Karthika Deepam 2 November 24th: కాశీ, స్వప్నలను కలిపిన కార్తీక్..తల్లి కాబోతున్న దీప.. షాక్‌లో జ్యోత్స్న

Photo Courtesy: JioHotstar

పూర్ణాహుతి తన చేతుల మీదుగా కాకుండా దీప చేతుల మీదుగా పడటంతో జ్యోత్స్న పెద్ద గొడవ చేస్తుంది. నీ చేతుల్లోంచి జారిపోతుండగా దీప పట్టుకునే యత్నంలో హోమగుండంలో పడిందని కార్తీక్ చెబుతాడు. దానికి నా భార్యను మెచ్చుకోవాల్సిందిపోయి.. గొడవ చేస్తున్నావని ఫైర్ అవుతుంది. దీపకు మద్ధతుగా స్వప్న, కాశీ మాట్లాడటంతో వాళ్లిద్దరిపై విరుచుకుపడుతుంది పారిజాతం. నువ్వు, నేను తల్లీకూతుళ్లం.. కానీ మన మధ్య దీప ప్రతిసారి అడ్డోస్తోందని మండిపడుతుంది జ్యోత్స్న. దీప పట్టుకోకుంటే పూర్ణాహుతి కిందపడి ఈ ఇంటికి అరిష్టం జరిగేదని గురువుగారు చెప్పడంతో అందరూ ఆమెను మెచ్చుకుంటారు.

నువ్వు నన్ను ప్రతిసారి ఫూల్‌ను చేస్తున్నావని దీపను కోపంతో పక్కకు నెట్టేస్తుంది జ్యోత్స్న. దీప స్పృహ తప్పడంతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. చిన్న విషయానికి పంచాయతీ పెట్టించి అందరిచేత చీవాట్లు తిన్నావని జ్యోత్స్నకి క్లాస్ పీకుతుంది పారిజాతం. దీప కాకుండా ఇంకెవరు పూర్ణాహుతిని పట్టుకున్నా, ఆ పూర్ణాహుతి నేల మీద పడినా నేను బాధపడే దానిని కాదని పారుతో చెబుతుంది జ్యోత్స్న. దీప ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నేను ఎన్నో కోల్పోయాను.... చివరికి వారసురాలి స్థానాన్ని కూడా కోల్పోయేలా ఉన్నానని జ్యోత్స్న చెప్పడంతో పారు షాక్ అవుతుంది. మా నాన్న నా గురించి ఎక్కడ దీపకి చెప్పేస్తాడోనని భయంగా ఉందని అంటుంది జ్యోత్స్న. కాశీకి ప్రసాదం పెట్టకుండా స్వప్న వెళ్లిపోవడాన్ని గమనిస్తాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 24వ తేదీ 523వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 523 November 24th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

మన ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకుందాం.. ఇక్కడ అందరికీ తెలియాల్సిన అవసరం లేదని స్వప్నతో అంటాడు కాశీ. ఇంతలో కార్తీక్ వచ్చి నాకైనా తెలియొచ్చా అని అడుగుతాడు. నేను ఆ ఇంటి దగ్గరే చూశాను, ఈరోజు ఈ ఇంటి దగ్గర చూశానని అంటాడు. మీ ఇద్దరి ముఖాల్లో నవ్వు లేదు.. కారణం ఏంటీ? అని అడుగుతాడు కార్తీక్. కాశీ నన్ను మోసం చేశాడు.. కాశీకి జాబ్ రావడం అబద్ధమని స్వప్న చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఏదో ఒక జాబ్‌కి ట్రై చేస్తున్నాడని అడిగానని ఫీలైపోయి జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పాడు....రోజు లంచ్ బాక్స్ తీసుకుని వెళ్లడం, ఈవినింగ్ రావడం చివరికి దొరికిపోయాడని చెబుతుంది స్వప్న. జాబ్ ట్రయల్స్‌లో ఉన్నాను.. ఈలోపు జాబ్ వచ్చేస్తుందని అనుకున్నానని చెబుతాడు కాశీ.

కాశీని నేను ప్రేమించాను, చివరికి ఈ మనిషి కోసం నాన్ననే వదిలేసుకున్నానని బాధపడుతుంది స్వప్న. నా దగ్గర చెప్పలేని నిజాన్ని, నేను వదిలేసుకున్న నాన్న దగ్గర చెప్పాడంటే నా ప్రేమకు ఏం విలువ ఉన్నట్లు అంటుంది. ప్రేమకు, ప్రేమించిన మనిషికి విలువ ఇవ్వని మనిషి నాకు అవసరం లేదని స్వప్న చెప్పడంతో కాశీ, కార్తీక్‌లు షాక్ అవుతారు. మనిషిని వదులుకోవడం ఈజీ.. కానీ వదిలేసుకున్న మనిషిని మళ్లి కలుపుకోవడం అంత తేలిక కాదని అంటాడు కార్తీక్. కొన్నిసార్లు మనవాళ్ల కోసం కొన్ని భరించాల్సిందేనని చెబుతాడు. దీపని జ్యోత్స్న నెట్టేసింది.. కానీ జ్యోత్స్న చేసిన పనికి లాగిపెట్టి కొట్టాలన్నంత కోపం వస్తుంది.. కానీ కొట్టలేకపోయానని చెబుతాడు కార్తీక్. దీపకి ఏమవుతుందోనని టెన్షన్‌గా ఉంది.. కానీ నేను పైకి అలా లేను అని అంటాడు.

