Karthika Deepam 2 December 6th: పారిజాతం ప్లాన్ తెలుసుకున్న కార్తీక్.. ప్రమాదంలో సుమిత్ర ఆరోగ్యం

Photo Courtesy: JioHotstar

నువ్వు ఇకపై మా ఇంటికి రావాల్సిన అవసరం లేదని సుమిత్ర చెప్పగా దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. దీప ఇక్కడే ఉంటే నేను దాని కడుపులోని బిడ్డను చంపడం కుదరదని ఎలాగైనా ఇంటికి వచ్చేలా చేయమని పారిజాతంను అడుగుతుంది జ్యోత్స్న. అక్కడైతే అన్ని సౌకర్యాలు ఉంటాయి.. మా ఇంటికే వచ్చేయమని పారిజాతం అంటుంది. అయితే కార్తీక్ కూడా నిర్ణయం దీప మీద వదిలేయడంతో దీప షాక్ అవుతుంది. సుమిత్ర- దశరథలకు దూరంగా ఉండాలని భయపడిన దీప.. మా బావ ఎక్కడుంటే అక్కడే ఉంటానని చెబుతుంది.

ఆ మాటలతో అనసూయ మండిపడుతుంది. నీకోసం వాళ్లు ఇంత తాపత్రయ పడుతుంటే నువ్వెందుకు ఇలా చేస్తున్నావని ఫైర్ అవుతుంది. నీ ఇష్టం వచ్చినట్లే చేయమని శివన్నారాయణ కుటుంబం వెళ్లిపోగానే కొడుకు కోడలికి క్లాస్ తీసుకుంటుంది కాంచన. నీకు ఒక బిడ్డ ఉంది కాబట్టి.. ఈ బిడ్డ ఉంటే ఎంత? పోతే ఎంత అన్నట్లుగా ఉంటున్నావని కాంచన నానామాటలు అనడంతో దీప బాధపడుతుంది. మరోవైపు.. పీఏగా చేరిన కాశీని శ్రీధర్ ఓ ఆట ఆడుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 6వ తేదీ 534వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 534 December 6th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

శౌర్యను వీళ్లతో పడుకోవద్దని చెప్పాను ఇద్దరూ వినలేదు... చివరికి కడపుతో తన్నిందని మండిపడుతుంది కాంచన. డాక్టర్ గారు అడిగితే కానీ నిజాలు బయటకు రాలేదు.. వీళ్ల దగ్గర నాకెంత విలువ ఉందో ఇప్పుడే అర్ధమవుతోంది. నువ్వు కూతురికి చెప్పుకోలేవు, భార్యకు చెప్పుకోలేవు.. నువ్వు నా మాట వినడం లేదని బాధపడుతుంది. మీ ఇద్దరి మీదా నాకు ఎలాంటి కోపం లేదు.. కానీ ఇదంతా నా బాధ అని చెబుతుంది కాంచన. నీ మనసులో ఏముందో నాకు తెలియదు కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల చెల్లి బాధపడుతోందని ఒకసారి ఆలోచించమని దీపతో అంటుంది అనసూయ. ఇంట్లో జరిగిన గొడవతో కార్తీక్ బాధపడతాడు.

జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని దశరథ చెప్పడంతో శివన్నారాయణ చాలా సంతోషిస్తాడు. సుమిత్రను స్వీట్స్ తీసుకురమ్మని చెప్పగా.. నాకేం స్వీట్స్ వద్దు అని చెబుతుంది జ్యోత్స్న. ఈ తీపి వెనుక ఓ చేదు నిజం ఉందని జ్యోత్స్న అనడంతో అంతా షాక్ అవుతారు. నేను పెళ్లికి ఒప్పుకోవడం ఇదే మొదటిసారి కాదు.. ఇప్పటికీ రెండు సార్లు ఒప్పుకున్నానని అంటుంది. అయినాసరే మనవాళ్లంతా ఇంత సంతోషంగా ఎందుకు ఫీల్ అవుతున్నారో తెలుసా? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. మనకి కావాల్సిన వాళ్లు మనతో ఉండాలని కోరుకున్నప్పుడు దానికి అడ్డుగా ఉన్న వారిని ఏదో ఒక రకంగా తప్పించాలని కోరుకుంటారు. శత్రువునైతే ఓడిస్తారు, పనివాళ్లనైతే డబ్బులిచ్చి పంపిస్తారు. అదే అడ్డుగా ఉన్న వ్యక్తి కూతురైతే ఇలాగే పద్ధతిగా గెంటేస్తారని జ్యోత్స్న అనడంతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది.

నిన్ను గెంటేసి మేం ఎవరితో ఉండాలని కోరుకుంటామని దశరథ అడగ్గా.. నీ చెల్లెలి ఫ్యామిలీతో అంటుంది జ్యోత్స్న. మీరు ఈరోజు చేసినదంతా ఇదే కదా అని మండిపడుతుంది. దీపకి నీరసంగా ఉంటే చూసుకోవడానికి భర్త ఉన్నాడు, ఓ అత్తగారుంది, ఓ మేనత్త ఉంది. డాక్టర్‌ను తీసుకుని మీరంతా ఎందుకు ఆ ఇంటికి వెళ్లారని నిలదీస్తుంది జ్యోత్స్న. దీప కడుపులో ఉన్నది కాంచన వాళ్ల అమ్మేనని మీ తాతగారు బలంగా నమ్ముతున్నారని మండిపడుతుంది పారిజాతం. మీరు కాంచన అత్త విషయంలో ఏమైనా చేయండి నేను అడ్డురాను.. కానీ దీప ఎవరు? అని ప్రశ్నిస్తుంది. ఆవిడగారికి చిన్న ప్రాబ్లమ్ వస్తే ఫ్యామిలీ అంతా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తుంది జ్యోత్స్న.

