Karthika Deepam 2 December 31st: జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్.. జైలు నుంచి శ్రీధర్ విడుదల

Photo Courtesy: JioHotstar

కూతురి విషయంలో దశరథ బాధపడుతుండగా దీప ఓదారుస్తుంది. సుమిత్ర అమ్మగారికి ఏం కాదని చెబుతుండగా.. సుమిత్ర వచ్చి నాకేం కాలేదు, ముందు మీ అయ్యగారికి ఏమైందో కనుక్కోమని అంటుంది. జ్యోత్స్న ఫోన్‌లో అన్న మాటల గురించి వైరా ఆలోచిస్తుండగా.. కార్తీక్, కాశీలు అక్కడికి వస్తారు. నీ వల్ల మా నాన్న జైలు పాలయ్యాడు. సాక్ష్యాధారాలతో సహా నేను తెలుసుకున్నానని చెప్పి శివన్నారాయణ ఇంటికి వైరాని, కాశీని తీసుకెళ్తాడు కార్తీక్. శివన్నారాయణ ఇంటి ముందు అప్పటికే మీడియా ఉండటంతో పెద్దాయన కుటుంబం కంగారు పడుతుంది.

ఇంతలో కాశీ, వైరాలను వెంటబెట్టుకొచ్చిన కార్తీక్.. జ్యోత్స్న రెస్టారెంట్‌లో జరిగిన ఫుడ్ కల్తీకి అసలు కారకులు వీరేనని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాడు. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని జ్యోత్స్న వణికిపోతుంది. జ్యోత్స్న చేయడం వల్లే నేను ఇదంతా చేశానని వైరా చెప్పడంతో.. తాను వైరాతో మాట్లాడిన ఆడియో కాల్‌ని వినిపిస్తుంది. జరిగిన దానికి, జ్యోత్స్నకి ఏ సంబంధం లేదా? అని కార్తీక్ అడగ్గా.. కాశీ ఏం మాట్లాడకుండా తనదే మొత్తం బాధ్యత అంటాడు. దాంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 31వ తేదీ 555వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 555 December 31st 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్నతో కలిసి కారులో వెళ్తుండగా సడెన్‌గా ఆపుతాడు కార్తీక్. జ్యోత్స్న రెస్టారెంట్‌ను నాశనం చేయాలని అనుకున్న వైరా గాడు చెడ్డవాడు. అదే జ్యోత్స్న రెస్టారెంట్ పరువు కాపాడాల్సిన వాళ్లు చేస్తే అని ప్రశ్నిస్తాడు కార్తీక్. నోరు జారిన వైరాగాడికి మీడియా ముందే బుద్ధి చెప్పాను.. అయినా నీకు నా మీద అనుమానం పోలేదని మండిపడుతుంది జ్యోత్స్న. మన ఫ్యామిలీలో ఇంతమంది ఉండగా వాడు నిన్నే ఎందుకు వేలెత్తి చూపించాడు అని అడుగుతాడు కార్తీక్. ఎవరినో ఒకరిని దోషిని చేస్తేనే కదా ఇంట్లో మనకి గొడవలు అవుతాయని అంటుంది జ్యోత్స్న. కాశీకి వైరా కంపెనీలో జీఎం పోస్ట్ రావడానికి కారణం ఎవరు? నువ్వు హెల్ప్ చేయలేదా? వైరాతో ఫోన్‌లో మాట్లాడలేదా? వైరాతో మా నాన్నని సీఈవో పోస్ట్ నుంచి దించాలని చెప్పలేదా? ఫుడ్ కల్తీ చేయడంలో నువ్వు వైరాకి సాయం చేయలేదా? అని ప్రశ్నిస్తాడు కార్తీక్.

