Karthika Deepam 2 November 27th: కంపెనీలో జ్యోత్స్న గోల్‌మాల్... రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న శ్రీధర్

Photo Courtesy: JioHotstar

నువ్వు ఎవరో? దీప ఎవరో తొందరలోనే ఈ కుటుంబానికి తెలుస్తుందని దాస్ చెప్పడంతో జ్యోత్స్న వణికిపోతుంది. దీప కూతురు గొప్పింటి బిడ్డలాగే ఈ ఇంట్లో అడుగుపెడుతుందని అంటాడు దాస్. నేను ఈ ఇంట్లో తిరిగి అడుగుపెట్టే పని చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు. తనపై ప్రేమ చూపిస్తోన్న కార్తీక్‌ను హత్తుకుంటుంది దీప. తనతో స్వప్న మాట్లాడకపోవడంతో కాశీ హర్ట్ అవుతాడు. మా అన్నయ్య మీద గౌరవంతో నీతో ఆరోజు అలా ఉన్నానని చెబుతుంది స్వప్న. కార్తీక్ బావ ఆప్టరాల్ డ్రైవర్ అని కాశీ నోరు జారడంతో శ్రీధర్ సీరియస్ అవుతాడు. నా కొడుకుతో నీకు పోలికా అంటూ అల్లుడిని నానామాటలు అంటాడు శ్రీధర్.

ఉదయాన్నే ఇంట్లోకి వచ్చిన దీపను రెస్ట్ తీసుకోమని చెబుతుంది శివన్నారాయణ కుటుంబం. దీపకు ఆల్రెడీ పెళ్లయి, ఒక పాప కూడా ఉంది. ఆమెకు ప్రెగ్నెన్సీపై అనుభవం ఉందని జ్యోత్స్న నోరు జారడంతో సుమిత్ర లాగిపెట్టి కొడుతుంది. దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని వార్నింగ్ ఇస్తుంది. గురువుగారు ప్రమాదం గురించి చెప్పిన విషయాన్ని కార్తీక్‌కు చెప్పి బాధపడతాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 27వ తేదీ 526వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 526 November 27th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

గురువుగారు చెప్పిన విషయాన్ని కార్తీక్‌తో చెబుతాడు శివన్నారాయణ. నా గురించి నాకు ఎలాంటి భయం లేదు. కానీ ఇంట్లో ఎవరి ముఖం చూసినా భయంగా ఉందని అంటాడు. అప్పుడే నా కూతురు నాకు గుర్తొచ్చింది.. తన తల్లి మళ్లీ దీప కడుపులో పుడుతుండటంతో కాంచన చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఆమెకు దూరం కాకూడదని చెబుతాడు శివన్నారాయణ. నువ్వేం భయపడొద్దు... నా తాత కుటుంబానికి, నా కుటుంబానికి, నా బిడ్డకు ఏం జరగనివ్వనని చెబుతాడు. నా ఇంటి ముందు పోతురాజులా నా మనవడు నిలబడ్డాడని ఆ ప్రమాదానికి చెప్పమని అంటాడు కార్తీక్. జ్యోత్స్న రూపంలో ఓ పెద్ద ప్రమాదం ఈ ఇంట్లోనే ఉందని అనుకుంటాడు కార్తీక్.

మీ అమ్మ నిన్ను కొట్టడంలో తప్పేం లేదని జ్యోత్స్నతో పారు అనడంతో ఆమె రగిలిపోయి కత్తిని గ్రానీ మెడకి పెడుతుంది. మా అమ్మ నన్ను సపోర్ట్ చేయకపోయినా నేను పట్టించుకోను.... కానీ నీకేమైంది. నేను మాట్లాడిదన దానిలో తప్పేముందని అడుగుతుంది జ్యోత్స్న. దీప కడుపు గురించి మాట్లాడితేనే తప్పయితే, కడుపే లేకుండా చేస్తే ఇంకెంత తప్పు అని అడుగుతుంది. దీప కడుపులో బిడ్డ ఈ భూమ్మీదకు రాకూడదని అంటుంది. దాంతో దాస్ చెప్పిన మాటలు జ్యోత్స్నకు గుర్తొస్తాయి. దీపకు బిడ్డ పుట్టడం నాకు నచ్చలేదని అందుకే బిడ్డ భూమ్మీదకు రాకూడదని అంటుంది. నా జీవితాన్ని నేను అనుకున్నట్లుగా లేకుండా చేసిందెవరు? ఆ దీపే కాదా? దానిని నేను ఏం చేయలేదంటే నా లాంటి చేతకానీ దద్దమ్మ ఉండదు అంటుంది జ్యోత్స్న. దీప కడుపులోని బిడ్డకు నూరేళ్లు నిండిపోవాలి, ఆ బిడ్డను బతకనివ్వనని చెబుతుంది.

