Karthika Deepam 2 January 2nd: సుమిత్రను కబళించనున్న బ్లడ్ క్యాన్సర్... డాక్టర్ మాటలతో కార్తీక్ షాక్
Photo Courtesy: JioHotstar
కాశీని జైలులోకి వెళ్లడానికి కారణమైన జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది పారిజాతం. నీ పాపాల పుట్ట నుంచి బయటపడటానికి నీ తమ్ముడిని జైళ్లోకి పంపించావని మండిపడుతుంది. నా తమ్ముడిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని జ్యోత్స్న చెబుతుంది. కాశీకి ఉద్యోగం ఇప్పించింది నేను.. వాడిని జైళ్లోకి పంపించింది బావ అని తప్పించుకోవాలని చూస్తుంది జ్యోత్స్న. జైళ్లో ఉన్న వైరాని కలవడానికి అతని అసిస్టెంట్ రాగా.. అతనిని నానామాటలు అంటాడు వైరా. నన్ను జైళ్లో పెట్టడానికి కారణమైన వాడిని వదిలిపెట్టను, వాడిని కూడా జైళ్లోకి తీసుకొస్తానని అంటాడు వైరా. మా బావతో పెట్టుకోవద్దని వైరాకి కాశీ వార్నింగ్ ఇస్తాడు.
సుమిత్ర రిపోర్ట్స్ వచ్చినట్లు దశరథకు డాక్టర్ గారు ఫోన్ చేసి చెబుతారు. రేపు మీరు ఒక్కరే వచ్చి స్పెషలిస్ట్‌తో మాట్లాడాలని చెప్పడంతో దశరథ కంగారుపడతాడు. శ్రీధర్ జైలు నుంచి తిరిగి రావడంతో కావేరి, స్వప్నలు కార్తీక్ ఇంట్లో భోజనానికి వస్తారు. కాశీని పెళ్లి చేసుకుని తప్పు చేశాను, నా నిర్ణయం వల్ల మీకు బాధే మిగిలిందని బాధపడుతుంది స్వప్న. కాశీ తప్పు చేశాడు కాబట్టే నువ్వు క్షమించనని చెబుతున్నావు కదా అని శ్రీధర్‌ను చూస్తూ అంటుంది కాంచన. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 1వ తేదీ 557వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సుమిత్ర ఆరోగ్యం గురించి కార్తీక్, దీపలు బాధపడుతుండగా దశరథ వచ్చి ఆసుపత్రికి వెళ్దామని కార్తీక్‌తో చెబుతాడు. నేనెందుకు అని కార్తీక్ అడగ్గా.. ఒక్కడినే వెళ్దామని అనుకున్నాను, కానీ తోడుగా నువ్వుంటే బాగుంటుందని అంటాడు దశరథ. వాళ్లిద్దరూ ఆసుపత్రికి వెళ్లగానే తులసి కోట దగ్గర దీపం ఆరిపోవడంతో దీప మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఆసుపత్రిలో ఎలాంటి రిపోర్ట్స్ ఎలా వస్తాయోనని దశరథ టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి కార్తీక్, దశరథలను లోపలికి తీసుకెళ్తాడు.
మీరు ఒక్కే రండి అంటే భయంగా ఉందని, ముందు రిపోర్ట్‌లో ఏం ఉందో చెప్పండి అని డాక్టర్‌తో అంటాడు దశరథ. ఈయన ఎవరు అని డాక్టర్ అడగ్గా.. నా చెల్లెలి కొడుకు, నా మేనల్లుడు... కొడుకు కంటే ఎక్కువ అని చెబుతాడు దశరథ. ఇల్లు వేరుగా ఉన్నా మేమంతా కలిసే ఉంటామని, నా కంటే వీడే ఎక్కువగా ఇంట్లో ఉంటాడు చెబుతాడు. మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారని .. దశరథ గారికి బీపీ ఎక్కువగా ఉంది, నాకెందుకో హై బీపీలా అనిపిస్తోంది వెంటనే ఆయనకి టెస్టులు చేయండి అని చెబుతుంది డాక్టర్. కార్తీక్ వెళ్లబోతుండగా అతనిని ఆపుతుంది డాక్టర్. మా అత్తయ్యకి ఏమైనా జరిగితే మా మావయ్య తట్టుకోలేడని డాక్టర్‌తో చెబుతాడు కార్తీక్. అందుకే ఆయనని పంపించి వేశానని చెబుతుంది డాక్టర్. మీ అత్తయ్యకి ప్రాబ్లమ్ ఉందని అంటుంది డాక్టర్.
కాశీని ఎలా బయటకు తీసుకురావాలా? అని ఆలోచించావా? అని జ్యోత్స్నతో గొడవ పడుతుంది పారిజాతం. బావ, నాన్న ఎక్కడికి వెళ్లారని జ్యోత్స్న అడగ్గా.. నాకు తెలియదని చెబుతుంది పారు. దీప ద్వారా తెలుసుకోవాలని ఆమెని పిలిపించి అడుగుతారు. నువ్వు, నీ మొగుడు కలిసి నా మనవడిని బలిపశువుని చేసి జైళ్లోకి తోశారు.. ఆడపడుచు మొగుడు జైళ్లో ఉన్నాడన్న బెంగ కూడా లేదు, మామగారు వచ్చారని సంతోషిస్తున్నావా అని నానామాటలు అంటుంది పారిజాతం. మీకు కాశీగాడు అక్కర్లేదు, మొగుడు వద్దా? నువ్వయినా చెప్పాలి కదా? అని మండిపడుతుంది. ఒకడుపోతే ఏంటీ? మరొకరిని చేసుకుందువులే అని చెప్పే ఉంటుందని జ్యోత్స్న అనడంతో దీప సీరియస్ అవుతుంది.
