Karthika Deepam 2 December 17th: జ్యోత్స్న ట్రాప్‌లో చిక్కుకున్న కాశీ... ప్రమాదంలో కార్తీక్, శ్రీధర్

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న రెస్టారెంట్స్‌ లాభాల్లోనే ఉందని కానీ ఆ లాభాలను తను తీసుకుని నష్టాలను చూపించిందని జ్యోత్స్న స్కామ్‌ గురించి శ్రీధర్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇది చాలా పెద్ద స్కామ్ అని.. కొన్ని కోట్ల రూపాయలను కొట్టేసిందని అంటాడు. అసలు జ్యోత్స్న శివన్నారాయణ గారి మనవరాలు కాదేమోనని తండ్రి అనడంతో కార్తీక్ ఉలిక్కిపడతాడు. త్వరలోనే ఆ లెక్కలన్నీ మీ తాత ముందు పెడతానని చెబుతాడు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని, నువ్వు ఆ పనిని త్వరగా కంప్లీట్ చేయమని చెబుతాడు కార్తీక్.

శ్రీధర్ దగ్గర డ్రైవర్ ఉద్యోగం మానేయమని జ్యోత్స్న, పారిజాతంలు కాశీని నానామాటలు అంటారు. మీరేమీ నాకు సాయం చేయనక్కర్లేదు.. మా మావయ్య నీ లెక్కలన్నీ బయటకు తీస్తున్నాడు. నువ్వు మామూలు స్కామ్ చేయలేదని కాశీ చెప్పడంతో జ్యోత్స్నకి చెమటలు పడతాయి. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆలోచిస్తున్న జ్యోత్స్న, పారిజాతం దగ్గరకి దీప వస్తుంది. నా బిడ్డ జోలికి వస్తే వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 17వ తేదీ 543వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 543 December 17th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

దీపని తమ రూమ్‌లో నుంచి బయటకు పంపించడానికి నానామాటలు అంటుంది జ్యోత్స్న. మీలో ఉన్న భయం పోలేదని అది ఇంకా ఇంకా పెరుగుతోందని అంటుంది దీప. నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా అయితే అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా? అని జ్యోత్స్న అనగా.. నా కూతురి జోలికి వస్తే ఏం చేస్తానో మీకు తెలుసు కదా అని గతం గుర్తుచేస్తుంది దీప. ఈ బిడ్డ జోలికి వచ్చినా అదే రిపీట్ అవుతుంది, ఈ బిడ్డ క్షేమం నా బాధ్యత అని మా అత్తయ్య గారికి మాటిచ్చాను, ఈ బిడ్డ ఈ ప్రపంచాన్ని చూస్తుందని నా భర్తకి చెప్పాను ఈ రెండు మాటలు నేను నిలబెట్టుకుంటానని చెబుతుంది దీప. ఈ ప్రయత్నంలో ఎవరైనా నాకు అడ్డుపడితే.. మీ మీద పిడుగులా పడతానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది దీప.

ప్రమాదంలో నుంచి ఎలా బయటపడాలో తెలియక జ్యోత్స్నకి ఐ ఐడియా వస్తుంది. దాస్‌కి కాశీ సొంత కొడుకేనా అని అడుగుతుంది. వాడు నీ సొంత తమ్ముడు.. దాస్ - కళ్యాణిల రక్తం పంచుకుని పుట్టినవాడు అని చెబుతుంది పారిజాతం. అయితే వాడిని మన దారిలోకి తెచ్చుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చని అంటుంది. తెలివితేటలు నీకే కాదు .. నాకు ఉన్నాయి, వాటిని ఇప్పుడు నీ బామ్మర్ది మీద వాడతానని అనుకుంటుంది జ్యోత్స్న. బయట నిలబడిన కాశీని బలవంతంగా లోపలికి లాక్కెళ్తుంది పారిజాతం. లోపలికి వెళ్లగానే నువ్వెందుకు పిలిచావో? నాకు మర్యాదలు ఎందుకు చేస్తున్నావో నాకు ముందే తెలుసని అంటాడు కాశీ.

నువ్వు అకౌంట్స్‌లో ఫ్రాడ్ చేశావని మావయ్య గారు చెప్పారు.. నాకు దాని గురించి పూర్తిగా తెలియదని చెబుతాడు కాశీ. దాని వివరాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయని అంటాడు. నేను నిన్ను హెల్ప్ అడగటానికి పిలవలేదు, అయినా నేను తప్పు చేస్తేనే కదా భయపడేది అని అంటుంది జ్యోత్స్న. ఒక సీఈవోగా కంపెనీ ఎదుగుదలకి నిర్ణయాలు తీసుకున్నాను, కొన్ని ఫండ్స్ వేరే వాటికి వాడాను, అది చూసి వాళ్లకి అర్ధంకాక నేను ఫ్రాడ్ చేశానని అనుకోవచ్చు.. కానీ నేను ఏం చేశానో సమాధానం చెప్పగలనని అంటుంది జ్యోత్స్న. నేను పిలిచింది నీ గురించే, జాబ్ పోతే మళ్లీ జాబ్ ఎందుకు ట్రై చేయలేదని అడుగుతుంది. నీ రెజ్యూమ్ నాకు పంపించు అని చెబుతుంది. అది చూసి ఇంత మెరిట్ పెట్టుకుని నీకు జాబ్ రాకపోవడం ఏంటని అడుగుతుంది జ్యోత్స్న.

