Karthika Deepam 2 January 5th: శ్రీధర్ చేతికి జ్యోత్స్న పాపాల చిట్టా... కార్తీక్‌కి షాకిచ్చిన శివన్నారాయణ

Photo Courtesy: JioHotstar

అల్లుడిని తన మానాన తనని వదిలేయకుండా ... తన కింద ఎందుకు పెట్టుకున్నాడు? అసలు కాశీ అరెస్ట్ కావడానికి తానే కారణమని కాంచన అన్న మాటలతో శ్రీధర్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో స్వప్న రావడంతో నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు. దాంతో తండ్రి ఒడిలో పడుకుని స్వప్న వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఒక మనిషి మీద మనం పెట్టుకున్న నమ్మకం, మనం మోయలేనంత బరువుగా ఉంటుందని కార్తీక్ అన్నయ్య ఎప్పుడూ అంటూ ఉండేవాడు. అది కాశీ దించేసుకున్నాడు.. నువ్వు మోస్తూనే ఉన్నావని చెబుతుంది స్వప్న. తండ్రి, కూతుళ్ల మాటలు విన్న కావేరి కూడా బాధపడుతుంది. కార్తీక్, దశరథల కోసం నిరీక్షిస్తోన్న దీపకు వారు ఆసుపత్రి నుంచి రావడంతో ఏం జరిగింది? రిపోర్ట్స్ ఎలా వచ్చాయని అడుగుతుంది దీప.

అంతా బాగానే ఉందని దరథ చెప్పగా... కార్తీక్ మౌనంగా లోపలికి వెళ్లిపోవడంతో దీపకి అనుమానం వస్తుంది. దశరథ, సుమిత్రలకు టెస్టులు చేయించిన విషయం తెలుసుకున్న శివన్నారాయణ.. ఒకసారి రిపోర్ట్స్ ఇవ్వమని అడగ్గా కార్తీక్ మాట దాటవేస్తాడు. ఆ వెంటనే సుమిత్ర పాయసం తీసుకొచ్చి మేనల్లుడికి తినిపిస్తుంది. నాకు అందరితో గడపాలని, వారికి ఇష్టమైనవి చేసి నా చేత్తో తినిపించాలని ఉందని అంటుంది సుమిత్ర. నా మనవడిని బాధపెట్టి మీరెంత కాలం సంతోషంగా ఉంటారో నేను కూడా చూస్తానని పారు మనసులో అనుకుంటుంది. మరోవైపు.. జ్యోత్స్న చేసిన మోసం తాలూకా ఫైల్స్ కనిపించకపోవడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 5వ తేదీ 559వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 559 January 5th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

సుమిత్రకి క్యాన్సర్ వచ్చిన విషయం, డాక్టర్ చెప్పిన విషయాలు, సుమిత్ర తనకు పాయసం తినిపించడం, పెద్దాయన చెప్పిన గండం గురించి ఆలోచిస్తూ బాధపడతాడు కార్తీక్. ఇంతలో దీప వచ్చి పాలు ఇవ్వగా.. నువ్వెందుకు తీసుకొచ్చావని అడుగుతాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు నేను సేవలు చేయాలని అంటాడు. ఆసుపత్రికి వెళ్లొచ్చినప్పటి నుంచి నువ్వు అదోలా కనిపిస్తున్నావు.. దేని గురించో ఆలోచిస్తున్నావని అంటుంది దీప. నీకు కూడా మా తాతలాగా చాదస్తం పెరిగిపోయింది, ఆసుపత్రిలో ఏం జరగలేదని అంటాడు కార్తీక్. నువ్వు రిపోర్ట్స్ గురించి అడిగితే తడబడుతున్నావు.. తాత మాట్లాడుతుంటే ఏదేదో మాట్లాడుతున్నావు, మా అమ్మని చూడగానే కంటతడి పెట్టుకుంటున్నావని చెబుతుంది దీప. అమ్మకి ఏదో ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ నీతో చెప్పారని నాన్న అంటున్నారు.. ఆసుపత్రి నుంచి వచ్చాక నువ్వేం మాట్లాడటం లేదని అడుగుతుంది. ఏమైనా అయితే నీకు చెప్పకుండా ఉంటానా? అని కార్తీక్ సీరియస్ అవుతాడు.