దశరథ, కార్తీక్‌లు ఎక్కడికి వెళ్లారని పారు అడగ్గా.. ఫోన్ చేసి కనుక్కోండి అంటుంది దీప. నా మనవడు తిండి తిప్పలు లేకుండా సెల్‌లో కూర్చొన్నాడు.. నువ్వుగానీ, నీ మొగుడు కానీ, నీ ఆడపడుచు కానీ చూడటానికి వెళ్లారా? అని ప్రశ్నిస్తుంది పారు. అందరూ వాడిని కరివేపాకులా వాడుకున్నారని మండిపడుతుంది. మీకు కాశీ చేసిన తప్పు కనిపించడం లేదా? అని దీప ప్రశ్నించగా.. మీ మామగారిని కూడా అలాగే వదిలేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నిస్తుంది పారు. ఇంతలో కాఫీ చేజారడంతో దీపని కొట్టబోతుండగా శివన్నారాయణ వస్తాడు. నేలకేసి కొట్టిందో, చేతిలో నుంచి లాగితే పడిందో నేను చూస్తూనే ఉన్నాను. మనవడి మీద అంత ప్రేమ కారిపోతుంటే కాఫీ తాగేంత కులాసాగా ఉన్నావా? అని మండిపడతాడు శివన్నారాయణ.
కడుపుతో ఉన్న వాళ్లతో సేవలు చేయించుకోవడం కరెక్ట్ కాదని అంటాడు పెద్దాయన. నువ్వు ఎవరికీ కాఫీలు, టీలు ఇవ్వొద్దు.. వంట చేసుకో, అది కూడా ఇబ్బందిగా ఉంటే నేనొచ్చి సాయం చేస్తానని చెబుతుంది సుమిత్ర. పగిలిపోయిన గాజు ముక్కలను దీప తీస్తుండగా... శివన్నారాయణ ఆపి పారిజాతంతో తీయమని అంటాడు. ఒకప్పుడు నువ్వు కూడా పనిమనిషివేనని జ్యోత్స్న అనగా.. మీ అమ్మ కూడా పనిమనిషే అంటుంది పారు. ఆ మాటలతో రగిలిపోతుంది జ్యోత్స్న. దీప ఎందుకు ఏడుస్తోంది? దాని ముఖం అలా ఎందుకుంది? అని అడుగుతుంది పారు.
మీ అత్తయ్యతో మీరు ఫ్రెండ్లీగా ఉంటారా? అని డాక్టర్ అడగ్గా.. ఆమె నాకు అత్త కాదు అమ్మ అంటాడు కార్తీక్. నేను చెప్పబోయే నిజం విని మీ మావయ్య గారు తట్టుకోలేరని అనిపించింది. మీకు మాత్రం నిజం చెప్పాల్సిందే అంటుంది డాక్టర్. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. దాంతో కార్తీక్‌కు ఇంట్లో పూజ చేయించినప్పుడు గురువుగారు చెప్పిన మాటలు, శివన్నారాయణ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మీరు దశరథ గారికంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నారని డాక్టర్ అంటుంది. ఇప్పుడు ఏం చేయమంటారు? మా అత్తని ఎలా కాపాడుకోవాలని కార్తీక్ అడగ్గా.. ఇంకొన్ని టెస్టులు చేయాలి, అవి కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెబుతాను.. దానికి రెండు రోజులు టైం పడుతుంది.
మీ అత్తకి వచ్చిన బ్లడ్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ చేసే దశలోనే ఉంది.. రెండ్రోజుల్లో సుమిత్ర గారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలి, మీకు ఈ సమస్య ఉంది అంటే పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇంట్లో వాళ్లు అస్సలు తట్టుకోలేరని అర్ధమవుతోంది. వ్యాధి కంటే ముందే భయం మనిషిని చంపేస్తుంది.. మీ అత్తయ్యని ట్రీట్‌మెంట్‌కి ప్రీపేర్ చేయండి. ఆలస్యం చేస్తే మనిషిని కాపాడే ఛాన్స్ తగ్గిపోతుందని చెబుతుంది డాక్టర్. వీలైనంత త్వరగా ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తానని అంటుంది డాక్టర్. నేను రాసిచ్చే మెడిసిన్‌ని వాడించమని చెబుతుంది డాక్టర్. అత్తకి వచ్చిన సమస్యని ఇంట్లో వాళ్లకి ఎలా చెప్పాలి? ఎవరూ తట్టుకోలేరు? ఎలా ఒప్పించాలి? ముందు మావయ్యకి ఏం చెప్పాలి? అని కార్తీక్ బాధపడతాడు. ఇంతలో దశరథ వచ్చి ఏడుస్తున్న కార్తీక్ ముఖం చూసి భయపడతాడు. అన్ని మీకు కార్తీక్ చెబుతారని డాక్టర్ అనగా.. నన్ను ఒక్కడినే ఎందుకు రమ్మన్నారని ప్రశ్నిస్తాడు దశరథ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











