Karthika Deepam 2 November 25th: సుమిత్ర- దశరథలకు ప్రమాదం... దాస్ మాటలతో జ్యోత్స్నకు ముచ్చెమటలు

Photo Courtesy: JioHotstar

నువ్వు నాతో అలా మాట్లాడొద్దని స్వప్నను బతిమలాడతాడు కాశీ. నువ్వు చేసిన దానికి నీ ముఖం కూడా చూడకూడదని స్వప్ప మండిపడుతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి అసలు మీ ఇద్దరికీ ఏం జరిగిందని అడుగుతాడు. దాంతో కాశీ ఉద్యోగం లేకుండా తనను మోసం చేసిన విషయాన్ని చెబుతుంది స్వప్న. మీరిద్దరూ మీ ప్రేమ కోసం మీ తల్లిదండ్రులనే వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఇదేనా ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం అని ఇద్దరినీ కలుపుతాడు. కార్తీక్ మాటలు విన్న దాస్ .. అల్లుడిని మెచ్చుకుంటాడు. దీపే ఈ ఇంటి వారసురాలు అన్న విషయాన్ని ఎప్పుడు చెబుతావని కార్తీక్‌ని అడుగుతాడు దాస్. దానికి ఇంకా టైం ఉందని చెబుతాడు కార్తీక్.

కావేరి, కాంచన, శ్రీధర్‌లు మాట్లాడుకుంటూ ఉండగా పారిజాతం వచ్చి నానామాటలు అనడంతో కావేరి చీవాట్లు పెడుతుంది. దీప ఎంతకు స్పృహలోకి రాకపోవడంతో డాక్టర్‌ని పిలిపిస్తాడు శివన్నారాయణ. కంగారు పడాల్సింది ఏం లేదని దీప తల్లి కాబోతున్నారని డాక్టర్ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 25వ తేదీ 524వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 524 November 25th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

కార్తీక్ గారు తండ్రి కాబోతున్నారని డాక్టర్ చెప్పడంతో శివన్నారాయణ కుటుంబం సంబరాలు చేసుకుంటుంది. ప్రెగ్నెంట్ అంటే ఏంటి అని శౌర్య అడగ్గా.. అమ్మ కడుపులో బుజ్జి పాపో, బుజ్జి బాబో ఉన్నారని చెబుతుంది సుమిత్ర. ఆ మాటలతో శౌర్య వెళ్లి తల్లికి థ్యాంక్స్ చెబుతుంది. మా అమ్మ నా మనవరాలి రూపంలో నా ఇంట్లోనే పుట్టబోతోందని శివన్నారాయణతో చెబుతుంది కాంచన. ఇంట్లో హోమం జరిగింది, మంచి జరిగిందని శ్రీధర్ అంటాడు. ఓ శుభవార్త విన్నాను.. మరి ప్రమాదం గురించి గురువుగారిని అడుగుతాడు శివన్నారాయణ. జరగబోయే ప్రమాదం ఇంట్లోనే ఉందని గురువు గారు మనసులో అనుకుంటారు.

దీప తల్లికాబోతుండటంతో జ్యోత్స్న షాక్‌లో ఉండిపోతుంది. నిజంగానే దీప తల్లి అయ్యిందా? లేక నేను కల గన్నానా అని పారును అడుగుతుంది జ్యోత్స్న. అది ప్రెగ్నెంట్ అయితే నీకేంటీ? అని ప్రశ్నిస్తుంది పారు. బావ కారణంగా దీపకు కడుపు వచ్చింది, బిడ్డ పుడుతుంది.. అప్పుడు నా కలలు సమాధి అయిపోయినట్లే అంటుంది జ్యోత్స్న. కార్తీక్ గాడు ఎప్పటికీ నీవాడు కాలేడు.. కార్తీక్ గాడు లేడు అనుకుని మరొకరిని పెళ్లి చేసుకోమని చెబుతుంది పారు. ఆ సంగతి తర్వాత.. ముందు దీప సంగతి ఆలోచించమని చెబుతుంది జ్యోత్స్న. దాని కథలో అదృష్టం ఉంటే మనకిపోయే కాలం దగ్గర పడింది అంటుంది. ఈ ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని గురువుగారు చెప్పారు కదా అని అంటుంది జ్యోత్స్న.

ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని చెప్పారు కానీ దీపకు మంచి జరుగుతుందని చెప్పలేదు కదా అని ప్రశ్నిస్తుంది పారిజాతం. దీపే ఈ ఇంటి వారసురాలా? అని ప్రశ్నించడంతో జ్యోత్స్న షాకిస్తుంది. ఆ పనిమనిషి దీప గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావ్.. దీప అనే పేరు పక్కన కార్తీక్ అనే పేరు లేకపోతే దీపం వెలిగించినా దాని ముఖం మీద వెలుగుపడదు అలాంటి జాతకం దానిది అని అంటుంది జ్యోత్స్న. ఇంతలో దాస్ వచ్చి.. అన్ని మనం అనుకున్నట్లు జరగవని, ఎదుటివారిని తక్కువ అంచనా వేయొద్దని వార్నింగ్ ఇస్తాడు దాస్. విర్రవిగితే నాశనమే అని వార్నింగ్ ఇస్తాడు దాస్. మనం ఎదుటివారికి చెడు చేయాలనుకుంటాం.. కానీ మంచే జరుగుతుందని చెబుతాడు దాస్.

మేం ఎవరి చెడు కోరుకోవడం లేదు కానీ దీనిని కాస్త ప్రశాంతంగా ఉంచమని దాస్‌ని అడుగుతుంది పారిజాతం. ఇక మీదట జ్యోత్స్న ప్రశాంతంగా ఉండదని చెబుతాడు దాస్. ఈ కథ ఒక పుట్టుక.. ఒక చావు.. ఒక బతుకు మధ్య జరుగుతుందని అంటాడు దాస్. నేను ఎప్పుడో మొదలుపెట్టాను కానీ పూర్తి చేయలేదని చెబుతాడు. వచ్చి దీపకు శుభాకాంక్షలు చెప్పమని అంటాడు దాస్. నువ్వొచ్చి దీపకు విష్ చేయకపోతే మీ తాత మనిద్దరినీ వదలడని వార్నింగ్ ఇస్తుంది పారిజాతం. మనల్ని ఎవరూ చెడ్డవారు అనుకోకూడదంటే కొన్ని ఇష్టం లేకపోయినా చేయాలని చెబుతుంది పారిజాతం.

అమ్మ మళ్లీ మనింట్లో పుట్టడానికి నాన్నే కారణమని.. అమ్మ జ్ఞాపకంగా నాన్న దాచుకున్న తాళి దీప మెడలో పడిందని గుర్తుచేస్తాడు దశరథ. దీపకు పారిజాతం శుభాకాంక్షలు చెబుతుంది. మా అమ్మే పుడుతుందని కాంచన సంతోషిస్తుండగా.. మీ అమ్మ దీప కడుపులో పుడుతుందని నీతో చెప్పిందా? అని వెటకారంగా అంటుంది. మీ అమ్మకు జ్యోత్స్న వారసురాలు కాబట్టి... తనకి పెళ్లయ్యాక తన కడుపులో పుడుతుందని అంటుంది పారిజాతం. మా అమ్మమ్మ జ్యోత్స్న కడుపులో పుడుతుందని నీతో ఏమైనా చెప్పిందా అని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు. గురువుగారి దగ్గర కార్తీక్, దీపలు ఆశీర్వాదం తీసుకుంటారు. నీ సమస్యలకు పరిష్కారం దొరికే రోజు తొందరలోనే ఉందని దీపతో చెబుతాడు గురువుగారు. వెళ్తూ వెళ్తూ.. మీ దంపతులిద్దరూ కొంచెం జాగ్రత్తగా ఉండమని దశరథ- సుమిత్రలకు చెబుతాడు గురువుగారు. ఆ మాటలతో అందరూ షాక్ అవుతారు.

గురువుగారు నీకు జాగ్రత్తలు ఎందుకు చెబుతున్నారని దశరథని శ్రీధర్ అడుగుతాడు. నాకున్న బాధ్యతల్ని ఆయన గుర్తుచేస్తున్నారని చెబుతాడు దశరథ. హోమం చేయించాం కదా ఇక అంతా మంచే జరుగుతుందని కార్తీక్ అంటాడు. హోమం జరిగింది జరగబోయే విపత్తుకు ఉపశమనమే తప్పించి.. సమూలంగా నిర్మూలించడానికి కాదని గురువుగారు చెప్పడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. మీ కుటుంబానికి జరగబోయే ప్రమాదం స్థాయి తగ్గుతుంది కానీ.... ప్రమాదం ఎవరికైనా, ఏ రూపంలోనైనా, ఎప్పుడైనా రావొచ్చునని చెబుతారు గురువుగారు. ఆ మాటలతో శివన్నారాయణ షాక్ అవుతాడు. కొన్నింటికి మీరు సిద్దంగా ఉండాలని వెళ్లిపోతాడు గురువుగారు. ఇప్పుడు ప్రమాదంలో ఏ రూపంలో, ఎవరికి రాబోతుందని టెన్షన్ పడతాడు శివన్నారాయణ.

