Karthika Deepam 2 December 2nd: శౌర్య మీద పారిజాతం దారుణమైన కుట్ర... ప్రమాదంలో దీప ప్రెగ్నెన్సీ
Photo Courtesy: JioHotstar
అనుకోకుండా కావేరి ఇంటికి రావడంతో కాంచన, శ్రీధర్‌లు షాక్ అవుతారు. దీప ప్రెగ్నెంట్ కావడంతో ఆమె కోసం పిండి వంటలు చేసి తీసుకొచ్చానని చెబుతుంది కావేరి. కార్తీక్, దీపలు ఇంటికి రాగానే.. దీప కాలు జారి కిందపడపోయిందని, సుమిత్ర లేకపోతే ఈరోజు అందరం ఏడవాల్సి వచ్చేదని చెబుతాడు శ్రీధర్. ఆ మాటలు విన్న కాంచన.. కొడుకు, కోడలిపై సీరియస్ అవుతుంది. ఇకపై దీపను శివన్నారాయణ గారింటికి తీసుకెళ్లొద్దని చెబుతుంది. దాంతో కార్తీక్, దీపలు బాధపడతారు.
కాశీకి తన పీఏగా ఉద్యోగం ఇస్తాడు శ్రీధర్. అపాయింట్‌మెంట్ లెటర్ చూడగానే రగిలిపోయిన కాశీ.. మామగారిపై సీరియస్ అవుతూ తాను ఆ ఉద్యోగం చేయనని తేల్చిచెబుతాడు. దాంతో కాశీని స్వప్న బెదిరించి ఒప్పిస్తుంది. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారని కార్తీక్, దీపలను నిలదీస్తుంది కాంచన. మధ్యలో వచ్చిన శౌర్యను కూడా కసురుకుంటుంది. దాంతో తల్లీపెళ్లాం మధ్యలో కార్తీక్ నలిగిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 2వ తేదీ 530వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కోపంతో రగిలిపోతూ బట్టలు సర్దుకుంటున్న పారిజాతాన్ని ఎందుకిలా చేస్తున్నావని అడుగుతుంది జ్యోత్స్న. నువ్వు జీవితంలో మారవని అర్దమైపోయింది అందుకే ఇలా చేస్తున్నానని అంటుంది. దీపకి నువ్వు కాలు అడ్డుపెట్టడం, కార్తీక్ నీకు వార్నింగ్ ఇవ్వడం నేను చూశానని చెబుతుంది పారు. ఆ మాటలతో జ్యోత్స్న వణికిపోతుంది. రేపు దీప బిడ్డకు ఏమైనా జరిగితే అది నీ వల్లేనని అందరూ అనుకుంటారని అంటుంది పారు. నీకోసం నిలబడేవాళ్లు ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెబుతుంది. నా కోసం ఎవ్వరూ నిలబడకపోయినా పర్లేదు.. కానీ దీప కడుపులోని బిడ్డను మాత్రం పుట్టనివ్వనని తేల్చిచెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారు షాక్ అవుతుంది.
దీప బతుకేదో అది బతుకుతుంది.. దానిని వదిలేయ్, నువ్వు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చి దోషిగా నిలబడే కంటే కొన్నాళ్లు దేశం వదిలి వెళ్లిపోమ్మని చెబుతుంది పారిజాతం. నాకు బదులుగా నువ్వు వెళ్లమని మండిపడతుంది జ్యోత్స్న. దీప అనే మనిషి పూర్తిగా నాశనం అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటానని తేల్చిచెబుతుంది. కాంచన అన్న మాటలతో కోపంతో ఉన్న దీపతో మాట్లాడాలని కార్తీక్ అనుకుంటాడు. కానీ దీప మాత్రం కోపంతో రగిలిపోతుంది. అత్తతో కలిసుండాలని మావయ్య గారు తపించిపోతున్నారు.. ఎవరిని అడగాలో తెలియక మా నాన్నని అడిగారు. అది ఎవరి చెవిలో పడకూడదో వాళ్ల చెవిలోనే పడింది. పారిజాతం గారి నోటికి అడ్డూ అదుపు ఉండదు.. అక్కడితో ఆగకుండా అత్తయ్యతోనే తేల్చుకోవాలని వచ్చిన మావయ్య.. నా గురించి ప్రస్తావించడంతో అత్తయ్య తట్టుకోలేకపోయారని చెబుతుంది దీప.
ఇన్ని తెలిసిన దానివి అమ్మ మాట్లాడినప్పుడు సైలెంట్‌గా ఉండొచ్చు కదా అని చెబుతాడు కార్తీక్. అత్తయ్య అడిగిన దానికి మన దగ్గర సమాధానం లేదు.. అప్పడు నేను మాట్లాడినది కరెక్టే కదా అంటుంది దీప. పాపం మధ్యలో శౌర్యకి తిట్లు పడ్డాయని కార్తీక్ బాధపడగా.. అది పెద్దవాళ్ల విషయాల్లో జోక్యం చేసుకుంటోందని దానికి అప్పుడప్పుడు పడాలని అంటుంది దీప. కొన్నిరోజులు ఎక్కడికైనా వెళ్దామా అని కార్తీక్ అడగ్గా.. శౌర్యని, అత్తయ్యని, అమ్మానాన్నలని, తాతని వదిలపెట్టి ఎక్కడికి వెళ్లాలని లేదు.. నా ఆనందం ఇక్కడే ఉందని అంటుంది దీప. ప్రపంచంలో ఎంత పెద్ద మేధావి అయినా తల్లి, పెళ్లాం మధ్యలో నగిలిపోతుంటే తలపట్టుకోవాల్సిందేనని అంటాడు కార్తీక్. నాన్న భయంలో అర్ధం ఉందని, అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలని దీపకు చెబుతాడు కార్తీక్.
