Karthika Deepam 2 January 6th: కార్తీక్‌పై చేయి చేసుకున్న శివన్నారాయణ... సుమిత్ర గురించి నిజం చెప్పిన డాక్టర్
Photo Courtesy: JioHotstar
మా అమ్మకి ఏం జరిగింది? మా అమ్మ ముఖం చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావని కార్తీక్‌ని దీప నిలదీస్తుంది. కానీ కార్తీక్ ఏం చెప్పకుండా వెళ్లిపోతాడు. ఇంతలో శ్రీధర్ ఫోన్ చేసి జ్యోత్స్న మోసానికి సంబంధించిన ఫైల్స్, డేటా కనిపించడం లేదని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. నీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని మండిపడతాడు. కాశీ షర్ట్స్ చూస్తూ అతనితో గడిపిన పాత రోజులను గుర్తుచేసుకుని ఎమోషనల్ అవుతుంది. అతని బట్టలతో నాతో కలిసి ఉండటానికి వీల్లేదని బట్టలు విసిరి పారేస్తుండగా కాశీ దాచిన ఫైల్స్, పెన్‌డ్రైవ్ కనిపిస్తాయి. వాటిని తీసుకెళ్లి తండ్రికి చూపించడంతో శ్రీధర్ షాక్ అవుతాడు.
నేను అరెస్ట్ కావడానికి? ఫుడ్ కల్తీ కావడానికి కారణం జ్యోత్స్న అని స్వప్న, కావేరీలకు చెప్పడంతో ఇద్దరూ షాక్ అవుతారు. సీతకు వచ్చిన వ్యాధి గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ బాధపడతాడు కార్తీక్. దాంతో పుట్టబోయే బిడ్డపై ఒట్టేసి నిజం చెప్పమని కార్తీక్‌ని నిలదీస్తుంది దీప. తప్పనిసరి పరిస్ధితుల్లో మీ అమ్మకి కాస్త నలతగా ఉందని.. ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని అంటాడు కార్తీక్. ఆ మాటలతో దీప షాక్ అవుతుంది. ఇద్దరూ కలిసి శివన్నారాయణ ఇంటికి వెళ్లేసరికి రిపోర్ట్స్ పట్టుకుని రెడీగా ఉంటాడు పెద్దాయన. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 6వ తేదీ 560వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నా దగ్గర ఏం నిజాలు దాచావు.. ఎందుకంత కంగారు పడుతున్నావని కార్తీక్‌ను ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. బావ ఎందుకు ఇన్ని మాటలు పడుతున్నాడు.. ఆ నిజం చెప్పేయొచ్చు కదా అని దీప బాధపడుతుంది. నీ దగ్గర ఓ నిజం దాచానని కార్తీక్ అంటాడు. ఎవరికి ఏమైందోనని పెద్దాయన టెన్షన్ పడుతుంటాడు. నీకు నిజం చెబితే నువ్వు తట్టుకోలేవని నీ దగ్గర నిజం దాచానని అంటాడు కార్తీక్. అంటే బావ దాచింది అంత పెద్ద నిజమన్న మాట.. అంటూ నానామాటలు అంటుంది జ్యోత్స్న. కొన్ని మనసుకు తీసుకోవడం చాలా కష్టం.. అన్నీ మీరు అనుకున్నంత తేలిక కాదని మండిపడతాడు కార్తీక్. అంటే నువ్వు చెప్పింది వినగానే నా గుండె ఆగిపోతుందా? అని అంటాడు పెద్దాయన.
అంత పెద్ద మాటలు వద్దు... నిజం చెబుతానని అంటాడు కార్తీక్. కానీ ