Karthika Deepam 2 December 29th: కాశీ చెంప పగలగొట్టిన కార్తీక్... జ్యోత్స్న- వైరా కుట్ర బట్టబయలు
Photo Courtesy: JioHotstar
అర్దరాత్రి స్వప్న తన ఇంటికి రావడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. నాకు ఇప్పుడున్న సమస్యలు చాలని, కొత్తగా భరించలేనని.. ఈ టైంలో ఎందుకొచ్చావని చెల్లెలిపై కోప్పడతాడు కార్తీక్. కాశీ ప్రవర్తన వింతగా ఉందని.. నాన్నపై పగ తీర్చుకున్నవాడిలా మాట్లాడుతున్నాడని స్వప్న చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. అర్ధరాత్రి పూట నువ్వు వచ్చేశావని స్వప్నని ఇంటి దగ్గర దించుతాడు కార్తీక్. ఉద్యోగంలో చేరాక నీతో చెబుదామని అనుకున్నానని కార్తీక్‌తో అంటాడు కాశీ. బావమరిది మాటలుతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది. ఇంటికొచ్చాక కాశీ- జ్యోత్స్నల వెనుక ఎవరో ఉన్నారని దీపతో అంటాడు కార్తీక్. వాళ్లెవరో కనిపెట్టి నాన్నని బయటకు తీసుకురావాలని చెబుతాడు.
శ్రీధర్‌ని అరెస్ట్ చేయించింది, కంపెనీలో ఫుడ్ పాయిజిన్ చేయించింది జ్యోత్స్నే అని తెలియడంతో పారిజాతంకు చెమటలు పడతాయి. నీ అల్లుడు నన్ను ఇరికించాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అని ప్రశ్నిస్తుంది. నువ్వు చేసిన పని వల్ల నా మనవడి జీవితం నాశనమైందని అంటుంది పారిజాతం. దాంతో కాశీకి ఫోన్ చేసి మాట్లాడిస్తుంది జ్యోత్స్న. నీ వల్లే నాకు మంచి జాబ్, శాలరీ వస్తున్నాయని కాశీ అనడంతో పారిజాతం పొంగిపోతుంది. ఉదయాన్నే జ్యోత్స్న, పారిజాతంలు మాట్లాడుకుంటూ ఉండగా కార్తీక్ వచ్చి మా నాన్న అరెస్ట్, ఫుడ్ కల్తీ వెనుక ఎవరున్నారో తెలిసిపోయిందని చెబుతాడు. ఆ మాటలతో ఇద్దరూ వణికిపోతాడు. జ్యోత్స్న గదిలో సీక్రెట్ కెమెరా ఫిక్స్ చేస్తుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 29వ తేదీ 553వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మొబైల్‌లో రికార్డింగ్ ఆన్ చేసి జ్యోత్స్న గదిలో పెడుతుంది దీప. తన గదిలో దీప ఉన్నట్లు తెలుసుకున్న జ్యోత్స్న పరుగు పరుగున వస్తుంది. ఆమె వచ్చేలోగా దీప వెళ్లిపోతుంది. కార్తీక్ అన్న మాటలతో బావకి నిజం తెలిసిపోయిందా? అసలు బావ ప్లాన్ ఏంటీ అని ఆలోచిస్తుంది. వైరాని నేను మోసం చేస్తున్నట్లే, నన్నూ వైరా మోసం చేస్తున్నాడని అనుకుని వైరాకి కాల్ చేస్తుంది జ్యోత్స్న. ఇంతలో దీప పెట్టిన మొబైల్‌ని గమనించి వెంటనే కాల్ కట్ చేస్తుంది. ఇది దీప మొబైల్.. అందుకే దీపతో మొబైల్ నా గదిలో పెట్టించాడని అనుకుంటుంది. అయినప్పటికీ కాల్ అలాగే మాట్లాడుతుంది జ్యోత్స్న. కాల్ చేసి ఎందుకు కట్ చేశారని వైరా అడగ్గా.. వైరానా? మీరు నాకెందుకు కాల్ చేశారని అడుగుతుంది. ఆ మాటలతో వైరా షాక్ అవుతాడు.
