Karthika Deepam 2 December 3rd: పారిజాతం ట్రాప్‌లో శౌర్య... కార్తీక్, దీపలకి పొంచి ఉన్న ముప్పు

Photo Courtesy: JioHotstar

తల్లి, భార్యల మధ్యలో నలిగిపోతున్న కార్తీక్... దీపను ఓదార్చడానికి వస్తాడు. అప్పటికే ఇంట్లో జరిగిన గొడవతో దీప కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మావయ్య గారికి అత్తయ్యని ఎలా దారిలో తెచ్చుకోవాలో తెలియక శివన్నారాయణ గారింట్లో జరిగింది బయటకు తీసుకొచ్చారని అంటుంది దీప. ఇన్ని అర్ధం చేసుకున్న దానివి ఇంట్లో గొడవలేంటీ? అని అడుగుతాడు కార్తీక్. మనం గొడవపడకపోతే అత్తయ్య అడిగిన ప్రశ్నకు సమాధానం లేదని అంటుంది దీప. దాంతో భార్యను హత్తుకుంటాడు కార్తీక్.

కాంచనకి పారిజాతం ఫోన్ చేసి.. శౌర్య నీ రక్తం కాదు, దానిని ఏ అనాధ శరణాలయంలోనో చేర్పించమని చెబుతుంది. పిన్ని మాటలతో కాంచన ఆలోచనలో పడుతుంది. తనకు సున్నుండ పెట్టలేదని కాంచన మీద అలిగిన శౌర్య తన అమ్మానాన్నల దగ్గర పడుకుంటుంది. నిద్రపోతుండగా.. శౌర్య కాలు పొరపాటున దీప కడుపుకు తగలడంతో ఆమె నొప్పితో విలవిలలాడిపోతుంది. ఆ ఏడుపు విన్న కాంచన ఏం జరిగిందోనని కంగారుగా తలుపు కొడుతుంది. నాకు నొప్పి తగ్గిపోయిందని దీప పంటిబిగువున భరిస్తుంది.. కానీ ఆ మాటలతో కాంచనకు అనుమానం వస్తుంది. కార్తీక్ ఎంత చెబుతున్నా ఆసుపత్రికి వెళ్లడానికి దీప ఒప్పుకోదు. నీ గుండెల మీద పడుకుంటాను నొప్పి తగ్గిపోతుందని చెబుతుంది దీప. భార్య పరిస్ధితి చూసి కార్తీక్ కంటతడి పెడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 3వ తేదీ 531వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 531 December 3rd 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

కార్తీక్, దీపలు డ్యూటీకి రాకపోవడంతో వాళ్లపై మండిపడుతుంది పారిజాతం. దీప ఒట్టి మనిషి కాదని కొంచెం అర్ధం చేసుకోమని క్లాస్ పీకుతాడు శివన్నారాయణ. మనం కొట్టించిన పెట్రోల్‌తో వాళ్లు రోడ్ల మీద తిరుగుతుంటారని నానామాటలు అంటుంది పారు. దాంతో నేను ఇప్పుడే కార్తీక్‌కి ఫోన్ చేసి కనుక్కుంటానని చెబుతాడు శివన్నారాయణ. కానీ కార్తీక్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో కాంచనకు ఫోన్ చేస్తాడు శివన్నారాయణ. రాత్రి వాళ్లు త్వరగా పడుకోలేదని... దీపకి కడుపులో నొప్పి వచ్చిందని చెప్పడంతో శివన్నారాయణ బాధపడతాడు. వెంటనే సుమిత్రను తీసుకుని కాంచన ఇంటికి వెళ్దామని పారుతో చెప్పి కంగారు పడతాడు. దీప కడుపు పోయిందని పారు సంబరాలు చేసుకుంటుంది.

