Karthika Deepam 2 December 18th: కుటుంబానికి వెన్నుపోటు.. శివన్నారాయణ శత్రువుతో చేతులు కలిపిన జ్యోత్స్న

Photo Courtesy: JioHotstar

నా బిడ్డను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తానని, తనకి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటానని మా అత్తయ్యగారికి, మా ఆయనకి మాటిచ్చానని జ్యోత్స్నకి చెబుతుంది దీప. నా బిడ్డ జోలికి వస్తే అంతుచూస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలతో జ్యోత్స్న, పారిజాతానికి ముచ్చెమటలు పడతాయి. జ్యూస్ తాగకుండా మారాం చేస్తున్న సుమిత్రని దశరథ బుజ్జగిస్తాడు. ఇదంతా చూసిన దీప నవ్వుకుంటుంది. జ్యోత్స్న చేసిన చీటింగ్‌ని లెక్కలతో సహా బయటపెట్టాలని శ్రీధర్‌కు కార్తీక్ చెబుతాడు. జ్యోత్స్న చాలా తెలివైనదని ఈలోగా జాగ్రత్త పడుతుందని హెచ్చరిస్తాడు.

మరోవైపు.. తనకు ఎదురవ్వబోతున్న ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కాశీని ట్రాప్ చేస్తుంది జ్యోత్స్న. మీ మావయ్య నిన్ను డ్రైవర్‌ని చేశాడు.. నీకున్న మెరిట్‌కి జీఎం పోస్ట్ ఇవ్వొచ్చని చెప్పుడు మాటలు చెబుతుంది. నీకు నేను ఉద్యోగం ఇప్పిస్తానని అతనిని తనవైపు తిప్పుకుంటుంది. జ్యోత్స్న గదిలో నుంచి కాశీ రావడం చూసిన దీప... ఏదో జరగబోతోందని అనుమానిస్తుంది. ఇంతలో శ్రీధర్, కార్తీక్‌‌లు శివన్నారాయణ ఇంటికి వస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 18వ తేదీ 544వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 544 December 18th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

శ్రీధర్ ఇంటి దగ్గరి నుంచి వచ్చినప్పటి నుంచి దీప తనతో మాట్లాడకపోవడంతో కాంచన బాధపడుతుంది. శౌర్యం అన్నం తినకుండా మారాం చేయడంతో పాటు అటూ ఇటూ తిరుగుతుండటంతో ఆమెపై కాంచన మండిపడుతుంది. నువ్వు పరిగెడితే అమ్మ, అమ్మ కడుపులోని బేబీ కూడా పరిగెడుతుందని చెబుతుంది. ఇకపై నీ అన్నం నువ్వే తినాలని చెప్పగా.. శౌర్య సరేనని అంటుంది. శౌర్య మంచిది, వెరీగుడ్ అని కాంచన మెచ్చుకోగా.. శౌర్య మంచిదే కానీ నానమ్మ మంచిది కాదని శౌర్య అనడంతో అంతా షాక్ అవుతారు. మా అమ్మని నాకు తినిపించకుండా చేశావుగా అందుకే నువ్వు మంచిది కాదు.. నానమ్మని తాతయ్య దగ్గరికి పంపించేయాలని అంటుంది శౌర్య. ఆ మాటతో దీపకి కోపమొచ్చి శౌర్యను కొట్టబోతుంది.

అసలు నీతో ఈ మాట ఎవరు చెప్పారు? అని కాంచన అడగ్గా.. అటూ ఇటూ చూసి నాతో నేనే చెప్పుకున్నాను అంటుంది. ముద్దుల తాతతో జో గ్రానీ ఉంటుంది, సుమిత్ర అమ్మమ్మ తాతతో ఉంటుంది. మరి నువ్వు తాతతో ఉండాలి కదా అని అంటుంది శౌర్య. మా ఫెండ్స్‌కి తాత నానమ్మలు ఉన్నారు.. వాళ్లతో ఆడుకుంటారు. మరి నాకు తాత నానమ్మలు ఉండరా? అని శౌర్య ప్రశ్నించడంతో కాంచన షాక్ అవుతుంది. నేను అలా అనడం నీకు నచ్చకపోతే సారీ చెప్పి.. ఇంకెప్పుడూ అనను అంటుంది. దాంతో శౌర్యను దగ్గరికి తీసుకుంటుంది కాంచన. మేం చేయలేని పని శౌర్య చేస్తోందని కార్తీక్, దీపలు సంబరపడిపోతారు. నీకు తాతయ్యతో ఆడుకోవాలని అనిపిస్తే మీ నాన్నతో పిలిపిస్తానని చెబుతుంది కాంచన. ఎవరినో చూసి నువ్వు బాధపడొద్దని అంటుంది. నువ్వు మంచిదానివి అంటూ కాంచనని హత్తుకుంటుంది శౌర్య. మీ తాతని నాన్నతో కాకుండా నేనే పిలిపిస్తానని చెప్పకుండా నేనే పిలుస్తానని చెప్పుంటే హ్యాపీగా ఫీలయ్యే దానిని అనుకుంటాడు కార్తీక్. అమ్మ మనసుని శౌర్య కూడా మార్చలేకపోయిందని బాధపడతాడు.

