Karthika Deepam 2 December 30th: తెలివిగా తప్పించుకున్న జ్యోత్స్న... అక్క కుట్రకి బలైన కాశీ

Photo Courtesy: JioHotstar

కార్తీక్ చెప్పినట్లుగానే జ్యోత్స్న గదిలో సీక్రెట్‌గా మొబైల్ పెడుతుంది. పరుగు పరుగున తన రూమ్‌లోకి వచ్చిన జ్యోత్స్న.. ఆ మొబైల్‌ పెట్టిన విషయాన్ని పసిగడుతుంది. వైరాకి మిస్డ్ కాల్ ఇచ్చి.. కట్ చేస్తుంది. దాంతో వైరా తిరిగి ఆమెకు ఫోన్ చేయగా.. కంపెనీ జోలికి రావొద్దని, జ్యోత్స్న కంపెనీ నాది అన్నట్లుగా అస్సలు సంబంధం లేనట్లుగా మాట్లాడుతుంది. దాంతో షాకైన వైరా.. జ్యోత్స్న ప్లేట్ ఫిరాయించిందని, మనమెంటో మనం కూడా చూపిద్దామని అసిస్టెంట్‌తో అంటాడు. తన మొబైల్‌లో జ్యోత్స్న మరోలా మాట్లాడటంతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది.. మనం ఫోన్ పెట్టినట్లు జ్యోత్స్నకి తెలిసిపోయిందని అందుకే మనల్ని డైవర్ట్ చేసేలా మాట్లాడిందని దీపతో చెబుతాడు. కాశీ జాబ్‌కి, మా నాన్న అరెస్ట్‌కి, వైరాకి, జ్యోత్స్నకి ఖచ్చితంగా లింక్ ఉందని అంటాడు కార్తీక్.

కాశీ దగ్గరికి వెళ్లి.. నీకు జాబ్ రావడానికి కారణం ఎవరని కార్తీక్ అడగ్గా అతను రకరకాలుగా ఆన్సర్ ఇస్తాడు. దాంతో కాశీని లాగిపెట్టి కొడతాడు. ఆ వైరాకి, శివన్నారాయణ కుటుంబానికి శతృత్వం ఉందని, తాతపై పగ సాధించడానికి నిన్ను పావుగా వాడుకున్నాడని మండిపడతాడు కార్తీక్. మనిద్దరం ఆ పెద్ద మనిషిని కలిసి అసలు నిజం రాబడదామని కాశీని లాక్కెళ్తాడు. తనను దీప ఓదార్చడంతో దశరథ పొంగిపోతాడు. నువ్వు మా కూతురివి అయితే బాగుంటుందని అంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 30వ తేదీ 554వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 554 December 30th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

కూతురి విషయంలో దశరథ బాధపడుతుండటంతో దీప కంటతడి పెట్టుకుంటుంది. నేనే మీ కూతురిని అని చెప్పి మీ బాధంతా పొగొట్టాలని ఉందని అనుకుంటుంది. ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని దశరథ బాధపడుతుండగా.. సుమిత్ర అమ్మగారికి ఏం కాదని అంటుంది దీప. ఇంతలో సుమిత్ర వచ్చి నాకేం అయ్యిందని ప్రశ్నిస్తుంది. ఆసుపత్రికి వెళ్లింది మీ కోసమైతే, మీరంతా నాకోసం బాధపడతారేంటీ అని మండిపడుతుంది సుమిత్ర. ఈయన కోసం ఆసుపత్రికి వెళితే.. డాక్టర్ గారు నన్ను అడ్మిట్ అవ్వమని చెబుతున్నారని చెబుతుంది.

జ్యోత్స్న అన్న మాటల గురించి వైరా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కాశీ, కార్తీక్‌లు అక్కడికి వస్తారు. నాకు కూడా ఏదైనా జాబ్ ఇవ్వొచ్చు కదా అని కార్తీక్ సెటైర్లు వేస్తాడు. డ్రైవర్లకి నా దగ్గర ఖాళీలు లేవని వైరా అనగా.. పీఏకి జీఎం పోస్ట్ ఇచ్చారంటే మనకి ఏం పోస్ట్ ఇవ్వొచ్చు అని అడుగుతాడు. ఇంతలో వైరా అసిస్టెంట్ ఎండీ పోస్ట్ ఇవ్వొచ్చని అంటాడు. నా అసిస్టెంట్‌కి తెలిసింది కూడా మీ తాతకి తెలియలేదు కదా? అందుకే నీ సీఈవో పోస్ట్ పీకేసి, నీకు డ్రైవర్ పోస్ట్ ఇచ్చాడు. అదే మీ తాతని వదిలేసి నాతో చేతులు కలిపితే వైరా సంస్థకే నిన్ను అధిపతిని చేస్తానని ఆఫర్ ఇస్తాడు వైరా.

