Karthika Deepam 2 December 27th: యాక్షన్‌లోకి దిగిన కార్తీక్, దీప... జ్యోత్స్న రూమ్‌లో సీక్రెట్ కెమెరా

Photo Courtesy: JioHotstar

నేను నీ భార్యగా కాకుండా కార్తీక్ భార్యగా వచ్చానని కాంచన చెప్పడంతో శ్రీధర్ కంటతడి పెడతాడు. చేయని తప్పుకి కుంగిపోతున్న నా తండ్రికి ఓదార్పుగానైనా నీకోసమే వచ్చానని చెప్పొచ్చుగా అని బాధపడతాడు కార్తీక్. ఇంటికొచ్చిన కార్తీక్, కాంచనలను మావయ్య గారు ఎక్కడ అని దీప ప్రశ్నిస్తుంది. నాన్నకి బెయిల్ రాకపోవడంతో ఇంకా స్టేషన్‌లోనే ఉంచారని చెబుతాడు కార్తీక్. భోజనం దగ్గర కాశీ- స్వప్నలకు షాక్ గొడవ జరుగుతుంది. మా నాన్న మీద నీకు ఎంత కోపం లేకపోతే ఆయన మీద సాక్ష్యం చెబుతావని మండిపడుతుంది. కుటుంబం గురించి, బంధాల గురించి నీకు తెలియదని కాశీపై ఫైర్ అవుతుంది.

ఆ వెంటనే వైరాకి కాశీ ఫోన్ చేసి నాకు జీఎం పోస్ట్ కావాలని అడుగుతాడు. రేపే వచ్చి జాయిన్ అయిపో.. జాయినింగ్ బోనస్ కింద ఇస్తానన్న 10 లక్షల రూపాయల్లో 5 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫన్ చేస్తున్నట్లు చెబుతాడు వైరా. ఆ మెసేజ్‌ని స్వప్నకి చూపించి ఇది నా రేంజ్.. పెద్ద కంపెనీలో జీఎంగా జాయిన్ అవుతున్నా, త్వరలోనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోదామని చెబుతాడు. ఆ మాటలతో కంగారుపడిన స్వప్న వెంటనే పరిగెత్తుకుంటూ కార్తీక్ దగ్గరకి వెళ్తుంది. నాన్న అరెస్ట్‌కు, కాశీ ఉద్యోగానికి ఏదో సంబంధం ఉందని డౌట్ పడుతుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 27వ తేదీ 552వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 552 December 27th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

కాశీ ప్రవర్తన చూసి భయం వేసి ఇక్కడికి వచ్చాను, నాన్న అరెస్ట్ కావడానికి కాశీకి ఏదో సంబంధం ఉందని స్వప్న చెప్పడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఇదంతా జరగానికి ఎవరో ఒకరు కారణమై ఉంటారు.. ఆ ఒక్కరు ఎవరో కాశీకి తెలుసని నా నమ్మకం అని అంటుంది. కాశీ తిక్క తిక్కగా లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు. అతనిలోని మార్పుకు, ఈ కేసుకు సంబంధం ఉంది అంటుంది. స్వప్న ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ఇంటి దగ్గర దించడానికి వెళ్తాడు కార్తీక్. స్వప్న మాటలతో కాశీ ఆరోజు జ్యోత్స్న గదిలో నుంచి బయకు వచ్చిన సంఘటనను గుర్తుచేసుకుంటుంది దీప. ఆరోజు జ్యోత్స్నని కాశీ కలవడానికి, ఈ డబ్బులకి, మావయ్యగారికి, ఆ ఉద్యోగానికి ఏదో సంబంధం ఉన్నట్లే ఉందని దీపకి అనుమానం వస్తుంది. మావయ్య గారిని ఇరికించింది జ్యోత్స్న కాదు కదా అని అనుకుంటుంది.

