Karthika Deepam 2 January 3rd: సుమిత్ర ఆరోగ్యంపై నిజం దాచిన కార్తీక్... జ్యోత్స్నపై శ్రీధర్‌లో అనుమానం

Photo Courtesy: JioHotstar

సుమిత్ర ఆరోగ్యంపై కార్తీక్, దీపలు బాధపడుతుండగా ఆసుపత్రికి వెళ్దామని కార్తీక్‌ని తీసుకుని వెళ్తాడు దశరథ. ఇంతలో తులసి కోట దగ్గర దీపం ఆరిపోవడంతో దీప భయపడుతుంది. డాక్టర్ దగ్గర దశరథ టెన్షన్ పడటంతో అతనిని బీపీ చెక్ చేసుకుని రమ్మని బయటకు పంపేస్తారు. కాశీని ఎలా బయటకు తీసుకురావాలో తెలియక పారిజాతం బాధపడుతుంది. దీపని పిలిచి తిడదామని భావించిన కాఫీ వంకతో ఆమెను నానామాటలు అంటుంది పారిజాతం. కావాలని కప్ కింద పడేసి దీపని కొట్టబోతుండగా శివన్నారాయణ కోప్పడతాడు.

నేనంతా చూశాను, ఆ కాఫీ కప్ నువ్వే శుభ్రం చేయమని ఆర్డర్ వేస్తాడు. కడుపుతో ఉన్నవాళ్లు ఏ పని చేయకూడదు నేనే చేస్తానని దీపతో అంటుంది సుమిత్ర. ఆసుపత్రిలో అసలు నిజం ఎలా చెప్పాలో తెలియక డాక్టర్ కంగారు పడుతుంది. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని ట్రీట్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి నయం చేయొచ్చని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. సుమిత్ర గారిని ట్రీట్‌మెంట్‌కి మీరే ఒప్పించాలని అంటుంది డాక్టర్. ఇంతలో దశరథ వచ్చి నా భార్యకు ఏమైందని అడగ్గా.. చిన్న టెస్టులు రాసి మందులు ఇచ్చారని చెబుతాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 3వ తేదీ 558వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 558 January 3rd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

కాశీ అలా అవ్వడానికి కారణం మీరేనంటూ కాంచన అన్న మాటల్ని గుర్తుచేసుకుని బాధపడతాడు శ్రీధర్. ఇంతలో స్వప్న రావడంతో మీ నాన్న తప్పు చేశాడని నువ్వు బాధపడుతున్నావా? అని అడుగుతాడు. కాశీ తప్పు చేశాడు.. అతని బుద్ధి మారిపోయిందని బాధపడుతుంది. తర్వాత తండ్రి ఒడిలో పడుకుని ఏడుస్తుంది స్వప్న. కూతురు కోరుకున్న అంత ప్రేమ కూతురి నుంచి దూరం అవుతుంటే ఏ తండ్రి మాత్రం తట్టుకోగలడు అని ప్రశ్నిస్తుంది.

కాశీ మళ్లీ వస్తాడని శ్రీధర్ చెబుతాడు. ఆడవాళ్లకు తండ్రి, భర్త, పిల్లల ప్రేమ కావాలని కోరుకుంటాం... మా మీద మీకున్న ప్రేమను ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తుంటామని బాధపడుతుంది స్వప్న. నేను పెట్టిన టెస్టుల్లో నువ్వే గెలిచావు.. కానీ కాశీ ఓడిపోయాడు. అన్నయ్య ఎప్పుడు ఒక మాట చెబుతాడు.. ఒక మనిషి మీద మనం పెట్టుకున్న నమ్మకం, మనం మోయలేనంత బరువుగా ఉంటుందని. అది కాశీ దించేసుకున్నాడు.. నువ్వు మోస్తూనే ఉన్నావని ఏడుస్తుంది. ఆ మాటలు విన్న కావేరి కూడా బాధపడుతుంది.

