Karthika Deepam 2 November 19th: పారు, జ్యోత్స్నలపై శ్రీధర్ ప్రతీకారం.. స్వప్న- కాశీల కాపురంలో చిచ్చు

Photo Courtesy: JioHotstar

శ్రీధర్‌ను జ్యోత్స్న, పారిజాతంలు అవమానించి పంపడంతో దీప బాధపడుతుంది. వాళ్లిద్దరికీ నేను బుద్ధి చెబుతానని అంటాడు కార్తీక్. జ్యోత్స్న రోజురోజుకు మొండిదానిలా మారిపోతుండటంతో దశరథ్, సుమిత్రలు బాధపడతారు. నాన్న, కార్తీక్‌లు ఏదో ఒకటి చేసి హోమం జరిగేలా చేస్తారని అంటాడు దశరథ. ఇంతలో దీప రావడంతో జ్యోత్స్నని చెల్లెలు అనుకో.. అది చేసే తప్పుల్ని క్షమించమని అడుగుతాడు దశరథ. కార్తీక్, శివన్నారాయణల నోరు మూయించామని జ్యోత్స్న, పారిజాతంలు సంతోషిస్తారు. ఇంతలో కార్తీక్ వచ్చి తాత పిలుస్తున్నాడని చెబుతాడు.

శ్రీధర్‌ని అతని కుటుంబాన్ని హోమానికి పిలవాలని, లేకపోతే పారిజాతంను ఇంట్లో నుంచి గెంటేస్తానని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. దాంతో జ్యోత్స్న, పారులు శ్రీధర్ ఇంటికి వెళ్తారు. జరిగింది మనసులో పెట్టుకోకుండా హోమానికి రావాలని పారిజాతం పిలుస్తుంది. నేను రాను అని శ్రీధర్ తేల్చేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 19వ తేదీ 519వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 519 November 19th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

నేను మీ ఇంట్లో హోమానికి రాను అని శ్రీధర్ చెప్పడంతో పారిజాతం, జ్యోత్స్నలు అతనిని బతిమలాడటంతో రావడానికి ఒప్పుకుంటాడు. కానీ ఒక షరతు... మా ఆవిడ వస్తేనే వస్తానంటాడు. కావేరిని కూడా ఫంక్షన్‌కి రమ్మని చెబుతుంది పారిజాతం. నేను మీ ఇంటికి రాలేనని కావేరి చెప్పడంతో జరిగింది మరిచిపో.. ఆవేశంలో ఏదో అనేసి నువ్వు బాధపడి ఉంటే సారీ చెబుతుంది పారు. మనం ఏమైనా పరాయి వాళ్లమా? మా అల్లుడి భార్యవంటే నువ్వు మా బంధువువే అని అంటుంది పారు. నా గురించి కాకపోయినా శివన్నారాయణ కోసమైనా రమ్మని చెబుతుంది. అందరి సమక్షంలో హోమం జరగాలన్నది శివన్నారాయణ గారి కోరిక అంటుంది పారిజాతం.

మీరు ఇంత బతిమాలాల్సిన అవసరం లేదు.. ఫోన్ చేసి చెప్పినా వచ్చేవాళ్లం, కానీ మీరు నా భర్తను అవమానించారు అంటుంది కావేరి. సారీ చెప్పాను కదా అని అంటుంది పారు. చివరికి కావేరి రావడానికి ఒప్పుకుంటుంది. మీరంతా మా ఇంటికి వచ్చేస్తే... అటు నుంచి అటే ఇంటికి వెళ్దామని చెప్పి శ్రీధర్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్న కార్తీక్‌కి స్వప్న - కాశీలు గొడవపడుతూ కనిపిస్తారు. వీళ్లద్దరికీ ఏం జరిగిందోనని ఆలోచనలో పడతాడు కార్తీక్. ఇంటికి వెళ్లాక జ్యోత్స్నతో విడిగా మాట్లాడతాడు కార్తీక్. నువ్వేదో కొత్తగా గేమ్ స్టార్ట్ చేశావు కదా అది అక్కడే ఆపేయ్ అని వార్నింగ్ ఇస్తాడు. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న ప్రతీసారి .. దానిని ప్రశాంతంగా నాశనం చేస్తావు. అత్తామావయ్యల గొడవే అందుకు ఎగ్జాంపుల్ అని కార్తీక్ అంటాడు.

నేను పాయింట్ ఔట్ చేయడం మొదలుపెడితే.. నువ్వు మాట్లాడానికి పాయింటే ఉండదని అంటుంది జ్యోత్స్న. రేపు జరగబోయే హోమం మన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్.. ఏ కారణంగానైనా నువ్వు దానిని చెడగొట్టాలని అనుకుంటున్నావు. నువ్వు చెడు చేయాలని చూసినా అవతలివాళ్లకు మంచే జరుగుతుంది, పోనీ ఓసారి మంచి చేయాలని ట్రై చేయ్ ఏం జరుగుతుందో చూద్దామని అంటాడు. మా తాత, మా నాన్న, మా అమ్మలు నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారు.. అందుకే నువ్వు అనుకున్నది జరుగుతుందని అంటుంది జ్యోత్స్న. నువ్వు తెలివిగా టాపిక్ డైవర్ట్ చేయాలని చూడొద్దని, నువ్వు ఏదో చేయబోతున్నావు... దయచేసి దానిని ఆపేయ్ అంటాడు కార్తీక్. ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని చెప్పినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా అని ప్రశ్నిస్తాడు. నువ్వేదో ఇంటి వారసురాలివి కాదన్నట్లుగా బిహేవ్ చేస్తున్నావని అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

