Karthika Deepam 2 December 15th: కోడలి ముందు ఏడ్చిన శ్రీధర్... దీప వార్నింగ్‌తో జ్యోత్స్నకి ముచ్చెమటలు
Photo Courtesy: JioHotstar
జ్యోత్స్నని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా పీడకల రావడంతో అర్ధరాత్రి ఉలిక్కిపడి లేస్తుంది పారిజాతం. తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయని అంటారు.. నువ్వు ఏదో పెద్ద తప్పు చేశావు.. అందుకే ఇలాంటి కల వచ్చిందని జ్యోత్స్నని ప్రశ్నిస్తుంది పారిజాతం. సుమిత్ర ఎంతకు నిద్ర లేవకపోవడం, శరీరం చల్లగా అయిపోవడంతో దశరథ కంగారుపడతాడు. వెంటనే శివన్నారాయణ దగ్గరికి వెళ్లి విషయం చెప్పగా ఇద్దరూ లేపి చూసినా సుమిత్ర లేవదు. ఈ ఏడుపులు విన్న జ్యోత్స్నకి చెమటలు పడతాయి. అమ్మ చచ్చిపోయిందని పారుకు చెప్పగా ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా తడుతుంది. ఆ దెబ్బకు సుమిత్ర కళ్లు తెరుస్తుంది.
తన చుట్టూ అందరూ ఏడుస్తుండటంతో నాకు ఏం జరగలేదని.. రాత్రి నిద్రపట్టకపోవడంతో స్లిపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నానని చెబుతుంది సుమిత్ర. అంత టెన్షన్ నీకు ఎందుకు? అని పారు అడగ్గా.. ఆడపిల్ల పెళ్లికి పెళ్లికాకపోతే కన్నతల్లి బాధపడుతుందని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్నకి ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కావడం లేదని సుమిత్ర బాధపడుతుందని చెబుతాడు. సుమిత్రకి జ్యోత్స్న కన్న కూతురు కాదు కాదా? ఎందుకు బాధపడటం అని పారు నోరుజారగా.. అంతా షాక్ అవుతారు. కార్తీక్, దీపలు శ్రీధర్ ఇంటికి వస్తారు.. కాంచన రాకపోవడంతో అతను బాధపడతాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కాశీ కనిపించకపోవడంతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది. కాంచనకి శ్రీధర్ టిఫిన్ పార్శిల్ పంపిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 15వ తేదీ 541వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
శ్రీధర్ క్యారియర్ పంపించడంతో కాంచన షాక్ అవుతుంది. మనసులో ఉన్న మనిషి మనతో ఉన్నట్లే, మన పక్కన ఉన్నట్లే అంటాడు శ్రీధర్. మైసూర్ బజ్జీలు ఎలా ఉన్నాయో చూడు.. నేనే వేశానని అంటాడు శ్రీధర్. మా అమ్మ ఏం అంటోందని కార్తీక్ అడగ్గా.. మీకు నచ్చినంతసేపు ఇక్కడే ఉండమని అంటోందని చెబుతాడు శ్రీధర్. ఇది నీ మాట అని కార్తీక్ సెటైర్లు వేస్తాడు. తండ్రిగా నిన్ను మాట అనే హక్కు కూడా లేదా అని అడుగుతాడు శ్రీధర్. భర్త పంపిన క్యారియర్ చూసి బజ్జీలు తీసుకుని తింటూ గతాన్ని తలచుకుని ఏడుస్తుంది కాంచన. టిఫిన్లు చేశాక శ్రీధర్ ఇంట్లో అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు.
మీరొస్తే ఇంత సంతోషంగా ఉందని తెలిస్తే.. వారానికి మూడు మా ఇంటి దగ్గరే టిఫిన్ చేయాలని కండీషన్ పెట్టేవాడినని అంటాడు శ్రీధర్. ఇప్పటికైనా పోయేదేం ఉంది.. మీ కోడలు మీ ఇష్టమని అంటాడు కార్తీక్. మీరు మీరు ఎన్ని కండీషన్స్ పెట్టుకున్నా రావడానికి నాకు ఏ అభ్యంతరం లేదని చెబుతాడు. అన్నయ్య నీ మీదే పెట్టాడని సెటైర్లు వేస్తుంది స్వప్న. మీ అన్నయ్య చాలా తెలివైనవాడని, అన్ని అమ్మ మీద పెడతాడు, లేకపోతే భార్య మీద పెడతాడని చెబుతాడు శ్రీధర్. వాళ్లే మన జీవితమైనప్పుడు వాళ్లని దాటి మనం ఏం చేస్తాం అంటాడు కార్తీక్. ఎంతకు కాశీ కనిపించకపోవడంతో ఎక్కడున్నాడని అడుగుతాడు కార్తీక్. పైన ఉన్నాడని తెలిసి అతని దగ్గరికి వెళ్తాడు.