స్వప్న కనిపించకపోవడంతో కాశీ కంగారుపడతాడు. స్వప్నని తీసుకుని కార్తీక్ రాగానే.. నీకు ఏ నిజాలు కావాలని అడుగుతాడు కాశీ. నీ గురించి చెప్పడానికే నా దగ్గరకి వచ్చింది? నీకు జాబ్ వచ్చిందట కదా అని అంటాడు కార్తీక్. జాయిన్ అయ్యాక నేనే చెబుదామని అనుకున్నానని అంటాడు కాశీ. నేను జాబ్‌కి రిజైన్ చేసిన విషయమే మావయ్య గారికి తెలియదు, తెలియకుండా చాలా చేస్తున్నావని కార్తీక్ పంచ్ డైలాగులు విసురుతాడు. నువ్వు జాబ్‌కి వెళ్లే టైంకి మీ మావయ్య లేకపోతే ఎలా? అల్లుడికి జాబ్ వచ్చిందంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని అంటాడు కార్తీక్. నువ్వు జాబ్‌కి వెళ్లేసరికి ఆయన ఖచ్చితంగా బయటకొస్తాడు. ఈ ఫుడ్ కల్తీ కేసులో మా నాన్నని ఎవరు ఇరికించారో నాకు తెలిసిపోయిందని అంటాడు కార్తీక్. ఆ మాటలతో కాశీ ఉలిక్కిపడతాడు. మీ నాన్న ఈ కేసులో ఇరుక్కోవడానికి కారణం ఎవరని కావేరి వచ్చి అడుగుతుంది.

ఎవరైనా తప్పించుకోలేరని అంటాడు కార్తీక్. మీ నాన్నకి శిక్ష పడుతుందని అంటున్నారని కావేరి భయపడుతుంది. వీలైనంత త్వరలో మా నాన్న బయటికి వస్తాడని చెబుతాడు కార్తీక్. తప్పు చేసింది ఎవరైనా సరే నువ్వు వదిలిపెట్టొద్దని స్వప్న చెబుతుంది. అరెస్ట్ అయ్యింది, అందరిలో పరువు పొగొట్టుకుంది మన తండ్రి కదా.. ఎవ్వరినీ వదిలిపెట్టనని అంటాడు కార్తీక్. కార్తీక్ మాటలతో కాశీకి ముచ్చెమటలు పడతాయి. అక్కడ ఏం జరిగింది? కాశీతో మాట్లాడావా? అని కార్తీక్‌ని ప్రశ్నిస్తుంది దీప. స్వప్న చెప్పినట్లుగానే కాశీలో ఏదో తేడాగా ఉందని చెబుతాడు. మా నాన్న మాటలకు కాశీ ఎక్కడో హర్ట్ అయ్యాడు.. అందుకే మా నాన్న మాటల్ని రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్‌లో సాక్ష్యంగా ఇచ్చాడని చెబుతాడు కార్తీక్. కానీ మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేసింది.. కల్తీ అయిన ఫుడ్‌ని సప్లయ్ చేసినందుకు? మా నాన్న మీద కోపం ఎవరికుంది? మా నాన్నని సీఈవో పోస్ట్ నుంచి తప్పిస్తే ఉపయోగం ఉంది? అని కార్తీక్ అడగ్గా.. జ్యోత్స్నకి అని అంటుంది దీప.

జ్యోత్స్నకి, కాశీకి మధ్యలో ఒకరున్నారు... అది ఎవరో కనుక్కోవాలి? మన అనుమానమే మనకి దారి చూపెడుతుంది. మా అమ్మకి మాటిచ్చాను.. మాట నిలబెట్టుకోవాలని అంటాడు కార్తీక్. పోలీస్ స్టేషన్‌లో ఏడుస్తున్న మా నాన్న ముఖం చూసినప్పుడు పదేళ్ల వయసులో భయంతో నేను మా నాన్నని పట్టుకుని ఏడుస్తున్న నేను గుర్తొచ్చాను. మా నాన్న ఏడుస్తుంటే నాకు చాలా కోపం వచ్చింది. మా నాన్నని ఈ పరిస్థితిలో ఉంచినవాడిని ఆయన కాళ్ల మీద పడేయాలని అనిపించింది. మనకి దొరికిన చిన్న క్లూతో అసలైన వాడిని ఎలా పట్టుకోవాలో ఆలోచించాలి. మరి జ్యోత్స్నని ఏం చేయాలి? ఆమె మీద మనకి అనుమానం ఉంది కదా అని అంటుంది దీప. సినిమా రేపు చూపిస్తానని అంటాడు కార్తీక్.

