Karthika Deepam 2 November 28th: దీప బిడ్డను చంపబోయిన జ్యోత్స్న... శ్రీధర్‌ని అవమానించిన పారిజాతం
Photo Courtesy: JioHotstar
ఇంటికి ఆపద రానుందని గురువుగారు చెప్పిన విషయాన్ని కార్తీక్‌తో చెబుతాడు శివన్నారాయణ. ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా నీ ఇంటి ముందు పోతురాజులా నేను నిలబడతానని చెబుతాడు కార్తీక్. జ్యోత్స్న రూపంలోనే ఈ ఇంట్లో పెద్ద ప్రమాదం ఉందని మనసులో భయపడతాడు కార్తీక్. సుమిత్ర తనను కొట్టడంతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఆ దీప వల్ల నేను చాలా కోల్పోయాను, ఆ బిడ్డను భూమ్మీదకు రానివ్వనని చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. జ్యోత్స్న అన్నమాటలతో బాధపడుతున్న దీపను సుమిత్ర ఓదారుస్తుంది. ఇంట్లో జరిగిన గొడవని వదినకు చెప్పొద్దని కార్తీక్‌ను అడుగుతుంది సుమిత్ర.
ఉదయాన్నే శివన్నారాయణ ఇంటికి వచ్చి జ్యోత్స్నని పిలవమంటాడు శ్రీధర్. ఏం జరిగింది? జ్యోత్స్న ఎందుకు అని శివన్నారాయణ అడగ్గా.. నేను నా మేనకోడలితోనే తేల్చుకోవాలని చెబుతాడు శ్రీధర్. కంపెనీకి సంబంధించిన 2.34 కోట్ల రూపాయల డబ్బు మాయమైందని, ఇది ఏమైందని జ్యోత్స్నని నిలదీస్తాడు. నేను మా మమ్మీ పేరు మీద ల్యాండ్ కొన్నానని జ్యోత్స్న చెప్పగా కార్తీక్ సీరియస్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 28వ తేదీ 527వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ల్యాండ్ కొన్నానని జ్యోత్స్న చెబుతున్నది పచ్చి అబద్ధమని పారు లాంటివాళ్లు అనుకుంటారని అంటాడు కార్తీక్. మధ్యలో నన్నెందుకు రా కలుపుతున్నావ్ అని పారు అనగా.. నువ్వు కరివేపాకు లాంటి దానివి ఉంటే అదో టేస్ట్ అంటాడు కార్తీక్. దీనికి నాకు ఏ సంబంధం లేదని చెబుతుంది పారిజాతం. ఎవరిని అడిగి ఆ స్థలం కొన్నావని శివన్నారాయణ నిలదీయగా.. నా కన్నతల్లి గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదని అంటుంది జ్యోత్స్న. మమ్మీకి సొంతంగా ఏదైనా ఉండాలని అనుకున్నానని.. అందుకే కొన్నానని చెబుతుంది. ఓ తల్లి కోసం తాపత్రయపడే కూతురిని అవమానిస్తారా అని పారిజాతం మండిపడుతుంది. తల్లి హృదయం గెలుచుకున్న కూతురు అన్న అవార్డ్ ఇవ్వాలని అంటుంది.
అయితే ఓ పెద్ద ఫంక్షన్ పెట్టి జ్యోత్స్నని సత్కరించాలని సెటైర్లు వేస్తాడు కార్తీక్. నా పర్మిషన్ లేకుండా జ్యోత్స్న అకౌంట్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన అకౌంటెంట్ మీద కేసు పెట్టమని శివన్నారాయణ ఫైర్ అవుతాడు. వాడికి బుద్ధి చెబితే అప్పుడు జ్యోత్స్నకి బుద్ధి వస్తుందని అంటాడు. అక్కడి దాకా అక్కర్లేదని ఆ ల్యాండ్‌ని కంపెనీ ఆస్తిగా చూపిస్తే సరిపోతుందని అంటాడు శ్రీధర్. కానీ అది అంత తేలిక కాదని చెబుతాడు దశరథ. జ్యోత్స్న మనకి కనిపించినంత అమాయకురాలు కాదని అనుకుంటాడు. నువ్వు మీ అమ్మ కోసం ల్యాండ్ కొన్న విషయం నాకెందుకు చెప్పలేదని అడుగుతుంది పారిజాతం. తప్పించుకోవడానికి వేరే దారి లేక మా మమ్మీని ఇరికించానని అంటుంది.