కార్తీక్, దశరథలు ఎప్పుడు వస్తారా? అని గుమ్మం దగ్గరే ఎదురు చూస్తుంటుంది దీప. సుమిత్రకు ఏ ప్రాబ్లమ్ లేదన్నారు ఇప్పుడు మనసు చాలా తేలికగా ఉందని కార్తీక్‌తో అంటాడు దశరథ. సుమిత్రమ్మ గారికి ఎలా ఉందని దీప అడగ్గా.. ఏం పర్లేదు, అంతా బాగానే ఉందని అంటాడు దశరథ. కానీ కార్తీక్ ముఖం నిరసంగా ఉండటంతో దీపకి అనుమానం వస్తుంది. వంట గదిలో కూర్చొని వంట చేసుకోక... బయటకు ఎందుకు వచ్చావని మండిపడతాడు కార్తీక్. మీకు ఏ ప్రాబ్లమ్ లేదు కదా అని దశరథని సుమిత్ర అడుగుతుంది. అతను చెప్పకపోవడంతో ఏం జరిగిందో చెప్పమని కార్తీక్‌ను అడుగుతుంది సుమిత్ర.

దశరథకు హెల్త్ బాలేదా? అని శివన్నారాయణ టెన్షన్ పడతాడు. హెల్త్ బాలేదు అన్నది ఆయనకి కాదు నాకు అని అంటుంది సుమిత్ర. ఇదే నిజం అత్త.. సమస్య నీకే వచ్చిందని మనసులో అనుకుంటాడు కార్తీక్. నాకు కొడుకైనా, కోడలైనా ఒకటే.. అసలు మీ కథేంటో చెప్పండి? నాకు తెలియకుండా హాస్పిటల్ అంటున్నారు, టెస్టులు అంటున్నారు. అసలు ఏం జరిగిందని పెద్దాయన నిలదీస్తాడు. ప్రతి 6 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్టులు, చెకప్‌లు చేయించుకోవాలి కదా అని కార్తీక్ కవర్ చేస్తాడు. ఆ విషయం నాకు కూడా తెలుసు.. రిపోర్ట్‌లో ఏముందో చెప్పమని పెద్దాయన అడగటంతో కార్తీక్ షాక్ అవుతాడు. టాబ్లెట్స్ వాడమని చెప్పారు.. ఆకుకూరలు తినమని చెప్పారని అంటాడు.

అత్తకి వచ్చిన ప్రాబ్లమ్ మీ అందరికీ చెప్పి.. రెండ్రోజుల్లో హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలని మనసులో అనుకుంటాడు కార్తీక్. తర్వాత ఏం చేయాలో చెప్పమని పారు అడగ్గా.. కార్తీక్ సీరియస్ అవుతాడు. నువ్వు నీ చాదస్తం, మావయ్యకి విటమిన్ డీ తక్కువగా ఉందని ఎండలో వాకింగ్ చేయమని చెప్పారని అంటాడు. అంతేనా అని అందరూ అడగ్గా.. రిపోర్ట్స్ చూపించమని శివన్నారాయణ ప్రశ్నించడంతో కార్తీక్ షాక్ అవుతాడు. సెకండ్ ఓపీనియన్ కోసం నాకు తెలిసిన స్పెషలిస్ట్‌కి పంపిస్తానని అంటాడు పెద్దాయన. మాకు రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ హారిక గారు పెద్ద స్పెషలిస్ట్ అని కవర్ చేస్తాడు కార్తీక్. రిపోర్ట్స్ అడుగుతుంటే కబుర్లు చెబుతావేంటీ? ఆ మెడిసిన్స్ నాకు ఇవ్వు.. అవి దేనికి వాడతారో చూస్తానని అంటాడు. ఆ మాటలతో కార్తీక్ షాక్ అవుతాడు.

మీరు ఇవన్నీ అడుగుతారనే వాటిని కారులోనే దాచి పెట్టానని మనసులో అనుకుంటాడు కార్తీక్. డీ విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా ఏం చూస్తావు, మేం చదువుకోలేదా .. కావాలంటే మావయ్యని అడుగు అంటాడు కార్తీక్. దశరథ కూడా ఎవ్వరికీ ఏ ప్రాబ్లమ్ లేదని అంటాడు. కానీ వీడి మనసులో ఏదో పెట్టుకుని బయటకు మరోలా చెబుతున్నట్లుగా ఉందని అంటాడు శివన్నారాయణ. వీడికి అలాంటిదేం లేదు.. స్వప్న సొంత చెల్లెలు అయ్యుంటే బావమరిది స్టేషన్‌లో ఉన్నందుకు ఎంతో కొంత బాధపడేవాడని అంటుంది పారిజాతం. ఆ మాటలతో శివన్నారాయణ సీరియస్ అవుతాడు.. కాశీ విశ్వాసం లేని మనిషి, తప్పు చేశాడు శిక్ష పడుతుంది, తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటికొస్తాడని అంటాడు.