అన్నింటికి లేదు .. లేదు అని జ్యోత్స్న ఆన్సర్ ఇస్తుంది. కోర్టులో లాయర్‌లా ప్రశ్నల మీద, ప్రశ్నలు గుక్క తిప్పుకోకుండా అడిగితే బోనులో నిలబడిన ముద్దాయిలా బెదిరిపోను అని అంటుంది జ్యోత్స్న. రాజు కంటే మొండివాడు బలవంతుడు అంటారు.. ఎందుకంటే రాజు కోల్పోవడానికి చాలా ఉంటాయి, కానీ మొండివాడు కోల్పోవడానికి ఏం ఉండవు. నీకు దమ్ముంటే నేను తప్పు చేశానని నిరూపించు అని సవాల్ విసరుతుంది జ్యోత్స్న. మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేయించకుండా ఉండుంటే నిన్ను మాట అడగటానికి కూడా రానిచ్చేవాడిని కాదని అంటాడు. మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేయడం దగ్గరి నుంచి ఈరోజు వైరాని అరెస్ట్ చేయడం వరకు జరిగిన ఉదంతంలో నీ హ్యాండ్ ఉందని నిరూపిస్తే ఏం చేస్తావని కార్తీక్ అడగటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

నేను శివన్నారాయణ గారి ఆస్తికి, సామ్రాజ్యానికి వారసురాలిని.. దీని మీద నీకంటే ఎక్కువ బాధ్యత నాకే ఉంటాయని అంటుంది జ్యోత్స్న. అవన్నీ ఈ ఇంటి వారసురాలికి తప్పకుండా ఉంటాయి. మరి నీకెందుకు ఉన్నాయని కార్తీక్ ప్రశ్నించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏం జరిగిందో నాకు కాశీ ఆల్రెడీ చెప్పాడని, కాశీకి వైరా యాంగిల్ పూర్తిగా తెలియదు... వైరాని నమ్మాలా? వద్దా? అనేది నీకే వదిలేస్తున్నానని అంటాడు కార్తీక్. నేను కాశీ అకౌంట్స్ డిటెయిల్స్, ఫోన్ కాల్స్ బయటకు తీస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు.. అసలే ఇంట్లో పరిస్ధితులు బాలేదు.. నీకు ఏమైనా అయితే అత్త తట్టుకోలేదు, అత్త ముఖం చూసే నేను ఆగిపోతున్నాను అని చెబుతాడు కార్తీక్. అంటే నేను దాస్ కూతురిని అని చెప్పకనే చెబుతున్నాడా? ఆ దాస్‌ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశానని అనుకుంటుంది జ్యోత్స్న.

పోలీస్ స్టేషన్‌లో శ్రీధర్‌ను విడుదల చేసి వైరా, కాశీలను జైళ్లో వేస్తారు. సెల్‌లోకి వెళ్తూ వెళ్తూ జ్యోత్స్నని సీరియస్‌గా చూస్తాడు వైరా. కాశీ జైళ్లోకి వెళ్తుండగా.. తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది, దానిని అస్తమానం చూపించలేడు, దానికి సమయం, సందర్భం రావాలి.. అల్లుడు కూడా కొడుకు లాంటి వాడే అంటాడు శ్రీధర్. నీకు నేను తప్పించి గైడ్ చేసేవాడు ఎవరున్నారు? అలా అనుకున్నాను కాబట్టే.. నువ్వు యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్‌లో కూర్చొంటే నేను డబ్బు కట్టి విడిపించాను, నిన్ను కొడుకులో అనుకున్నాను కాబట్టే నాతోనే పెట్టుకుని బిజినెస్ నేర్పించి నీతో సొంతంగా రెస్టారెంట్ పెట్టించాలని అనుకున్నాను, నేను నీ దగ్గర తీసుకున్న చనువు అధికారం అనుకున్నావు అని అంటాడు శ్రీధర్. నా ప్రేమను తప్పుగా అనుకుని ఇంత నమ్మకద్రోహం చేస్తావని అనుకోలేదని బాధపడతాడు శ్రీధర్. నా శత్రువుని నువ్వు నమ్మావంటే నా శత్రువుగా మారావు.. తప్పు నువ్వు చేసి నా కూతురిని ఏడిపిస్తున్నావు అని అంటాడు. నిన్ను మాత్రం జీవితంలో క్షమించనని చెబుతాడు.

