Karthika Deepam 2 November 26th: కార్తీక్‌ని అవమానించిన కాశీ... జ్యోత్స్న చెంప పగలగొట్టిన సుమిత్ర

Photo Courtesy: JioHotstar

దీప ప్రెగ్నెంట్ అని తెలియడంతో జ్యోత్స్న రగిలిపోతుంటుంది. ఈ మాటతో నా కలలన్నీ కూలిపోయాయని పారుతో అంటుంది. కార్తీక్ ఇక ఎప్పటికీ నీవాడు కాదు.. నువ్వు ఇప్పటికైనా మరో పెళ్లి చేసుకోమని చెబుతుంది పారు. ఇంతలో దాస్ వచ్చి పారు, జ్యోత్స్నలకి స్వీట్లు పంచుతాడు. నువ్వు ఎంత చెడు చేయాలనుకున్నా మంచే జరుగుతుందని కూతురికి క్లాస్ పీకుతాడు. హోమం పూర్తి చేసి బయల్దేరుతూ... దశరథ - సుమిత్రలను జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు గురువుగారు.

హోమం చేసింది రాబోయే విపత్తు తీవ్రతను తగ్గించడానికే కానీ... పూర్తిగా నిర్మూలించలేమని, అన్నింటికి సిద్ధంగా ఉండమని చెబుతాడు గురువుగారు. ఆ మాటలతో శివన్నారాయణ షాక్ అవుతాడు. దీప గురించి నిజం తెలిసే రోజు త్వరలోనే ఉందని జ్యోత్స్నకి చెబుతాడు దాస్. నీ కూతురు సంతోషంగా ఉండాలని అనుకుంటే నువ్వు నిజం చెప్పొద్దని బతిమలాడుతుంది జ్యోత్స్న. దీప ప్రెగ్నెంట్ కావడంతో కాంచన, అనసూయలు సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 26వ తేదీ 525వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 525 November 26th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

దీప బిడ్డ గొప్పింటి బిడ్డగా ఈ అంత:పురంలో అడుగుపెడుతుందని.. దీనిని ఎవ్వరూ ఆపలేరని జ్యోత్స్నతో అంటాడు దాస్. రాతను ఎవ్వరూ ఆపలేరని, దీపకే కాదు ఆమె బిడ్డకు అన్యాయం చేయాలని చూసినా నేను నీ ముందు ప్రత్యక్షమవుతానని వార్నింగ్ ఇస్తాడు దాస్. ఇప్పుడు నేనొక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, నువ్వు తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తానని చెబుతాడు. నువ్వు అన్నింటికి సిద్దంగా ఉండు.. నువ్వు నా కూతురివి అని తెలిసే రోజు దగ్గరలోనే ఉందని అంటాడు దాస్. తండ్రి మాటలతో జ్యోత్స్నకు ముచ్చెమటలు పడతాయి.

దీప ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతాడు కార్తీక్.. ప్రతి నెలా టెస్టులు చేయించుకోవాలి, మంచి ఫుడ్ తినాలని అంటాడు. ఆ మాటలు విన్న దీప.. నీకు ఈ జాగ్రత్తలు అన్ని ఎలా తెలుసు అని అడుగుతుంది. నాకు పాపే పుడుతుందని కార్తీక్ చెబుతాడు. తాత, అమ్మలు మాట్లాడుకుంటూ ఉండటం, పెద్దమ్మ నీకు ఆడపిల్ల బొమ్మ కొనివ్వడం చూస్తుంటే నాకు ఆడపిల్లే పుడుతుందని దీప మురిసిపోతుంది. నాకు చాలా సంతోషంగా ఉందని తెలియకుండానే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని చెబుతుంది దీప. భర్తను కౌగిలించుకుని సంతోషిస్తుంది. ఈ తొమ్మిది నెలలు త్వరగా గడిచిపోవాలని అంటుంది దీప. ఈ 9 నెలలు నిన్ను భార్యలా కాకుండా చంటి బిడ్డలా చూసుకుంటానని అంటాడు కార్తీక్.

ముందు నీ నోరు తీపి చేయాలని చెప్పి దీపకు స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెబుతాడు. సరికొత్త ప్రయాణం ఈరోజే మొదలైంది, మన బిడ్డ ఈ భూమీ మీదకు వచ్చేసరికి ఒక్క సమస్య కూడా ఉండకూడదు. రేపటి నుంచి నువ్వు తాత ఇంటికి రావొద్దు, రెస్ట్ తీసుకోమని చెబుతాడు. అక్కడ అమ్మానాన్న ఉంటారు.. వాళ్లని చూస్తుంటే ఆనందంగా ఉంటుందని చెబుతుంది దీప. పారు మంచిది కాదు, నేనే దీపని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాడు కార్తీక్. అక్కడ నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం ఆ ఇంటికి రావొద్దని దీపకి చెబుతాడు.

