Karthika Deepam 2 December 25th: కాంచన మాటలతో శ్రీధర్ మనసు ముక్కలు.. సుమిత్ర ఆరోగ్యంపై దశరథ ఆందోళన
Photo Courtesy: JioHotstar
శ్రీధర్‌పై నాకు అనుమానం లేదు.. అలాగని నమ్మకం కూడా లేదని శివన్నారాయణ అనడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. మన కంపెనీని ఈ స్థితికి తీసుకొచ్చేందుకు కారణమైంది ఇంట్లో వాళ్లయినా సరే, బయటి వాళ్లయినా సరే క్షమించే ప్రసక్తే లేదని శివన్నారాయణ వార్నింగ్ ఇవ్వడంతో అంతా వణికిపోతారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికొచ్చిన కాశీని గుమ్మంలోనే కడిగిపారేస్తారు కావేరి, స్వప్న. నీ కారణంగా మా నాన్న జైలుకి వెళ్లాడని, నిన్ను గొప్ప స్థితిలో చూడాలనుకున్న వ్యక్తిపై ద్వేషం నింపుకున్నావని చీవాట్లు పెడుతుంది.
ఆసుపత్రికి వెళ్లిన అమ్మానాన్న ఇంటికి రాకపోవడంతో దీప టెన్షన్ పడుతుంది. కన్న కూతురిని నాకే ఏం లేదు, పనిమనిషివి మా అమ్మానాన్నల గురించి నీకెందుకు అని మండిపడుతుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ వచ్చి.. అత్తయ్య మావయ్యలు దీపను సొంత కూతురిలాగే చూసుకుంటున్నారని అంటాడు. ఇంతలో దశరథ, సుమిత్రలు ఇంటికొస్తారు. శ్రీధర్ అరెస్ట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రైడ్ గురించి కొడుక్కి చెబుతాడు శివన్నారాయణ. శ్రీధర్ బావ ఏ తప్పూ చేసుండడని దశరథ అనడంతో జ్యోత్స్న రగిలిపోతూ నానామాటలు అంటుంది. నా తండ్రి ఏ తప్పూ చేయలేదు.. అసలేం జరిగిందో నేను కనుక్కుంటానని కార్తీక్ సవాల్ విసరడంతో జ్యోత్స్న వణికిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 25వ తేదీ 550వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
శ్రీధర్ జైల్లో ఉండటంతో కావేరి, స్వప్న ఏడుస్తుంటారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్దామని కావేరి అడగ్గా.. నాన్న ముఖం నేను చూడలేనని బాధపడుతుంది స్వప్న. మనకే ఇలా ఉంటే పెద్దమ్మ పరిస్ధితి ఏంటని వెంటనే కాంచనకి ఫోన్ చేసి ఇస్తుంది స్వప్న. నాకు చాలా భయంగా ఉందని కావేరి అనగా.. స్వప్న వాళ్ల నాన్న తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా? అని కాంచన ప్రశ్నిస్తుంది. ఆయనకు సీఈవో పోస్ట్ వచ్చినప్పటి నుంచి ఆ ఇంట్లో వాళ్లు అవకాశం దొరికిన ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉన్నారని చెబుతుంది కావేరి. ఆయన ఎదుగుదలను ఓర్చుకోలేని వారెవరో ఈ పని చేసుంటారని అంటుంది కావేరి. దాని వెనుక ఎవరున్నారో? ఏ ఉద్దేశంతో చేశారో త్వరలోనే బయటపడుతుందని చెబుతుంది. నా కొడుకు, నీ కూతురు అందరం ఆయన తప్పు చేయలేదనే నమ్ముతున్నారు. మన నమ్మకమే ఆయనకు ధైర్యమని అంటుంది కాంచన.
ఆయనకి నా కంటే నువ్వంటనే ఎక్కువ ఇష్టం, నాతో ఉన్నా నీ గురించే ఆలోచిస్తారని కావేరి అంటుంది. మనిషెప్పుడు తన దగ్గర లేని దాని గురించే ఆలోచిస్తాడు అంటుంది కాంచన. మరి ఇప్పుడు ఆయన నీ దగ్గర లేరు కదా? నువ్వు కూడా ఆయన గురించే ఆలోచిస్తున్నావా? అని ప్రశ్నిస్తుంది కావేరి. భార్యాభర్తల బంధం తెంపేసుకున్నా.. అమ్మానాన్నల బంధం తెంపలేకపోయానని అంటుంది కాంచన. కార్తీక్ వాళ్ల నాన్నకి ఏం కాదని ధైర్యం చెబుతుంది. ఇలాగేనా పెద్దమ్మతో మాట్లాడేదని కావేరిపై స్వప్న సీరియస్ అవుతుంది. ఎవరో కావాలనే నాన్నని దీనిలో ఇరికించారని చెబుతుంది.
