు లేదని కౌంటరిస్తాడు శ్రీధర్. కార్తీక్ ఒక్కడినే లోపలికి పిలవడంతో జ్యోత్స్న, శ్రీధర్ బయటే ఆగిపోతారు. హోమానికి పిలిచి వారిని అవమానించాలని జ్యోత్స్న చెబుతుండగా కార్తీక్ వింటాడు. శ్రీధర్‌ని ఎలాగైనా ఒప్పించాలని జ్యోత్స్న, పారిజాతంలు లోపలికి వస్తారు.
ఇక్కడ జరిగింది చూస్తున్నాను, అక్కడ జరిగింది విన్నానని కావేరి చెప్పడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. ఇంతలో కాశీ వచ్చి ఇంటికొచ్చిన మనిషిని నిలబెట్టే మాట్లాడుతున్నావ్, కూర్చొపెట్టి కాఫీ ఇవ్వమని స్వప్నతో అంటాడు. నువ్వయినా మీ అక్కని అర్ధం చేసుకున్నావని పారిజాతం అనగా.. నేను చెప్పింది మా బావ గురించి అంటాడు కాశీ. ఆ మాటలతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. అయినప్పటికీ హోమానికి రావాల్సిందిగా అందరినీ పిలుస్తారు పారు, జ్యోత్స్న. మేం ఆ హోమానికి రాము అని శ్రీధర్ తేల్చి చెప్పడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