స్వప్న కిందపడిపోతుండటంతో కాశీ పట్టుకుంటాడు. జాబ్ వచ్చే వరకు నీతో మాట్లాడనని అంటుంది స్వప్న. మా అన్నయ్యని చూసి నేర్చుకోమని చెబుతుంది. దాంతో కాశీ సీరియస్ అవుతాడు. మీ అన్నయ్య ఆఫ్ట్రాల్ కార్ డ్రైవర్ అనడంతో ఈ మాటలు విన్న శ్రీధర్ సీరియస్ అవుతాడు. నా కొడుకుని కారు డ్రైవర్ అంటావా? నన్ను ఏమన్నా పడతాను కానీ నా కొడుకుని అంటే మాత్రం తట్టుకోలేనని వార్నింగ్ ఇస్తాడు శ్రీధర్. 50వేల జీతం కోసం పది కంపెనీలు తిరిగే నువ్వెక్కడ? పెట్టిన సంతకానికి, ఇచ్చిన మాట కోసం సీఈవో పదవిని వదులుకున్నాడు. వాడు రాజ్యాన్నే వదిలేసుకుని రారాజు.. వాడు మా అందరి కోసం అన్ని వదులుకున్నాడని కార్తీక్‌ను మెచ్చుకుంటాడు. జీవితాన్నే త్యాగం చేయాలంటే వాడు నా కొడుకు అయ్యుండాలి.. అలాంటి వాడి పేరు మీద మచ్చపడితే ఊరుకోనని మండిపడతాడు. నీకు ఇచ్చిన అవకాశాలన్నీ అయిపోయాయి.. రాత్రికి నీకు చెబుతానని అంటాడు.

గురువుగారు చెప్పిన మాటలు గురించి, జరగబోయే ప్రమాదం గురించి బాధపడతాడు శివన్నారాయణ. జరగబోయే ప్రమాదం నుంచి నన్ను నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారని అనుకుంటాడు. దీప ఇప్పుడు ఒట్టి మనిషి కాదు.. కడుపుతో ఉంది. తన జాగ్రత్త తనదే, తన కడుపులోని బిడ్డ జాగ్రత్త కూడా తనదే అంటాడు శివన్నారాయణ. మెట్లు ఎక్కడం, పనులు చేయడం లాంటి పనులు చేయొద్దని చెబుతాడు దశరథ. దీప ఇప్పుడే ప్రెగ్నెంట్ కాలేదు.. తనకి ఆల్రెడీ శౌర్య అనే బిడ్డ ఉందని నానామాటలు అంటుంది. ఆ మాటలు విన్న సుమిత్ర కోపంతో రగిలిపోతూ... జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది. నువ్వు అవమానిస్తున్నది మాతృత్వాన్ని.. శౌర్యని దీప ఎలా కన్నదో, నేను నిన్ను అలా కన్నానని చెబుతుంది సుమిత్ర. కడుపులోని బిడ్డను మోయడం ఎంత కష్టమో నీకు తెలుసా? అని అంటుంది.

బిడ్డ రూపాన్ని అందంగా ఊహించుకుంటాం. కడుపులో కదులుతుంటే మురిసిపోతామని, రోజులు నెలలుగా మారతాయి.. బిడ్డకు మనకి దూరం తగ్గుతుంది, దానిని కళ్లతో చూసే క్షణం కోసం ప్రాణాల్ని పణంగా పెడతాం. బిడ్డకు ఏమవుతుందోనన్న భయాన్ని భరించడం కష్టంమని చెబుతుంది సుమిత్ర. ఇది అమ్మతనంలో దొరికే కన్నీళ్లు పెట్టించే ఆనందం.. అలాంటి మాతృత్వం గురించి ఎంత తేలికగా మాట్లాడావు, ఎంత వెటకారంగా మాట్లాడావని జ్యోత్స్న సీరియస్ అవుతుంది. వెలుగునిచ్చే సూర్యుడి కంటే జన్మనిచ్చే తల్లి గొప్పదని, అలాంటి తల్లి ఎంతమంది బిడ్డల్ని కన్నా తను గర్భవతి అయితే ఓనమాలు దిద్దే పసిబిడ్డ అవుతుందని చెబుతుంది సుమిత్ర. దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని, లోపలికి తరిమికొడుతుంది సుమిత్ర.

జ్యోత్స్న మాటలతో బాధపడ్డ కార్తీక్‌కు సుమిత్ర క్షమాపణలు చెబుతుంది. కార్తీక్‌తో మాట్లాడాలని పక్కకి తీసుకెళ్తాడు శివన్నారాయణ. నాలో ఒక భయం ఉంది.. అది ఎవ్వరికీ చెప్పలేనని అంటాడు. అదేంటో చెప్పమని కార్తీక్ అడగ్గా.. గురువుగారు చెప్పిన ప్రమాదం గురించి కార్తీక్‌కు చెబుతాడు శివన్నారాయణ. ఇంట్లో వాళ్లకి ఏమైనా జరిగితే తట్టుకోలేనని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X