దీపతో ఆరోగ్యం ఎలా ఉంది? టాబ్లెట్స్ ఎలా వేసుకుంటున్నావు? అని అడుగుతాడు శ్రీధర్. అలాగే కాంచనతో నీకు ఏ గొడవలు లేవు కదా? అని ప్రశ్నించడంతో దీప షాక్ అవుతుంది. ఎప్పుడైనా మాట పట్టింపులు వచ్చినా వెంటనే కలిసిపోతామని చెబుతుంది. అత్తాకోడళ్లు అలాగే ఉండాలని, నిన్ను ఒక మాట అడగానా అని అంటాడు శ్రీధర్. కార్తీక్ ఊళ్లో లేనప్పుడైనా కాంచనతో కలిసి పడుకున్నావా? అని అడుగుతాడు. ఆ మాటలతో దీప షాక్ అవుతుంది. కాంచనలో ఏదో బాధ ఉందని చెబుతాడు. ఓ పదునైన కత్తి గుండెల్లో దిగినప్పుడు బాధ వేరుగా ఉంటుందని, నిద్రపోవడానికి కళ్లుమూస్తే ఆమెకు గతమే గుర్తొస్తుందని చెబుతుంది. అలాంటి రాత్రుల్ని అనుభవించడం చావుతో ప్రయాణం లాంటిందని అంటుంది. దానికి కారణం నేనే అని నాకు తెలుసని శ్రీధర్ బాధపడతాడు. మీరు ఇప్పుడు జాలిపడినా, బాధపడినా ఉపయోగం లేదని అంటుంది దీప.
నా జాలి కాంచనకు అక్కర్లేదు.. కానీ కాంచన చూపించే జాలి కోసం ఎదురుచూసే పరిస్ధితుల్లో నేను ఉన్నానని శ్రీధర్ అంటాడు. కాంచనకు యాక్సిడెంట్ అయిన కొత్తలో ఒకే ఒకసారి తన పరిస్ధితి చూసి ఏడ్చానని అప్పుడు కాంచన నన్ను ఓదారుస్తూ, మీ కాళ్లు ఉండగా నేనెందుకు అవిటి దానిని అవుతాను అంది. నేనిప్పుడు నా భార్యని అవిటిదానిని చేసినట్లేనని శ్రీధర్ బాధపడతాడు. ఇవన్నీ ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పుడు గుర్తు లేవా అంటే అన్నీ గుర్తున్నాయి.. కానీ కాలం మనిషిలో కోపాన్ని తగ్గిస్తుంది, ఆలోచించే విధానాన్ని మారుస్తుందని ఎదురుచూశానని చెబుతాడు. కాంచన ఎప్పుడూ ఒకేలా ఉందని, నేనే మారుతూ వచ్చానని చెబుతాడు. నా మీద నీకు ఏ కోపం లేదు కదా అని శ్రీధర్ అడగ్గా.. గతంలో మీరన్న ఏ మాట నేను మనసులో పెట్టుకోలేదని అంటుంది. నాకు ఓ సాయం చేస్తావా? అని శ్రీధర్ అడుగుతాడు.
