Karthika Deepam 2 December 12th: బెడిసికొట్టిన కార్తీక్ ప్లాన్.. స్వప్న- కాశీలను బయటికి పొమ్మన్న కావేరి
Photo Courtesy: JioHotstar
దీపపై చేసిన వ్యాఖ్యలకు జ్యోత్స్నకి కౌంటర్ ఇస్తాడు కార్తీక్. దీపకి ఊహా తెలిసేలోపే పెళ్లయి, పిల్ల పుట్టిందని... ఆ లోపే తనని వదిలేసి భర్త వెళ్లిపోయాడని చెబుతాడు. అలాంటి దీపకి కొత్త జీవితాన్ని ఇచ్చానని అంటాడు. దీప రెండో పెళ్లి చేసుకుంటే నీకొచ్చిన నష్టమేంటీ? ఒకవేళ దీపను నేను పెళ్లి చేసుకోకపోయినా నిన్ను మాత్రం చేసుకునే వాడిని కాదని.. కేవలం మన కుటుంబాలు కలవాలనే భరించానని అంటాడు కార్తీక్. దాస్ మావయ్య, అనసూయ పెద్దమ్మలు వారి జీవిత భాగస్వాములపై ఉన్న ప్రేమతో అలాగే ఒంటరిగా మిగిలిపోయారని.. పారు, తాతయ్యలు వారి పిల్లల కోసమే మళ్లీ పెళ్లి చేసుకున్నారని చెబుతాడు.
ఆ మాటలతో కార్తీక్‌కి పారిజాతం ఏకీభవిస్తుంది. ఆడదాని మనసును అర్ధం చేసుకున్నావని చెప్పడంతో శివన్నారాయణ ఆమెకు గులాబ్‌జామ్ తినిపిస్తాడు. ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలబడదని జ్యోత్స్న రగిలిపోతుంది. జ్యోత్స్న మాటలతో దీప బాధపడుతుంది. నన్ను ఎన్ని మాటలు అన్నా పడతానని, కానీ నిన్ను ఒక్కమాట అన్నా తట్టుకోలేనని చెబుతుంది దీప. భార్యను ఓదార్చి ఆమెకు గులాబ్‌జామ్ తినిపిస్తాడు కార్తీక్. కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన ఫుట్ ట్రక్స్ దగ్గరికి వెళ్లి పరిస్ధితి ఎలా ఉందో చూడమని కాశీకి చెబుతాడు శ్రీధర్. పని అవ్వగానే తాను ఇంటికి వెళ్తానని కాశీ చెప్పగా శ్రీధర్ ఒప్పుకోడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 12వ తేదీ 539వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కాంచన, అనసూయలతో శౌర్య గొడవ పడుతుంది. శౌర్య సెటైర్లకు అనసూయకు కోపం రావడంతో కొట్టబోతుంది. అయితే కాంచన ఆపుతుంది. దీనికి సరిగా మార్కులు రావడం లేదని వాళ్ల మిస్ కార్తీక్‌కి ఫోన్ చేసి చెప్పిందట. అందుకే దీని బాధ్యత నేను తీసుకున్నాను అని చెబుతుంది కాంచన. నువ్వు కలెక్టర్ అవ్వాలని మీ కోరుకుంటోంది బాగా చదువుకోమని చెబుతుంది కాంచన. ఇంతలో చదువుకోకుండా బొమ్మలు వేస్తున్న శౌర్యని అనసూయ చూస్తుంది. దొంగ దొరికేసింది దీనికి స్కూల్‌లో ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయో ఇది చూస్తే నీకు అర్ధమవుతుందని అంటుంది. ఇంతలో తాను వేసిన బొమ్మను తీసుకుని శౌర్య పారిపోతుంది. తనని పట్టుకోవాలని అనసూయ అటు ఇటు పరిగెత్తుతుండగా కార్తీక్ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. నన్ను పట్టుకోకూడదని కార్తీక్‌తో శౌర్య అంటుంది. ఆ వెంటనే దీప రావడంతో ఆమెను జాగ్రత్తగా ఉండమని చెబుతాడు కార్తీక్.
ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండగా ఇంతలో కావేరి రావడంతో అంతా షాక్ అవుతారు. కడుపుతో ఉన్న కోడలికి ఏదైనా వండి పెట్టడం ఆనవాయితి. ఇక్కడ నువ్వు, నేను తప్పించి దీపకి అత్తగార్లుగా ఎవరున్నారు? అని అంటుంది కావేరి. దీపని కార్తీక్‌ని మా ఇంటికి టిఫిన్ చేయడానికి పిలుద్దామని వచ్చామని కాంచనతో చెబుతుంది. వాళ్లిద్దరూ ఖచ్చితంగా వస్తారని చెబుతుంది కాంచన. మాతో పాటు నువ్వు కూడా రావొచ్చు కదా అని కార్తీక్ అడుగుతుండగా.. మీ పెద్దమ్మ గుడ్డు పులుసు పెట్టింది భోజనం చేద్దామని కాంచన సీరియస్ అవుతుంది.
ఆఫీస్‌కి రాకుండా ఇంటికి ఆలస్యంగా వచ్చిన కాశీపై శ్రీధర్ సీరియస్ అవుతాడు. మన బాస్ మనతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ కట్ చేస్తే బాస్ ఏమని అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తాడు. వేరే కాల్ వచ్చిందని కట్ చేశానని చెబుతాడు కాశీ. నువ్వు వర్క్ చేస్తోంది నా దగ్గర, నువ్వు అప్పుడు డ్యూటీలో ఉన్నావు.. ఆ టైంలో నా కాల్ కంటే ఇంపార్టెంట్ కాల్ ఏముంటుందని ప్రశ్నిస్తాడు శ్రీధర్. పీఏ అనేది చిన్న జాబ్.. అదే నా జీవితం కాదని అంటుంది. ఫుడ్ ట్రక్స్ దగ్గర నిలబడితేనే బిజినెస్ ఎలా జరుగుతుంది? పబ్లిక్ మన ఫుడ్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? అనేది తెలుస్తుందని చెబుతాడు శ్రీధర్. రోడ్డు మీద తిరగడం అంటే కాశీకి చాలా ఇష్టమని స్వప్న సీరియస్ అవుతుంది.
నువ్వు ఆ మనిషి భవిష్యత్ గురించి ఆలోచించి నీ దగ్గర పీఏగా పెట్టుకున్నావు.. కానీ ఈయనగారికి నామోషిగా ఉంది, ఫోన్ మాట్లాడడు, చిరాకు పడతాడు, మధ్యలోనే కట్ చేస్తాడు అంటుంది స్వప్న. మావయ్య గారు నీకోసం ఏం చేశారు? ఈరోజుకు నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం మా నాన్న, మా అన్నయ్యే అని అంటుంది స్వప్న. మా నాన్న ఆఫీసులో జరిగింది? మీ ఇద్దరికీ ఫోన్‌లో జరిగింది మొత్తం చెప్పాడు.. నువ్వు ఎందుకిలా తయారయ్యావు అని నిలదీస్తుంది స్వప్న. మీ ఇంట్లో ఉంటున్నాను కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని కాశీ సీరియస్ అవుతాడు. మా నాన్న, అన్నయ్య లేకపోతే నువ్వు దేనికీ పనికిరావని నానామాటలు అంటుంది స్వప్న. మన ఇల్లు మెయింటైన్ చేయడానికి నెలకు 50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది కదా? ఒక రెండు నెలలు మెయింటైన్ చేయమని చెబుతుంది స్వప్న. నువ్వు అసమర్ధుడివే.. నువ్వు కొనలేవని తెలిసి ఏ రోజూ ఖరీదైన చీరలు అడగలేదు, నగలు అడగలేదు. నిన్ను పెళ్లి చేసుకుంది నీ పొజిషన్ చూసి కాదు, నీ మంచితనం చూసి అని అంటుంది స్వప్న.