చెడ్డవాడి చేతికి కత్తిలా ఉండటం కంటే మంచివాడి చేతిలో కర్రగా ఉండటానికే నేను ఇష్టపడతాను. నీ పక్కన యజమానిగా ఉండటం కంటే.. మా తాత దగ్గర డ్రైవర్‌గా ఉండటమే మంచిది అని అంటాడు కార్తీక్. కాశీతో వస్తే నువ్వు నా దారిలో వచ్చావని అనుకున్నా అని చెబుతాడు వైరా. నిన్ను అభినందించే ప్లేస్‌కి కాశీతో కలిపి తీసుకెళ్తానని అంటాడు కార్తీక్. కాశీ ముఖం ఓ వైపు ఎర్రగా మారిపోయింది.. మీరు గమనించలేదా అని తాను కొట్టిన దెబ్బను చూపిస్తాడు కార్తీక్. బెదిరిస్తే భయపడతాను అనుకున్నావా? వైరాతో వైరం అంటే కరెంట్ తీగలతో ఉయ్యాల ఊగినట్లేనని వార్నింగ్ ఇస్తాడు వైరా. నీ తీగల్ని తెంపి నీకే చుట్టి బొంగరాలు కూడా ఆడతానని కౌంటర్ ఇస్తాడు కార్తీక్.

గతంలో నా కంపెనీ జోలికి వచ్చావు.. వార్నింగ్ ఇచ్చి వదిలేశాను, ఈసారి నా ఫ్యామిలీ జోలికి వచ్చావు ఈసారి వార్నింగ్‌లు ఉండవు వాయించడాలే అని అంటాడు కార్తీక్. నువ్వు చేసిన తప్పు నాకు సాక్ష్యాధారాలతో దొరికిపోయింది అక్కడికే తీసుకెళ్తానని చెప్పి చితకబాదుతాడు. ఇంతలో శివన్నారాయణ ఇంటికి మీడియా వాళ్లు రావడంతో దీప కంగారుపడి అందరినీ పిలుస్తుంది. మీరంతా మా ఇంటికి ఎందుకొచ్చారు? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? అని శివన్నారాయణ అడగ్గా.. నేనే రమ్మన్నాను అని కార్తీక్ చెబుతాడు. పక్కన వైరా, కాశీ ఉండటంతో అంతా షాక్ అవుతారు. అసలు నేరస్తులు ఎవరో చెప్పడానికి మిమ్మల్ని రమ్మన్నాను అని చెబుతాడు కార్తీక్.

జ్యోత్స్న రెస్టారెంట్స్‌లో జరిగింది కల్తీ కాదు, కుట్ర అని కార్తీక్ చెప్పగా అంతా షాక్ అవుతారు. వీళ్లద్దరినీ బావ తీసుకొచ్చాడంటే? వీళ్లు దొరికిపోయారు.. నా పేరు చెప్పుంటారని జ్యోత్స్న వణికిపోతుంది. మీరు ఒక అబద్ధాన్ని నిజమని ఇప్పటి వరకు కథనాల్ని ప్రసారం చేశారు.. దాని వల్ల జ్యోత్స్న రెస్టారెంట్‌కి మార్కెట్‌లో సంపాదించుకున్న గౌరవం దెబ్బతింది. ఈసారి నిజాల్ని జనానికి అర్ధమయ్యేలా చెప్పండి అని మీడియాను అడుగుతాడు కార్తీక్. తనకంటే ఉన్నతంగా ఎదుగుతున్న జ్యోత్స్న రెస్టారెంట్‌ అభివృద్ధిని చూడలేక.. ఈ వైరా అనే వ్యక్తి, ఈ కాశీ అనే వ్యక్తి సహాయంతో, జ్యోత్స్న రెస్టారెంట్‌లో పనిచేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగుల సాయంతో కావాలనే ఫుడ్ కల్తీ చేశారని చెబుతాడు కార్తీక్. ఆ మాటలతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది.

కల్తీ జరిగిన ఫుడ్‌ని కావాలనే పంచి పెట్టారు.. తన వెనుక ఇంత కుట్ర జరుగుతుందని తెలియని సీఈవో శ్రీధర్ గారు.. జరిగిన దానికి బాధ్యత వహించకపోతే కేసు ఛైర్మన్ గారి వరకు వెళ్తుందని ఆలోచించి పోలీసుల దగ్గర తను లొంగిపోయారు. జరిగిన దానికి శ్రీధర్‌ గారికి, జ్యోత్స్న రెస్టారెంట్‌కి ఏ సంబంధం లేదని కార్తీక్ చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కాశీని చెప్పమని అడుగుతాడు. నేను సీఈవో శ్రీధర్ గారి పీఏని, వైరా గారు జీఎంగా జాబ్ ఇస్తా అన్నారు అందుకుగాను ఒక ఫేవర్ చేయాలన్నారు. నా వెనుక ఏం జరుగుతుందో తెలుసుకునేసరికి అంతా అయిపోయిందని అంటాడు కాశీ.

