Karthika Deepam 2 December 24th: కాశీని బయటికి పొమ్మన్న స్వప్న... కార్తీక్ ఛాలెంజ్, జ్యోత్స్నకి ముచ్చెమటలు

Photo Courtesy: JioHotstar

శ్రీధర్ అరెస్ట్ కావడం, బెయిల్ ఇవ్వకపోవడం, కార్తీక్ తనను అనుమానిస్తూ ఉండటంతో కాశీ వణికిపోతాడు. నాకు చాలా భయంగా ఉందని వైరాకి ఫోన్ చేసి చెబుతాడు. అలాంటిదేమీ ఉండదని, నిన్ను చెప్పులా చూసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకున్నావని అంటాడు వైరా. త్వరగా వచ్చి నా కంపెనీలో జీఎంగా జాయిన్ అవ్వమని చెబుతాడు. ఇంతలో కార్తీక్ వెనుక నుంచి పట్టుకోవడంతో కాశీకి ముచ్చెమటలు పడతాయి. పనిగట్టుకుని మా నాన్న కాల్స్ ఎందుకు రికార్డ్ చేసి పోలీసులకు ఇచ్చావు అని నిలదీస్తాడు కార్తీక్. దాంతో ఏం చెప్పాలో తెలియక.. నాకు తెలిసింది పోలీసులకు ఇచ్చానని చెప్పి వెళ్లిపోతాడు.

కార్తీక్, శివన్నారాయణలు ఇంటికి రాగా.. మావయ్య గారు ఎక్కడ అని అడుగుతుంది దీప. హాస్పటల్‌లో కొందరు చావు బతుకుల్లో ఉన్నారు.. వాళ్లు సేవ్ అయితేనే నాన్నకి బెయిల్ ఇస్తారని కార్తీక్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. శ్రీధర్ విషయంపై శివన్నారాయణ ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా.. జ్యోత్స్న రెస్టారెంట్స్‌పై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రైడ్ చేసిందని, భారీగా ఫైన్ వేసిందని మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి చెబుతాడు. దాంతో శ్రీధర్‌ని పారిజాతం, జ్యోత్స్నలు నానామాటలు అంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 24వ తేదీ 549వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 549 December 24th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

మా నాన్న తప్పు చేయలేదని నమ్మాల్సిన వాళ్లు నమ్మితే చాలని కార్తీక్ అంటాడు. దాంతో మావయ్య తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా? అని జ్యోత్స్న అడగ్గా.. శివన్నారాయణ లేదని చెబుతాడు. ఆ మాటలతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. తప్పు చేశాడని కూడా నేను నమ్మడం లేదని పెద్దాయన అనడంతో జ్యోత్స్న ఉలిక్కిపడుతుంది. అసలు నేను ఎవరినీ నమ్మడం లేదు.. ఎవరిని పూర్తిగా నమ్మాలో నాకు అర్ధం కావడం లేదని అంటాడు. నాకు మీ నాన్న అంటే నమ్మకం ఉంది.. మీ నాన్నకి కాశీ అంటే నమ్మకం ఉంది. అందుకే అల్లుడిని పీఏగా పెట్టుకున్నాడు. మీ నాన్నకి నమ్మకమైన వాడైన వాడే.. మీ నాన్నే తప్పు చేశాడని చెప్పినప్పుడు అతని నమ్మకాన్ని నమ్మాలా వద్దా అని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. కాశీ సాక్ష్యం చెప్పాడా అని దీప అడగ్గా.. ఔను అని అంటాడు శివన్నారాయణ. శ్రీధర్ కాశీతో మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసి దానినే వాంగ్మూలంగా ఇచ్చాడని చెప్పడంతో దీప షాక్ అవుతుంది.

కాశీ ఏదో భయంతో అలా చేశాడు.. ఎందుకు భయపడుతున్నాడో నాకు అర్ధం కావడం లేదని దీపతో అంటాడు కార్తీక్. కాశీ గాడు ఆ వాంగ్మూలం ఇవ్వడం ఏంటీ? జ్యోత్స్న ఏమైనా చేసిందా అని పారిజాతానికి డౌట్ వస్తుంది. అంత నమ్మకమైన అల్లుడే మా మావయ్యే తప్పు చేయమన్నాడు అని చెప్పినప్పుడు నేను ఎవరినీ నమ్మాలి? కానీ శ్రీధర్ లాగా నేను ఎవ్వరినీ గుడ్డిగా నమ్మనని అంటాడు శివన్నారాయణ. ఇప్పుడు మన రెస్టారెంట్‌ మీద ఫుడ్ సేఫ్టీ వాళ్లు రైడ్ చేశారు.. దానికి కారణం కల్తీ అయిన ఫుడ్ సప్లై చేయడమేనని అంటాడు. మనం వీలైనంత త్వరలో ఆ తప్పు ఎవరు చేశారో కనిపెట్టాలని కార్తీక్‌తో చెబుతాడు శివన్నారాయణ. అది ఇంట్లో వాళ్లయినా, బయటి వాళ్లయినా క్షమించేది లేదని శిక్ష పడాల్సిందేనని తేల్చేస్తాడు. ఈ మోసానికి పాల్పడింది ఇంటి దొంగో, బయటి దొంగో త్వరలోనే తెలుసుకుంటానని చెబుతాడు.