నా ప్లేస్ మీద నాకు నమ్మకం లేక ఇలా చేశానని, ఏనాటికైనా నేను అసలు కూతురు కాదని మా డాడీకి తెలిసేలోగా నా పేరు మీద ఎంతో కొంత ఆస్తి ఉండాలని ఇలా చేశానని జ్యోత్స్న చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. నేను సీఈవోగా ఉంటే నేను వాడుకున్న డబ్బుని నష్టాల్లో చూపించి తప్పించుకునే దానిని అని అంటుంది జ్యోత్స్న. బావ నా పాలిట భస్మాసురిడిలా తయారయ్యాడని మండిపడుతుంది జ్యోత్స్న. కానీ మీరు దొరకరు కదా అని దీప, కార్తీక్‌లు ఎంట్రీ ఇవ్వడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. అది దాని తల్లి కోసం ప్రాపర్టీ కొంటే దానిని ఎందుకు తిడుతున్నారని ఫైర్ అవుతుంది పారిజాతం. ఇది శివన్నారాయణ గారి ఏకైక వారసురాలు.. ఎప్పటికైనా ఈ ఆస్తి మొత్తం జ్యోత్స్నదే అంటుంది. మీరంతా చీమల్లా చుట్టూ చేరి తలో ముక్క పట్టుకుపోదామని అనుకుంటున్నారా అని మండిపడుతుంది పారు.
ఎవరి ఆస్తి ఎవరికి సొంతమని కార్తీక్ అడగ్గా.. పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. కార్తీక్ ఆస్తి గురించి చెప్పబోతుండగా దీప ఆపుతుంది. దాంతో జ్యోత్స్న, పారులకు అనుమానం వస్తుంది. ఈ ఆస్తి దశరథ మావయ్య పేరు మీద ఉంది, ఆయన దీనిని తన వారసురాలికి రాస్తాడని అంటాడు కార్తీక్. ఈ ఇంటి వారసురాలు జ్యోత్స్న కాదన్నట్లుగా చెబుతాడు. శివన్నారాయణ కుటుంబం మొత్తం భోజనాలు చేస్తుండగా దీపని కోపంతో చూస్తుంది జ్యోత్స్న. ఇంత జరిగినా మావయ్య, కార్తీక్, దీపలు సిగ్గు లేకుండా తింటున్నారని పారుతో అంటుంది జ్యోత్స్న. నా కూతురు కొన్న ల్యాండ్‌ని ఏం చేయాలి అన్న దాని గురించి తర్వాత మాట్లాడుకుందామని శ్రీధర్‌తో చెబుతాడు దశరథ.
నీ చెల్లికి అన్యాయం చేశానని నీకు నా మీద కోపంగా ఉందా? అని దశరథను అడుగుతాడు శ్రీధర్. నీ మీద కోపం ఉంటే నిన్ను నిలబెట్టి మాట్లాడతానా? అని అంటాడు దశరథ. కాంచనకు నువ్వంటే చాలా ఇష్టం.. నా గురించి కాంచనతో మాట్లాడమని అడుగుతాడు. నన్ను, కాంచనను కలపమని చెబుతాడు శ్రీధర్. నువ్వు గట్టిగా అడిగితే నీ మాట కాదనదు, మావయ్య గారితో నువ్వు మాట్లాడమని చెబుతాడు. ఈ మాటలు విన్న పారు వచ్చి తిడుతుంది. మీ నాన్నకి ఇద్దరు పెళ్లాలు కావాలట అని పారు అనడంతో శివన్నారాయణ సీరియస్ అవుతాడు. నా బాధలు నాకున్నాయి.. ఏం చేయాలో తెలియక దశరథ బావని సాయం అడిగానని అంటాడు శ్రీధర్. అప్పుడు ఇద్దరు పెళ్లాల్ని నువ్వు కోరుకున్నట్లే కదా? తప్పు చేసిన భర్తని వదిలేసినందుకు కాంచన పరువు నిలబడిందని అంటుంది పారిజాతం. ఇప్పుడు కాంచన తన నిర్ణయాన్ని మార్చుకుంటే కాంచన మొదటి భార్యగా ఉండాలని చెబుతుంది.
