Karthika Deepam 2 December 20th: శ్రీధర్‌కు కాశీ వెన్నుపోటు... సుమిత్ర ఆరోగ్యంపై దీప కంటతడి
Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న చెప్పడంతో కాశీని వైరా తన ఇంటికి పిలిపించి కాశీని పొగుడుతూ అతి మర్యాదలు చేస్తాడు. నీ రెజ్యూమ్ చూశాను, నీ టాలెంట్‌కు ఎక్కడో టాప్‌లో ఉండాలని చెబుతాడు. నిన్ను నా కంపెనీకి జీఎంను చేస్తున్నాను, 10 లక్షల రూపాయల బోనస్ ఇస్తున్నానని వైరా చెప్పడంతో కాశీ షాక్ అవుతాడు. ఆ వెంటనే జ్యోత్స్నకి కాల్ చేసి కాశీతో మాట్లాడిస్తాడు. ఈ అక్క పవర్ ఏంటో చూశావా? నీ టాలెంట్‌కు తగ్గ ఉద్యోగం ఇప్పించానని చెబుతుంది జ్యోత్స్న. వాళ్ల ట్రాప్‌లో పడిపోయిన కాశీ.. వైరా దగ్గర జీఎంగా చేయడానికి ఒప్పుకుంటాడు.
జ్యోత్స్న రెస్టారెంట్ గురించి మీడియాకు శ్రీధర్ చెబుతుండగా కాశీని పోలీసులు తీసుకొస్తారు. జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ పాయిజన్ అయ్యిందని పలువురు ఆసుపత్రి పాలయ్యారని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతారు. సీఈవోగా మీదే బాధ్యత కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. దీప ఇంటిని శుభ్రం చేస్తుండగా సుమిత్ర వచ్చి నువ్వు అలాంటి పనులు చేయకూడదని చెప్పి తను క్లీన్ చేస్తుంది. ఇంతలో సుమిత్రకు బాగా దగ్గు వచ్చి రక్తం కక్కుకుంటుంది. అది చూసిన దీప తన తల్లికి ఏం జరిగిందోనని బాధపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 20వ తేదీ 546వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సుమిత్ర రక్తం కక్కుకోవడంతో దీప పరిగెత్తుకుంటూ కార్తీక్ దగ్గరకి వచ్చి నోట్లో నుంచి రక్తం ఎందుకు పడుతుందని అడుగుతుంది. ఆ మాటలతో కార్తీక్ టెన్షన్ పడతాడు. దానికి రకరకాల కారణాలు చెబుతాడు కార్తీక్. అమ్మకి రక్తం పడిందని చెప్పగానే కార్తీక్‌కి గురువుగారు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. దీప కంగారు పడటం చూసి ఏదేదో చెబుతాడు కార్తీక్. ఒక తల్లిని తెలియకుండానే పొగొట్టుకున్నాను, మరో తల్లిని పొగొట్టుకోలేనని దీప బాధపడుతుంది. నా తల్లి అనారోగ్యంతో చనిపోయిందట.. నేను ఎదిగిన తర్వాత మా నాన్న చెప్పారు, కానీ మా మేనత్త మాత్రం నేనే మా అమ్మని బలి తీసుకున్నాను అనేది. ఆ మాట మా నాన్న పడనిచ్చేవాడు కాదు కానీ నాకు మాత్రం లోపల ఉండేది. అదంతా నేను పుట్టినప్పుడు నాకు తెలియకుండానే జరిగిపోయింది. కుబేర్ నా కన్న తండ్రి కాదని, మనకి పెళ్లయిన తర్వాతే తెలిసింది. కానీ మా మేనత్త మాటలు మాత్రం నా మనసులో అలాగే ఉండిపోయాయని బాధపడుతుంది.
అమ్మవాళ్ల ఫ్రెండ్ ధరణి గారు కూడా అమ్మకి ఆరోగ్యం బాలేదని టెస్టులు చేయించుకోమన్నారని దీప గుర్తుచేస్తుంది. ఒకసారి మనం మావయ్యతో మాట్లాడదామని దశరథ దగ్గరికి వస్తాడు. దీప ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచే మీ అత్త ఆరోగ్యం బాలేదని, ఎన్నోసార్లు అడిగానని చెబుతాడు దశరథ. మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ ధరణి గారు కూడా చెప్పారట. కానీ మీ అత్తయ్య వినలేదు. ఇప్పుడు రక్తం కక్కుకోవడంతో భయంగా ఉందని అంటాడు దశరథ. ఇదంతా విన్న సుమిత్ర వచ్చి హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లాలని అడుగుతుంది. నువ్వు, మావయ్య ఇద్దరూ కలిసి టెస్టులు చేయించుకోవాలని చెబుతాడు కార్తీక్. ఒక వయసు వచ్చిన తర్వాత 6 నెలలకు ఒకసారి అన్ని టెస్టులు చేయించుకోవాలని అంటాడు దశరథ.