స్కూల్‌కి రెడీ అవ్వకుండా శౌర్య ఇంట్లో గోల చేస్తుంది. అనసూయ తనకు జడ సరిగా వేయలేదని.. అమ్మతో వేయించుకుందామని అనుకుంటే మమ్మీ ఇంకా లేవలేదని అంటుంది శౌర్య. దాంతో నేను జడ వేస్తానని చెబుతుంది కాంచన. ఆలస్యంగా నిద్రలేచిన కార్తీక్‌కి డ్యూటీ ఆలస్యం కావడంతో టెన్షన్ పడతాడు. దీప పడుకునే ఉండటంతో ఆమెను లేపకుండా వచ్చేస్తాడు. జడలు బాగా వేయడంతో కాంచనను మెచ్చుకుంటుంది శౌర్య. దీంతో నేను వేగలేకపోతున్నానని.. ఎక్కడికైనా పంపించేయమని కసురుకుంటుంది అనసూయ. దాంతో రాత్రి పారిజాతం చెప్పిన మాటలు కాంచనకి గుర్తొస్తాయి.

ఇంతలో శివన్నారాయణ, పారిజాతం, సుమిత్రలు డాక్టర్‌ని తీసుకుని రావడంతో కాంచన, కార్తీక్‌‌లు షాక్ అవుతారు. మే అడిగేవరకు మీరేం చెప్పరు కదా? మా ఫోన్‌ కూడా లిఫ్ట్ చేయరని మండిపడతాడు శివన్నారాయణ. ఒకప్పుడు దీపని ఇంట్లో అడుగుపెట్టొద్దన్న మనిషి.. ఈరోజు దీప కోసం తాపత్రయపడుతున్నాడని అనసూయ మురిసిపోతుంది. దీప కడుపులో పెరుగుతున్నది నా మనవరాలు కాదు.. నా అమ్మ అని నువ్వు నాతో అన్నావు కదా, అమ్మని ఇలాగేనా చూసుకునేది అని కాంచనకు క్లాస్ తీసుకుంటాడు శివన్నారాయణ. మేమంతా ఇక్కడే ఉన్నాం కదా? ఏదైనా అయితే ఈ నాన్నతో చెప్పొద్దా అని మండిపడతాడు. ఏది ఏమైనా సరే నువ్వు కోరుకున్నది నీకు దూరం కాకూడదని చెబుతాడు శివన్నారాయణ.

దీపని చూసి మీ అత్త నీకు బాలేదని చెప్పింది.. నిన్ను చూస్తే నిక్షేపంలా ఉన్నావని అంటుంది పారిజాతం. రాత్రి ఏమైనా జరిగిందా? దేనికైనా గుద్దుకున్నావా? అని పారు నిలదీస్తుంది. రాత్రి ఏం జరిగిందని డాక్టర్ అడగటంతో దీప నిజం చెబుతుంది. ఆమెకు ఇంజెక్షన్ చేసి దీపకి ఏం ప్రాబ్లం లేదని, కానీ ఇకపై ఇది రిపీట్ కాకూడదని సుమిత్రతో చెబుతుంది డాక్టర్. దీపకు ఏం జరిగిందోనని పారిజాతం టెన్షన్ పడటంతో కాంచనకు అనుమానం వస్తుంది. రాత్రి శౌర్యను దూరం చేయమని చెబుతోంది, ఇప్పుడేమో దీప గురించి కంగారు పడుతోంది.. పిన్ని క్యారెక్టర్ నాకు అర్ధం కావడం లేదని అనుకుంటుంది.

దీపను తీసుకుని డాక్టర్, సుమిత్రలు బయటికి వస్తారు. దీపకు ఎలా ఉందని శివన్నారాయణ అడగ్గా.. బాగానే ఉందని చెబుతుంది డాక్టర్. బాగానే ఉంటే కడుపునొప్పి ఎందుకు వచ్చిందని పారిజాతం ఫైర్ అవుతుంది. రాత్రి శౌర్య వీళ్ల పక్కన పడుకుందని, దాని కాలు దీప కడుపుకి తగిలిందని సుమిత్ర చెప్పడంతో కాంచన, శివన్నారాయణలు షాక్ అవుతారు. మొదటి నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ గురించి జాగ్రత్తలు తీసుకోవాలని, శౌర్యకి.. ఈ బిడ్డకు గ్యాప్ వచ్చింది కాబట్టి ఫిజికల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయని దీపకి క్లాస్ పీకుతుంది డాక్టర్. సుమిత్రకు నీరసంగా ఉండటంతో నువ్వు కూడా ఆసుపత్రికి రమ్మనిన చెబుతుంది డాక్టర్. నేను బాగానే ఉన్నాను.. నేను ఎక్కడికి రాను అని తేల్చేస్తుంది సుమిత్ర. ఇక్కడ అందరూ మొండివాళ్లేనని, వాళ్ల మాట మనం వినాలే తప్పించి.. మన మాట వాళ్లు వినరని మండిపడుతాడు శివన్నారాయణ.