మీ అత్తయ్యతో నా గురించి మాట్లాడు.. ఓ ఆడదాని బాధ, మరో ఆడదానికే తెలుస్తుంది, నువ్వు మీ అత్తయ్యతో మాట్లాడి తన పక్కన నిలబెట్టగలవా? అని అడుగుతాడు. మీ అత్తయ్య కంట్లో కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత నీకే ఉందని అంటాడు. నేను మీకు మాట ఇవ్వలేనని.. అత్తయ్యని అర్ధం చేసుకున్న మనిషిగా ఈ మాట చెబుతున్నానని, కానీ మీరిద్దరూ కలవాలంటే మీరొక పనిచేయాలని అంటుంది. అత్తయ్య గారికి ఎదురుపడకండి, మాట్లాడటం మానేయండి, ఆవిడని అడగటం మానేయండి.. అప్పుడు ఆవిడ మనసులో మీమీదున్న అభిప్రాయం తెలుస్తుంది. కాంచన మొండిది, అయినాసరే నువ్వు చెప్పినదాని గురించి ఆలోచిస్తాను, అలాగే నువ్వు కూడా నీ ప్రయత్నం చేయమని అడుగుతాడు శ్రీధర్.
కాశీ బాధగా ఉండటంతో అతనికి హితబోధ చేస్తాడు కార్తీక్. వైజాగ్‌లో చదువుకున్న నువ్వు పీఏగా చేస్తున్నందుకే బాధపడుతుంటే... లండన్‌లో చదువుకున్న నేను డ్రైవర్‌గా చేస్తూ ఇంకెంత బాధపడాలని ప్రశ్నిస్తాడు కార్తీక్. డ్రైవర్‌గా పనిచేస్తున్నా బోర్డ్ డైరెక్టర్‌గా నా సలహాలు, సూచనలు ఇస్తున్నానని చెబుతాడు. నువ్వు కూడా నాన్నతో ఉంటూ రెస్టారెంట్ బిజినెస్ ఎలా నడపాలో నేర్చుకోమని చెబుతాడు కార్తీక్. ఇంతలో స్వప్న వచ్చి థ్యాంక్స్ చెబుతుంది. ఇలా చెబితేనే కానీ ఈయన గారికి అర్ధం కాదు... ఈ మధ్య బాగా కోప్పడుతున్నాడని అంటుంది. అర్ధం చేసుకునే భార్య వస్తే మగాడి జీవితం అందంగానే ఉంటుందని కార్తీక్ అనడంతో స్వప్న షాక్ అవుతుంది. అనంతరం దీపని శివన్నారాయణ గారింటి దగ్గర దించమని కాశీకి చెబుతాడు శ్రీధర్.
మీ అమ్మ చనిపోయిందని బాధపడ్డావా అని జ్యోత్స్నని అడుగుతుంది పారిజాతం. మనిషికి అంత తేలికగా చావు రాదని, రాత బాగుంటే ఏం చేయలేరని చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో దీపని తీసుకుని కాశీ రావడంతో ఇద్దరూ షాక్ అవుతారు. పనిమనుషులకు కూడా డ్రైవర్లు ఉంటారని ఇప్పుడే అర్ధమైందని దీపపై సెటైర్లు వేస్తుంది. మీ మామగారితో ఫుడ్ ట్రాక్ బిజినెస్ పెట్టించావు, దానికి కృతజ్ఞతగా మీ మామగారు తన కారు ఇచ్చి, తన అల్లుడినే నీకు డ్రైవర్‌ని చేశాడని అంటుంది. నా తమ్ముడు నన్ను ఇంటి దగ్గర దింపితే ఈ ఇంటికి డ్రైవర్ అయిపోతాడా అని ప్రశ్నిస్తుంది దీప. ఈరోజు మేం మా అత్తయ్య గారింటికి వెళ్లామని దీప చెప్పగా.. ఏ అత్తయ్య గారు.. చిన్నత్తయ్యా, పెద్దత్తయ్యా అంటూ సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న.
దీపకి అన్ని రెండేసి ఉన్నాయని అనడంతో దీపకి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. అడ్డమైన వాళ్లు అడ్డదిడ్డంగా ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు.. మనం చెవిటివాళ్లలా ముందుకు పోవాలని మా బావ చెప్పాడని అనడంతో కాశీ విజిల్స్ వేస్తాడు. కార్తీక్, శ్రీధర్‌లు బైక్ మీద వస్తారు. బైక్ నడిపే వయసులో తండ్రిని ఎక్కించుకుని తిరిగే అదృష్టం అందరికీ రాదని అంటాడు కార్తీక్. ఒక టీ కొట్టు దగ్గర ఆగి జ్యోత్స్న రెస్టారెంట్‌కి మనం అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని చెబుతాడు శ్రీధర్. దాంతో కార్తీక్ ఎంతో సంతోషిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