ఆవిడగారికి స్వీట్స్, తాంబూలాలు, సత్కారాలు, నువ్వయితే ఏకంగా దీపకి కూతురి పోస్ట్ ఇచ్చేశావని సుమిత్రపై మండిపడుతుంది. నీ ముందు వేరొకరిని మమ్మీ అని పిలిస్తే నీకు ఎలా ఉంటుంది అని నిలదీస్తుంది జ్యోత్స్న. మీకు నాకంటే ఆ దీపే ఎక్కువని, కానీ దీప మీ మాటకు గౌరవం ఇస్తుందా అని ప్రశ్నిస్తుంది. కడుపుతో ఉన్నావు.. పనిలోకి రావొద్దు అంటే మీ మాట వినిందా అని అడుగుతుంది. కార్తీక్ ఏం చేసినా రైట్ అనే భ్రమలో మీరంతా ఉన్నారు.. అలాగే ఉండండి, పనిమనిషి కోసం ఇలాగే తపించిపోండి అని సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న.

అందరినీ కలపాలని ఆరాటపడేవాడు కొందరు.. ఆ అందరితో కలవలేక ఒంటరిగా మిగిలిపోదామనుకునేవాళ్లు ఇంకోకరు అంటూ జ్యోత్స్నపై మండిపడతాడు దశరథ. మనకి దగ్గరగా ఉన్న వాళ్ల ఆలోచనలు సరిగ్గా ఉంటే మనకి మంచి ఆలోచనలు వస్తాయని శివన్నారాయణ అనగా.. నేను ఎవరి మనసుల్ని చెడగొట్టడం లేదని అంటుంది పారిజాతం. నా మనవరాలు కడుపుతో ఉంటే ఏమేం చేస్తానో అవన్నీ దీపకి చేస్తానని తేల్చేస్తాడు శివన్నారాయణ. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద నా కూతురికి ఒక నమ్మకం ఉంది.. నా బిడ్డ మీద నాకు ప్రేమ ఉంది, నా కూతురి కోడలి కోసం నేను అన్నీ చేస్తానని అంటాడు శివన్నారాయణ. ఆ మాటలతో పారిజాతం, జ్యోత్స్నలు షాక్ అవుతారు.

శౌర్యకి ఇచ్చిన బొమ్మల్ని చూసుకుంటూ మురిసిపోతున్న సుమిత్రను చూసి సంతోషిస్తాడు దశరథ. ఇప్పటికే మనం కూతురి విషయంలో ఫెయిల్ అయ్యామని, మనం ఏం చేసినా తనకి నచ్చడం లేదని బాధపడుతుంది సుమిత్ర. తనకంటే దీపకి ప్రాధాన్యత ఇస్తున్నామని జ్యోత్స్న ఫీల్ అవుతోందని అంటుంది. తన బిహేవియర్‌లో చాలా మార్పులు వచ్చాయని.. మాట అనడానికి అస్సలు ఆలోచించడం లేదని అంటాడు దశరథ. పెళ్లికి ఒప్పించి చాలామంచి పనిచేశారు.. మంచి సంబంధం ఉంటే పెళ్లి చేసి దూరంగా పంపించేద్దామని అంటుంది సుమిత్ర. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ వచ్చినా కార్తీక్ ఎందుకు వెళ్లిపోవడం లేదు.. వాడు మన దగ్గర ఏదో దాస్తున్నాడని చెబుతుంది. ఆ మాటలతో దాస్‌ని జ్యోత్స్న చంపాలనుకున్న విషయం దశరథ గుర్తొస్తుంది. మన కుటుంబాలను కలపడానికి కార్తీక్ ఇక్కడ పనిచేస్తున్నాడు. అందరూ కలిసిపోయాక వాడు ఉండడు అని చెబుతాడు దశరథ. సుమిత్ర పైకి లేస్తూ ఉన్నట్లుండి తల తిరగడంతో కింద పడిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామని దశరథ చెప్పినా వినిపించుకోదు సుమిత్ర.

శౌర్యను నానమ్మ దగ్గర పడుకోమ్మని కార్తీక్ చెప్పడంతో శౌర్యకు పారిజాతం మాటలు గుర్తొచ్చి ఏడుస్తుంది. నువ్వు మారిపోతావని జో గ్రానీ ముందే చెప్పిందని శౌర్య చెప్పడంతో కార్తీక్‌కి మొత్తం అర్ధమైపోతుంది. నాకు ఎవ్వరూ వద్దు వెళ్లిపోతానని ఏడుస్తూ వెళ్తూ కిందపడిపోతుంది శౌర్య. నొప్పితో ఏడుస్తున్న పాప దగ్గరికి వెళ్లి రాత్రి నువ్వు బుజ్జిబాబుని కొట్టావని కార్తీక్ చెప్పడంతో శౌర్య బాధపడుతుంది. అందుకే నిన్ను నానమ్మ దగ్గర పడుకోమని చెప్పానని అంటాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X