Karthika Deepam 2 December 13th: నిద్రమాత్రలు మింగిన సుమిత్ర... వెక్కి వెక్కి ఏడ్చిన జ్యోత్స్న, పారిజాతం
Photo Courtesy: JioHotstar
హోంవర్క్ చేయకుండా కాంచన బొమ్మగీస్తూ అనసూయకి దొరికిపోతుంది శౌర్య. వారిద్దరూ ఆడుకుంటూ ఉండగా కావేరి వచ్చి దీప ప్రెగ్నెంట్ అయ్యాక అత్తగారిగా ఆమెకు ఇష్టమైనవి వండి పెట్టాలని అనుకున్నానని చెబుతుంది. రేపు కార్తీక్, దీపలను మా ఇంటికి పంపించమని అడుగుతుంది కావేరి. అయితే నా కొడుకు, కోడలు వస్తారని చెబుతుంది కాంచన. కాశీ వ్యవహారశైలి మారిపోతుండటంతో శ్రీధర్, స్వప్నలు అతనికి క్లాస్ తీసుకుంటారు. భార్యాభర్తలిద్దరూ తగ్గకపోవడంతో తన ఇంట్లో నుంచి ఇద్దరినీ వెళ్లిపోమ్మంటుంది కావేరి. అయితే నేనొక్క దానినే వెళ్లిపోతానని మొండిగా మాట్లాడుతుంది స్వప్న. దాంతో శ్రీధర్ ఇద్దిరికీ నచ్చజెప్పి లోపలికి పంపిస్తాడు.
కార్తీక్, దీపలను ఇంటికి పిలిచావా అని కావేరిని శ్రీధర్ అడుగుతాడు. మరి కాంచన పరిస్ధితి ఏంటని అడగ్గా.. తను ముందే రాను అని చెప్పేసిందని అంటుంది కావేరి. నాన్న ఇంటికి అమ్మను తీసుకురావాలని కార్తీక్, దీపలు అనుకుని ఆమెతో మాట్లాడటానికి వెళ్తారు. ఇంతలో శౌర్య వచ్చి నానమ్మని తాతయ్య దగ్గరికి పంపించమని చెబుతుంది. ఆ మాటలు నీతో ఎవరు అనమని చెప్పారంటూ దీపపై సీరియస్‌గా చూస్తుంది కాంచన. అత్తాకోడళ్లు ఇద్దరూ గొడవ పడుతుండటంతో కార్తీక్ నలిగిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 13వ తేదీ 540వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
జ్యోత్స్నని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లుగా పారిజాతానికి కల వచ్చి ఉలిక్కిపడి లేస్తుంది. దాంతో ఏం జరిగిందోనని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు గతంలో చేసిన స్కామ్‌లన్నీ బయటపడి పోలీసులు నిన్ను మరోసారి అరెస్ట్ చేసి తీసుకెళ్తారేమోనని భయంగా ఉందని అంటుంది పారిజాతం. నాకు తెలియకుండా నువ్వేం తప్పులు చేయలేదు కదా అని అడుగుతుంది. తప్పులు చేయడమే నా జీవిత లక్ష్యం అన్నట్లుగా మాట్లాడుతున్నావని మండిపడుతుంది జ్యోత్స్న. ఊయలలో బిడ్డలను మార్చడం తప్పించి నేను అనుకున్నది ఏం జరగలేదని అంటుంది పారిజాతం. తినిపించిన గులాబ్ జామ్‌లనే ఒకటికి పదిసార్లు తలచుకుంటే ఇంకా చేస్తాం అని సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. పెళ్లయిన ఇన్నాళ్లకు మీ తాత నాకు ప్రేమగా గులాబ్‌జామ్ తినిపిస్తే కుళ్లుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది పారిజాతం.
నన్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని అడుగుతుంది జ్యోత్స్న. నాకు కల ఊరికే రాదు.. వచ్చిందంటే దానికి సంబంధించి ఏదో ఎక్కడో పురుడు పూసుకుంటుందని అర్ధమని చెబుతుంది. నీకు తెలియకుండా నువ్వు చేసిన పాపాలన్నీ ఎవరో బయటకు లాగుతున్నట్లు అనిపిస్తుందని, నువ్వు జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది. ఒకవేళ నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తానని అంటుంది జ్యోత్స్న. నువ్వు తీసుకెళ్లినా తీసుకెళ్తావని వణికిపోతుంది పారు. ఇది ఆస్తి రాయించుకుని త్వరగా అత్తారింటికి వెళ్లిపోతే బాగుంటుందని అనుకుంటుంది. ఆఫీసులో ఇది చేసిన ఘోరాలన్నీ అల్లుడి కంట్లో పడకుండా జాగ్రత్త పడాలి.. మామగారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి శ్రీధర్ ఎంతకైనా తెగిస్తాడని భయపడుతుంది పారిజాతం.
ఎప్పుడూ అందరికంటే త్వరగా నిద్రలేచే సుమిత్ర ఇంకా లేవకపోవడంతో దశరథకు అనుమానం వస్తుంది. ఎంత పిలిచినా లేవకపోవడం, ఒళ్లంతా చల్లగా ఉండటంతో దశరథ కంగారుపడుతూ శివన్నారాయణ దగ్గరికి వెళ్తాడు. ఇది విన్న జ్యోత్స్న.. సుమిత్ర దగ్గరికి వెళ్లి మమ్మీ చనిపోయిందని చెబుతుంది. దాంతో పారిజాతం గట్టిగా కుదుపుతుంది ఆ దెబ్బకి సుమిత్ర లేస్తుంది. తను లేచి చూసేసరికి చుట్టూ అందరూ ఉండటంతో ఏం జరిగిందని అడుగుతుంది. నీకు ఏం జరిగిందోనని మేమంతా కంగారుపడిపోయామని చెబుతాడు శివన్నారాయణ. నిద్రపట్టడం లేదని స్లిపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నానని, అందుకే ఇంత మత్తుగా నిద్రపోయానని చెబుతుంది. అంత నిద్రరానంత ఆలోచనలు నీకేం ఉన్నాయని అడుగుతుంది పారిజాతం. పెళ్లీడుకు ఎదిగిన కూతురు ఇంట్లో ఉంటే భయం లేకుండా ఎలా ఉంటుంది? జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ నిద్రపట్టి ఉండదని చెబుతాడు శివన్నారాయణ.
జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని పారు చెప్పగా.. సంబంధాలు రావడం లేదని బాధపడతాడు శివన్నారాయణ. నేను, దశరథ నాలుగైదు సంబంధాలు చూశామని జాతకాలు కలవడం లేదని .. వాటి ప్రస్తావన మీ వరకు తీసుకురావడం లేదని చెబుతాడు. ఈ విషయం సుమిత్రకు దశరథ చెప్పి ఉంటాడని అంటాడు పెద్దాయన. ఓ తల్లికి నిద్రపట్టకపోవడానికి ఇంతకు మించిన కారణం ఏముంటుందని ప్రశ్నిస్తాడు. సుమిత్ర బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదని.. జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదు కాబట్టి అంటుంది పారిజాతం. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. జ్యోత్స్న నా కూతురు కాదా అని దశరథ అడుగుతాడు. దాంతో ఏదో చెప్పి కవర్ చేస్తుంది పారిజాతం. ఆ మాటలతో జ్యోత్స్న ఊపిరి తీసుకుంటుంది. కూతురికి పెళ్లి చేసినంత మాత్రాన, తల్లికి బిడ్డకు సంబంధం ఉండదా? అని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. మరోసారి నిద్రమాత్రలు వేసుకోవద్దని సుమిత్రకు చెబుతాడు పెద్దాయన. అందరూ వెళ్లిపోయాక దశరథ చేతిని పట్టుకుని ఏడుస్తుంది సుమిత్ర. నన్ను వదిలి నిన్ను ఎక్కడికి పోనిస్తానని చెబుతాడు దశరథ.
కార్తీక్, దీపలు వస్తారని టిఫిన్ రెడీ చేసి ఎదురుచూస్తారు కావేరి, శ్రీధర్. మీరు టిఫిన్ చేసేయమని శ్రీధర్‌ను కావేరి అడగ్గా.. కాంచన వస్తుంది కదా అప్పుడు తింటానని చెబుతాడు. కాంచన వస్తుందని నా మనసు చెబుతుందని కార్తీక్ తీసుకొస్తాడని అంటాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్, దీపలు రాగా కాంచన కనిపించదు. అమ్మని ఎందుకు తీసుకురాలేదని అడుగుతాడు శ్రీధర్. అంతగా రావాలనిపిస్తే నువ్వే వచ్చి పిలవొచ్చు కదా అని అంటాడు కార్తీక్. నేను పిలిస్తే రాదనే, మీ చిన్నమ్మని పంపించానని అంటాడు శ్రీధర్. మనమంతా కలిసుండాలని నాకు కూడా ఉందని కానీ అక్క ఈ ఇంటికి రావడం ఎప్పటికీ జరగదని అంటుంది కావేరి. నువ్వు తొందరగా మేనల్లుడినో, మేనకోడలినో కంటే ఆడుకుంటానని స్వప్న చెబుతుంది. నువ్వు కూడా బిడ్డల్ని కంటే వాళ్లతో ఆడుకోవాలని మీ అన్నయ్య కూడా ఆశపడుతున్నాడని అంటుంది దీప. ఆ మాటలతో స్వప్న బాధపడుతుంది. స్వప్న ముఖం బాధగా ఉండటంతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది.
నువ్వు కొడుకునే కను, నేను కూతురిని కని మీ ఇంటికే కోడలిగా పంపిస్తానని చెబుతుంది స్వప్న. పెళ్లయినా దీని అల్లరి మాత్రం తగ్గలేదని కార్తీక్ ఆటపట్టిస్తాడు. దీపని కూర్చోబెట్టి టిఫిన్ వడ్డిస్తుంది కావేరి. ఇంతలో కాశీ ఎక్కడ అక్కడ కార్తీక్ అడగ్గా.. స్వప్న, శ్రీధర్ వేరు వేరుగా ఆన్సర్ ఇవ్వడంతో కార్తీక్, దీపలకి అనుమానం వస్తుంది. కావేరి ప్రేమగా వడ్డించడంతో దీప పొంగిపోతుంది. ఇంతలో కార్తీక్‌కి కాంచన ఫోన్ చేసి త్వరగా బయల్దేరమని చెబుతుంది. ఆ వెంటనే శ్రీధర్ ఫోన్ లాక్కుని బయటకు వెళ్తాడు. నువ్వు కూడా రావొచ్చు కదా అని శ్రీధర్ అడగ్గా.. నేనొచ్చి పిలిస్తే వచ్చే దానివా అని అడుగుతాడు. నేను పిలిస్తే రావు.. నా కొడుకునైనా కాసేపు ఉండనివ్వవా అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. కోపంలో అయినా నా ఇల్లు అన్నారు కానీ.. మన ఇల్లు అనలేదని కాంచన అనడంతో శ్రీధర్ బాధపడతాడు. అందరం ఇక్కడ ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు ఒక్కదానివే అక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. అందుకే నీకోసం టిఫిన్ పంపించానని చెబుతాడు. ఇంతలో ఓ కుర్రాడొచ్చి కాంచనకి టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