సుమిత్ర ఆరోగ్యం బాగానే ఉందని దశరథ చెప్పగా.. కార్తీక్, దీపలు నమ్మరు. డాక్టర్ గారు చాలా పాజిటివ్‌గానే చెప్పారని అంటాడు. ఆ తర్వాత సుమిత్రకు ఏం కావాలో చూడమని దీపని లోపలికి పంపేస్తాడు. మీ నాన్నకి ఏం కాదు పోలీస్ స్టేషన్‌కి వెళ్దామని అంటాడు దశరథ. మా నాన్న కంటే అత్త గురించే భయంగా ఉందని చెబుతాడు కార్తీక్. అబద్ధాల్ని నవ్వుతూ చెప్పినంత మాత్రాన నిజాలు అయిపోవు.. నువ్వు బాధను దాచుకుంటున్నావ్, నిజాలు చెప్పడానికి భయపడుతున్నావని అంటాడు కార్తీక్. డాక్టర్ గారు ఏం చెప్పారని నిలదీస్తాడు.
దీపకి సుమిత్ర అంటే చాలా ఇష్టం.. తనుండగా చెప్పలేకపోయానని చెబుతాడు దశరథ. దాంతో హాస్పిటల్‌లో ఏం జరిగిందో మొత్తం చెబుతాడు. రిపోర్ట్స్ ఎలా వస్తాయోనని భయంగా ఉంది, మరోవైపు ఏం కాదని ధైర్యంగానూ ఉందని అంటాడు. ఈ నిజం మన దగ్గరే ఉండాలని చెబుతాడు. దేవుడు ఒకేసారి రెండు పెద్ద కష్టాల్ని ఇచ్చాడని బాధపడతాడు కార్తీక్. ఇంతలో దీప వచ్చి అంతా విన్నానని ఏడుస్తుంది. మీ అమ్మకి ఏం కాదని ధైర్యం చెబుతాడు. కావేరి అన్న మాటల గురించి కాంచన బాధపడుతుండగా శౌర్య వచ్చి ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావని? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. మీ తాత పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని కాంచన చెప్పడంతో శౌర్య బాధపడుతుంది.
ఇంతలో కార్తీక్, దీపలు రాగా.. తాతయ్య దగ్గరికి నానమ్మని తీసుకెళ్లమని చెబుతుంది శౌర్య. నేను మీ నాన్నని చూడాలి నన్ను స్టేషన్‌కి తీసుకెళ్లమని అడుగుతుంది కాంచన. అలాగే దీపని వంట చేసి క్యారియర్ కట్టమని చెబుతుంది. నువ్వు భర్తగా అంగీకరించని మనిషి కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తాడు కార్తీక్. అయితే నేనే పోలీస్ స్టేషన్‌కి వెళ్తానని అంటుంది కాంచన. దీప ఏదో చెప్పబోతుండగా సీరియస్ అవుతుంది. నువ్వు మీ నాన్న కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్లావ్.. మరి నేను వెళ్తానంటే నన్నెందుకు అన్ని ప్రశ్నలు అడుగుతున్నావని మండిపడుతుంది కాంచన.
పోలీస్ స్టేషన్‌లో శ్రీధర్ పరిస్ధితి చూసి మరో దొంగ ఏదో ఒకటి తెప్పించుకుని తినమంటాడు. మీకోసం ఎవరూ ఏమీ తెచ్చేలా కనిపించడం లేదని అంటాడు. పోలీస్ స్టేషన్‌కి కాంచన, కార్తీక్ రావడంతో శ్రీధర్ చాలా సంతోషిస్తాడు. అమ్మని ఎందుకు రా తీసుకొచ్చావు అని కార్తీక్ అడగ్గా.. అమ్మే వస్తానని అన్నదని అంటాడు. ఆ మాటలతో కాంచన నన్ను క్షమించిందని, భర్తగా అంగీకరించిందని సంతోషిస్తాడు కార్తీక్. వాళ్లిద్దరినీ చూసి లాయర్‌కి ఫోన్ చేయాలని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. నువ్వు వస్తావని అనుకోలేదని శ్రీధర్ అనగా.. కావేరి వస్తుందని అనుకున్నారా? అని ప్రశ్నిస్తుంది కాంచన. నన్నెందుకు అరెస్ట్ చేశారో నీకు తెలుసా? నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా? అని అడుగుతాడు శ్రీధర్. మీరు తప్పు చేశారని నమ్మితే నేను ఇంత దూరం వచ్చేదానినా అని కాంచన అనడంతో శ్రీధర్ చాలా సంతోషిస్తాడు.
నన్ను భర్తగా అంగీకరించాలంటే నాకు ఈ పరిస్థితి రావాలని నాకు తెలియదు.. తెలుసుంటే ఏదో ఒక చిన్న తప్పు చేసైనా అరెస్ట్ అయ్యేవాడినని అంటాడు శ్రీధర్. నీకు చెడ్డపేరు తీసుకొచ్చి బాధపెడుతున్నానని ఇప్పటిదాకా ఆలోచించానని అంటాడు. ఈ బంధం మనిద్దరి ప్రాణాలు పోయేంత వరకు ఉంటుందని అంటాడు. నేను మిమ్మల్ని భర్తగా అంగీకరించానని మీతో ఎవరు చెప్పారని ప్రశ్నిస్తుంది కాంచన. నేను కార్తీక్ తల్లిగా మాత్రమే ఇక్కడి వరకు వచ్చానని చెప్పడంతో శ్రీధర్ బాధపడతాడు. ఇంతలో కార్తీక్ వచ్చి అన్నం తినిపిస్తాడు. మీ ఇద్దరూ మాట్లాడుకుంటే చూడాలని ఉందని చెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










