Karthika Deepam 2 December 22nd: శ్రీధర్ రిలీజ్ కాకుండా జ్యోత్స్న కుట్ర... ఆడియో క్లిప్‌తో కాశీ వెన్నుపోటు

Photo Courtesy: JioHotstar

సుమిత్ర నోటి నుంచి రక్తం రావడంతో దీప కంగారు పడుతుంది. దాంతో పరుగు పరుగున కార్తీక్ దగ్గరకి వెళ్లి అసలు నోటి నుంచి రక్తం ఎందుకు వస్తుందని అడుగుతుంది దీప. దాంతో భార్యకి ఏమైందోనని అతను కంగారు పడతాడు. నోట్లో, గొంతులో పుండ్లు, కడుపులో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అలాగే అవుతుందని కార్తీక్ చెబుతాడు. మా అమ్మ రక్తం కక్కుకుందని కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నాన్న అన్నాడని దీప చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. దాంతో కార్తీక్, దీపలు వెంటనే దశరథతో మాట్లాడి సుమిత్రను ఆసుపత్రికి తీసుకెళ్లమని చెబుతారు. మామూలుగా చెబితే సుమిత్ర వినకపోవడంతో నాకు హెల్త్ బాలేదని అందుకే టెస్టులు చేయించుకుందామని దశరథ అడగటంతో సుమిత్ర కంగారుపడి ఆసుపత్రికి వెళ్లడానికి సరేనని అంటుంది.

శివన్నారాయణ సీరియస్‌గా ఫోన్‌లో మాట్లాడుతుండగా కార్తీక్, పారిజాతం, దీపలు వస్తారు. వాళ్లంతా ఏం జరిగిందని అడగ్గా.. నేను చెబుతానని అంటుంది జ్యోత్స్న. నీకెలా తెలుసని శివన్నారాయణ అడగ్గా.. సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్ అని చెబుతుంది. వెంటనే శ్రీధర్‌ను అరెస్ట్ చేసిన వీడియో చూపిస్తుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్, దీప, పారిజాతంలు షాక్ అవుతారు. శ్రీధర్‌ వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ జ్యోత్స్న నానామాటలు అనడంతో కార్తీక్ మండిపడతాడు. తండ్రిని విడిపించడానికి శివన్నారాయణతో కలిసి వెళ్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 22వ తేదీ 547వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar

Karthika deepam 2 Serial Today s Episode 547 December 22nd 2025 Here is full story

కాంచన వంట చేసుకుంటూ ఉండగా శ్రీధర్‌ను అరెస్ట్ చేసిన వీడియో పంపుతుంది పారిజాతం. అది చూసిన కాంచన షాక్ అవుతుంది. వెంటనే పారిజాతం ఫోన్ చేస్తుంది. మీరు నా భర్త పరువుని రోడ్డునపడేశారు. అబద్ధాలు చెప్పడం, మనుషులను మోసం చేయడం, మాటిచ్చి తప్పడం. అన్నం పెట్టిన వాళ్ల మీద తిరగబడటం, అవకాశం ఇచ్చిన వాళ్ల నెత్తిన చేయి పెట్టడం మీ ఇంట్లో వాళ్లందరికీ అలవాటే కదా అని నానామాటలు అంటుంది పారిజాతం. ఆ మాటలకు సీరియస్ అవుతుంది కాంచన. నీలాంటి ఒక కూతురిని కని తప్పు చేశాడు, నువ్వేమో నీ అన్నకి మాటిచ్చి మోసం చేసింది.. నీ కోడలు నా మనవరాలికి మాటిచ్చి మోసం చేసింది.. నీ కొడుకు నీ మేనకోడలిని పెళ్లి చేసుకోకుండా ఊళ్లో ఎవరి ముందు తలెత్తుకోకుండా చేశాడు. ఇప్పుడంతా బాగానే ఉందని అనుకునేలోపే అవకాశమిచ్చి అందలం ఎక్కించినందుకు నీ భర్త మోసం చేశాడు అని అంటుంది పారిజాతం.