శ్రీధర్ మావయ్య నీకు ట్రై చేసే ఛాన్స్ ఇవ్వకుండా తన దగ్గరే పీఏగా పెట్టుకున్నాడు, అదే నేను సీఈవోగా ఉండి ఉంటే జ్యోత్స్న రెస్టారెంట్‌కి ఇన్‌ఛార్జ్‌ని చేసేదానిని, లేదంటే జీఎం పోస్ట్ ఇచ్చేదానిని అంటుంది. కానీ మీ మావయ్య సీఈవోగా అయ్యుండి కూడా నీకు మంచి పోస్ట్ ఇవ్వలేకపోయాడని చెప్పుడు మాటలు నూరిపోస్తుంది. ఒక ఇన్‌ఛార్జ్‌కి ఉన్న రెస్పెక్ట్, ఒక జీఎంకి ఉన్న రెస్పెక్ట్ పీఏకి ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. దాంతో కాశీకి శ్రీధర్, స్వప్న చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నిన్ను తన కార్‌కి పర్మినెంట్ డ్రైవర్‌ని చేసేలా ఉన్నాడని అంటుంది. పీఏ అయినట్లే డ్రైవర్ కూడా అవుతావని అంటుంది. తన భర్త తన తండ్రి దగ్గర పీఏగా ఉన్నా ఓకే అనుకుంటుంది అనుకుంటే స్వప్న కూడా తండ్రికే సపోర్ట్ చేస్తుందని చెబుతుంది.

నువ్వు ఎప్పుడు ఒంటరివే కానీ నేను నీకు ఫస్ట్ నుంచి అండగానే ఉన్నానని గుర్తుచేస్తుంది జ్యోత్స్న. దాంతో గతంలో తనకు జ్యోత్స్న డబ్బులిచ్చిన సంగతి గుర్తుచేసుకుంటాడు కాశీ. మీ బావ చెప్పిన మాటలు నమ్మి.. ఆ డబ్బులు నాకు తిరిగిచ్చావు. వీడు వాళ్ల మాయలో ఉండి వాళ్లకి వెట్టిచాకిరి చేస్తున్నావని పారిజాతం అంటుంది. నాకు జ్యోత్స్న రెస్టారెంట్‌కు ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని కానీ నా పరపతి వాడి నీకు మంచి జాబ్ వచ్చేలా చేస్తానని అంటుంది. అందరూ నాకు అది చేస్తా? ఇది చేస్తా? అనేవాళ్లే కానీ చేసేవాళ్లు ఎవరు లేరని అంటాడు కాశీ. ఇంతకంటే బెటర్ ఛాన్స్ వస్తే పీఏగా ఎందుకుంటాను అని చెబుతాడు.

నా గురించి పాజిటివ్‌గా మాట్లాడి, నా గురించి ఆలోచించినందుకు థ్యాంక్స్ చెబుతాడు కాశీ. తమ్ముడు నా బుట్టలో పడిపోయాడని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. వాడు నా సొంత తమ్ముడు నేను వాడిని కలుపుకోవాలని అనుకుంటున్నానని చెబుతుంది. ఆ మాటలతో పారిజాతం పొంగిపోతుండగా.. అందరినీ నా అవసరాలకి వాడుకోవడం తప్పించి నాకు ఎవ్వరి మీద ప్రేమ లేదని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న గదిలో నుంచి కాశీ రావడం చూసిన దీప షాక్ అవుతుంది. నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని అనుకుంటుంది.

దశరథ జ్యూస్ ఇస్తే తాగకుండా సుమిత్ర మారాం చేస్తుంది. ఇదంతా చూసిన దీప మురిసిసోతుంది. ఉదయాన్నే ఎంత లేపినా నిద్రలేవ లేదని దశరథ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. నాకేం కాలేదు, నాకు బాగానే ఉంది.. నా బాధంతా జ్యోత్స్న పెళ్లి గురించేనని అంటుంది సుమిత్ర. నువ్వు బాధపడొద్దు ఎంత ఆలస్యమైనా జ్యోత్స్నకి మంచి సంబంధం చూస్తానని చెబుతాడు దశరథ. నేను మీ దగ్గర పొందలేని ఆనందాన్ని మీ దగ్గర పొందేలా చేస్తానని అనుకుంటుంది. కాశీ నీ మాటలు వింటాడా అని జ్యోత్స్నని పారిజాతం అడగ్గా.. తమ్ముడు మనదారిలోకి రావాలంటే వాడి ఇగోని టచ్ చేయాలి, అదే చేశానని చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్, శ్రీధర్‌లు స్కూటీ మీద వస్తారు. మనకి నిజం తెలిసిపోయిందని బావకి తెలియకూడదని పారిజాతంతో చెబుతాడు కార్తీక్. ఆ వెంటనే కాశీని కారు తీయ్ వెళ్దామని శ్రీధర్ చెప్పగా.. కాశీకి జ్యోత్స్న చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X