Karthika Deepam 2 December 26th: స్వప్నకి షాకిచ్చిన కాశీ.. శ్రీధర్ వెనుక కుట్రపై కార్తీక్‌కి ఆధారాలు
Photo Courtesy: JioHotstar
సుమిత్రకు అంతా బాగానే ఉందని రిపోర్ట్స్ రావడం లేట్ అవుతుందని కార్తీక్‌కి చెబుతాడు దశరథ. నిజం చెప్పమని కార్తీక్ నిలదీయగా.. ఆసుపత్రిలో డాక్టర్ గారు చెప్పిన విషయాన్ని కార్తీక్‌తో అంటాడు. ఎప్పుడు ఏం వినాల్సి వస్తోందని భయంగా ఉందని చెబుతాడు. వీరి మాటల్ని గుట్టుగా విన్న దీప.. కార్తీక్ దగ్గర బాధపడుతుంది. కాంచనకి కావేరి ఫోన్ చేసి శ్రీధర్ అరెస్ట్ అయిన విషయం గురించి మాట్లాడుతుంది. పోలీస్ స్టేషన్‌లో ఉన్నా ఆయన నీ గురించే ఆలోచిస్తూ ఉంటారని చెబుతుంది కావేరి. స్టేషన్‌కి వెళ్లి ఒక్కసారైనా ఆయనని పలకరించి రమ్మని అంటుంది.
ఇంతలో శౌర్య వచ్చి నానమ్మని పోలీస్ స్టేషన్‌లో ఉన్న తాతయ్య దగ్గరికి తీసుకెళ్లమని కార్తీక్‌తో అంటుంది. తన కోసం ఎవ్వరూ రారని ఒంటరిగా శ్రీధర్ బాధపడుతుండగా.. కార్తీక్, కాంచనలు రావడంతో ఎంతో సంతోషిస్తాడు. నువ్వు నన్ను క్షమించేసినట్లేనని శ్రీధర్ చెప్పగా.. నేను కార్తీక్ తల్లిగానే ఇక్కడికి వచ్చానని కాంచన చెప్పడంతో శ్రీధర్ కంటతడి పెడతాడు. అది చూసిన కార్తీక్ తన తండ్రికి భోజనం తినిపిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 26వ తేదీ 551వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నేను కార్తీక్ తల్లిగా మాత్రమే వచ్చానని కాంచన చెప్పడంతో శ్రీధర్ కంటతడి పెడతాడు. అసలే బాధలో ఉన్నాడు.. చేయని తప్పుకి నింద మోస్తున్నాడు, ఇంతకుమించిన భారం నాన్న కూడా మోయలేడు. నీ భార్యగానే ఇక్కడికి వచ్చానని చెప్పొచ్చుగా అని తల్లితో అంటాడు కార్తీక్. నేను మీతోనే ఉన్నాను కానీ.. నా ఆలోచన అంతా ఇంటి దగ్గర ఉన్న నా భార్య మీద, కూతురి మీదే ఉంది.. నాన్న కూడా నాలాంటి ఒక తండ్రే కద అని చెబుతాడు కార్తీక్. పిల్లలు తప్పు చేస్తే తల్లే క్షమిస్తుంది.. ఆడది కడుపున మోయని తొలి బిడ్డ తన భర్తే, అలా అనుకుని నాన్నని క్షమించొచ్చు కదా అని అంటాడు కార్తీక్. నా భార్యగా వచ్చానని ఒక్కమాట చెప్పమని శ్రీధర్ బతిమలాడతాడు.
నేను మీ భార్య కావేరి తరపున వచ్చానని కాంచన చెప్పడంతో కార్తీక్, శ్రీధర్‌లు షాక్ అవుతారు. తను ఫోన్ చేసి బాధపడితే ధైర్యం చెప్పాను, అదే ధైర్యం మీకు చెప్పడానికి వచ్చానని అంటుంది కాంచన. నువ్వేం చేస్తావో తెలియదు.. రేపు ఈపాటికి మీ నాన్న వాళ్లింట్లో ఉండాలని కార్తీక్‌తో అంటుంది కాంచన. మీ నాన్నని ఈ పరిస్థితిలో ఉంచిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టొద్దని చెబుతుంది. ఇంతలో టైం అయిపోవడంతో శ్రీధర్ తిరిగి లాకప్‌లోకి వెళ్లిపోతాడు. తండ్రిని క్షమించకపోవడంతో కాంచనపై కార్తీక్ సీరియస్ అవుతాడు.