అంటే నేను సుమిత్ర కూతురిని కాదా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. ఈ విషయం నేనేమీ అనలేదు.. నువ్వే అంటున్నావని కార్తీక్ చెప్పడంతో ఆమె ఉలిక్కిపడుతుంది. నువ్వు సుమిత్ర - దశరథల కూతురివి కాదా? నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదా? అని ప్రశ్నిస్తాడు. నేను శివన్నారాయణ గారి మనవరాలిని అంటుంది జ్యోత్స్న. వీరి మాటలను దొంగచాటుగా వింటోన్న పారిజాతాన్ని శివన్నారాయణ గమనించడంతో ఆమె షాక్ అవుతుంది. దాంతో కార్తీక్‌ను పిలుస్తాడు శివన్నారాయణ. నువ్వు, జ్యోత్స్న ఏం మాట్లాడుకుంటున్నారోనని పాపం పారిజాతం ఇక్కడ నిలబడి చూస్తోంది. మీరిద్దరూ తనని మధ్యలో నిలబెట్టి మాట్లాడమని అంటాడు. శ్రీధర్‌ ఫ్యామిలీని ఫంక్షన్‌కి పిలిచావా? లేదా? అని పారిజాతాన్ని అడుగుతాడు శివన్నారాయణ. పారిజాతం ఏదైనా అనుకుంటే అది సాధించకుండా ఉంటుందా? అని అంటుంది పారు. రేపు వాళ్ల ఫ్యామిలీ అంతా వస్తున్నారని చెప్పడంతో నువ్వు లోపలికి వెళ్లమని చెబుతాడు శివన్నారాయణ.

రేపు ఈ హోమం ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రశాంతంగా జరుగుతుందని జ్యోత్స్నని చూస్తూ అంటాడు కార్తీక్. ఇంటి దగ్గర కాంచనకి కూడా విషయం చెప్పమని అంటాడు శివన్నారాయణ. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఈ హోమం జరగనివ్వనని అనుకుంటుంది జ్యోత్స్న. శ్రీధర్ ఇంట్లో జరిగింది తలచుకుని రగిలిపోతుంది పారిజాతం. కావేరి కనిపించగానే అసహ్యించుకునే తాత... ఈరోజు ఆమెను మన ఫ్యామిలీలో మెంబర్‌ని చేశాడంటే ఆవిడ స్థాయి పెరిగిందా? మనం దిగజారిపోయామా అని ప్రశ్నిస్తుంది పారు. ఇదంతా కార్తీక్ గాడు వెనకుండి నడిపిస్తున్నాడని అంటుంది పారు.

ఈ హోమాన్ని సక్రమంగా జరగదని.. గురువుగారు చెప్పినవాటిలో మనం లేమని చెబుతుంది జ్యోత్స్న. మనం వాళ్ల ఫ్యామిలీ కాదు.. ఇంటి వారసురాలికి మంచి జరగబోతోందని చెప్పాడు.. అది కూడా దీపకి అని చెప్పబోతు ఆగిపోతుంది జ్యోత్స్న. ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరో నీకు తెలుసు కదా అని పారిజాతం ప్రశ్నించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు దూరం చేసిన మనిషి ఎవరో నీకే తెలియాలి... లేదా నీ కొడుక్కి తెలియాలి అంటుంది జ్యోత్స్న. గురువు గారు చెబుతున్న అరిష్టం జరిగితేనే మన మాట వింటారని చెబుతుంది. ఈ హోమం జరగకూడదు... తాత మనసులో మొదలైన ఈ ఆలోచనని మొదట్లోనే చెరిపేయాలని అనుకుంటుంది జ్యోత్స్న.

హోమం గురించి వినగానే కాంచన షాక్ అవుతుంది. గతంలో ఇలాగే ఓ గురువుగారు చెప్పారని నాన్న హోమం చేయించేలోపు.. ఆవిడ ప్రాణం పోయిందని అంటుంది. అప్పుడు చావు అంటే తెలియని వయసు.. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అయితే తట్టుకోలేనని చెబుతుంది కాంచన. నాన్న బాగా మారిపోయారు.. కావేరిని ఇంటికి రమ్మనడం ఏంటీ? అని ప్రశ్నిస్తుంది. చిన్నమ్మనే కాదు.. స్వప్న, కాశీని కూడా రమ్మన్నారు.. అందరూ కలిసిపోయే టైం వచ్చిందని చెబుతాడు కార్తీక్. హోమం అయ్యే వరకు నువ్వు, దీప అన్నీ దగ్గరుండి చూసుకోమని చెబుతుంది కాంచన. ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని కూడా గురువుగారు చెప్పారని అంటాడు కార్తీక్. ఆ జ్యోత్స్న జీవితంలో జరగాల్సిన మంచి పెళ్లి ఒక్కటేనని అంటుంది కాంచన. దానికి మా అమ్మ పేరు పెట్టారు.. దాని బుద్ధులు చూస్తే మా అమ్మ ఆత్మ కూడా శాంతించదని చెబుతుంది. అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతాయని.... ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తానని దీపతో అంటాడు కార్తీక్. శివన్నారాయణ, కాంచనలకు కలలో వాళ్ల అమ్మ కనిపించి... మీరు మరిచిపోలేదని నాకు తెలుసు... అందుకే మళ్లీ మీ ముందుకు వస్తానని చెప్పడంతో ఇద్దరూ ఉలిక్కిపడి లేస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X