శ్రీధర్‌ను తీసుకుని కార్తీక్, జ్యోత్స్నలు ఇంటికొస్తారు. కానీ కాశీ కనిపించకపోవడంతో పారిజాతం బాధపడుతుంది. ఇంటికి రాగానే క్షమించాలని పెద్దాయన కాళ్ల మీద పడతాడు శ్రీధర్. నువ్వు ఏ తప్పు చేశావు? జ్యోత్స్న రెస్టారెంట్‌కి ఉన్న వాల్యూని పబ్లిక్‌గా పొగొట్టినట్లే కదా? సీఈవోగా ఉండి కంపెనీ పరువుని ఏం కాపాడగలిగాను అని అడుగుతాడు శ్రీధర్. నేను సీఈవో పోస్ట్‌లో ఉండటానికి అనర్హుడిని వెంటనే రాజీనామా చేస్తానని అంటాడు. నువ్వు తప్పు చేయలేదు, నీకు శిక్ష పడలేదు కదా? వైరా మీడియా ముందుకు వచ్చే వరకు మనం ఎంత పతనం కావాలో అంత వరకు అయ్యాం కదా? కానీ వీడు ఉన్నాడు కదా అని కార్తీక్‌ని మెచ్చుకుంటాడు. వాడెప్పుడూ ఈ కుటుంబం కోసం ఒక ధ్వజస్తంభంలా నిలబడతాడని కొడుకుని మెచ్చుకుంటాడు శ్రీధర్. ఈ సంఘటన వల్ల మనకి ఎంతమంది శత్రువులు ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు అంటాడు శివన్నారాయణ.

నీ అల్లుడు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదని పెద్దాయన చెప్పగా.. వాడు మోసపోయే రకమే కానీ మోసం చేసేవాడు కాదని అంటుంది పారిజాతం. ముందు వాడిని లోపలికి రమ్మని చెప్పండి అంటుంది.. ఎవరిని అని కార్తీక్ అడగ్గా.. నా మన వాడిని అని చెబుతుంది. నీ మనవడు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నాడని కార్తీక్ చెప్పడంతో పారిజాతం బాధపడుతుంది. వాడి చేత ఎవరో అబద్ధం చెప్పించారని పారు అనగా.. మరి మా నాన్న జైళ్లో ఉన్నప్పుడు వాడి చేత ఎవరో అబద్ధం చెప్పించలేదని ఎందుకు చెప్పలేదని అడుగుతాడు కార్తీక్. డబ్బు మీద ఆశపెరిగితే.. తన, మన అన్న బంధం ఉండదు, అయినవాళ్లని కూడా మోసం చేస్తారని అంటాడు శివన్నారాయణ. నీ మవనడు ఎలాంటి వాడో తేల్చడానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయని అంటాడు.

ఇదంతా మీ అల్లుడి వల్లే జరిగింది. వాడి మానాన వాడిని వదిలేసి ఉంటే చక్కగా కంప్యూటర్ ముందు కూర్చొని, ఏసీ గదిలో ఉండే నా మనవడిని పీఏగా చేశాడు. వాడి చేత ఫైల్స్ మోయించాడు, కార్ నడిపించాడు.. మీరు చిత్తు కాగితంలా తొక్కేస్తుంటే ఎంతసేపని భరిస్తాడని అడుగుతుంది. ఫుడ్ ట్రక్స్‌కి కాశీయే సూపర్‌వైజర్.. అతనికి తెలియకుండా కల్తీ జరిగిందా? వైరాగాడు జీఎం పోస్ట్ ఇస్తానని చెప్పినప్పుడు ఈ ఇల్లు గుర్తురాలేదా? అని ప్రశ్నిస్తాడు దశరథ. ఫుడ్ కల్తీ వల్ల ఎవరిదైనా ప్రాణం పోతే? తప్పు చేసినవాడు మనవాడైనా సరే సమర్ధించడం తప్పు అంటాడు. దాంతో నువ్వేం మాట్లాడవేంటీ అని జ్యోత్స్నని నిలదీస్తుంది పారు. అప్పుడు నా కొడుకు అనాథే, ఇప్పుడు నా మనవడు కూడా అనాథే అని బాధపడుతుంది. అల్లుడి చేతిలో మోసపోయానని ఏడ్చారే కానీ, మా అత్తగారితో కూడా కాశీ గురించి తప్పుగా చెప్పలేదని అంటుంది దీప. కాశీని మంచిదారిలోకి తీసుకురావాలని మావయ్యగారు అనుకున్నారని చెబుతుంది. నా మనవడిని అలాగే వదిలేస్తారా అని శివన్నారాయణని అడుగుతుంది పారిజాతం. వాడిని ఈ గుమ్మంలోకి కూడా రానివ్వనని అంటాడు. నా మనవడికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ జ్యోత్స్నే.. నా చేతిలో నీకుంది అని మనసులో అనుకుంటి పారిజాతం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X