Karthika Deepam 2 December 9th: పారిజాతం ప్లాన్ తిప్పికొట్టిన కార్తీక్.. పారుకి శివన్నారాయణ పనిష్మెంట్

Photo Courtesy: JioHotstar

అనసూయ, కాంచనలు మాట్లాడుకుంటూ ఉండగా దీప వచ్చి అత్తగారితో మాట్లాడుతుంది. ఆమెను చూడగానే కాంచన విసుక్కుంటుంది. ఇంట్లో ఉంటే ఈ అవిటి దానికి సేవలు చేయాల్సి వస్తుందని దీప అనుకుంటుందని చెబుతుంది. ఆ మాటలతో దీప కంటతడి పెడుతూ... ఇప్పుడు నేను అనుభవిస్తున్న జీవితం మీరు పెట్టిన భిక్ష, మీకు సేవల చేసుకోవడం నా అదృష్టం అని అంటుంది. కానీ నేను శివన్నారాయణ గారింటికి వెళ్లడానికి ఒక బలమైన కారణం ఉంది.. అది ఇప్పుడు చెప్పలేను, సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందని చెబుతుంది దీప. ఆ మాటలతో శివన్నారాయణ గారింటికి వెళ్లడానికి కాంచన అనుమతిస్తుంది.

అమ్మ కడుపు మీద కొట్టడంతో దీపకి శౌర్య సారీ చెప్పి ఇకపై నేను నానమ్మ దగ్గరే పడుకుంటానని చెబుతుంది. ఆ మాటలతో అంతా సంతోషిస్తారు. శివన్నారాయణ గారింట్లో మీరిద్దరూ జాగ్రత్తగా ఉండమని కొడుకు కోడలికి చెబుతుంది కాంచన. నీ కోడలికి, నీ మనవరాలికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది అని మాటిస్తాడు కార్తీక్. మీరెంత జాగ్రత్తగా ఉన్నా రాంగ్ రూట్‌‌లో వచ్చి యాక్సిడెంట్ చేసేవాళ్లు ఆగరని హెచ్చరిస్తుంది. దాంతో కార్తీక్, దీపలు ఆలోచనలో పడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 9వ తేదీ 536వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 536 December 9th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

పెళ్లికి ఒప్పుకున్నావు కదా? షాపింగ్‌కి ఎప్పుడు వెళ్దామని జ్యోత్స్నని అడుగుతుంది పారిజాతం. పెళ్లికొడుకు ఎప్పుడైనా దొరుకుతాడు.. కానీ పెళ్లిబట్టలు, దానికి మ్యాచింగ్ జ్యూవెలరీ, బ్లౌజులు ఇలా చాలా ఉంటాయని అంటుంది. నా పెళ్లి గురించి బాగా ఊహించుకుంటున్నావని మండిపడుతుంది జ్యోత్స్న. డాడీ అడిగాడు కాబట్టి పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చిందని జ్యోత్స్న చెప్పడంతో.. నీ పెళ్లి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని అంటుంది పారిజాతం. నీ ఆశలు నెరవేరే దారి నేను వేశాను.. దీప కూతురు శౌర్య మనసు విరగ్గొట్టాను. మీ అమ్మకి ఇంకో బిడ్డపుడితే నిన్ను సరిగా చూడరని చెప్పాను, అలాగే కాంచనకి కూడా శౌర్యను అనాథాశ్రమంలో పడేయమని చెప్పాను. ఇప్పుడు కార్తీక్ గాడికి కొత్త తలనొప్పులు స్టార్ట్ అవుతాయని పారిజాతం సంబరపడిపోతుంది.

