Karthika Deepam 2 December 19th: జ్యోత్స్న కుట్రకు శ్రీధర్ అరెస్ట్.. రక్తం కక్కుకున్న సుమిత్ర, షాక్‌లో దీప
Photo Courtesy: JioHotstar
అన్నం పెడుతుండగా శౌర్య మారాం చేస్తుండగా కాంచన కసురుకుంటుంది. నానమ్మని తాతయ్య దగ్గరికి పంపించేద్దామని ప్రశ్నిస్తుంది శౌర్య. ఈ మాట నీతో ఎవరు చెప్పారని కాంచన అడగ్గా.. మా ఫ్రెండ్స్ అందరికీ నానమ్మ - తాతయ్యలు ఉన్నారని.. వారితో ఆడుకుంటారు. కానీ నాకు ఎవరూ లేరని చెప్పడంతో మీ నాన్నకి చెప్పి తాతయ్యని పిలిపిస్తానని చెబుతుంది కాంచన. మనం చేయలేని పని శౌర్య చేసిందని, కానీ అమ్మ చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చిందని దీపతో అంటాడు కార్తీక్. జ్యోత్స్న దగ్గరికి కాశీ ఎందుకు వచ్చాడో తెలియడం లేదని దీప అనడంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు.
సీఈవో పోస్ట్ కోసం శివన్నారాయణకు బద్ధ శత్రువైన వైరాతో చేతులు కలుపుతుంది జ్యోత్స్న. అలాగే కాశీకి మీ దగ్గర ఉద్యోగం ఇవ్వాలని కూడా చెప్పగా.. సైరా సరేనని అంటాడు. మామగారితో మాట్లాడుతుండగా కాశీకి జ్యోత్స్న చెప్పిన మాటలు గుర్తొస్తాయి. దాంతో స్వప్నని పిలిచిన శ్రీధర్.. మీ ఆయనకు ఉద్యోగం చేయడం లేదని క్లాస్ పీకుతాడు. దాంతో శ్రీధర్ మాటలకు ఓకే చెప్పి.. ఇష్టం లేకపోయినా పని చేస్తున్నానని బాధపడతాడు కాశీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 19వ తేదీ 545వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న చెప్పడంతో కాశీని తన దగ్గరికి పిలిపించి అతి మర్యాద చేస్తాడు వైరా. నీలాంటి యంగ్ టాలెంట్ కోసమే ఎదురు చూస్తున్నాను.. మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు వైరా. జ్యోత్స్న రెస్టారెంట్స్ సీఈవోకి పీఏని అని కాశీ చెప్పడంతో వైరా మండిపడతాడు. నీ క్వాలిఫికేషన్ ఏంటీ? నువ్వు చేస్తున్న జాబ్ ఏంటీ అని నిలదీస్తాడు వైరా. నా కారణాలు నాకు ఉన్నాయని కాశీ చెప్పగా... అవన్నీ చెత్త కారణాలు అంటాడు వైరా. నీ స్థాయిని నువ్వు తగ్గించుకుని దిగజారిపోతుంటే ఇది వాడుకుని వదిలేసే సమాజామే కానీ ఉద్ధరించే సమాజం కాదని చెబుతాడు వైరా. నువ్వు ఇలాగే చేస్తే నీ వల్ల దగ్గరే నీకు విలువ ఉండదు, నిన్ను నీచంగా చూస్తారని అంటాడు. మనమేంటో ఈ సమాజానికి చెప్పాలని.. నిన్ను నా కంపెనీకి జనరల్ మేనేజర్‌ని చేస్తున్నాను, రేపే జాయినింగ్ అని వైరా చెప్పడంతో కాశీ షాక్ అవుతాడు.
అక్కడ సీఈవో పర్మిషన్ తీసుకోవాలని కాశీ చెప్పడంతో .. ఇలా ఉంటే ఖచ్చితంగా నష్టపోతావని అంటాడు వైరా. నిన్ను తన కాలి కింద చెప్పులా పెట్టుకోవాలని అనుకున్నాడు.. అలాంటి వాళ్లకి బుద్ధి చెబుతావా? లేక చేతకానీ దద్ధమ్మవి అవుతావని అంటాడు వైరా. ఆ మాటలతో కాశీకి పౌరుషం తన్నుకొస్తుంది. బుద్ధి చెబుతానని కాశీ ఆన్సర్ ఇస్తాడు. ముందు పీఏ జాబ్‌కి రాజీనామా చేసి ఆ తర్వాత నీ బాస్‌కి బుద్ధి చెప్పమని అంటాడు వైరా. దీపని కార్తీక్ బైక్ ఎక్కించుకుని వస్తుండగా జ్యోత్స్న రెస్టారెంట్ ఫుట్ ట్రక్ దగ్గర జనాన్ని చూసి సంతోషిస్తుంది దీప. ఫుడ్ అమ్మడంతో పాటు ఫ్రీగా ఫుడ్ సప్లయ్ చేయడంతో ఆ దీవెనలన్నీ మా తాతయ్యకి చెందుతాయని అంటుంది. ఫుడ్ ట్రక్స్ దగ్గర కాశీ లేకపోవడంతో దీప, కార్తీక్‌లకు అనుమానం వస్తుంది.
