Karthika Deepam 2 December 10th: దీప మొదటి పెళ్లిపై జ్యోత్స్న కామెంట్స్... కార్తీక్‌ని సెకండ్ హ్యాండ్ అంటూ

Photo Courtesy: JioHotstar

పెళ్లికి ఒప్పుకున్నావు కదా షాపింగ్‌కి ఎప్పుడు వెళ్దామని జ్యోత్స్నని అడుగుతుంది పారిజాతం. ఇదంతా మా నాన్న కోసం ఒప్పుకున్నానని చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్, దీపలు శౌర్యను వెంటబెట్టుకుని రావడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. శివన్నారాయణ దగ్గరికి కాకుండా పారిజాతం దగ్గరికి వెళ్లి ఆమెను గట్టిగా హత్తుకోవడంతో అంతా అవాక్కవుతారు. జో గ్రానీ చాలా మంచిది, నాకు మంచి విషయాలు చెప్పిందని శౌర్య అనడంతో పారిజాతం పొంగిపోతుంది.

జో గ్రానీ ఏం చెప్పిందని పెద్దాయన అడగ్గా.. అమ్మా, నాన్న, నానమ్మలు నన్ను సరిగా చూడరని.. నేను ఇంట్లో బాగా అల్లరి చేయాలని చెప్పిందని శౌర్య చెప్పడంతో శివన్నారాయణ రగిలిపోతాడు. ఈరోజు దీపకి బదులు పారు పనిమనిషిలా చేస్తుందని నువ్వే దగ్గరుండి చేపించాలని కార్తీక్‌తో అంటాడు. మరోవైపు.. సాయంత్రం గుడికి వెళ్దామని త్వరగా ఇంటికి వచ్చేయమని కాశీని అడుగుతుంది స్వప్న. పక్కనే ఉన్న శ్రీధర్.. పనులున్నీ పూర్తయ్యే వరకు పంపనని తేల్చిచెప్పడంతో స్వప్న మండిపడుతుంది. శివన్నారాయణ ఇంటికి కాశీతో కలిసి వెళ్తాడు శ్రీధర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 10వ తేదీ 537వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 537 December 10th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

దీపకి బదులుగా పారిజాతం కాఫీ తీసుకురావడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. వన్ డే సీఎంలా దీప ప్లేస్‌లోకి పారు వచ్చిందని చెబుతాడు కార్తీక్. నీ కొడుకు దెబ్బకి ఇక్కడ తలరాతలే మారిపోతున్నాయని అంటుంది పారిజాతం. ఆ నాలుక కంట్రోల్ చేస్తే అన్నీ కంట్రోల్‌లో ఉంటాయని అంటాడు శివన్నారాయణ. ప్రెజేంటేషన్ గురించి అందరికీ చెప్పమని శ్రీధర్‌తో అంటాడు శివన్నారాయణ. దాంతో లాప్‌టాప్ తీసుకుని లోపలికి రమ్మని కాశీకి ఫోన్ చేసి చెబుతాడు శ్రీధర్. ఎలాగైనా ప్రెజేంటేషన్ జరగకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న. కాశీని చూసిన పారిజాతం.. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు.. నాతో ఏదైనా పని ఉంటే ఫోన్ చేయమని అంటుంది. శ్రీధర్‌ని సార్ అని పిలవడంతో మావయ్య గారిని పట్టుకుని సార్ అంటావేంటీ అని మండిపడుతుంది. కాశీ ఇప్పుడు నాకు అల్లుడు కాదు.. నేను అతనికి మామని కాదని శ్రీధర్ అనడంతో నా మనవడిని నీ కూతురితో విడదీసేశావా అని ప్రశ్నిస్తుంది పారిజాతం.

