Karthika Deepam 2 December 1st: దీప, కార్తీక్‌లకి షాకిచ్చిన శ్రీధర్... స్వప్న కోసం కాశీ షాకింగ్ డెసిషన్
Photo Courtesy: JioHotstar
కిందపడిపోతున్న దీపని సుమిత్ర కాపాడటంతో తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని జ్యోత్స్న రగిలిపోతుంది. దీపకి, మా మమ్మీకి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఆమెను కాపాడుతూనే ఉందని మండిపడుతుంది. ఈసారి ఆ బిడ్డను ఎవరూ కాపాడలేరని మనసులో అనుకుంటూ ఉండగా కార్తీక్ వస్తాడు. కడుపులోని బిడ్డను కూడా చంపాలని చూస్తే ఒక పెద్ద కర్ర తీసుకుని వెనుక నుంచి కొడతానని అంటాడు. ఆ మాటలతో దాస్‌ని తాను కొట్టిన విషయం గుర్తొచ్చి జ్యోత్స్న వణికిపోతుంది. నా బిడ్డ జోలికి, నా భార్య జోలికి వస్తే.. డ్రైవర్‌గా ఉన్న నేను.. కార్తీక్‌గా మారతానని అప్పుడు జరిగేది కురుక్షేత్రమేనని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్.
కాంచన ఒంటరిగా ఉండగా ఆమెతో తాడోపేడో తేల్చుకోవాలని ఇంటికి వస్తాడు శ్రీధర్. మిమ్మల్ని జీవితంలో క్షమించనని కాంచన అనడంతో శ్రీధర్ బాధపడతాడు. మీ నాన్న, కార్తీక్ నన్ను క్షమించినప్పుడు నువ్వెందుకు మారడం లేదు అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. జ్యోత్స్నకి వార్నింగ్ ఇవ్వడం నేను చూశానని కార్తీక్‌తో చెబుతుంది దీప. ఇంతలో నువ్వు కిందపడిపోవడం అనుకోకుండా జరిగిందా? లేక ఎవరైనా కాలు అడ్డుపెట్టారా? అని శివన్నారాయణ అడగటంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. కార్తీక్, దీపల కోసం కాంచన, శ్రీధర్ ఎదురుచూస్తుండగా అనుకోకుండా కాంచన ఇంటికి కావేరి రావడంతో భార్యాభర్తలిద్దరూ షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 1వ తేదీ 529వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దీప ప్రెగ్నెంట్ కావడంతో ఆమె కోసం కావేరి స్వీట్స్, పిండి వంటలు చేసి తీసుకొస్తుంది. ఇంతలో శౌర్య వచ్చి హాయ్ చెబుతుంది. నాకు మాత్రమే చెప్పావు.. తాతయ్యకి చెప్పవా? అని కావేరి అడగ్గా.. నువ్వు ఎప్పుడో కానీ రావు, తాత అస్తమానం వస్తూనే ఉంటాడని అంటుంది శౌర్య. ఆ మాటలతో కాంచన, శ్రీధర్‌లు షాక్ అవుతారు. ఆయన ఇప్పుడు సీఈవో కదా? కార్తీక్‌తో మాట్లాడటానికి వస్తూనే ఉంటాడని కవర్ చేస్తుంది కాంచన. ఇది కూడా ఆయన ఇల్లే, ఎవరి కోసమైనా రావొచ్చని అంటుంది. నాకు స్వీట్స్ కావాలని శౌర్య మారాం చేస్తుంది. మీ అమ్మ కడుపులో ఉన్న బుజ్జి పాప కోసం నానమ్మ తీసుకొచ్చిందని చెబుతుంది కాంచన. ఇంతలో కార్తీక్ రావడంతో మీ నాన్న నీకోసం చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్నారని చెబుతుంది కాంచన.