టెస్టులు చేయించుకోవాల్సింది నేను కాదు దీప అని చెబుతుంది సుమిత్ర. నేను ఎప్పుడో చేయించుకున్నాను, మీరు కూడా టెస్టులు చేయించుకున్నాను అని అంటుంది దీప. మీరు బాగా నీరసంగా ఉన్నారని చెప్పగా.. నీరసం నా ఒంట్లో లేదు, మీ చూపుల్లో ఉందని చెబుతుంది. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగొచ్చిన తర్వాతి నుంచి మీకు నా మీద ప్రేమ పెరిగిపోయిందని అంటుంది సుమిత్ర. మీరు ఇందాక దగ్గినప్పుడు అని దీప నిజం చెప్పబోతుండగా దశరథ ఆపుతాడు. మీ మావయ్య నా దగ్గర ఏదో దాస్తున్నాడు.. అంత దాయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తుంది సుమిత్ర. నువ్వంటే మావయ్యకి ప్రేమ.. అందుకే నీ విషయంలో ఏం జరిగినా ఆయన తట్టుకోలేడని చెబుతుంది సుమిత్ర
నాకు ఆరోగ్యం బాలేదని అందుకే టెస్టులు చేయించుకోవడానికి వెళ్దామని అంటాడు దశరథ. ఆ మాటలతో సుమిత్ర షాక్ అవుతుంది. ఓసారి టెస్టులు చేయించుకుందామని చెబుతాడు. దాంతో సుమిత్ర కంగారుపడి ఇప్పుడే ఆసుపత్రికి వెళ్దామని అంటుంది. మీతో పాటు అత్తకి కూడా టెస్టులు చేయించమని కార్తీక్ చెప్పగా దశరథ సరేనంటాడు. ఈ విషయం మావయ్యగారికి చెప్పొద్దు.. ఆయన తట్టుకోలేరు, ఒకవేళ ఆసుపత్రికి ఎందుకు అని చెబితే సుమిత్రకు ఆరోగ్యం బాలేదు టెస్టులు చేయించడానికి వెళ్తున్నామని చెప్పండి అని సుమిత్ర అంటుంది. ఆ మాటలతో అంతా బాధపడతారు. మీరు మాత్రం ఈ నిజం ఎవరికీ చెప్పొద్దని దశరథ అంటాడు.
వాళ్లిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో చూశావా బావా.. అమ్మ ఎక్కడ బాధపడుతుందోనని, నాన్న టెస్టులు తన కోసమని చెబుతున్నాడు. తాత ఎక్కడ బాధపడతాడోనని నాకు టెస్టులు చేయించడానికి వెళ్తున్నామని చెప్పామని అమ్మ అంటోంది. అమ్మకి ఏమవుతుందో దానికంటే ఆ భయంతో నాన్న ఏమవుతాడోనని ఇంకా ఎక్కువ భయంగా ఉందని దీప కంటతడి పెడుతుంది. దాంతో కార్తీక్ ఆమెను ఓదారుస్తాడు. సుమిత్రను తీసుకుని ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్స్ రాసిన టెస్టులు నేను చేయించుకోనని సుమిత్ర మారాం చేస్తుంది. దాంతో ఆమెను టెస్టులు చేయించుకోవడానికి ఒప్పిస్తాడు దశరథ.
శివన్నారాయణ సీరియస్‌గా ఫోన్‌లో మాట్లాడుతుండగా ఏం జరిగిందని అడుగుతుంది పారిజాతం. దానికి కారణం నేను చెబుతానని అంటుంది జ్యోత్స్న. సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్ .. మన ఆఫీసులో ఏం జరిగిందో నువ్వే చూడు అని ల్యాప్‌టాప్‌లో చూపిస్తుంది. మీరు కూడా వచ్చి చూడమని దీప, కార్తీక్‌లను పిలుస్తుంది జ్యోత్స్న. అందులో శ్రీధర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండటం చూసి దీప, కార్తీక్, పారిజాతం షాక్ అవుతారు. నిజాయితీ లేనివాళ్లకి అధికారం ఇస్తే తప్పులే చేస్తారని జ్యోత్స్న అనడంతో దీప సీరియస్ అవుతుంది. నువ్వు ఇచ్చింది ఎందుకు పనికిరాని ఐడియా అని నేను ఆ రోజే చెప్పాను. కానీ మా వాళ్లు నా మాట వినలేదని మండిపడుతుంది జ్యోత్స్న. మీ మావయ్య కూడా నీ ఐడియాని తన స్వార్ధానికి వాడుకుని మా కంపెనీ పరువు తీశాడని అంటుంది. నా తండ్రి ఎలాంటి వాడో నాకు తెలుసు అని కార్తీక్ అనగా.. అందుకే నీ తండ్రిని నీ తల్లి వదిలేసిందని నానామాటలు అంటుంది జ్యోత్స్న. మా తాత మాత్రం నువ్వు చెప్పింది విని మనవరాలిని పక్కనపెట్టి అల్లుడిని సీఈవోని చేశాడని చెబుతుంది.
మీడియాలో చూపించిన ప్రతీది నిజమని నమ్ముతావా? అని కార్తీక్ అడగ్గా.. దొంగ దొరికిపోయిన తర్వాత ఇంకా వెనకేసుకొస్తున్నావని మండిపడుతుంది పారిజాతం. మీ తాత మీద మీ నాన్నకి ఉన్న పగతోనే ఇదంతా చేశాడని అంటుంది. అల్లుడు తప్పు చేశాడని కొట్టి గెంటేశాడు కదా, ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు.. అన్ని మనసులో పెట్టుకుని ఈ కార్తీక్ ద్వారా మీకు దగ్గరై ఇంట్లో అడుగుపెట్టాడు అంటుంది పారిజాతం. మంచోడిలా నటించే సీఈవో అయ్యాడు... జ్యోత్స్న రెస్టారెంట్ మీద జనానికి ఉన్న నమ్మకాన్ని చంపేశావు అని మండిపడుతుంది పారిజాతం. శ్రీధర్ మావయ్య చేసిన దానికి మనకి ఏ సంబంధం లేదని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాలని జ్యోత్స్న అనడంతో అంతా షాక్ అవుతారు. మావయ్య చేసిన తప్పులో నీకు కూడా వాటా ఉందని జ్యోత్స్న అనడంతో దీప మండిపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