కాశీ ఇప్పుడు నా పీఏ అని చెబుతాడు శ్రీధర్. ఆ మాటలతో జ్యోత్స్న మండిపడుతుంది. ఎవరిని అడిగి అపాయింట్ చేశారని ప్రశ్నిస్తుంది. ఇదేమీ మీ సొంత కంపెనీ కాదు.. మీకు నచ్చినవాళ్లని నచ్చిన పోస్టుల్లో పెట్టుకోవడానికి అంటుంది జ్యోత్స్న. మన కంపెనీ రూల్స్ ప్రకారం సీఈవో తనకు నచ్చిన మనిషిని పీఏగా పెట్టుకునే రైట్ ఉందని కౌంటర్ ఇస్తాడు కార్తీక్. కానీ ముందే చెప్పాలి కదా అని జ్యోత్స్న అడగ్గా.. నిన్న శ్రీధర్ నాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న ముఖం మాడిపోతుంది. ఛైర్మన్ గారే పర్మిషన్ ఇచ్చారా అంటూ పారిజాతం మండిపడుతుంది. నాన్న ఏ తప్పు చేయలేదు కదా? కాశీ పరాయివాడు కాదు కదా అని అంటాడు దశరథ. కాశీనే మిగతా వాళ్లని కూడా వేరే వేరే పోస్టులలో పెట్టేశారా? అని అడుగుతుంది జ్యోత్స్న. ముందుగానే చెబితే అన్నింటికీ ప్రిపేర్ అయి ఉంటామని అంటుంది పారిజాతం.

అల్లుడు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాడు.. మన దగ్గర పనిలో పెడితే బిజినెస్ నేర్చుకుంటాడని మావయ్య గారే చెప్పారని అంటాడు శ్రీధర్. తాత పేరు చెబుతున్నారు కానీ దీనంతటికీ కారణమైన మనిషి వేరే ఉంటారని అంటుంది జ్యోత్స్న. అతనెవరో కాదు ఈ మాయలోడే అని కార్తీక్‌పై సెటైర్లు వేస్తుంది పారిజాతం. అన్నింటికి మా బావని తప్పుబడుతున్నారు.. నేను చెప్పాను కదా అని పెద్దయ్య చెబుతున్నారని కౌంటర్ వేస్తుంది. అధికారాలన్నీ మీ దగ్గరే పెట్టుకున్నారని మండిపడుతుంది జ్యోత్స్న. ఎవరినీ పీఏగా పెట్టుకోవాలనేది పూర్తిగా సీఈవో నిర్ణయమేనని చెబుతాడు దశరథ. ఆ తర్వాత శ్రీధర్ తన ప్రెజేంటేషన్ ఇస్తాడు. నీ ప్లాన్ బాగుంది వర్కవుట్ అవుతుందని శివన్నారాయణ, దశరథలు శ్రీధర్‌ను మెచ్చుకోగా.. జ్యోత్స్న మాత్రం కాదు అని చెబుతుంది.

మీరు చెప్పిన దానిలో చాలా ఫుడ్ ట్రక్స్ ఉంటాయి.. అన్నీ దాటుకుని వచ్చి మన దగ్గర ఎవరు కొంటారని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. వర్కవుట్ అవుతుందని కాశీ కూడా చెబుతాడు. దాంతో పారిజాతం, జ్యోత్స్నలు అతనిపై మండిపడతారు. కాశీ మీకు ధైర్యాన్ని ఇస్తున్నాడని అతనికి అండగా నిలబడుతుంది దీప. ఫుడ్ వేస్ట్ కాదని, నేను మీ అంత చదువుకోకపోయినా నాకు కొంచెం లౌక్యం ఉందని చెబుతుంది దీప. జ్యోత్స్న రెస్టారెంట్‌ని ముందు జనాల్లోకి తీసుకెళ్లాలి, వేస్ట్ అయిన ఫుడ్‌ని అనాథ పిల్లలకి పంచిపెడితే పుణ్యం వస్తుంది, పేరు కూడా వస్తుందని అంటుంది దీప. అప్పుడు ఆర్డర్స్ వస్తాయి.. బిజినెస్ పెరుగుతుంది. అప్పుడు కూడా పేదలకు ఫ్రీ ఫుడ్ పెట్టడం ఆపకుండా కంటిన్యూ చేస్తామని చెబుతుంది దీప. పేదల ఆకలి తీర్చడం కోసం ఈ జ్యోత్స్న రెస్టారెంట్ నిలబడుతుందని జనం అనుకుంటారని చెబుతుంది. దాంతో అందరూ చప్పట్లు కొట్టగా.. జ్యోత్స్న, పారులు ఉడుక్కుంటూ ఉంటారు.