మీరే నాకు ఫోన్ చేశారు.. ఏమైంది మీకు అని అడుగుతాడు. నువ్వు ఎంత ట్రై చేసినా, మా కంపెనీలో అడుగుపెట్టలేవు అని అంటుంది ఆ మాటలతో వైరా షాక్ అవుతాడు. మా మావయ్య తప్పు చేసినంత మాత్రాన, రెస్టారెంట్ మూసేస్తామని అనుకుంటున్నావా? నేను జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవోగా లేకపోవచ్చు, దాని బాధ్యతలు తీసుకోకపోవచ్చు. కానీ అది మాత్రం నాదే, డబ్బుతో కొనాలని చూస్తే ఇక్కడ కంపెనీని అమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అలాగే నీలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా? ఏం చేయాలని ట్రై చేసినా జ్యోత్స్న రెస్టారెంట్ పరువు ఎవరెస్ట్ శిఖరంలా నిలబడే ఉంటుందని అంటుంది జ్యోత్స్న. నువ్వు మమ్మల్ని అడ్డుకోలేవు.. మరోసారి ఇంకెప్పుడూ నా కంపెనీ జోలికి రావడానికి ట్రై చేయొద్దని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది. వచ్చిన సమస్య నుంచి ఎలా బయటపడాలో? మళ్లీ తిరిగి నెంబర్ వన్ పొజిషన్‌కు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు... మరోసారి ఇలాంటి కాల్ చేశావంటే పోలీస్ కంప్లయంట్ ఇస్తానని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలతో వైరా షాక్ అవుతాడు.
ఇంతకుముందు మనిద్దరం పార్ట్‌నర్స్ అని చేతులు కలిపింది.. నేనేమో సీఈవోని అరెస్ట్ చేయించి జైళ్లో కూర్చోబెట్టాను. ఇప్పుడు సంబంధం లేనట్లుగా మాట్లాడుతోందని అంటాడు వైరా. ఆ జ్యోత్స్న ప్లేట్ ఫిరాయించిందని అంటాడు అసిస్టెంట్. వాళ్లని నమ్మొద్దని ముందే చెప్పాను.. మీరే నా మాట వినలేదని చెబుతాడు. వైరా ఎప్పుడూ ఎవరినీ గుడ్డిగా నమ్మడు, నా జాగ్రత్తలో నేనుంటానని అంటాడు. జ్యోత్స్న చెబితేనే ఫుడ్ కల్తీ చేయించాను, ఆ నిజం బయటపడుతుందనే భయపడి ఇలా మాట్లాడి ఉంటుంది. వైరాకి ఏం చేయాలో ఒక క్లారిటీ ఉంది. జ్యోత్స్న ఏంటో మనకి అర్ధమైంది కదా? మనమెంటో జ్యోత్స్నకి చూపిద్దామని అంటాడు. నేను తప్పించుకోవడానికి నేను ఆడుతున్న నాటకం.. ఇప్పుడు బావ ఫోన్‌లో రికార్డ్ అవుతుంది, కల్తీ ఫుడ్ కేసులో నా హస్తం లేదని నమ్మడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలని అనుకుంటుంది. జ్యోత్స్న అలా వెళ్లగానే దీప ఆ ఫోన్ తెచ్చేస్తుంది. ఇంతలో ఆమెకు జ్యోత్స్న ఎదురవ్వడంతో దీప షాక్ అవుతుంది.
ఏంటి వంటలక్క గారు ఏదో వెతుకుతున్నట్లుగా ఉన్నారు.. నా రూమ్‌లో నీకేం పని అని ప్రశ్నించడంతో దీపకు చెమటలు పడతాయి. నిజాన్ని అన్ని దీప ఆన్సర్ ఇవ్వగా.. మరి దొరికిందా? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. దొరికిందనే అనుకుంటున్నానని చెబుతుంది దీప. చేప కూడా వలలో పడి తప్పించుకోలేదని దీప చెప్పగా.. మీ వలలో చేప పడుతుందని అనుకుంటున్నావా? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు వల వేయడాలు, నిజాలు వెతకడాలు మానేసి వంట గదిలో వంటలు చేసుకుంటే నీకే మంచిదని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నీ వల్ల ఎవరికైనా నష్టం జరగొచ్చు.. పాపం శ్రీధర్ మావయ్య, నువ్విచ్చిన ఐడియాతో అన్ని పొగొట్టుకుని స్టేషన్‌లో కూర్చున్నాడు. ఈసారి పొగొట్టుకోవడం బావ వంతు కావొచ్చు, లేదా నీ వంతే కావొచ్చు అని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది. ఎవరో ఒకరు ఏదో ఒకటి పోగొట్టుకోవాలని అనుకుంటున్నారు కదా మీ కోరిక నెరవేరుతుందని అంటుంది దీప. మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేయండి, సాక్ష్యాలు, ఆధారాలు దొరకవు.. శ్రీధర్ మావయ్య జైలుకి వెళ్లకుండా బావ ఆపలేడని అనుకుంటుంది జ్యోత్స్న.
