Karthika Deepam 2 November 29th: జ్యోత్స్న కుట్ర తెలుసుకున్న దీప... మరదలికి కార్తీక్ మాస్ వార్నింగ్..

Photo Courtesy: JioHotstar

కంపెనీ డబ్బుతో మా అమ్మ పేరుతో ల్యాండ్‌ కొన్నానని జ్యోత్స్న చెప్పిన మాటలని కార్తీక్ అస్సలు నమ్మడు. ఓ తల్లి కోసం కూతురుపడే తాపత్రాయాన్ని అవమానిస్తున్నారని పారిజాతం మండిపడుతుంది. అయితే ఆ కూతురికి ఖచ్చితంగా సన్మానం చేయాల్సిందేనని కార్తీక్ సెటైర్లు వేస్తాడు. నా పర్మిషన్ లేకుండా జ్యోత్స్న ఖాతాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన అకౌంటెంట్‌పై కేసు పెట్టమని శివన్నారాయణ మండిపడతాడు. ల్యాండ్‌ని కంపెనీ ఆస్తిగా చూపిస్తే సరిపోతుందని శ్రీధర్ అనగా.. అది చాలా కష్టమైన పని అని చెబుతాడు దశరథ. నిజంగానే నువ్వు మీ అమ్మ పేరుతో ల్యాండ్ కొన్నావా? అని జ్యోత్స్నని పారిజాతం అడగ్గా... రేపు నేను అసలు వారసురాలిని కాదని తెలిస్తే నా జీవితం గడవాలి కదా? అందుకే కంపెనీ డబ్బుతో నా పేరు మీద ల్యాండ్ కొన్నానని జ్యోత్స్న చెప్పడంతో పారు షాక్ అవుతుంది.

తనను, కాంచనను కలపాల్సిందిగా దశరథ సాయాన్ని అడుగుతాడు శ్రీధర్. ఈ మాటలు విన్న పారిజాతం.. నువ్వు నేను చెప్పినట్లుగా చేస్తే నిన్ను, కాంచనని నేను కలుపుతానని అంటుంది. కావేరిని, స్వప్నను వదిలేస్తే కాంచన కాళ్లు పట్టుకుని అయినా నేను కలుపుతానని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నా బాధలేవో నేను పడతానని నా కారణంగా మీరు మీరు కొట్టుకోవద్దని శ్రీధర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో దీప వస్తుండగా జ్యోత్స్న కాళ్లు అడ్డు పెడుతుంది. దాంతో దీప పడిపోతుండగా సుమిత్ర కాపాడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 29వ తేదీ 528వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 528 November 29th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

దీప కడుపు పొగొట్టాలని అనుకున్న జ్యోత్స్న ఆమె నడుస్తుండగా కాలు అడ్డుపెట్టడంతో కిందకు పడిపోతుండటంతో సుమిత్ర పట్టుకుంటుంది. చూసుకోవాలి కదా అంటూ దీపతో చెబుతారు శివన్నారాయణ కుటుంబ సభ్యులు. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో రగిలిపోతుంది జ్యోత్స్న. మా మమ్మీకి ప్రాణగండమైతే దీప కాపాడింది.. దీపకి ప్రాణగండమైతే మా మమ్మీ కాపాడింది. ఇప్పుడు దీప కడుపులోని బిడ్డకు ప్రాణగండమైతే స్వయంగా అమ్మమ్మే కాపాడుకుందని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ కోపంతో అక్కడికి వస్తాడు. నీకు, పారుకు గొడవలు పెట్టుకోవడం అలవాటు అయిపోయిందని మండిపడతాడు. నాకొక చిన్న డౌట్ వచ్చింది.. అడుగులు తడబడటం వల్ల నా భార్య పడిపోయిందా? కాలు అడ్డుపెట్టడం వల్ల నా భార్య పడిపోయిందా? అని కార్తీక్ అడగటంతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి.