తన ప్రెగ్నెన్సీపై జ్యోత్స్న అన్నమాటలతో దీప బాధపడుతుంది. ఇంతలో సుమిత్ర వచ్చి జ్యోత్స్న అన్న మాటలకు నాకే బాధగా ఉంది, దీప సంగతి చెప్పనక్కర్లేదని అంటుంది. దీప మోస్తున్నది దింపుకోలేని బరువు అంటుంది దీప. నాకు ఏదైనా బాధ ఉందంటే అది నీ గురించే, కడుపుతో ఉన్న ఆడది గర్భగుడిలో ఉన్న దేవత లాంటిది ఆమెను ఎవ్వరూ ఏం అనకూడదని చెబుతుంది సుమిత్ర. దీపపై జ్యోత్స్నకు ఈర్ష్య ఉందని, నా కూతురు కార్తీక్‌ని కోరుకుంది.. కానీ కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకున్నాడని అంటుంది సుమిత్ర. ఒక ఆడదానికి ఈర్ష్య కలగడానికి ఇంతకుమించిన కారణం ఉండదని చెబుతుంది. పైగా సీఈవో పోస్ట్ విషయంల దీపని రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది.. అది కూడా వర్కవుట్ అవ్వలేదు. నిన్న హోమంలో కూడా దీప తల్లి కావడం జ్యోత్స్నకి నిద్ర లేకుండా చేశాయి. అవకాశం దొరికింది అనేసిందని చెబుతుంది సుమిత్ర.

జ్యోత్న్సకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తామని అంటుంది సుమిత్ర. ఆ పని త్వరగా చేస్తే అందరికీ ప్రశాంతంగా ఉంటుందని చెబుతాడు కార్తీక్. దాని మనసుని మార్చే ప్రయత్నం ముందు చేయాలని అంటుంది సుమిత్ర. అనవసరమైన బరువులు మోయొద్దని దీపకు చెబుతుంది. తల్లయిన ప్రతి ఆడదానికి తన తల్లిని చూడాలని మనసులో ఉంటుందని అంటుంది సుమిత్ర. చూస్తున్నది కదా అని కార్తీక్ అనగా.. అది నేను కాదు, దీప కన్నతల్లి అని అంటుంది సుమిత్ర. నువ్వే దీపకు కన్నతల్లివి అని అనుకుంటాడు కార్తీక్. కన్నతల్లి బిడ్డకు పంచే ప్రేమను ఎవ్వరూ చూపించలేరని చెబుతుంది సుమిత్ర. ఇంట్లో జరిగిన గొడవ గురించి వదినతో చెప్పొద్దని అడగ్గా... కుటుంబాలు కలవాలని కోరుకునేవాడిని నేనెందుకు చెబుతానని అంటాడు కార్తీక్. ఈ జనరేషన్‌లో పిల్లలంతా నీలాగా ఉంటే మళ్లీ ఉమ్మడి కుటుంబాలు ఏర్పడతాయని అంటుంది సుమిత్ర.

శ్రీధర్ శివన్నారాయణ ఇంటికొచ్చి జ్యోత్స్నని పిలవమంటాడు. కంపెనీ అకౌంట్స్ చెక్ చేశానని.. క్లోజింగ్ బ్యాలెన్స్‌కి కొంత అమౌంట్ టాలీ కావడం లేదని చెబుతాడు శ్రీధర్. ఆ మాటలతో జ్యోత్స్నకి చెమటలు పడతాయి. కొంత డబ్బు మిస్ అయ్యిందని శ్రీధర్ చెప్పడంతో ఎంత అని పారిజాతం అడుగుతుంది. 2.34 కోట్లని శ్రీధర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. కంపెనీ అకౌంట్స్ నుంచి మాజీ సీఈవో గారి ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయ్యిందని శ్రీధర్ చెబుతాడు. దాంతో అంత డబ్బు ఏం చేశావని శివన్నారాయణ, దశరథలు జ్యోత్స్నని నిలదీస్తారు. కంపెనీకి ఇప్పుడు నష్టాలు ఎందుకు వచ్చాయోనని తెలుస్తోందని అంటాడు శివన్నారాయణ. ట్రస్ట్‌కు ఏమైనా దానం చేసిందని పారు అనగా.. ట్రస్ట్‌కు ఎవ్వరూ పర్సనల్ అకౌంట్ నుంచి దానం చేయరు, కంపెనీ అకౌంట్ నుంచే ట్రాన్స్‌ఫర్ చేస్తారని చెబుతాడు కార్తీక్.

కంపెనీ అకౌంట్ నుంచి డబ్బును వ్యక్తిగత అవసరాలకి వాడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంటాడు కార్తీక్. అల్లుడు కదా అని సీఈవో పదవి ఇస్తే అత్తారింట్లోనే నిప్పుపెడుతున్నాడని శ్రీధర్‌పై మండిపడతుంది పారిజాతం. కార్తీక్ కౌంటర్‌తో జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది పారిజాతం. అంత డబ్బు జ్యోత్స్న ఏం చేసిందో చెప్పాలని దశరథ నిలదీస్తాడు. నువ్వు నాకు చెప్పే సమాధానాన్ని బట్టే నేను బోర్డ్ మెంబర్స్‌కి చెప్పాలి.. మామూలుగా అయితే బోర్డ్ మీటింగ్‌లోనే నిలదీయాలి, కానీ మావయ్యగారి పరువు పోకూడనే ఇంటికొచ్చి అడుగుతున్నానని అంటాడు శ్రీధర్. ఆ డబ్బును నేను సొంత ఖర్చులకు వాడుకోలేదని, ల్యాండ్ కొన్నానని అంటుంది జ్యోత్న్స. ఆ ల్యాండ్‌ని సుమిత్ర కోసం కొన్నానని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మమ్మీ పెళ్లి రోజుకి గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకున్నానని జ్యోత్స్న చెబుతుంది. కానీ నువ్వు చెప్పేది పచ్చి అబద్ధమని అంటాడు కార్తీక్. దాంతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X