ఇంతలో దీప, కార్తీక్, శౌర్యలు ఇంటికి రావడంతో పారిజాతం షాక్ అవుతుంది. ఇంటికి రాగానే ముద్దుల తాత అంటూ శివన్నారాయణ దగ్గరికి వెళ్లబోతూ ఆగిపోతుంది. నాకు నువ్వొద్దని పారిజాతంను హగ్ చేసుకోవడంతో పెద్దాయన షాక్ అవుతాడు. చిన్నపిల్లలకు ఎవరు ఇష్టమైతే వాళ్ల దగ్గరికే వెళ్తారని అంటుంది పారు. ఇంటి దగ్గర ఆడుకోవచ్చు కదా అని పారు అడగ్గా.. నేను కూడా ఇక్కడికి వస్తానని చెప్పానని అంటుంది శౌర్య. నీకోసమే వచ్చా, నువ్వు చాలా మంచిదానివి అనడంతో పారు పొంగిపోతుంది. మరి అంత ఓవరాక్షన్ వద్దని జ్యోత్స్న చెప్పగా.. నీకు నా మీద కుళ్లు అంటుంది పారు.

జో గ్రానీ నీకోసం ఏం చేసిందని శివన్నారాయణ అడగ్గా.. చాలా చేసిందని అంటుంది శౌర్య. దాంతో భయపడ్డ జ్యోత్స్న.. పాపకు అడ్డుపడుతుంది. దాంతో మనవరాలిపై పారు మండిపడుతుంది. మీ జో గ్రానీ నీకు ఏం మంచి విషయాలు చెప్పిందో చెప్పమని అడుగుతాడు శివన్నారాయణ. మా మమ్మీ బొజ్జలో ఉన్న బేబీ మీద ప్రేమతో మా నాన్న సరిగా చూసుకోడట, పక్కన పడుకోనివ్వడట, మా అమ్మకి నా పైన ప్రేమ తగ్గిపోతుందట, నాకు సున్నండలు పెట్టరట, నన్ను ఎవరికైనా ఇచ్చేస్తారని జో గ్రానీ చెప్పిందని పాప అనడంతో శివన్నారాయణ రగిలిపోతాడు. మరీ ఇవన్నీ నువ్వు పాటిస్తావా? అని పెద్దాయన అడగ్గా.. బయటివాళ్లు ఏం చెప్పినా పట్టించుకోవద్దని నాన్న చెప్పాడని శౌర్య అనడంతో పారిజాతం షాక్ అవుతుంది. ఏం దెబ్బ కొట్టావురా, గురిచూసి గుండెల్లో కొట్టావని అనుకుంటుంది. మీ నాన్న చెప్పిన మాటలే విను... ఎవరి మాటలు వినొద్దని శౌర్యని మెచ్చుకుంటాడు శివన్నారాయణ

చిన్నపిల్లలు తెల్లని కాగితం లాంటి వాళ్లు.. మనం చెప్పిన మాటలే రాసుకుంటారు. మంచి మాటలు కాకుండా పిల్లల మనసుల్ని చెడగొట్టే వాళ్లని ఏం చేయాలని కార్తీక్‌ని అడుగుతాడు శివన్నారాయణ. నీ కూతురికి ఇలాంటి మాటలు చెబితే ఓ తల్లిగా నువ్వెంత రగిలిపోతున్నావో నాకు తెలుసు. నువ్వు ఏ శిక్ష వేయమంటే ఆ శిక్షే వేస్తానని దీపతో అంటాడు శివన్నారాయణ. గుర్తిండిపోయేలా ఏదో ఒకటి చేయమని దీప చెబుతుంది. ఈరోజు నువ్వు మా గెస్ట్‌వి.. నువ్వు ఏ పనిచేయడానికి వీల్లేదని అంటాడు శివన్నారాయణ. ఈరోజు దీప పనులన్ని పారిజాతమే చేస్తుందని, కార్తీక్ నీతో పనులన్నీ చేయిస్తాడని చెబుతాడు. కార్తీక్ నీకు 10కి 10 మార్కులు ఇవ్వకపోతే రేపు మరోసారి పనిమనిషివి కావాల్సిందేనని పెద్దాయన చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. నా కూతురిని అడ్డు పెట్టుకుని నన్ను నా ఇంట్లోనే పనిమనిషిని చేయిస్తావా? అని కార్తీక్‌పై రగిలిపోతుంది పారు.