నేనొక మాట అంటాను మీరు బాధపడొద్దని చెబుతాడు శ్రీధర్. ఇన్నిరోజులు దీపంటే నాకు మాత్రమే పడదని అనుకున్నాను, కానీ మీ అమ్మకి కూడా దీపంటే ఇష్టం లేదని నాకు ఈరోజే తెలిసిందని అంటాడు శ్రీధర్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. దీప అంటే ఇష్టం లేదని మీతో నేను చెప్పానా అని కాంచన సీరియస్ అవుతుంది. దీప ప్రెగ్నెంట్ అవ్వడం కూడా నీకు ఇష్టం లేదని అంటాడు. బిడ్డ పుడితే ఎంత పోతే ఎంత అనుకుంటోందని అనడంతో కాంచన మండిపడుతుంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి తప్పుగా మాట్లాడే అర్హత మీకు లేదని అంటుంది కాంచన. నువ్వు అన్ని ఆశలు పెట్టుకుంటే కడుపుతో ఉన్న కోడలిని మీ నాన్న ఇంటికి పనిచేయడానికి పంపించవు అంటాడు శ్రీధర్.
ఈ రోజు నీ కోడలు కాలుజారి కిందపడిపోబోయింది నీకు తెలుసా? అని శ్రీధర్ అనడంతో అంతా షాక్ అవుతారు. మా అమ్మ మళ్లీ నా మనవరాలి రూపంలో మా ఇంట్లో పుట్టబోతోందని మీ నాన్నతో చెప్పావు కదా? ఈరోజు కనుక సుమిత్ర దీపను పట్టుకోకపోయుంటే మీ అమ్మ మరోసారి చచ్చిపోయేదని అంటాడు శ్రీధర్. ఏమైనా జరిగిఉంటే తల్లిని, భార్యని ఓదార్చలేక నువ్వు కూడా ఏడుస్తూనే ఉండేవాడని కార్తీక్‌పై మండిపడతాడు శ్రీధర్. నువ్వు కాలు జారి పడిపోబోతే.. నా గుండె జారినంత పనైందని దీపై సీరియస్ అవుతాడు. నా కొడుకు తండ్రి కాబోతున్నాడంటే, నేను తాతయ్యని కాబోతున్నట్లే కదా? కాఫీ కప్పు తీసుకొస్తేనే మనం చాలా జాగ్రత్తగా నడుస్తాం.. అలాంటిది నా కొడుకు వారసత్వాన్ని నువ్వు కడుపుతో మోస్తున్నావని చెబుతాడు శ్రీధర్.
ఆ ఇంట్లో పనిచేయాల్సిన అవసరం ఏంటీ? అని శ్రీధర్ నిలదీస్తాడు. ఇవన్నీ నేను కాదు.. నువ్వు అడగాల్సింది అని కాంచనపై మండిపడతాడు. పడకుండా చూసుకుంటానని కార్తీక్ అనడంతో.. అంటే పనికిమాత్రం తీసుకెళ్తావా అని అంటాడు శ్రీధర్. అమ్మ కాబోతున్న ఆడదాని గురించి అమ్మ అయిన ఆడదే ఎక్కువగా చూసుకుంటుందని చెబుతాడు. నీ పుట్టింటి మీదున్న ప్రేమలో పావు వంతైనా నీ కోడలి మీద చూపించమని కాంచనపై మండిపడతాడు శ్రీధర్. దీపని జాగ్రత్తగా చూసుకో... ఇంటి పనులు ఆపించమని చెబుతాడు. ఏం చెబుతావో చెప్పుకో.. వీళ్లు మాత్రం ఆ ఇంటికి వెళ్లడానికి వీల్లేదని తేల్చిచెబుతాడు శ్రీధర్. ఈ విషయం గురించి ఆలోచించమని కాంచనతో కావేరి కూడా చెబుతుంది. శ్రీధర్ చెప్పిన మాటలతో ఆలోచనలో పడ్డ కాంచన.. నువ్వు ఇకపై ఆ ఇంటికి వెళ్లడానికి వీల్లేదని దీపకి తేల్చిచెబుతుంది. మీ భార్యాభర్తలు ఇద్దరూ ఏం ఆలోచించుకుంటారో కానీ మీ నిర్ణయం నాతో చెప్పండి అని అంటుంది కాంచన. మా నాన్న ఇంత పని చేశాడేంటీ అని కార్తీక్ బాధపడతాడు.