అనుకున్న టైంకి జాబ్ రాలేదు.. ఈలోపు నాన్నకి నిజం తెలిసింది, నీ సంగతి కాశీకి తెలుసుకదా.. నిజం చెబితే నువ్వు ఊరుకుంటావా అని ప్రశ్నిస్తాడు కార్తీక్. ఆ భయంతోనే నీ ప్రేమను దూరం చేసుకోలేక నిజం చెప్పలేకపోయాడని అంటాడు. దాంతో బావ నీకు చేతులెత్తి మొక్కాలి, నీ చెల్లెలి కంటే నువ్వే నన్ను ఎక్కువ అర్ధం చేసుకున్నావని అంటాడు కాశీ. నువ్వు కూడా ఇదేనా నీ భార్యను అర్ధం చేసుకున్నది, జాబ్ లేదని చెబితే.. నా చెల్లి నీకు భోజనం పెట్టదా? ఇంట్లోకి రానివ్వదా? నీ కోసమే బతికే మనిషి గురించి నువ్వు ఇలాగేనా ఆలోచించేది అని చెబుతాడు కార్తీక్. ప్రేమ కోసం అందరినీ వదిలేసుకోవడానికి సిద్ధపడ్డారు, ఇప్పుడు మాట కోసం ప్రేమనే వదిలేసుకుంటారా అని ప్రశ్నిస్తాడు. కాశీ నీకు నిజం చెప్పలేదంటే అది కూడా ప్రేమేనని కాశీ చేతుల్లో స్వప్న చేతిని పెడతాడు.

ఇంతలో దాస్ చప్పట్లు కొట్టి నీలాంటి అన్నయ్య ప్రతి చెల్లికి ఉండాలని అంటాడు. కట్టుకున్న దానిని కన్నీళ్లు పెట్టించొద్దని చెబుతాడు. నా బెంగ అంతా దీప గురించేనని, ఇంకా ఎన్ని రోజులు నా కూతురిని నువ్వు భరించాలని అడుగుతాడు దాస్. ఇంకా నేను చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయని చెబుతాడు కార్తీక్. మా అమ్మనాన్నల్ని కలపాలి, ఆ మనిషి అందరూ ఉండి కూడా ఒంటరిది అయిపోయిందని బాధపడతాడు కార్తీక్. మరోవైపు.. దీప కోసం తులశమ్మకి దండం పెట్టుకుంటుంది కాంచన. ఇంతలో శ్రీధర్ వచ్చి.. కోడలి మీద ఇంత నమ్మకం పెట్టుకున్న అత్తగారిని నిన్నే చూశానని అంటాడు. కోడలంటే కొడుక్కి భార్య మాత్రమే కాదని... కొడుకు జీవితం. కోడలు బాగుంటేనే కొడుకు బాగుంటాడు, చాలామందికి ఇది అర్ధం కాక కోడలు ఏమైనా పర్లేదు.. కొడుకు బాగుంటే చాలని అనుకుంటారని అంటుంది కాంచన.

మరి నీలో ఉండాల్సిన నన్ను... నీ నుంచి ఎందుకు దూరం చేశావని శ్రీధర్ నిలదీస్తాడు. కొన్నింటికి మౌనమే సమాధానం అని చెబుతుంది కాంచన. ఇంతలో కాంచన బొట్టు చెరిగిపోవడంతో శ్రీధర్... బొట్టు పెడతాడు. అది చూసిన కావేరి ఎంతో సంతోషిస్తుంది. మీరు అక్కకి బొట్టు పెడితే నాకెందుకు అని అంటుంది. మీరంతా బయల్దేరండి అని కాంచన చెప్పగా.. నేను ఇక్కడే ఉంటానని అంటాడు శ్రీధర్. నా కోడలికి ఏం కాదులే అని కాంచన అనగా.. దీప మీకు కోడలు కాదా అని శ్రీధర్‌ని నిలదీస్తుంది కావేరి. ఇంతలో పారు వచ్చి ఇద్దరి పెళ్లాల మధ్యలో నిన్ను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉందని అంటుంది. మీ చూపు పడితే పచ్చని సంసారాలు కూడా నాశనమైపోతాయని మండిపడుతుంది కావేరి. దీప మీదకి జ్యోత్స్నని ఊసిగొలిపావని మండిపడుతుంది.

దీప కళ్లు తెరవడంతో సుమిత్ర, కార్తీక్, కాంచన సంతోషిస్తారు. దీపకి సుమిత్ర జ్యూస్ తాగిస్తుంది. దీప కళ్లు తెరిచిందని పారు చెప్పడంతో శివన్నారాయణ, శ్రీధర్, దశరథలు సంతోషిస్తారు. దీపకు వాంతులు కావడంతో డాక్టర్ గారిని పిలిపిస్తాడు దశరథ. ఈ ఇంటికి ఓ విపత్తు ఉంది, కానీ ఆనందం లేకుండా పోయిందని గురువుగారితో చెప్పి బాధపడతాడు దశరథ. ఆ మంచి కనిపించదు, వినిపిస్తుందని.... జరగబోయేది కలలో కనిపిస్తుందని గురువుగారు చెప్పడంతో జ్యోత్స్న కలలోకి వచ్చిన విషయాన్ని శివన్నారాయణ, కాంచనలు చెబుతారు. మా అమ్మ ఏ రూపంలో మా ముందుకు వస్తుందని కాంచన అడగ్గా.. ఇంతలో దీపని తీసుకుని సుమిత్ర బయటికి వస్తుంది. మీ భార్య మీ మీద చాలా పెద్ద బాధ్యత పెట్టిందని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. తండ్రి కావడం అంటే బాధ్యతేనని డాక్టర్ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. జ్యోత్స్న, పారులు మాత్రం షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X