నువ్వు నాకు సున్నుండలు పెట్టలేదు కదా నీకు నాకు కటీఫ్ అని కాంచనతో అంటుంది శౌర్య. నువ్వు నాకు ఎన్ని సున్నండలు పెట్టినా నేను నీతో మాట్లాడనని శౌర్యం మారాం చేస్తుంది. అమ్మానాన్నల దగ్గర పడుకోకూడదని నానమ్మ దగ్గరే పడుకోవాలని కాంచన చెబుతుంది. అయితే నాన్న అమ్మ దగ్గర ఉన్నాడు.. మరి తాతయ్య దగ్గర నువ్వుండాలి కదా అని శౌర్య అనడంతో కాంచన షాక్ అవుతుంది. ఎంత చెబుతున్నా వినకుండా కార్తీక్, దీపల దగ్గరే పడుకుంటానని వెళ్తుంది శౌర్య. ఇంతలో కాంచనకు పారిజాతం ఫోన్ చేస్తుంది. నీ కోడలికి కూతురు పుడతాడా? కొడుకు పుడతాడా? అని పారిజాతం అడుగుతుంది. కూతురు ఉంది కాబట్టి.. కొడుకు పుట్టాలని కోరుకుంటున్నానని చెబుతుంది కాంచన. కార్తీక్ మొదటిసారి తండ్రి అవుతున్నాడు.. శౌర్య దీప కూతురు, కార్తీక్ కూతురు కాదని అంటుంది పారిజాతం. దీపతో ఎవరికో పుట్టిన బిడ్డ కార్తీక్‌కి కూతురు ఎలా అవుతుందని ప్రశ్నిస్తుంది.
నేను, మీ నాన్నకి భార్యని తల్లిలా చూస్తున్నావా? పిన్నిలా చూస్తున్నావా? అని అడుగుతుంది పారిజాతం. నీ కన్నతల్లితో సమానంగా నువ్వు నన్ను చూడలేవు.. అలాగే కావేరి కూతురు స్వప్న, నీ కొడుకు కార్తీక్‌లలో నీకు ఎవరు ఎక్కువ? అంటే నువ్వు ఏం చెబుతావని ప్రశ్నిస్తుంది పారిజాతం. 9 నెలలు నువ్వు మోసిన కొడుకుతో ఆమె సమానం కాదని చెబుతుంది. అలాగే శౌర్య కూడా నీ కొడుక్కి కూతురు కాలేదు, నీకు మనవరాలు కూడా కాలేదని అంటుంది పారిజాతం. శౌర్యని పరాయిదానిలా చూడాలి.. రేపు కార్తీక్‌కి బిడ్డ పుట్టాక శౌర్యని దూరం పెట్టాల్సిందే, అందుకే ఇప్పుడే దానిని అనాథ శరణాలయంలో పెట్టాల్సిందేనని చెప్పడంతో పారుపై కాంచన సీరియస్ అవుతుంది. కాంచన మాటలతో పారిజాతం ఆలోచనలో పడుతుంది. నా మనవరాలు దీప కడుపులోని బిడ్డను దూరం చేయాలని అనుకుంటుంది, కానీ నేను కళ్ల ముందున్న బిడ్డను దూరం చేయాలని అనుకుంటున్నానని పారు మనసులో అనుకుంటుంది.
నిద్రపోతుండగా.. శౌర్య కాలు పొరపాటున దీప కడుపుకు తగలడంతో ఆమె నొప్పితో విలవిలలాడిపోతుంది. ఆ ఏడుపు విన్న కాంచన ఏం జరిగిందోనని కంగారుగా తలుపు కొడుతుంది. దీప కడుపులో నొప్పి అని ఏడుస్తోందని కార్తీక్ చెప్పగా.. శౌర్య కాలు తగిలిందా? అని కాంచన అడుగుతుంది. దీపని తీసుకుని ఆసుపత్రికి వెళ్లమని చెబుతుంది కాంచన. నాకు నొప్పి తగ్గిపోయిందని దీప పంటిబిగువున భరిస్తుంది.. కానీ కాంచనకు అనుమానం వస్తుంది. కార్తీక్ ఎంత చెబుతున్నా ఆసుపత్రికి వెళ్లడానికి దీప ఒప్పుకోదు. నీ గుండెల మీద పడుకుంటాను నొప్పి తగ్గిపోతుందని చెబుతుంది దీప. భార్య పరిస్ధితి చూసి కార్తీక్ కంటతడి పెడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