ఈ ఉద్యోగులు కూడా వైరా ఇచ్చిన డబ్బుకి కక్కుర్తిపడి ఫుడ్‌ని కల్తీ చేశారు.. దీనంతటికీ కారణం ఈ వైరా అని కార్తీక్ చెప్పగా అబద్ధం అని అంటాడు వైరా. దీనంతటికీ కారణం నేను కాదు.. వేరే ఉన్నారని వైరా అంటాడు. మీడియా ముందుకు వచ్చేసరికి గుండెల్లో భయం మొదలైందా? అని కార్తీక్ పంచ్‌లు వేస్తాడు. ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. వీరిద్దరినీ అరెస్ట్ చేయమని కార్తీక్ చెప్పగా.. ఎవరు ఒప్పుకున్నారు? ఎవరినీ అరెస్ట్ చేయాలని వైరా మండిపడతాడు. ఉద్యోగులు కూడా వైరా పేరు చెప్పడంతో అతను బలంగా ఇరుక్కుంటాడు. అయితే నా మాట కూడా వినమని అంటాడు వైరా. ఈ తప్పులన్నీ నా చేత ఒకరు చేయించారని, అది జ్యోత్స్న రెస్టారెంట్స్ ఛైర్మన్ శివన్నారాయణ గారి మనవరాలు జ్యోత్స్న అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

మన నాశనం కోరుకునేవాడితో చేతులు కలిపావా? ఎందుకు? అని పెద్దాయన మండిపడతాడు. మా నాన్నని సీఈవో చేశారనే పగతో మేడం గారు వైరాతో చేతులు కలిపారని కార్తీక్ చెప్పగా.. తప్పుప ఎవరు చేసినా సరే శిక్ష తప్పదని అంటాడు శివన్నారాయణ. దాంతో జ్యోత్స్నని అరెస్ట్ చేయొద్దని గట్టిగా కలవరిస్తుంది పారిజాతం. నిన్ను అరెస్ట్ చేసినట్లుగా ఊహించుకున్నానని పారు చెప్పడంతో జ్యోత్స్న మండిపడుతుంది. నాతో ఈ పనులన్నీ చేయించింది జ్యోత్స్న అని వైరా చెప్పడంతో అందరూ నిజంగానే షాక్ అవుతారు. ఇంతలో శివన్నారాయణ వచ్చి వైరాని లాగిపెట్టి కొడతాడు. తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నావా? అని మండిపడతాడు.

నా దగ్గరికొచ్చి నాతో చేతులు కలిపింది మీ మనవరాలే అని వైరా చెప్పడంతో నీలాగే నేను కూడా మాట్లాడితే నీకు, నాకు ఏం తేడా ఉందని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నేను నీ దగ్గరికి వచ్చినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయా? అని జ్యోత్న్న ప్రశ్నిస్తుంది. ఆ మాటలతో వైరా షాక్ అవుతాడు. ఆ వెంటనే వైరా తనకు ఫోన్ చేసిన ఆడియో క్లిప్‌ని వినిపిస్తుంది జ్యోత్స్న. ఇంటి దొంగని యజమాని కూడా కనిపెట్టలేడని అంటాడు వైరా. మీ మనవడితో మీ మనవరాలే చేయించింది.. చెప్పు కాశీ తప్పు చేసినవాళ్లు ఎవరో చెబితే మనం బయటపడతామని చెబుతాడు వైరా. దాంతో ఏ సంబంధం లేదని కాశీ చెబుతాడు. ఆ మాటలతో కార్తీక్ షాక్ అవుతాడు. నా పేరు చెప్పనందుకు థ్యాంక్స్ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కాశీని నమ్మకద్రోహి అంటూ నానామాటలు అంటాడు శివన్నారాయణ. కాశీగాడిని జ్యోత్స్నే ఇరికించిందని పారిజాతం బాధపడుతుంది. ఆ వెంటనే సీఈవోని విడిపించి తీసుకురావడానికి వెళ్దామని జ్యోత్స్నని తీసుకుని వెళ్తాడు కార్తీక్. ఎవరినీ నమ్మాలో? ఎవరినీ నమ్మకూడదో అర్ధం కావడం లేదని శివన్నారాయణ బాధపడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X