ఇంటికొచ్చిన కాశీని బయటికి పొమ్మంటుంది కావేరి. మా నాన్న నేరం చేశాడని పోలీస్ స్టేషన్‌లో సాక్ష్యం చెప్పావు కదా అని మండిపడుతుంది స్వప్న. నేను ఆ సాక్ష్యం చెప్పకపోతే నేరం నా మీదకి వచ్చేదని అంటాడు. నువ్వు తప్పించుకోవడానికి నేరం నా భర్త మీదకి నెట్టేశావా? అని మండిపడుతుంది కావేరి. నీ నిర్లక్ష్యం వల్లే ఫుడ్ కల్తీ జరిగిందని స్వప్న నానామాటలు అంటుంది. నా భర్త తప్పు చేయడం నువ్వు చూశావా అని నిలదీస్తుంది కావేరి. మీ మావయ్య ఎలాంటి వారో నీకు తెలియదా? అని అంటుంది. మనం ఏది కళ్లతో చూడకుండా నిజమని నమ్మలేం కదా అని అంటాడు కాశీ. తప్పు చేయకపోతే తలవంచుకుని పోలీస్ స్టేషన్‌కి ఎందుకు వెళ్లాడని ప్రశ్నిస్తాడు. నిన్ను నమ్మి విలువిచ్చిన మనిషికి నువ్వు చూపించిన కృతజ్ఞత ఇదా అని మండిపడుతుంది స్వప్న. మావయ్యగారికి అర్హత లేకపోయినా శివన్నారాయణ గారు సీఈవో పోస్ట్ ఇచ్చారు.. నాకు మావయ్య గారికంటే ఎక్కువ అర్హత ఉన్నప్పటికీ వేరే పోస్ట్ ఇవ్వకుండా పీఏ పోస్ట్ ఇచ్చి తన కింద పెట్టుకున్నారని అంటాడు కాశీ. అది నన్ను అవమానించినట్లు కాదా అని నిలదీస్తాడు.

నేను పీఏగా ఉంటే నన్ను ఎన్ని మాటలైనా అంటారు అందుకే నేను జాబ్‌కి రిజైన్ చేశానని చెబుతాడు కాశీ. ఆ మాటలతో కావేరి, స్వప్నలు షాక్ అవుతారు. ఇంట్లో నేను ఉండటం ఇష్టం లేదంటే ఈ క్షణమే వెళ్లిపోతానని చెబుతాడు కాశీ. సమస్య వచ్చినప్పుడు మా నాన్న నిలబడ్డాడు.. ఇప్పుడు మా నాన్నకి సమస్య వస్తే నువ్వు వెళ్లిపోతానని అంటున్నావా? అని మండిపడుతుంది స్వప్న. మా నాన్న నిర్దోషిగా బయటకు వచ్చాక ఆయనకి సారీ చెప్పడానికైనా నువ్వు ఇక్కడే ఉండాలని చెబుతుంది స్వప్న. నా తండ్రికి అర్హత లేకపోయినా సీఈవో పోస్ట్ ఇచ్చారా? ఆయన గురించి మాట్లాడే అర్హత నీకేముంది. నువ్వు జీవితంలో సీఈవో పోస్ట్ సంపాదించగలవా? మనిషిని తక్కువ చేసి మాట్లాడే చీప్ క్యారెక్టర్ నీది అని మండిపడుతుంది స్వప్న. భర్త మర్యాదని తండ్రి ముందు కాపాడలేని నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? అని కాశీ కూడా సీరియస్ అవుతాడు. నువ్వు పోలీస్ స్టేషన్‌లో సాక్ష్యం చెప్పావంటేనే నీ మనసులో మా నాన్న మీద ఎంత ద్వేషం ఉందో అర్ధమవుతోందని స్వప్న ఫైర్ అవుతుంది.