శివన్నారాయణ గారికి కూతురు ఉండటం వల్ల కలిగిన ఆనందం ఏంటో ఇప్పుడు చెప్పమని పారిజాతం నిలదీయడంతో కాంచన మౌనంగా ఉండిపోతుంది. నీ భర్త మోసగాడని తెలిసినా కూడా అవకాశం ఇచ్చినందుకు నా భర్తను మోసం చేశాడు. డబ్బు కోసం మరీ ఇంత దిగజారిపోతారా? కడుపుకి పెట్టే దానిని కూడా కల్తీ చేస్తుంటే ఏం అనుకోవాలని మండిపడుతుంది. నీ భర్త, అతని అల్లుడు ఆఫీసులో పెత్తనం చేస్తుంటే.. నీ కొడుకు, కోడలు నా ఇంట్లో పెత్తనం చేస్తున్నారని ఫైర్ అవుతుంది. నా నోరు చెడ్డదని ఒప్పుకుంటాను.. నీ భర్త బుద్ధి కూడా చెడ్డదే. అసలు ఆ మనిషే కల్తీ అయినప్పుడు తినే దానిని కల్తీ చేయడంలో ఆశ్చర్యం ఏముందని ప్రశ్నిస్తుంది పారిజాతం.

నీ భర్తని పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణం దీప అని పారు చెప్పడంతో కాంచన షాక్ అవుతుంది. ఈ ఫుడ్ ట్రక్ సలహా ఎవరిది? దీపది. కార్తీక్ గాడు చెప్పగానే శ్రీధర్ సరే అన్నాడు. కార్తీక్ ఏం చెప్పినా సరే అనడానికి మా ఇంట్లో వాళ్లు రెడీగా ఉంటారు. దీప లాంటి కోడలు ఎవ్వరికీ ఉండరు, ఇకముందు రారు ఇంటికి రాగానే స్వీట్ పెట్టమని అంటుంది పారు. ఆ మాటలతో కాంచన షాక్ అవుతుంది. ఆ మాటలతో దీప మీద రగిలిపోతుంటుంది కాంచన. నన్నే ఇన్నేసి మాటలు అంటే దీపని ఇంకెన్ని మాటలు అన్నది అనుకుంటుంది.

దీప వంట చేసుకుంటూ ఉండగా జ్యోత్స్న వచ్చి పిచ్చి సలహా ఇచ్చి మామగారిని అరెస్ట్ చేశావని నానా మాటలు అంటుంది. నీ టైం అయిపోయింది.. ఇప్పటి వరకు ఈ ఇంట్లో నువ్వు చాలా మంచిదానిలా నటిస్తూ, అందరి మనసుల్లో స్థానం సంపాదించావు. నువ్వు చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే ఫుడ్ ట్రక్ ఐడియా ఇవ్వడం, ఆ ఒక్క ఐడియా చాలామంది జీవితాల్ని మార్చబోతోంది. ముందుగా మీ మావయ్య గారిని అంటుంది.

ఇంతలో పారిజాతం వచ్చి.. శ్రీధర్ ఇద్దరు భార్యలతో హాయిగా, ప్రశాంతంగా ఉండేవాడు. స్వప్న పెళ్లి చేసి ఒక్క భార్యని దూరం చేసింది. ఇప్పుడిప్పుడే వాళ్లు కలుసుకుంటుంటే శ్రీధర్‌ని రెండో భార్యకి కూడా దూరం చేసింది. దీప మెడలో తాళి పడింది.. కార్తీక్ రోడ్డునపడ్డాడు, దీప మెడలో బిడ్డ పడింది మామగారు స్టేషన్‌లో పడ్డారు. ఇంకా ఆ బిడ్డ భూమ్మీద పడితే ఎంతమంది పోతారోనని పారు అనడంతో దీప సీరియస్ అవుతుంది. నా బిడ్డ జోలికి రావొద్దని వార్నింగ్ ఇస్తుంది. శ్రీధర్‌కు శిక్షపడని కాంచన ద్వారా దీని ఆట కట్టిస్తానని అంటుంది పారు. నిజం నిప్పులాంటిది దానితో ఆడుకోవాలని చూస్తే అంతుచూస్తుందని వార్నింగ్ ఇస్తుంది దీప.