శ్రీధర్ అరెస్ట్ కావడానికి, నీకు సంబంధం ఉందా అని పారిజాతం అడగ్గా.. ఉందనుకో అని అంటుంది జ్యోత్స్న. కంపెనీలో నేను చేసిన తప్పులన్నీ బయటపెట్టి.. నా ఇంట్లో వాళ్ల ముందే నన్ను దోషిలా నిలబెట్టాలనుకున్న మావయ్యని ఎలా వదిలిపెడతాను అని జ్యోత్స్న చెప్పగా పారిజాతం వణికిపోతుంది. ఫుడ్ కల్తీ నేనే చేయించాను, కాశీతో సాక్ష్యం నేనే చెప్పాను, బెయిల్ రాకుండా నేనే చేశానని జ్యోత్స్న చెప్పడంతో పారిజాతం మండిపడుతుంది. నువ్వు మరీ ఇంత కిరాతకంగా ఉన్నావేంటీ? ఆసుపత్రిలో ఉన్నవాళ్లలో ఎవరైనా చస్తే మావయ్య జైలుకి వెళ్తాడని అంటుంది జ్యోత్స్న. ఈ లోపు కార్తీక్ గాడు నిజాలన్నీ బయటకు లాగి నిన్ను జైలుకు పంపుతాడని చెబుతుంది పారిజాతం.

ఇవన్నీ నేను చేయించాను అని చెప్పాను కానీ, చేశాను అని చెప్పలేదు కదా అని అంటుంది జ్యోత్స్న .. ఈ పాపాలన్నీ కాశీ గాడితో చేయించావా? నిజాలన్నీ బయటపడితే జైలుకు వెళ్లేది కాశీగాడా? అని తెలుసుకుని పారిజాతం బాధపడుతుంది. తమ్ముడికి సాయం చేస్తానని చెప్పి వాడి మెడకి ఊరేస్తావా అని మండిపడుతుంది. నేను కాశీతో ఏం చేయించలేదు, అది చేయించింది మరొకరు అని అంటుంది జ్యోత్స్న. నిజాలు బయటపడినా కేసులు మన మీదకి రాకుండా జాగ్రత్త పడ్డాను అని చెబుతుంది. కాశీకి ఎంత మంచి జీవితం ఇచ్చానో వాడి మాటల్లోనే వినమని కాల్ చేస్తుంది జ్యోత్స్న. మన లెక్కలు కంపెనీలోనే లేకుండా చేశానని చెప్పడంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది.

స్టేషన్ దగ్గర నీ అల్లుడు ఎలా ఉన్నాడో చూసి రాకపోయావా అంటూ పారిజాతంపై సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. మనకి ఏం పని కొడుకు ఉన్నాడు కదా? స్టేషన్ దగ్గర పడిగాపులు కాస్తూ ఉంటాడని అంటుంది పారిజాతం. మా నాన్న మర్డర్లు, దొంగతనం చేయలేదు అంటాడు కార్తీక్. నువ్వెప్పుడు పనిలోకి వచ్చావని ప్రశ్నిస్తుంది పారు. తప్పు చేసిన వాళ్లు బయట తిరుగుతున్నారని కార్తీక్ అనడంతో జ్యోత్స్న, పారులు వణికిపోతారు. పెద్ద మేడం గారు తప్పు చేశారని నీకు అనుమానంగా ఉందా అని అడుగుతాడు కార్తీక్. మనుషుల్ని నమ్మించి మోసం చేయడం నీ రక్తంలోనే ఉంది. అత్తయ్యని మావయ్య.. నన్ను నువ్వు, మా తాతని మీ నాన్న మోసం చేశాడని నానామాటలు అంటుంది.

మోసం ఎవరు చేశారో త్వరలోనే బయటపెడతా.. మా నాన్నని కోర్టుకు కూడా వెళ్లనివ్వనని సవాల్ విసురుతాడు కార్తీక్. ఫుడ్ కల్తీ ఎవరు చేశారో తెలిసిందని.. ఆల్రెడీ పోలీసులకు చెప్పానని అంటాడు. ఆ మాటలతో పారు, జ్యోత్స్నలు వణికిపోతారు. ఆధారాలు దొరికిన వెంటనే మా నాన్నని అందరి ముందు ఎలా అయితే అరెస్ట్ చేయించారో అదే స్టైల్‌లో మర్యాదలు చేస్తూ పంపిస్తానని వార్నింగ్ ఇస్తాడు. మళ్లీ జీవితంలో తప్పు చేయడానికి బయపడేలా చేస్తానని అంటాడు. జ్యోత్స్న రూమ్‌లో సీక్రెట్ కెమెరా ఫిక్స్ చేస్తుంది దీప. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X