నువ్వు పేరుకు చెప్పుకోవడానికే బంధాలు వాడుకుంటావు, కానీ కార్తీక్ బంధాల్ని కలుపుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. నీకు పగలు, పట్టింపులు.. ఆస్తులు, అంతస్తులు కావాలి, కానీ వీడికి మనుషులు కావాలి, వాళ్లు బాగుండటమే కావాలని చెబుతాడు శివన్నారాయణ. ఆ మాటలతో కార్తీక్ బాధపడతాడు. వాడొక పూలతోట.. నిత్యం పూస్తూనే ఉంటాడు, పరిమళిస్తుంటాడని అంటాడు పెద్దాయన. నీ మాటలు నేను నమ్ముతానని చెబుతాడు శివన్నారాయణ. రిపోర్ట్స్ కోసం వెళ్లేటప్పుడు నన్ను కూడా పిలవొచ్చు కదా అని జ్యోత్స్న అడగ్గా.. మేం షాపింగ్‌కి వెళ్తున్నామా? అందరినీ తీసుకెళ్లడానికి అంటూ కార్తీక్ సెటైర్లు వేస్తాడు. చిన్నసార్ కారు తీయమన్నారు.. డ్రైవర్‌ని కదా కారు తీశానని అంటాడు. ఆ తర్వాత కార్తీక్‌ని కుర్చీలో కూర్చోబెట్టి పాయసం తీసుకొచ్చి ఇస్తుంది.

ఉన్నట్లుండి పాయసం ఎందుకు చేశావని అడుగుతాడు కార్తీక్. నాకు తినాలని అనిపిస్తోంది, అందరినీ చూడాలని అనిపిస్తోందని అంటుంది సుమిత్ర. ఆ మాటలతో కార్తీక్ బాధపడుతుండటంతో దీపకి అనుమానం వస్తుంది. బావేంటీ హ్యాపీగా ఉన్నట్లు నటిస్తున్నాడని జ్యోత్స్నకి కూడా అనుమానం వస్తుంది. కార్తీక్‌కి సుమిత్ర పాయసం తినిపిస్తుంది. నాకు నువ్వు దూరం అవుతున్నట్లే ఉంది. ఈ రెండ్రోజుల్లో అందరికీ ఈ నిజం ఎలా చెప్పాలో? ఏం అర్ధం కావడం లేదని కార్తీక్ బాధపడతాడు. నా మనవడిని బాధపెట్టి మీరంతా సంతోషంగా ఉంటారా? అని పారిజాతం రగిలిపోతుంది. బావ నా దగ్గర ఏదో దాస్తున్నాడని దీపకి అనుమానం వస్తుంది.

ఫుడ్ కల్తీ, తాను అరెస్ట్ కావడం గురించి ఆలోచిస్తుంటాడు శ్రీధర్. అయిపోయిందని అనుకున్న నా జీవితానికి నా కొడుకు మళ్లీ వెలుగునిచ్చాడు.. నీకు జన్మనివ్వడం తప్ప, నీ కోసం గొప్పగా చేసింది ఏది లేదు. నీ కోసం ఏదైనా చేయాల్సి వచ్చిన రోజున అప్పుడు ఖచ్చితంగా చేస్తానని అనుకుంటాడు. జ్యోత్స్న జాతకం మొత్తం మన దగ్గర ఉంది కదా? దానిని తీసుకెళ్లి మావయ్య గారి ముందు పెడితే మనవరాలిని ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడని అనుకుంటాడు శ్రీధర్. కానీ ఫైల్స్ ఎక్కడ కనిపించకపోవడంతో శ్రీధర్ మొత్తం వెతుకుతాడు. ల్యాప్‌టాప్‌లో కూడా ఫైల్స్ లేకపోవడంతో.. అకౌంట్స్ మొత్తాన్ని ఎవరు డిలీట్ చేశారు, అసలు దీని గురించి జ్యోత్స్నకి ఎలా లీకైంది అని ఆలోచిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X