కలవాలా? వద్దా? అనేది వాళ్ల ఇష్టం... మధ్యలో నీ గొడవ ఏంటీ అని పారిజాతం మీద కార్తీక్ సీరియస్ అవుతాడు. నా గురించి మీరెవ్వరూ గొడవ పడొద్దని చెబుతాడు శ్రీధర్. మీ ఫ్యామిలీ కారణంగా మా ఫ్యామిలీలో గొడవలు రావడం కామన్ అంటుంది జ్యోత్స్న. మీరు మరీ మనసు లేకుండా ఎలా మాట్లాడుతున్నారని పారిజాతంపై మండిపడుతుంది దీప. సుమిత్రమ్మ గారు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు, భార్యాభర్తలు విడిపోయారు, మళ్లీ కలిసిపోయారు కదా అని అంటుంది దీప. ఆ కలవడం వేరు, ఈ కథ వేరు కదా అని చెబుతుంది పారిజాతం. మనుషుల్ని కలపడానికి సాయం చేయమని అడగటంతో తప్పు లేదు కదా అని అంటుంది దీప. ఇదే మాట మీద మీ మావయ్య గారిని నిలబడమను నేనేంటో చూపిస్తానని చెబుతుంది పారిజాతం.
కాంచన కాళ్లు పట్టుకుని అయినా మీ అమ్మని, మీ నాన్నని కలుపుతానని పారిజాతం అనడంతో అంతా షాక్ అవుతారు. కావేరిని వదిలేయాలని పారు చెప్పడంతో అంతా ఉలిక్కిపడతారు. కావేరితో, నీ కూతురితో నీకు ఎలాంటి సంబంధం లేదని వస్తే నిన్ను, కావేరిని నేను కలుపుతామని అంటుంది. నా తల్లి కన్నీళ్లు తుడవటానికి రానివాళ్లకి ఆమె ఆత్మాభిమానం గురించి ఎందుకు? నా తండ్రిని నా తల్లి ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లావని జ్యోత్స్నని నిలదీస్తాడు కార్తీక్. తెంచుకోవడానికి వాళ్లు కూడా మనుషులేనని అంటాడు. గొడవ ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి అటో ఇటో తేలిపోవాలి. కాంచన అల్లుడిని క్షమిస్తుందని మీరంతా ఎలా అనుకుంటున్నారని అంటుంది పారిజాతం.
పలకరించడానికి కూడా ఫోన్ చేయని మనిషి కలవడానికి ఒప్పుకుంటుందా? అని చెబుతుంది పారు. మా నాన్నని తాత కొట్టి ఇంట్లోంచి తరిమేశాడు, మళ్లీ మా నాన్నని క్షమిస్తాడని నువ్వు ఊహించావా? అని పారుని నిలదీస్తాడు కార్తీక్. మా నాన్నకి సీఈవో పోస్ట్ ఇస్తారని ఊహించావా? తాత, మావయ్య, మా నాన్న మళ్లీ కలిసి భోజనం చేస్తారని నువ్వు ఊహించావా? ఇన్ని జరిగినప్పుడు మా నాన్నని మా అమ్మ క్షమించదని నువ్వు అనుకుంటున్నావా? అంటాడు కార్తీక్. నా బాధలు, నా ప్రయత్నాలు నేను చూసుకుంటానని శ్రీధర్ వెళ్లిపోతాడు. అయితే లాప్‌టాప్ మరిచిపోవడంతో జ్యోత్స్న వెళ్లి ఇస్తుంది. వస్తూ వస్తూ దీపకి కాళ్లు అడ్డుపెట్టడంతో ఆమె కిందపడిపోబోతుండగా సుమిత్ర పట్టుకుంటుంది. దాంతో జ్యోత్స్నని దీప కోపంగా చూస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