ఫోన్ ఆన్ చేసి జ్యోత్స్న మాట్లాడిన మాటలు విని కార్తీక్, దీపలు షాక్ అవుతారు. మనం అనుమానించిన దానికి, మావయ్యగారు అరెస్ట్ అవ్వడానికి, జ్యోత్స్నకి సంబంధం లేదా? అని కార్తీక్‌ని అడుగుతుంది దీప. ఫుడ్ కల్తీ కావడం, మా నాన్న అరెస్ట్ అవ్వడం, అదే రోజు కాశీకి వేరే కంపెనీలో జాబ్ రావడం ఇది జరగడానికి అన్నింటి కంటే ముందు.. జ్యోత్స్న గదిలో నుంచి కాశీ రావడం చూశానని చెప్పావు కదా అని అడుగుతాడు కార్తీక్. వైరా ఫుడ్ కల్తీ చేశాడు కాబట్టి.. సీఈవోగా ఉన్న మా నాన్న పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు కాబట్టి ఫోన్ ఎవరికి చేయాలి అని అడుగుతాడు కార్తీక్. అంటే కాల్ దశరథ మావయ్యకి చేయాలి, లేదా తాతకి చేయాలి.. వీరిద్దరికీ కాకుండా ఏ పోస్ట్ లేని జ్యోత్స్నకి కాల్ వచ్చిందంటే ఏంటీ అర్ధం అని ప్రశ్నిస్తాడు కార్తీక్. పైగా జ్యోత్స్న మాట్లాడిన మాటలన్నీ మనకోసం మాట్లాడినట్లే ఉన్నాయి.. అంటే మొబైల్ గదిలో ఉందని చూసి తనకి ఈ కేసుకి ఏ సంబంధం లేదని చాలా తెలివిగా మాట్లాడిందని చెబుతాడు కార్తీక్.
జ్యోత్స్నకి, ఫుడ్ కల్తీకి, వైరాకి, జాబ్‌కి, కాశీకి, అడ్వాన్స్ డబ్బులకి ఏదో కనెక్షన్ ఉంది.. మనం అనుమానిస్తున్నామని జ్యోత్స్నకి అర్ధమై జాగ్రత్త పడుతుంది. నేను ఓ పెద్ద మనిషిని కలవడానికి వెళ్తున్నాను, అతనితో మాట్లాడితే ఏం చేయాలో తెలుస్తుందని అంటాడు కార్తీక్. వెంటనే కాశీ దగ్గరికి వెళ్తాడు. నా లాంటి డ్రైవర్ 5 లక్షలు సంపాదించాలంటే ఏడాది పడుతుంది, నీకు రోజు కూడా పట్టలేదుగా అని కార్తీక్ అనడంతో కాశీ షాక్ అవుతాడు. నీ వెనుక ఎవరున్నారని కార్తీక్ అడగ్గా.. ఎవరూ లేరని కాశీ చెబుతాడు. అయితే వైరాని కలవడానికి వెళ్దామని కార్తీక్ చెప్పగా.. కాశీ షాక్ అవుతాడు. వైరా ఎవరు అని కాశీ ప్రశ్నించగా.. లాగిపెట్టి కొడతాడు కార్తీక్. నీ మీద నాకు ఎప్పుడో అనుమానం వచ్చింది.. కానీ నా చెల్లెలి ముఖం చూసి వదిలేశాను. వైరాకి మా తాతకి శతృత్వం ఉంది.. ఇవేవి తెలియకుండా వాడి బిస్కెట్స్‌కి ఎందుకు ఆశపడ్డావని ప్రశ్నిస్తాడు కార్తీక్.
జాబ్ పోయి ఇంట్లో కూర్చొంటే నన్ను మీరు మనిషిలాగే చూడలేదు.. అదే టైంలో జ్యోత్స్న అక్క హెల్ప్ చేసిందని చెబుతాడు కాశీ. ఇద్దరూ కలిసి మా నాన్నని ముంచేశారని మండిపడతాడు కార్తీక్. ఇద్దరం కలిసి వైరాని కలుద్దామని కాశీని లాక్కెళ్తాడు కార్తీక్. సుమిత్ర ఆరోగ్యం గురించి దశరథ బాధపడుతుండటంతో అమ్మగారికి ఏం కాదని ధైర్యం చెబుతుంది దీప. కానీ దీప మాటలు వినగా.. జ్యోత్స్న పిలిచినట్లుగా ఉందని చెబుతాడు దశరథ. తల్లిదండ్రులకు వయసు అయిపోయాక బిడ్డలు ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడాలని చెబితే బాగుంటుందని అనుకుంటామని దశరథ బాధపడతాడు. నువ్వే నా కూతురివి అయ్యుంటే బాగుంటుందని అనిపించిందని చెప్పడంతో దీప కంటతడి పెడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