జ్యోత్స్నకి వైరా కాల్ చేసి కాశీకి ఇస్తాడు. వైరా గారు నీకు ఏం ఆఫర్ చేశారని జ్యోత్స్న అడగ్గా.. జీఎం పోస్ట్ అని చెబుతాడు కాశీ. అది ఈ అక్క పవర్.. మీ మావగారు నీకు పీఏ పోస్ట్ ఇస్తే, నేను వేరే కంపెనీలో జీఎం పోస్ట్ ఇప్పించాను. ఊహించలేనంత జీతం, తిరగడానికి కారు, సొంతిల్లు వస్తాయి.. ఇకపై నువ్వు ఎవరి కొంపలోనో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉండదని చెబుతుంది జ్యోత్స్న. నీ గ్రానీ, మా గ్రానీ ఒక్కరే. దాస్ బాబాయ్‌కి మా ఫ్యామిలీ అంటే ప్రాణం.. ఇకపై మనమంతా కలిసుండాలని చెబుతుంది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? లేదా అని ప్రశ్నిస్తాడు. నీకు జాయినింగ్ బోనస్ కింద 10 లక్షల రూపాయలు ఇస్తానని వైరా చెప్పడంతో కాశీ షాక్ అవుతాడు.
నిన్ను తక్కువగా చూసిన బాస్ మీద రివేంజ్ తీర్చుకో... అక్కడ జాబ్‌కి రాజీనామా చేసి ఇక్కడ జాయిన్ అవ్వు అని చెబుతాడు వైరా. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేనని కాశీ చెప్పగా.. నీ టాలెంట్ చూసి, జ్యోత్స్న గారు చెప్పారని నీకు ఈ జాబ్ ఇస్తున్నానని అంటాడు వైరా. ఆ తర్వాత నువ్వేం చేయాలో నేనే చెబుతానని అంటాడు. మరోవైపు జ్యోత్స్న రెస్టారెండ్ ఫుడ్ ట్రక్ బిజినెస్ బాగా జరుగుతూ ఉండటంతో లోకల్ మీడియా అంతా శ్రీధర్ చుట్టూ తిరుగుతుంది. ఫ్రీ ఫుడ్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తామని కేవలం బిజినెస్ ప్లాన్ ఒక్కటే కాదని చెబుతాడు శ్రీధర్. ఇంతలో పోలీసులతో కలిసి కాశీ రావడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. మీ ఫుడ్ ట్రక్ దగ్గర ఫుడ్ తిన్నవాళ్లంతా కళ్లు తిరిగి పడిపోయారు. కల్తీ ఫుడ్ తినడం వల్లే వాళ్లంతా అస్వస్థతకు గురయ్యారని డాక్టర్ చెప్పారు. ఈ కంపెనీకి సీఈవో మీరే కాబట్టి.. బాధ్యత మీదేనని అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెబుతాడు.
ఫుడ్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే ఫుడ్ బయటికి వెళ్తుందని శ్రీధర్ చెప్పగా అతనిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు పోలీసులు. మీ వ్యాపారాల కోసం జనాన్ని చంపుతారా అంటూ మీడియా అంతా అతనిని చుట్టు ముడుతుంది. దీప ఇంటిని క్లీన్ చేస్తుండగా సుమిత్ర వచ్చి చీపురు కట్ట లాక్కొని తాను ఊడుస్తుంది. కడుపుతో ఉన్నవాళ్ల ఇలా చీపురు పట్టుకుని ఊడవకూడదని, అలా చేస్తే కడుపు మడతపడి బిడ్డ మీద ఒత్తిడి పెరుగుతుందని అంటుంది సుమిత్ర. కాన్పు గురించి, శ్రీమంతం గురించి దీపకు వివరిస్తుంది. అదే ఆడపిల్ల పుట్టింటిలో యువరాణిలా ఉంటుందని చెబుతుంది సుమిత్ర.
అమ్మ నీకు లేదు, పుట్టింటికి వెళ్లలేవు.. అందుకే నీ తల్లి చెప్పాల్సిన జాగ్రత్తలు నేను చెబుతున్నాను అని చెప్పడంతో ఆ మాటలకు దీప కంటతడి పెడుతుంది. నన్ను మీ అమ్మని అనుకో, నాలోనే వచ్చిందనుకో అని అంటుంది సుమిత్ర. సుమిత్ర ఇల్లు ఊడుస్తుండగా ఒక్కసారిగా దగ్గుతుంది. వాష్ రూంలో సుమిత్ర నోటి వెంట రక్తం రావడంతో దశరథ, దీపలు షాక్ అవుతారు. అమ్మ నోటి వెంట రక్తం ఎందుకు వచ్చిందని దీప అడగటంతో దశరథ ఇవన్నీ మరిచిపోమ్మని చెబుతాడు. దాంతో దీప టెన్షన్ పడిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