కాశీ ఏదో ఆలోచిస్తుండగా స్వప్న వచ్చి డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి వెళ్లిపోతుంది. భర్తతో భార్య ఎలా ఉండాలో దీపక్కని చూసి నేర్చుకోమని చెబుతాడు కాశీ. కృతజ్ఞత ఎలా చూపించాలో నువ్వు మా అన్నయ్యని చూసి నేర్చుకోమని కౌంటర్ వేస్తుంది స్వప్న. నీకు ఎంత కోపం లేకపోతే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మా నాన్న తప్పుచేశాడని సాక్ష్యం చెబుతావు, మా అమ్మ, పెద్దమ్మలు ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఫ్యామిలీ ఉన్నవాళ్లకే కుటుంబం విలువ తెలుస్తుంది, నీకో తండ్రి తప్పించి ఎవరూ లేరు. ఆ తండ్రి కూడా నీతో ఉండడు.. ఒంటరిగా పెరిగావు, అలాగే బతుకుతున్నావని నానామాటలు అంటుంది స్వప్న.
నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని చంపుకుని నేను బతకలేనని అంటాడు కాశీ. జ్యోత్స్న దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు, జాబ్ వచ్చిందని రోడ్ల మీద తిరిగినప్పుడు ఏమైంది నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అని మండిపడుతుంది స్వప్న. మా నాన్న కనుక పట్టించుకోకపోతే.. నువ్వు మనింటి రెంట్ కూడా కట్టలేవని అంటుంది స్వప్న. ఆ మాటలతో రగిలిపోయని కాశీ నేనెంటో చూపిస్తానని అనుకుని వెంటనే వైరాకు ఫోన్ చేస్తాడు. నాకు జీఎం పోస్ట్ ఎప్పుడు ఇస్తారని అడుగుతాడు. ఇంట్లో వాళ్లే నన్ను నమ్మడం లేదు.. కానీ మీరు నాకు సాయం చేశారని వైరాకి థ్యాంక్స్ చెబుతాడు కాశీ.
సుమిత్ర ఆరోగ్యం గురించి దీప బాధపడుతుంది. ఇంతలో తాతని ఎప్పుడు ఇంటికొస్తాడు అని శౌర్య అడుగుతుంది. నిన్ను కూడా ఒకసారి ఇలాగే పోలీసులు తీసుకెళ్లారు కదా అని ప్రశ్నిస్తుంది శౌర్య. కొన్నిసార్లు ఎవరో చేసిన తప్పులకి మంచివాళ్లు బాధ్యత తీసుకుంటారని అంటుంది దీప. ఇంతలో కార్తీక్, కాంచన రావడంతో తాతయ్యని తీసుకొచ్చారా అని శౌర్య అడుగుతుంది. తాత వాళ్లింటికి వెళ్లిపోయాడని కార్తీక్ చెప్పడంతో శౌర్య ఎగిరిగంతెస్తుంది. దీప కూడా సంతోషిస్తుంది. బావ వల్ల కానిది మీ వల్ల అయ్యిందని అంటుంది. అయితే నాన్నకి ఇంకా బెయిల్ రాలేదని కార్తీక్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. మీ మావయ్యగారు స్టేషన్‌లో ఉండటానికి కారణం నువ్వే అయినప్పుడు నువ్వెందుకు బాధపడాలని కాంచన ప్రశ్నించడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు.
ఫుడ్ ట్రక్స్ సలహా మీ ఆవిడ ఇవ్వకపోయుంటే మీ నాన్న, మా నాన్నలు బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్లే కాదు.. అసలు ఈ ఫుడ్ కల్తీ అయ్యేదే కాదని అంటుంది కాంచన. ఇవి నా మాటలు కాదు.. పారిజాతం పిన్ని చెప్పిందని అంటుంది. ఎవరెన్ని చెప్పినా నేను నిన్ను తప్పుగా అనుకోనని చెబుతుంది కాంచన. నా వల్ల ఏ తప్పు జరగలేదని నమ్మారు... మావయ్యగారు కూడా ఏ తప్పు చేయలేదని ఒక భార్యగా నమ్ముతున్నారా? అని దీప అడుగుతుంది. కార్తీక్ తల్లిగా నమ్ముతున్నానని అంటుంది కాంచన.