నేనేంటో నా విలువ ఏంటో తొందరలోనే చూపిస్తానని సీరియస్ అవుతాడు కాశీ. ఇంతలో కావేరి వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కాశీతో గొడవ పడుతూనే ఉంటావా? అని మండిపడుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో అలసిపోతాడు, ఇంటి దగ్గరైనా కాస్త మనశ్శాంతి ఉండాలి కదా అని అంటుంది కావేరి. మీ కోసమే మీ నాన్న ఈ వయసులోనూ కష్టపడుతున్నాడు. ఉంటే సైలెంట్‌గా ఉండు.. లేదంటే నీ మొగుడిని తీసుకుని బయటికిపోమ్మని కావేరి అనడంతో స్వప్న బాధపడుతుంది. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వెళ్లిపోతానని చెబుతుంది. కానీ మీ అల్లుడితో కాదు.. నేనొక్కదానినే పోతానని అనడంతో శ్రీధర్ మండిపడతాడు. ముందు మీరిద్దరూ లోపలికి వెళ్లమని చెబుతాడు. కార్తీక్, దీపలతో పాటు కాంచనని టిఫిన్‌కి పిలిచావా? లేదా? అని కావేరిని అడుగుతాడు శ్రీధర్.. అంత అవకాశం అక్క నాకు ఇవ్వలేదని చెబుతుంది కావేరి.
శ్రీధర్ వాళ్ల ఇంటికి కాంచనను కూడా తీసుకెళ్లాలని దీప, కార్తీక్‌లు అనుకుని ఆమెను అడగటానికి వెళ్తారు. శౌర్య స్కూల్‌కి వెళ్తుంది.. మన నలుగురం మా నాన్న దగ్గరికి వెళ్దామని అనసూయతో చెబుతాడు కార్తీక్. మీ నాన్నగారి ఇంటికి శౌర్య స్కూల్ దగ్గరేనని చంటి దానిని సాయంత్రం తీసుకెళ్లి రాత్రి భోజనం కూడా అక్కడే చేసేయొచ్చని అంటుంది అనసూయ. ఆ మాటలు వినగానే కాంచన సీరియస్ అవుతుంది. నేను మాత్రం రానని తేల్చేస్తుంది. ఆ మాటలతో నేను కూడా రానని చెబుతుంది అనసూయ. నీ వల్ల పాపం పెద్దమ్మ కూడా ఆగిపోతుందని అంటాడు కార్తీక్. మీరు సరిగా తినకపోతే మావయ్య గారు నన్ను తిడతారని దీప అంటుండగా శౌర్య వచ్చి అప్పుడు నానమ్మని తాతయ్య దగ్గరకి పంపించేయాలని చెబుతుంది. అమ్మ అలిగితే నువ్వు తినిపిస్తావు కదా? అలాగే నానమ్మ తినకపోతే తాత తినిపిస్తాడని అంటుంది. ఆ మాటలతో కాంచన సీరియస్ అవుతుంది.
ఈ మాటలన్నీ శౌర్య అన్నట్లు లేదు.. ఎవరో అనిపించినట్లుగా ఉందని దీపను చూస్తుంది కాంచన. మీరు నన్ను చూసి ఎందుకు అంటున్నారని దీప బాధపడుతుంది. తల్లి అన్నట్లుగానే కూతురు అంది, నా ఆరోగ్యం చెడిపోతే మీ నాన్న దీపని ఎందుకు తిడతాడు అని నిలదీస్తుంది కాంచన. దాంతో కాంచన కాళ్లు పట్టుకుంటుంది దీప. అయినప్పటికీ ఇద్దరూ తగ్గకుండా పొట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్లిద్దరి మధ్యలో కార్తీక్ నలిగిపోతాడు. రేపు నాన్న ఇంటికి నువ్వు కూడా రావాలని అడుగుతాడు కార్తీక్. నేను రాను.. మీరు వెళ్లడం కూడా నాకిష్టం లేదని తేల్చేస్తుంది కాంచన. కావేరి పిలిచింది కాబట్టి ఊరుకున్నాను కానీ ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోకలు ఎంత తగ్గిస్తే అంత మంచిదని అంటుంది. అయితే చిన్నత్తయ్యకి ఫోన్ చేసి మేం రావడం లేదని చెప్పమని అంటుంది దీప. ఫైనల్‌గా అడుగుతున్నాను వస్తావా? రావా? అని కాంచనను నిలదీస్తాడు కార్తీక్. దానికి ఆమె కరాఖండీగా నో అని చెప్పేస్తుంది. దాంతో కార్తీక్, దీపలు తల పట్టుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