సుమిత్ర - దశరథల నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో నాన్న ఫోన్ ఎత్తడం లేదని జ్యోత్స్నని అడుగుతుంది దీప. మా డాడీని పట్టుకుని నాన్న అంటున్నావని మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వు ఈ ఇంటికి పనిమనిషివి.. మా మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్తే నీకెందుకు? వాళ్లకి ఏమైతే నీకెందుకు అని ఫైర్ అవుతుంది. అసలు నువ్వెవరు అని పదే పదే అడగటంతో సుమిత్ర అత్త కూతురు అని కార్తీక్ ఆన్సర్ ఇవ్వడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. సారె పెట్టడానికి మా ఇంటికి వచ్చినప్పుడు మావయ్య భార్యని కూతురు అనుకున్నాడు అంటాడు కార్తీక్. ఇంట్లో ఎవరికేం జరిగినా మేం ఉన్నాం.. అర్హత లేని వాళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వెళ్లిపోతాడు. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అసలు తల్లికి ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటుంది.

హాస్పిటల్‌లో డాక్టర్ గారు సుమిత్రను కాకుండా దశరథను మాత్రమే పిలవడంతో సుమిత్రకు అనుమానం వస్తుంది. నేను కూడా వస్తానని మారాం చేస్తూ లోపలికి వచ్చేస్తుంది. రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది ఈలోగా మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలని సుమిత్రకు చెబుతాడు డాక్టర్. నేను అడ్మిట్ కాను అంటూ వెళ్లిపోతుంది సుమిత్ర. ఆమె వెళ్లిపోగానే అసలు ఏం జరిగిందని డాక్టర్‌ను అడుగుతాడు దశరథ. మీ వైఫ్‌కి మేజర్ ప్రాబ్లమ్ ఉందని, నాకు అర్ధం కాక బ్లడ్ శాంపిల్స్‌ని స్పెషలిస్ట్ డాక్టర్‌కి పంపించానని చెబుతాడు డాక్టర్. ఆ మాటలతో దశరథ షాక్ అవుతాడు. హాస్పిటల్ నుంచి సుమిత్ర, దశరథలు ఇంటికి రాగానే అమ్మకి టెస్టులు చేశారా? డాక్టర్ గారు ఏం చెప్పారు అని ఏడుస్తుంది దీప. దాంతో అంతా షాక్ అవుతారు. నువ్వు సుమిత్ర కూతురివి కాదు.. ఈ ఇంటి పనిమనిషివి అని అంటుంది. కార్తీక్ కూడా అమ్మగారు అనే పిలవాలని అంటాడు.

మాకు ఏ ప్రాబ్లమ్ లేదని డాక్టర్ గారు చెప్పారని దశరథ అనడంతో అంతా సంతోషిస్తారు. మీతో పాటు దీప నాకు ఫోన్ చేశారు.. నేను లిఫ్ట్ చేయలేకపోయానని అంటాడు దశరథ. అసలు ఏం జరిగిందని అడుగుతాడు. అల్లుడు మోసం చేశాడని ఏ మామగారు మాత్రం కొడుక్కి చెప్పుకోగలరు అని అంటుంది పారిజాతం. దాంతో శ్రీధర్ అరెస్ట్, పుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైడ్ అంతా చెబుతాడు శివన్నారాయణ. అన్నయ్య ఏ తప్పు చేయడని సుమిత్ర తేల్చిచెబుతుంది. బావ ఏ తప్పూ చేయడని దశరథ కూడా అంటాడు. దాంతో జ్యోత్స్న మండిపడుతుంది. నేను సీఈవోగా ఉన్నప్పుడు షేర్ విలువ 0.5 తగ్గితేనే నేను పెద్ద తప్పు చేశానని చూశారు.. మరి ఈరోజు మీ సీఈవో మీ కంపెనీ పరువు, ప్రతిష్టల్ని భోగీ మంటల్లా తగులబెట్టాడని చెబుతుంది.

ఫుడ్ ట్రక్ ప్లాన్ ఫెయిలైంది.. దీనికి కారణం శ్రీధర్ మావయ్యే. అర్హత లేని వాళ్లని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుందని అంటుంది జ్యోత్స్న. షేర్ వాల్యూ పడిపోయేలా చేసింది, కంపెనీని అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఆ అర్హత లేని మనిషే అని అంటాడు కార్తీక్. ఈసారి కుర్చీలో కూర్చోబెట్టింది సమర్ధుడినే... ఏ తప్పు చేయని నా తండ్రిని పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. దీని వెనుక ఉన్న వాళ్లని పట్టుకుంటానని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న వణికిపోతుంది. జ్యోత్స్నపై దీప, పారిజాతంలు అనుమానపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X