మరోవైపు.. వైరా కంపెనీలో తాను జీఎం పోస్టులో జాయిన్ అవ్వబోతున్నానని, 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని కాశీ చెప్పడంతో స్వప్న షాక్ అవుతుంది. మీ నాన్న నా అవసరం చూసి జాబ్ ఇచ్చాడు.. అవతలివాళ్లు నా అర్హతను చూసి జాబ్ ఇచ్చారని అంటాడు కార్తీక్. మీ నాన్న నన్ను కాలికింద చెప్పులా వాడుకున్నాడు.. పీఏని చేశారు, డ్రైవర్‌ని చేశారు, ఫుడ్ ట్రక్స్ దగ్గర కాపలా పెట్టారు, అవమానించారని బాధపడతాడు కాశీ. జాబ్‌లో జాయిన అయిన వన్ వీక్‌లో ఇల్లు ఖాళీ చేసి కొత్తింటికి వెళ్లబోతున్నానని చెబుతాడు. ఆ మాటలతో స్వప్న షాక్ అవుతుంది. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేటి వరకు నా కోసం ఖర్చు పెట్టిన ప్రతిరూపాయికి లెక్కచెబితే సింగిల్ పేమెంట్‌తో కొడతానని అంటాడు కాశీ.
మా నాన్న పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.. నువ్వు పగ తీర్చుకున్నవాడిలా మాట్లాడుతున్నావని స్వప్న మండిపడుతుంది. మీ నాన్న నా వల్ల జైలులో లేడు.. తప్పు చేశాడు కాబట్టే పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని అంటాడు కాశీ. మీ నాన్న వల్ల నాకు నష్టమే కానీ మంచి ఎప్పుడు జరగలేదు, ఆయన వల్ల నాకు కూడా చెడ్డ పేరొచ్చిందని చెబుతాడు కాశీ. భర్త మాటలతో స్వప్న బాధపడుతుంది. ఈ విషయం ఎవరితో చెప్పాలని అనుకుంటుంది. తండ్రిని ఎలా పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావాలా? అని కార్తీక్ ఆలోచిస్తుండగా దీప వచ్చి ఓదారుస్తుంది. ఇంతలో ఎవరో తలుపుకొట్టిన శబ్ధం వస్తుంది. ఇంతలో స్వప్న ఏడుస్తూ కార్తీక్‌ని హత్తుకుంటుంది. అర్ధరాత్రి ఆడదే కాదు.. మగాడు కూడా తిరగలేని పరిస్ధితుల్లో ఉన్నాం, ఒక్కదానివే ఎలా వచ్చావని మండిపడతాడు కార్తీక్. ఇప్పుడున్న సమస్యలు చాలు.. కొత్త సమస్యలు వద్దని అంటాడు.
కొత్త సమస్య కాశీ రూపంలో వచ్చిందని అంటుంది స్వప్న. మళ్లీ మీరిద్దరూ గొడవ పడ్డారా? అని దీప ప్రశ్నిస్తుంది. ఈసారి మేం గొడవపడింది మొగుడు, పెళ్లాలా మాదిరిగా కాదు. ఒకసారి ఇది చూడమని కాశీ పంపిన స్క్రీన్ షాట్‌ని చూపిస్తుంది స్వప్న. అది చూసి కార్తీక్ షాక్ అవుతాడు. కాశీ జాబ్‌కి రిజైన్ చేసి ఇంకొక కంపెనీలో జీఎం పోస్ట్ వచ్చిందని చెబుతుంది స్వప్న. జాయినింగ్ బోనస్ కింద 10 లక్షలు ఇస్తారట అని చెబుతుంది. ఆ మాటలతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది. జీఎం పోస్ట్‌కి చాలా ఎక్స్‌పీరియన్స్ అవసరమని, కాశీ ఫుడ్ ట్రక్స్ దగ్గర మేనేజ్ చేయడానికే చాలా ఇబ్బంది పడతాడు. అలాంటిది జనరల్ మేనేజర్ అంటే చాలా కష్టమని చెబుతాడు కార్తీక్. నాన్న గురించి నీచంగా మాట్లాడుతున్నాడు.. అతని ప్రవర్తన చూసి భయం వేసి ఇక్కడికి వచ్చానని అంటుంది స్వప్న. నాన్న అరెస్ట్ కావడానికి, కాశీకి ఏదో సంబంధం ఉందని ఆమె చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