ఇంతలో కార్తీక్‌కి శ్రీధర్ ఫోన్ చేయడంతో బయటికి వెళ్లిపోతాడు. ఆఫీసులో జ్యోత్స్న చేసిన మోసం తాలూకా అకౌంట్స్ మిస్ అయ్యాయని శ్రీధర్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఫైల్ అంటే ఓకే, కానీ లాప్‌టాప్‌లో డేటా ఎలా పోతుందని కార్తీక్ ప్రశ్నిస్తాడు. కేవలం నీ నిర్లక్ష్యం వల్లే పోయింది.. ఆ ఫైల్స్ ఎలా మిస్ అయ్యాయో కనుక్కోమని సీరియస్ అవుతాడు. ఏం జరిగిందని దీప అడగ్గా.. మాష్టారు ఓ తప్పు చేశాడని అంటుండగా మీ నాన్న మళ్లీ ఆఫీసుకు వెళ్తున్నాడా? అని ప్రశ్నిస్తుంది కాంచన. నాన్న సీఈవో పోస్ట్‌కి రిజైన్ చేస్తానని చెబుతున్నా.. తాత మాత్రం వినలేదని చెబుతాడు కార్తీక్. మా నాన్నకి మీ నాన్న మీద నమ్మకం ఎక్కువని కాంచన అనగా.. మరి నీకు లేదా? అని కార్తీక్ అడుగుతాడు. కొన్ని బంధాల్ని మనం గుర్తించకపోయినా అవి మారవని అంటాడు కార్తీక్. అందుకే నేనే మారిపోయాను...నా మనసుకు పడని వాటిని దూరంగా పెడతానని అంటుంది కాంచన. అత్తకు క్యాన్సర్ అన్న విషయాన్ని ఆ ఇంటికన్నా ముందు ఈ ఇంట్లో చెప్పాలని అనుకుంటాడు కార్తీక్. బావ వ్యవహారశైలి తేడాగా ఉండటంతో దీపకి అనుమానం వస్తుంది.

బట్టలు సర్దుతుండగా కాశీ షర్ట్స్ చూసి గతం గుర్తుతెచ్చుకుని బాధపడుతుంది స్వప్న. కాశీ బట్టలు ఇక్కడ ఉండటానికి వీల్లేదని కోపంతో వాటిని విసిరేస్తుండగా కాశీ దాచిన ఫైల్స్, పెన్‌డ్రైవ్ కనిపిస్తుంది. ఈ ఫైల్స్‌లో ఏముందని చూడగా జ్యోత్స్న రెస్టారెంట్‌కి సంబంధించినవి అని డౌట్ పడుతుంది. వెంటనే వాటిని తీసుకుని శ్రీధర్‌కి ఇవ్వాలని అనుకుంటుంది. మీరెందుకు ఉదయాన్నే హడావుడిగా రెడీ అయ్యారని కావేరి అడగ్గా.. పోలీస్ స్టేషన్‌కి అని శ్రీధర్ ఆన్సర్ ఇస్తాడు. అల్లుడిని కొన్ని అడగటానికి వెళ్లాలని అనుకుంటున్నానని చెబుతుండగా స్వప్న వచ్చి ఫైల్స్, పెన్‌డ్రైవ్ ఇస్తుంది. వాటిని చూడగానే శ్రీధర్ షాక్ అవుతాడు. వెళ్లి ల్యాప్‌టాప్ తీసుకుని రమ్మని కూతురికి చెబుతాడు.

