Karthika Deepam 2 December 16th: శ్రీధర్ చేతిలో జ్యోత్స్న పాపాల చిట్టా.. జ్యోత్స్నకి దీప మాస్ వార్నింగ్
Photo Courtesy: JioHotstar
నువ్వు మా ఇంటికి టిఫిన్ చేయడానికి రావని తెలిసే నీకోసం క్యారియర్ పంపించానని.. మైసూరు బజ్జీ నేనే చేశాను, రుచి చూసి చెప్పమని కాంచనకి చెబుతాడు శ్రీధర్. భర్త ఫోన్ పెట్టేయగానే ఆ బజ్జీల రుచి చూస్తుంది కాంచన. గతం గుర్తొచ్చి శ్రీధర్‌ను తలచుకుంటూ ఏడుస్తుంది. కార్తీక్, దీపల రాకతో శ్రీధర్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఎంతకూ కాశీ కిందకి రాకపోవడంతో కార్తీక్ పైకి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుంటాడు. మా నాన్నకి పీఏగా ఉంటే రెస్టారెంట్ బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకుని, నువ్వే సొంతంగా బిజినెస్ పెట్టొచ్చని అంటాడు కార్తీక్. ఇంతలో స్వప్న రాగా.. భర్తను అర్ధం చేసుకోవడం నేర్చుకోమని క్లాస్ పీకుతాడు.
నన్ను, కాంచనని కలపమని శ్రీధర్ దగ్గర కంటతడి పెడతాడు శ్రీధర్. అత్తయ్య గారు మహామొండి మనిషి, కానీ నేను ప్రయత్నిస్తానని చెబుతుంది. అలాగే మీరు కూడా కొన్నిరోజులు అత్తయ్య గారింటికి రావడం, పోవడం చేయొద్దని శ్రీధర్‌కు సలహా ఇస్తుంది దీప. దీపను తీసుకుని శివన్నారాయణ ఇంటికి వచ్చిన కాశీని నానామాటలు అంటారు జ్యోత్స్న, పారిజాతం. దాంతో వారిద్దరికీ కౌంటర్ ఇస్తుంది దీప. కార్తీక్ - శ్రీధర్‌లు స్కూటీ మీద వస్తూ జ్యోత్స్న రెస్టారెంట్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 16వ తేదీ 542వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
టీ కొట్టు దగ్గర టీ తాగుతూ తన సక్సెస్‌ను కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తాడు శ్రీధర్. జనంలో ఇంత రీచ్ ఉన్న కంపెనీని జ్యోత్స్న ఎలాంటి స్థితికి తీసుకొచ్చింది అంటూ కార్తీక్ బాధపడతాడు. అసలు జ్యోత్స్న రెస్టారెంట్‌కి నష్టాలు రాలేదని.. వచ్చిన లాభాలన్నీ దాచేయడం వల్ల అని శ్రీధర్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. మొత్తం ఎంత అనేది చెబితే శివన్నారాయణ గారు గుండె పట్టుకుని పడిపోతారని అంటాడు. ఈ మధ్యలోనే నాకు మరో విషయం తెలిసింది.. అసలు జ్యోత్య శివన్నారాయణ గారి మనవరాలు కాదు అని శ్రీధర్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు.
శివన్నారాయణ గారింటి దగ్గర వెయిట్ చేస్తున్న కాశీని చూసి ఏం చేస్తే నీ మనవడు మావయ్య దగ్గర వర్క్ మానేస్తాడు అనేది ఆలోచించమని పారిజాతంను చెడగొడుతుంది జ్యోత్స్న. ఆ వెంటనే కొంగులో మూటగట్టిన 50 రూపాయలు డబ్బులు తీసి కాశీని డ్రైవర్ .. డ్రైవర్ అంటూ పదే పదే పిలుస్తుంది. ఆ మాటలతో కాశీ షాక్ అవుతాడు. ఈ 50 రూపాయలు తీసుకుని బయటికి వెళ్లి టీ తాగి రమ్మని పారు అనడంతో కాశీ ఖంగు తింటాడు. నేను డ్రైవర్‌ను కాదు అని ఎన్నిసార్లు చెప్పాలంటూ రగిలిపోతాడు. మరి నువ్వేంటీ పీఏవా, ప్యూన్ వా, డ్రైవర్‌వా, పనివాడివా అని ప్రశ్నిస్తుంది. జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవో గారికి పీఏని చెబుతాడు కాశీ.
మరి దీపని ఎందుకు ఇక్కడ డ్రాప్ చేశావని అతనిని ప్రశ్నించగా.. దీప అక్కని, కార్తీక్ బావని మా అత్తయ్య టిఫిన్ చేయడానికి ఇంటికి పిలిచారు. బావ మావయ్య గారు స్కూటీ వస్తున్నారు... నన్ను దీపక్కని డ్రాప్ చేయమని చెప్పారని అంటాడు కాశీ. శ్రీధర్‌కు జీతం లేని పనివాడిలా నువ్వు దొరికావు... అందుకే ఈ అడ్డమైన పనులు చెబుతున్నారని మండిపడుతుంది పారిజాతం. పీఏ అంటే ఆఫీస్ పని మాత్రమే చేయాలి.. ఇలా వాళ్లని వీళ్లని డ్రాప్ చేయడం ఏంటీ? వెయిట్ చేయడం ఏంటీ.. అని అంటుంది. పారిజాతం మనవడికి పీఏగా చేయాల్సిన కర్మ ఏంటీ.. ఖాళీగా ఉండు, డబ్బులు కావాలంటే నన్ను అడుగు అంటుంది. అల్లుడంటే ఎలా ఉండాలి? మామగారి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చునేలా ఉండాలి? అంటూ మనవడిని రెచ్చగొడుతుంది.