తనను పెంచిన తల్లిదండ్రుల ఫోటోలకి దీపం వెలిగిస్తుంది దీప. అమ్మలా ఆదుకోవాల్సిన దీపను నడిరోడ్డు మీద వదిలేశాను, దేవుడిలాంటి కార్తీక్ బాబు తన నీడలో బతికే వరం నీకూతురికి ఇచ్చాడని చెబుతుంది అనసూయ. ఇది మనమంతా సంతోషంగా ఉండాల్సిన టైం అని కాంచన అంటుంది. నా తమ్ముడికి దీప అంటే ప్రాణం.. ఆడపిల్ల తల్లి అయ్యిందంటే అమ్మానాన్నలకు కలిగే ఆనందమే వేరని చెబుతుంది అనసూయ. కానీ దీపకు తల్లిదండ్రులు లేకుండా పోయారని బాధపడుతుంది. దీపకు తల్లిదండ్రులుగా సుమిత్ర అత్త, దశరథ మావయ్య ఉన్నారు కదా అని కార్తీక్ అనడంతో కాంచన, అనసూయ షాక్ అవుతారు. నాన్న అని దీప పిలిచినందుకు మావయ్య కూడా తండ్రి అవుతాడని అంటాడు కార్తీక్.

దాస్‌తో జ్యోత్స్న పర్సనల్‌గా మాట్లాడుతుంది. నిజం చెబుతానని నేను బెదిరించడం మామూలే.. నువ్వు మారకపోవడం మామూలే అంటాడు దాస్. ఏ తండ్రయినా పిల్లల భవిష్యత్ కోసం కష్టపడాలి.. నీకు ఆ అవసరం లేదని అంటుంది జ్యోత్స్న. నీ కూతురు బాగుండాలంటే.. నువ్వు చేయాల్సింది వేరు. దీప గురించి నిజం చెప్పకపోతే చాలని అంటుంది జ్యోత్న్న. నా తల్లి పాపం చేసింది, నేను తప్పు చేశాను రెండింటిని నేను సరిదిద్దుతానని చెబుతాడు దాస్. నేను అన్నింటికీ తెగించే ఉన్నానని అంటుంది జ్యోత్స్న. అయితే శివన్నారాయణ గారికి నిజం చెప్పేస్తానని దాస్ వెళ్తుండగా జ్యోత్స్న ఆపుతుంది. ఎవరైనా విన్నారంటే నా బతుకు కూడా కాశీ గాడి జీవితంలాగే ఉంటుంది. కనీసం వాడికి తలదాచుకోవడానికి అత్తగారి ఇల్లయినా ఉంది, నీతో పాటు నేను కూడా అద్దె ఇల్లు, గుడులు చుట్టూ తిరగాల్సిందేనని చెబుతుంది జ్యోత్స్న.

దీప నిన్ను ఎక్కడికీ పోనివ్వదని, ఈ ఇంట్లో నీకు ఆశ్రయం ఇస్తుందని అంటాడు దాస్. ఇప్పుడది పనిమనిషి.. ఆ తర్వాత నేను పనిమనిషిని అవుతానని అంటుంది జ్యోత్స్న. వారసురాలినే పనిమనిషిని చేశావు.. నువ్వు పనిమనిషిగా ఉంటే తప్పేంటీ? అని ప్రశ్నిస్తాడు దాస్. మా నోరు నువ్వు మూయించొచ్చు కానీ నిజం అదే బయటపడుతుందని చెబుతాడు దాస్. దీప కడుపులోకి మరో వారసురాలు రాబోతుందని .. ఆమె భూమ్మీద పడిన వెంటనే ఒక గొప్పింటి బిడ్డగానే ఈ అంత:పురంలో అడుగుపెడుతుందని చెబుతాడు దాస్. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X