సిస్టమ్‌లో డిలీట్ చేసిన ఫైల్స్ అన్నింటిని పెన్‌డ్రైవ్‌లో దాచిపెట్టాడని శ్రీధర్ చెప్పడంతో కావేరి, స్వప్నలు షాక్ అవుతారు. జ్యోత్స్న రెస్టారెంట్‌కి జ్యోత్స్న సీఈవోగా ఉన్నప్పుడు చేసిన ఫ్రాడ్ అంతా బయటికి తీసి నేను ఫైల్ రెడీ చేశాను. దీని గురించి కాశీకి నాకు మాత్రమే తెలుసు. తర్వాత కార్తీక్‌కి చెప్పాను.. దీని గురించి బయటపెట్టేలోపే ఫుడ్ కల్తీ కేసులో అరెస్ట్ అయ్యాను. ఇదంతా ఎందుకు జరిగిందో నాకిప్పుడే అర్థమైంది. జ్యోత్స్న తప్పు చేసిందన్న సాక్ష్యాలు లేకుండా చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. అసలు ముద్ధాయి వైరా కాదు.. జ్యోత్స్న. నా అల్లుడు, నా మేనకోడలు కలిసి నన్ను మోసం చేశారని... ఇది ఎక్కడ బయటపెట్టాలో అక్కడే బయటపెడతానని ఆవేశంగా శివన్నారాయణ ఇంటికి బయల్దేరతాడు శ్రీధర్.

పేరెంట్స్ మీటింగ్‌కి రావాలని కార్తీక్‌కి శౌర్య చెబుతుంది. అప్పుడే ఎందుకు చెబుతున్నావని కార్తీక్ అడగ్గా.. నువ్వు ప్రిపేర్‌గా ఉండాలి కదా అని అంటుంది. దాంతో కార్తీక్‌కి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఇంతలో దీప టిఫిన్ తీసుకురాగా అందరికీ తినిపిస్తాడు కార్తీక్. మన సొంతింటిని వదిలేసినప్పుడు నీకు భయం వేసిందా? అని అడుగుతాడు కార్తీక్. పెద్దింటిలో గొప్పగా బతికిన కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడినప్పుడు భయం వేయకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తుంది దీప. కొన్నిసార్లు జీవితం మనకి షాక్‌లు ఇస్తుంది.. ఆర్ధిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా ఇలాంటివే. మొదటి మన ఓపికని, సహనాన్ని పరీక్షిస్తుంది. రెండోది మన ధైర్యాన్ని, గుండె బలాన్ని పరీక్షిస్తుందని అంటాడు కార్తీక్. మనిషి అన్నింటిని తట్టుకుని నిలబడాలని చెబుతాడు.

అలాంటిది మన జీవితంలో జరగబోతుందా? అని కాంచన అడగ్గా.. అత్త మనకి దూరమైపోతుందేమోనని లోపల బాధపడతాడు కార్తీక్. కొడుకు మాటలతో కాంచనకి అనుమానం వస్తుంది. నువ్వు నిజం చెప్పకపోతే నా కడుపులోని బిడ్డపై ఒట్టేనని దీప చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. దాంతో అత్తకి చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందని.. కానీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలని అంటాడు. చిన్న సమస్యకు అడ్మిట్ చేయడం ఎందుకు? దీనికి నువ్వు ఇంతలా ఆలోచించవు.. నిజం చెప్పమని దీప నిలదీస్తుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో పరిస్ధితులు బాలేదు.. ఈ సమయంలో అత్తకి ఆరోగ్యం బాలేదంటే ఎవరైనా తట్టుకోగలరా అని ప్రశ్నిస్తాడు కార్తీక్. ముందు అందరికీ చెప్పి .. ఆ తర్వాత అత్తకి నిజం చెప్పాలని అంటాడు. ఇంటికి వెళ్లగానే దశరథ, సుమిత్రల మెడికల్ రిపోర్ట్స్‌ని శివన్నారాయణ చూపించి కార్తీక్, దీపలపై సీరియస్ అవుతాడు. డాక్టర్ ఏం చెప్పారో నువ్వు చెబుతావా? నన్ను చెప్పమంటావా? అని మండిపడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X