రాత్రి దీప కడుపునొప్పి అనగానే శౌర్య ఏదో చేసుంటుందని నాకు అనుమానం వచ్చిందని చెబుతుంది కాంచన. అది కావాలని చేయలేదని, నిద్రలో కాలు వేసిందని చెబుతాడు కార్తీక్. నేను సున్నుండ ఇవ్వలేదని నా మీద అలిగి మీ దగ్గర పడుకుందని చెబుతుంది కాంచన. ఇలాంటి సమయంలోనే పెద్దవాళ్లు తెలివిగా ఆలోచించాలని, పిల్లల్ని దూరంగా ఉంచాల్సిందేనని పారిజాతం అంటుంది. దానిని నా వైపు పడుకోబెట్టుకుంటానని కార్తీక్ అనగా.. మరి అంత గారాబం చేయాల్సిన అవసరం లేదని కాంచన సీరియస్ అవుతుంది. కాంచన మీద నా మాటలు పనిచేస్తున్నాయని పారిజాతం సంబరపడిపోతుంది. ఇలోగా... శౌర్య మనసు చెడగొట్టాలని అనుకుంటుంది. పిల్లలు ఒకచోట కుదురుగా ఉండరని, ముందు నువ్వు దీప గురించి, దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాత్రమే ఆలోచించాలని కార్తీక్‌తో అంటుంది కాంచన.

శౌర్య దగ్గరికి వెళ్లి.. రాత్రి నువ్వు మీ అమ్మని నిద్రలో కాలితో తన్నావని చెబుతుంది పారిజాతం. నువ్వు అబద్ధం చెబుతున్నావని శౌర్య అంటుంది. ఇప్పటి వరకు మరి మీ అమ్మ ఎందుకు నిద్రలేవలేదో చెప్పమని అడుగుతుంది పారిజాతం. డాక్టర్‌ గారిని మీ ముద్దుల తాత ఎందుకు తీసుకొచ్చాడో చెప్పు అని ప్రశ్నిస్తుంది. నువ్వు కాలితో తన్నడం వల్ల మీ అమ్మకి నొప్పి వచ్చింది.. అది చెక్ చేయడానికి డాక్టర్ గారు వచ్చారని చెబుతుంది పారిజాతం. ఆ మాటలతో శౌర్య కంగారుపడుతుంది. నిన్ను ఈరోజు నుంచి మీ అమ్మనాన్నల దగ్గర పడుకోనివ్వరని చెబుతుంది పారిజాతం. నానమ్మ నాకు సున్నండలు పెట్టలేదని అందుకే అమ్మ దగ్గర పడుకున్నానని చెబుతుంది శౌర్య.

మీ నానమ్మ మారిపోయిందని, మీ అమ్మకి బిడ్డ పుట్టబోతోంది కదా? మీ నానమ్మ ప్రేమంతా ఆ బిడ్డ మీదే ఉందని అందుకే నీకు సున్నండలు పెట్టను అని చెప్పిందని అంటుంది పారిజాతం. నువ్వు అబద్ధం చెబుతున్నావని పారుపై సీరియస్ అవుతుంది శౌర్య. ఆ తర్వాత మీ అమ్మనాన్నలు కూడా నిన్ను దూరం పెడతారు, సరిగా చూసుకోరని చెబుతుంది పారిజాతం. నిన్ను బాగా చూసుకోవాలంటే నువ్వు అన్నింటికి అల్లరి చేయాలి, మారాం చేయాలని చెబుతుంది పారిజాతం. ఆ మాటలతో శౌర్య ఆలోచనలో పడుతుంది. రాత్రి కాంచన, ఇప్పుడు శౌర్యలు నా బుట్టలో పడిపోయారు.. ఇక కార్తీక్‌కి నరకమే అని సంబరపడిపోతుంది పారిజాతం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X