నాకు అనుమానం వచ్చింది కాబట్టి నిలబడి మాట్లాడుతున్నా... అదే ప్రూఫ్ ఉండుంటే ఓ పెద్ద కర్ర తీసుకొచ్చి నీ బుర్ర బద్ధలు కొట్టేదానిని అనడంతో జ్యోత్స్న వణికిపోతుంది. ఒకవేళ నా భార్యను కిందపడేయాలని గానీ, కడుపులో బిడ్డను హానీ చేయాలని గానీ ఎవరైనా అనుకుంటే దాని కోసం ప్రయత్నాలు చేస్తే నేను కొట్టే దెబ్బే అలాగే ఉంటుందని వార్నింగ్ ఇస్తాడు. కడుపులోని బిడ్డను కూడా చంపాలని చూసేవాళ్లు ఆడ అయినా, మగ అయినా వదిలిపెట్టనని హెచ్చరిస్తాడు. ఇక్కడ నేను దీపకు భర్తగా ఉన్నానను అలాగే ఉండనివ్వండి... కార్తీక్‌గా మారితే కురుక్షేత్రమేనని వార్నింగ్ ఇస్తాడు.

కళ్లు నెత్తి మీద పెట్టుకుని నడిస్తే అలాగే పడిపోతారని అంటుంది జ్యోత్స్న. కాళ్లు అడ్డుపెట్టిన వాళ్ల పతనం మొదలైంది, తొందరలోనే వాళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతా.. వాళ్ల అర్హత ఏంటో వాళ్లకు గుర్తుచేస్తానని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అతను వెళ్లిపోయిన తర్వాత బావకి ఏం తెలుసు? నిజం తెలిసిపోయిందా? తొందర్లో ఏం చేయబోతున్నాడు? అంటూ ఆలోచిస్తుంది జ్యోత్స్న. దీని నుంచి బయటపడాలంటే నేను ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది.

కార్తీక్ ఇంటికి వచ్చిన శ్రీధర్.. నేను తప్పు చేసిన మనిషిని అని చొక్కా మీద రాసినట్లుగా నా జీవితం ఉందని కాంచనతో అంటాడు శ్రీధర్. వాళ్లందరి నోరులు మూయించాలంటే నా సమస్యకు పరిష్కారం వెతుక్కోవాల్సిన అవసరం లేదని చెబుతాడు. నేను కావేరిని వదిలేసి వస్తే నువ్వు నన్ను భర్తగా అంగీకరిస్తావా అని శ్రీధర్ అడగటంతో కాంచన షాక్ అవుతుంది. అత్తయ్య గారు ఈ ప్రశ్న అడిగినప్పుడు నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదని అంటాడు. అదే నన్ను అడిగి ఉంటే భర్తగా అంగీకరించను అని చెప్పేదానిని అని అంటుంది కాంచన. కావేరిని మీరు ఎందుకు వదిలేయాలి? మీరు నన్ను వద్దు అనుకున్నారా? నేను మిమ్మల్ని వదిలేశానని చెబుతుంది.

నువ్వు నన్ను కావేరితో వెళ్లు అనగానే వెళ్లిపోయాను, ఇక్కడ ఉంటానంటే ఏం చేసేదానివి అని అడుగుతాడు శ్రీధర్. అప్పుడు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయేదానిని అంటుంది కాంచన. మిమ్మల్ని పంపించింది నా ఇంట్లో నుంచి కాదు, నా జీవితంలో నుంచి అని చెబుతుంది. అనేవాళ్లు వంద అంటారు.. వీలైతే సమాధానం చెప్పండి, లేదంటే అక్కడి నుంచి వచ్చేయండి అని చెబుతుంది కాంచన. మావయ్య గారు నన్ను కొట్టి ఇంట్లో నుంచి బయటికి పంపేశారు, నా కొడుకైతే నా ముఖం మీదే డోర్ వేసుకుని వెళ్లిపోయాడు, నా కూతురు ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కొద్దని చెప్పిందని గుర్తుచేస్తాడు శ్రీధర్. చెత్తకు కూడా ఓ విలువ ఉందని.. నా ఎమోషన్స్‌కు నువ్వు చెత్త లాంటి విలువ ఇచ్చినా పర్లేదని అంటాడు.