కాశీ, శ్రీధర్‌లు కారులో వెళ్తూ.. ప్రెజెంటేషన్ బాగా ప్రిపేర్ చేశావా అని కాశీని అడుగుతాడు శ్రీధర్. ఐడియా ఇచ్చింది దీప అక్క కాబట్టి..ఎలాంటి తేడా ఉండదని చెబుతాడు కాశీ. ఇంతలో స్వప్న ఫోన్ చేసి సాయంత్రం గుడికి వెళ్లాలి త్వరగా రమ్మని అడుగుతుంది. ఆ మాటలు విన్న శ్రీధర్.. సాయంత్రం లేట్ అవుతుందని అంటాడు. దాంతో స్వప్న సీరియస్ అవుతుంది. మీ ఆవిడే కాదు, మా ఆవిడ ఫోన్ చేసినా కష్టం అని చెబుతాడు శ్రీధర్. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నానని అనుకుంటాడు కాశీ. కిచెన్‌లో పారుతో వంట చేయిస్తాడు కార్తీక్. మనవడి దెబ్బకి పారిజాతానికి చుక్కలు కనిపిస్తాయి.

కాశీతో గుడికి వెళ్లడనికి శ్రీధర్ ఒప్పుకోకపోవడంతో స్వప్న కోపంతో రగిలిపోతుంది. డ్యూటీ టైం అయ్యాకే ఇంటికి వెళ్లాలట, ముందుగా వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వరట అంటూ కావేరితో చెబుతుంది స్వప్న. ఎంత అర్జెంట్ పని ఉంటే మాత్రం అలాగేనా సమాధానం చెప్పేది అని విసుక్కుంటుంది. పైగా సార్ అని పిలిపించుకుంటున్నారని మండిపడుతుంది స్వప్న. మా ఆయన సీఈవో... మీ ఆయన పీఏ అని అంటుంది కావేరి. ఇంటి దగ్గర ఉంటే మీ ఆయనతో గొడవపడతావు... నిజం చెప్పకపోతే మీ నాన్నతో గొడవపడతావ్.. వాళ్లిద్దరూ లేకపోతే నాతో గొడవపడతావ్ అని మండిపడుతుంది కావేరి. ఏం జరిగినా మీ నాన్నని అడగమని స్వప్నకి చెప్పి తప్పించుకుంటుంది.

కిచెన్‌‌లో పారిజాతంతో ఫ్రూట్స్‌ కట్ చేయించిన కార్తీక్.. దీపకి తినిపించమని చెబుతాడు. నేను తినిపించనని పారు చెప్పడంతో నీకు ఐదు మార్కులు వేద్దామని అనుకున్నా.. కానీ నువ్వు వినిపించుకోవడం లేదని మండిపడతాడు. అయినా చిన్నపిల్లలకి అలాంటి మాటలు ఎవరైనా చెబుతారా అని పారుపై దీప ఫైర్ అవుతుంది. మరో బిడ్డ పుడితే .. మొదటి బిడ్డపై ప్రేమ తగ్గుతుందని అంటుంది పారు. ఎవరికి తగ్గితే నీకెందుకు అని మండిపడతాడు కార్తీక్. దశరథకి శౌర్య స్వీట్స్ తినిపిస్తూ సందడి చేస్తుంది. ఇదే అసలైన మనవరాలని తెలిస్తే స్వీట్స్ తినిపించడం కాదు.. పర్మినెంట్‌గా ఇంట్లోనే ఉంచుకుంటారని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో శ్రీధర్ రావడంతో పారుని కాఫీ తీసుకురమ్మని చెబుతాడు శివన్నారాయణ. నా వల్ల కాదు, అల్లుడి ముందు పరువు పోతుందని అంటుంది పారిజాతం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X