జ్యోత్స్న వైరాకు కాల్ చేసి నిజాలు బయటకు రాకూడదని ప్లాన్ బీ వర్కవుట్ చేయమని అడుగుతుంది. నేను సీఈవో అవ్వగానే మా కంపెనీలో సగం షేర్స్ మీవేనని చెబుతుంది. నేను సీఈవో అయ్యే వరకే నీతో కానీ, ఆ కాశీ గాడితో కానీ పని.. ఆ తర్వాత మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్, శివన్నారాయణలు శ్రీధర్‌ను విడిపించడానికి స్టేషన్‌కు వస్తారు. అయితే బెయిల్ ఇవ్వడం కుదరదని ఎస్ఐ తేల్చిచెబుతాడు. ఆసుపత్రిలో విషమంగా ఉన్నవాళ్లు కోలుకున్నట్లు డాక్టర్లు చెప్పలేదు. అలాగే శ్రీధర్ తప్పు చేశారని మా దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెబుతాడు. ఆ మాటలతో కార్తీక్, శివన్నారాయణ షాక్ అవుతారు. మీ అల్లుడు తప్పు చేశాడు.. వాళ్ల అల్లుడు సాక్ష్యం చెప్పాడని ఎస్ఐ చెప్పగా... కాశీని చూసి కార్తీక్ షాక్ అవుతాడు.

ఆ మాటలు మాత్రమే ఎలా రికార్డ్ చేసి పోలీసులకు ఇచ్చావని కాశీని నిలదీస్తాడు కార్తీక్. హాస్పటల్‌లో ఉన్నవాళ్లు ఎవరైనా చనిపోతే.. జనాన్ని చంపడానికి మీరు ఫుడ్ సర్వీస్ చేస్తున్నారా? అని మండిపడతాడు ఎస్ఐ. నువ్వు ఏం అనుకున్నా ఇదే నిజం.. మిగిలిపోయిన ఫుడ్‌ని అందరికీ పంచమన్నారు. అది బాలేదు పడేస్తానని నేను చెప్పాను.. నేను చెప్పినా వినకుండా మావయ్యగారే పంచమన్నారని అంటాడు కాశీ. దాంతో శ్రీధర్ గారికి బెయిల్ ఇవ్వలేనని ఎస్ఐ తేల్చిచెబుతాడు. అల్లుడు, కూతురు బాగుంటారని ఏదో స్వార్ధంతో నా దగ్గర పీఏగా పెట్టుకున్నాను.. మా మామగారు నా మీద ఎలాంటి అధికారం చూపించేవారో, అలాంటి అధికారమే నేను కాశీ మీద చూపించాను.

మా మామగారి వల్ల నాకు బాధ్యత వచ్చింది.. నేను నా అల్లుడి మీద చూపించిన అధికారానికి వాడికి బాధ ఉంది. వాడికి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు.. కోపంలో రెండు మాటలు అంటే నిజాయితీగా పనిచేస్తాడని అనుకున్నాను, నా ఫోన్ కాల్స్ రికార్డ్ చేసేంత సిన్సియర్‌గా ఉంటాడు అనుకోలేదు. వాడు ఎదిగే రోజు కోసం నేను చూస్తుంటే.. నన్ను వదిలించుకునే రోజు కోసం వాడు చూస్తున్నాడని అంటాడు కాశీ. తప్పు ఎక్కడ జరిగిందో? ఎలా జరిగిందో నేను తెలుసుకుంటానని అంటాడు కార్తీక్. కాశీని ఏమి అనొద్దని, నీ చెల్లి గురించి ఆలోచించమని చెబుతాడు. నేను తప్పు చేయలేదని మీరు నమ్మితే చాలని శివన్నారాయణతో అంటాడు శ్రీధర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X