ఆకలి గురించి అనాథల గురించి చాలా బాగా చెప్పావు... పెంపకం వల్లే ఇలాంటి లక్షణాలు రావు, రక్తంలో ఉండాలని అంటాడు శివన్నారాయణ. దాంతో దీప, సుమిత్రల వైపు చూస్తూ బాధపడుతుంది దీప. తర్వాత ప్లాన్‌ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేయమని శ్రీధర్‌కి ఆల్‌ది బెస్ట్ చెబుతాడు శివన్నారాయణ. మనింట్లో, మన ఆఫీసులో దీపకి బలం పెరుగుతోందని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. ఫుడ్ ట్రాక్ బిజినెస్‌ని ఎలాగైనా ఆపాలని చెబుతుంది జ్యోత్స్న. ఈ ఇంట్లో చప్పుట్లు కొట్టించుకునే స్థానంలో దీప.. చీవాట్లు తినే స్థానంలో నువ్వు ఉన్నావని అంటుంది పారిజాతం. సీఈవో పోస్ట్ విషయంలో కాంచన అత్తయ్య కాళ్ల మీద పడుంటే మావయ్య అసలు ఆఫీస్‌కి వచ్చేవాడే కాదని అంటుంది జ్యోత్స్న. ఇలాగే ఊరుకుంటే స్వప్న, కావేరిలు కూడా ఫ్యామిలీలో, బిజినెస్‌లో ఎంటర్ అవుతారని చెబుతుంది.

దీప కన్నవాళ్లెవరో నీకు తెలుసా? అని పారు అడగటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప కళ్లలో ఓ మెరుపును చూశానని పారు చెప్పగా.. మరి నా కళ్లలో బాధని చూడలేదా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. ఈసారి మనం కొట్టే దెబ్బకి అందరికీ గుర్తుండిపోవాలని చెబుతుంది. కార్తీక్‌ గులాబ్ జాంలు తయారు చేయించి అందరినీ పిలిచి ఓ శుభవార్త చెప్పబోతున్నట్లు చెబుతాడు. దీప గురించి ఓ పద్యం పాడి వినిపిస్తాడు. నా భార్య నాకు గర్వంగా నిలిచిందని అంటాడు. దీప చెప్పిన ఐడియా నీకు, జ్యోత్స్నకి వచ్చిందా? అని ప్రశ్నిస్తాడు కార్తీక్. మార్కెట్‌లోకి ఫుడ్ ట్రక్స్ వెళ్లాయి.. రేపటి నుంచి జ్యోత్స్న రెస్టారెంట్స్ గురించి జనం మాట్లాడుకుంటారని చెబుతాడు.

దీపకి దిష్టి తగులుతుంది, ఆమె భర్తగా నిన్ను కూడా పొగుడుతారు. కానీ దీప మొదటి భర్తని కూడా జనం గుర్తు చేసుకుంటారని జ్యోత్స్న అనగా అంతా షాక్ అవుతారు. మొదటి భర్తని దురదృష్ట వంతుడిని చేసి జైలు పాలు చేసిందని అంటుంది. నచ్చినవాడు కంటికి కనిపించినప్పుడు, నచ్చనివాడిని దూరం పెట్టడమే మంచిదని జ్యోత్స్న అనడంతో శివన్నారాయణ సీరియస్ అవుతాడు. మరొక ఆడదాని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నానన్న సంస్కారం లేకుండా పోయిందని జ్యోత్స్నకి చీవాట్లు పెడతాడు దశరథ. నేను చెప్పింది నిజం కాదా? బావ దీపకి రెండో భర్త కాడా? సంసారం చక్కదిద్దుకోవడం తెలియక మొగుడిని వదిలేసింది అని అంటుంది జ్యోత్స్న. విడాకులు తీసుకున్నది బావ కోసమా? లేక భర్త నచ్చక అనేది తెలియడం లేదని చెబుతుంది. ఆ మాటలతో సుమిత్రకు కోపం వచ్చి జ్యోత్స్నని కొట్టబోతుండగా కార్తీక్ ఆపుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X