కాశీ వర్క్ చేసుకుంటూ ఉండగా స్వప్న వచ్చి కవర్ ఇస్తుంది. తనకు అపాయింట్‌మెంట్ లెటర్ రావడంతో కాశీ చాలా సంతోషించి అదేంటో చదివి షాక్ అవుతాడు. వెంటనే సీరియస్‌గా శ్రీధర్ దగ్గరికి వెళ్తాడు. మీ కింద పీఏగా నేను పనిచేయనని తేల్చి చెబుతాడు. కావాలంటే బడ్డీ కొట్టు దగ్గర జాయిన్ అవుతానని ఈ కవర్ మీ దగ్గరే పెట్టుకోండి అని కాశీ వెళ్లిపోతాడు. అల్లుడుగారిని ఎందుకు అవమానించారని శ్రీధర్‌పై మండిపడుతుంది కావేరి. సీఈవోకి పీఏ అంటే ఏమనుకున్నావు.. 40 వేలు జీతం, మా దగ్గర పనిచేస్తే తర్వాత బిజినెస్‌లోకి కూడా తీసుకురావొచ్చని చెబుతాడు శ్రీధర్. ఆ తర్వాత రెస్టారెంట్ పెట్టుకుంటే అల్లుడే ఓ 50 మందికి జాబ్ ఇవ్వొచ్చని అంటాడు. కానీ అల్లుడుగారికి నచ్చలేదు కదా అని కావేరి అనడంతో నేను కాశీని ఒప్పిస్తానని అంటుంది స్వప్న.
కాశీ దగ్గరికి వెళ్లిన స్వప్న.. నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్లిపోతున్నాను, ఇక రాను అని చెబుతుంది. ఇదేనా నువ్వు నన్ను అర్ధం చేసుకున్నదని అడుగుతాడు కాశీ. నువ్వు మా నాన్న చెప్పినట్లు చేస్తే నేను ఇదివరకటిలా ఉంటాను, లేదు నాకు నచ్చినట్లుగా ఉంటానంటే నీతో పాటు నేనుండను అని తేల్చేస్తుంది స్వప్న. ప్రేమ కోసం ప్రాణాలే వదులుకోవాలని అనుకున్నాను.. ఇగోని వదులుకోలేనా అని ఇష్టం లేకపోయినా కాశీ ఆ ఉద్యోగంలో చేరడానికి ఒప్పుకుంటాడు. దాంతో స్వప్న చాలా సంతోషిస్తుంది.
శివన్నారాయణ గారింటికి వెళ్లొద్దని కాంచన చెప్పడంతో దీప, కార్తీక్‌లు బాధపడతాడు. నువ్వే ఆ ఇంటికి అసలైన వారసురాలివన్న నిజం తెలిస్తే మా అమ్మ ఒప్పుకుంటుందని కార్తీక్ అంటాడు. ఇంతలో కాంచన వచ్చి ఆ నిజం ఏంటీ అని ప్రశ్నిస్తుంది. మీ ఇద్దరినీ ఏమైనా అనే అధికారం నాకుందని కాంచన అంటుంది. మేనత్తవి కదా ఆ అధికారం ఉంటుందని దీప నోరుజారుతుంది. నేను నీకు మేనత్తనా? అని కాంచన మండిపడుతుంది. మీ నాన్న చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావని అడుగుతుంది. నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పకపోతే.. ఆయనకి నేను సమాధానం చెప్పాల్సి వస్తుందని అంటుంది. నువ్వెందుకు సమాధానం చెప్పాలని కార్తీక్ అడగ్గా.. ఆయన అడిగింది నన్ను కాబట్టి అంటుంది కాంచన.
దీప కింద పడిపోయుంటే ఏంటి పరిస్ధితి? నీ కోడలి మీద నీకు బాధ్యత లేదా? అని ముఖం మీద చెయ్యి పెట్టి అడిగారని అంటుంది కాంచన. నీ మాట మేం ఎప్పుడు కాదన్నామని అడుగుతాడు కార్తీక్. ఎవరో వచ్చి నా కోడలి గురించి చెప్పే స్థాయికి నన్నెందుకు తీసుకొచ్చారని మండిపడుతుంది కాంచన. ఇంతలో శౌర్య రావడంతో పాప మీద కసురుకుంటుంది. దాంతో శౌర్య ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. దీప కూడా తన గదిలో బాధపడటంతో కార్తీక్ నలిగిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