నీ వెనుక ఉన్నట్లు నా వెనుక కూడా కోట్ల రూపాయలు ఉంటే అలాగే బతుకుతాను అంటాడు కాశీ. నా కొడుకుకి కోట్లు ఉన్నాయా? అయినా గౌరవంగా బతుకుతున్నాడు? కదా అని ప్రశ్నిస్తుంది పారిజాతం. ఆయనకు పోషించడానికి భార్య లేదు, ఏ బాధ్యతలు లేవు.. పెళ్లాం ఉంది, దానిని పోషించాలి కదా అని అంటాడు. మీ మామగారికి బుద్ధి లేదు.. కొడుకుని ఇంట్లో డ్రైవర్‌ని చేశాడు, ఇప్పుడు అల్లుడిని కూడా డ్రైవర్‌ని చేశాడని అంటుంది పారిజాతం. నీకు నచ్చి ఈ పని చేయడం లేదు.. వేరే దారి లేక ఈ పని చేస్తున్నావని చెబుతుంది. జాబ్ చేస్తున్నానని అబద్ధం చెబితే ఇంట్లో గొడవ జరిగింది. చేసేదేం లేక మీ మావయ్య చెప్పినట్లు పీఏగా చేరావని అంటుంది జ్యోత్స్న.
నీకు ఏం సాయం కావాలన్నా నన్ను అడుగు అంటుంది. దాంతో మండిపడిన కాశీ.. ముందు నీకు ఎవరు సాయం చేస్తారో చూసుకో అంటూ కౌంటర్ ఇస్తాడు. నువ్వు చేసిన తప్పులన్నీ ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా? అని కాశీ అంటాడు. అదేం చేసిందని పారిజాతం అడగ్గా.. దొంగ లెక్కలు రాసి డబ్బు మాయం చేసిందని చెబుతాడు. ఆ మాటలతో పారిజాతం, జ్యోత్న్స షాక్ అవుతారు. 2 కోట్ల 34 లక్షల రూపాయల స్కాం జస్ట్ శాంపిల్ మాత్రమే.. అంతకంటే భారీ స్కామే చేసిందని అంటాడు కాశీ. ఆ మాటలతో జ్యోత్స్నకు ముచ్చెమటలు పడతాయి. మా మావయ్య గారు నిన్ను బోర్డు మెంబర్స్ ముందు నిలబెడతాడు అని చెప్పడంతో ఆమె వణికిపోతుంది.
జ్యోత్స్న అసలు ఆ ఇంటి బిడ్డ కాదని కార్తీక్ దగ్గర తేల్చేస్తాడు శ్రీధర్. మొత్తం ఆస్తి తనదే అయినప్పుడు తన కంపెనీలో తనే ఎందుకు మోసం చేయాలని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. అకౌంట్స్‌ని చాలా జాగ్రత్తగా రాయించేదని చెబుతాడు. జ్యోత్స్న చేసిన మోసాన్ని బయటపెట్టి తనకి శిక్ష పడేలా చేయమని అడుగుతాడు కార్తీక్. నన్ను మాస్టారు.. మాస్టారు అని ఎప్పుడు పిలవకుండా ఉంటావు అని అడుగుతాడు శ్రీధర్. మా అమ్మ నిన్ను భర్తగా అంగీకరించిన రోజున పిలుస్తానని చెబుతాడు. ఇది జరుగుతుందా అని శ్రీధర్ అడగ్గా... నేను నిన్ను క్షమిస్తానని నువ్వు అనుకున్నావా? అమ్మ క్షమించే రోజు కూడా వస్తుందని అంటాడు కార్తీక్. ఆ మాటలతో శ్రీధర్ సంతోషిస్తాడు.
కాశీ చెప్పిన మాటలతో జ్యోత్స్న, పారిజాతంలు వణికిపోతారు. నాకొచ్చిన కల నిజం అయ్యేలా ఉంది.. నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయమని అంటుంది. నేను మళ్లీ సీఈవో అవుతానని లెక్కలేవీ పట్టించుకోలేదని చెబుతుంది జ్యోత్స్న. నిన్ను కాపాడటం నా వల్ల కూడా కాదని పారిజాతం అంటుండగా ఇంతలో దీప అక్కడికి వస్తుంది. నీ ప్రెగ్నెన్సీ మా వల్ల ఎక్కడ పోతుందోనని భయంగా ఉందని పారిజాతం అంటుంది. నా కూతురి జోలికి వస్తే ఏం చేస్తానో మీకు తెలుసు కదా? ఈ బిడ్డ జోలికి వచ్చినా అదే రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇస్తుంది దీప. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