శ్రీధర్‌తో బిజినెస్ గురించి మాట్లాడుతుండగా జ్యోత్స్న చెప్పిన మాటలు గుర్తొచ్చి కాశీ బాధపడుతుంటాడు. నువ్వు ఒకడి కింద పనిచేస్తావా? నువ్వే ఒకడికి పని ఇస్తావా? అనేది ఆలోచించుకోమ్మని చెబుతాడు శ్రీధర్. మీ దగ్గర పనిచేస్తే నేను బానిసలా బతకాల్సిందేనని అనుకుంటాడు కాశీ. నా టాలెంట్ ఏంటో నా చుట్టూ ఉన్నవాళ్లకి అర్ధమవుతోంది. ఈ ఇంట్లోకి వాళ్లకు మాత్రం ఏ అర్ధం కావడం లేదని అనుకుంటాడు. నువ్వు నీ వర్క్ మీద ఫోకస్ చేయడం లేదని శ్రీధర్ చెప్పగా.. ఫోకస్ చేసేంత వర్క్ కాదని అంటాడు కాశీ. ఫుడ్ ట్రక్స్ సూపర్‌వైజ్ చేయాలి అంతేకదా? అని చెబుతాడు.

ఆ మాటలతో సీరియస్ అయిన శ్రీధర్ వెంటనే కూతురిని పిలిచి కాశీ రేపటి నుంచి డ్యూటీకి రావాల్సిన అవసరం లేదని అంటాడు. ఆ మాటలతో కాశీ, స్వప్నలు షాక్ అవుతారు. ఈ పని ఇష్టం లేదంటే మరేదో ఇష్టముండాలి కదా? సాఫ్ట్‌వేర్‌లో ఇప్పుడు ట్రై చేసినా జాబ్ రాదు.. వేరే బిజినెస్ చేయలేడు, కనీసం మీతో ఉంటే ఫుడ్ ట్రక్ బిజినెస్ గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత మేమే ఓన్‌గా ఫుడ్ ట్రక్ పెట్టుకుంటామని చెబుతుంది స్వప్న. దాంతో భయపడిన కాశీ.. మీరేం చెబితే అదే చేస్తానని అంటాడు. నేను నిన్ను క్షమించినా మా మావయ్య గారు నిన్ను క్షమించరని, నమ్మకాలతో చేస్తున్న బిజినెస్ అని చెబుతాడు శ్రీధర్.

ఎవ్వరూ ఊహించని విధంగా వైరాని కలుస్తుంది జ్యోత్స్న. వేలంపాటలో జరిగినది నేనింకా మరిచిపోలేదని.. ఈ బిజినెస్‌లో ఎంతో అనుభవం ఉన్న నేను కూడా నీ తెలివి తేటల ముందు ఓడిపోయానని చెబుతాడు. నేను బిజినెస్ చేసేది పగతోనే, కానీ ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నానని అంటాడు. నేను సీఈవోగా ఉంటే మీ పార్ట్‌నర్‌షిప్ గురించి ఆలోచించేదానిని అని చెబుతుంది జ్యోత్స్న. నేను జ్యోత్స్న రెస్టారెంట్‌కి సీఈవోని కావాలి, ఇప్పుడున్న సీఈవో దిగిపోవాలని అంటుంది జ్యోత్స్న. అది నా చేతుల్లో లేదు.. ఇప్పుడున్న సీఈవో మీ మావయ్యే కదా అని చెబుతాడు వైరా. సీఈవో మీ ఫ్యామిలీ మెంబరే కాబట్టి మీరు తలచుకుంటే ఎలాంటి రాజకీయాలైనా చేయొచ్చని అంటాడు. ఇందుకు నా దగ్గరికి రావడం ఎందుకు అని ప్రశ్నిస్తాడు. నాలాగా ఆలోచించగలిగేది మీరే కాబట్టి అని అంటుంది జ్యోత్స్న.

సాయం కోసం వచ్చిన మనిషివైతే నేను ఇవ్వగానే మందు తీసుకునే దానివి అని అంటాడు వైరా. నా మీద పగ తీర్చుకోవడానికి మీ నాన్నే నన్ను పంపించొచ్చు అని అంటాడు. మీరు ఇచ్చిన కప్‌తోనే మీకు కాన్ఫిడెన్స్ వస్తుందనుకుంటే ఓకే అంటుంది. నేను అనుకున్నది నా ఇంట్లోనే ఉండి సాధించుకునే అవకాశం ఉంటే, నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నాకు సీఈవో పోస్ట్ కావాలి, ఇప్పుడున్న సీఈవోకి మళ్లీ నా ఆఫీస్ వైపు వచ్చే అవకాశం ఉండకూడదని చెబుతుంది. కాశీని అడ్డుపెట్టుకుని సీఈవోని దించేయాలి? వీడికి మీ దగ్గర జాబ్ ఇవ్వాలని అంటుంది. దానికి వైరా ఓకే చెబుతాడు. నా గురించి పూర్తిగా తెలియక, నా దగ్గరికి వచ్చి మరి ఆఫర్ ఇచ్చింది.. నేనంటే ఏంటో చూపిస్తానని తన అనుచరుడితో అంటాడు వైరా.

కాశీని జ్యోత్స్న తన రూమ్‌లోకి పిలిపించుకుని ఏదో చెప్పిందని కార్తీక్‌తో అంటుంది దీప. జ్యోత్స్న మన కంపెనీలో ఎన్నో మోసాలు చేసిందని నాన్న నాకు ఈ విషయాలు చెప్పాడని అంటాడు కార్తీక్. ఇవన్నీ చూసి అసలు జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలేనా అని నాన్న అడిగాడని చెప్పడతో దీప షాక్ అవుతుంది. ఒకసారి జ్యోత్స్నని నమ్మి కాశీ మోసపోయాడు కాబట్టి మళ్లీ తప్పు చేయడని అంటాడు కార్తీక్. మా నాన్న నీతో ఏం మాట్లాడాడని అడగ్గా... అత్తయ్య గురించేనని చెబుతుంది దీప. అత్తయ్య - మావయ్య తిరిగి కలవాలంటే ఒక బలమైన సంఘటన జరగాలని అంటుంది. కాశీ - స్వప్నకి మధ్య విభేదాలు ఉన్నాయని కానీ కలపాలని చెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X