నేను నీ భర్తనీ, కొన్నాళ్లు ఇద్దరం కాపురం చేశాం.. నా బాధ వినడానికి కూడా నీకు ఇంత ఇబ్బంది అయితే ఎలా? ఏది పూర్తిగా చెప్పనివ్వవు? ఏది అర్ధం చేసుకోవని శ్రీధర్ బాధపడతాడు. నీ మెడలో తాళి కట్టిన నాటి నుంచి ఈరోజు వరకు నువ్వు చెప్పిన మాట ఏదైనా కాదు అన్నానా? అని ప్రశ్నిస్తాడు. రెండో పెళ్లి చేసుకోవడం, బిడ్డను కనడం వరకు అన్ని నాకు చెప్పే చేశారా? అని నిలదీస్తుంది కాంచన. నేను తప్పు చేశాను, అందరూ నన్ను శిక్షించారు.. కానీ అందరిలో మార్పు వచ్చింది, కొట్టి తరిమేసిన మా మావయ్య గారు అల్లుడిగా అంగీకరించారు, నడిరోడ్డు మీద నా ముఖం మీదే కారు డోర్ వేసిన నా కొడుకు నన్ను క్షమించాడు, చివరికి నా కూతురు కూడా నన్ను అర్ధం చేసుకుందని చెబుతాడు శ్రీధర్. పెళ్లయిన తర్వాత అందరి జీవితాలు మొదలయ్యాయి.. ఉంటే నీతో ఉండాలి, లేదా నీ జ్ఞాపకాలతో పోవాలి అంటాడు. కలిసి బతకడం అనేది జరగదని కాంచన తేల్చేస్తుంది. నీతో మాట్లాడాల్సిన విషయం అయిపోయింది.. ఇంకో విషయం నీ కొడుకు, కోడలి ముందు అడుగుతానని శ్రీధర్ అంటాడు. వాళ్లు రావడానికి టైం పడుతుందని కాంచన చెప్పగా.. వచ్చాక అడుగుతానని చెబుతాడు శ్రీధర్. అప్పటి వరకు వెయిట్ చేస్తానని అంటాడు.

శివన్నారాయణ ఇంట్లో మొక్కలకు నీళ్లు పోస్తున్న కార్తీక్‌ను దీప ఆపుతుంది. నువ్వు పనులు తగ్గించుకోవాలి.. నిన్ను, నీ కడుపులోని బిడ్డను కూడా నేనే జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతాడు కార్తీక్. నా మొగుడికి నేనంటే ప్రాణం.. ఎవరైనా నా జోలికి వస్తే వాళ్ల తాట తీస్తాడని దీప అంటుంది. నేను జ్యోత్స్నతో మాట్లాడటం నువ్వు చూశావా? అని అడుగుతాడు కార్తీక్. దానికి ఆమె అవును అని సమాధానం చెబుతుంది. అత్త నిన్ను పట్టుకోకుంటే ఏమయ్యేదని కార్తీక్ సీరియస్ అవుతాడు. ఇంతలో శివన్నారాయణ వచ్చి అలవాటైన ఇంట్లో పడబోయావంటే.. పడటానికి ఎవరైనా కారణం అయ్యారా అని అడుగుతాడు. ఆ మాటలతో దీప, కార్తీక్ షాక్ అవుతారు. కార్తీక్ ఏదో చెప్పబోతుండగా దీప ఆపడంతో శివన్నారాయణకు అనుమానం వస్తుంది. ఇంట్లో అందరూ నా మేలు కోరుకునేవారే అంటుంది దీప. ఇక్కడ జరిగినవి కాంచనకు చెప్పొద్దని కార్తీక్‌తో అంటాడు శివన్నారాయణ. దీప, కార్తీక్‌ల కోసం శ్రీధర్ వెయిట్ చేస్తుండగా.. ఇంతలో కాంచన ఇంటికి కావేరి వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X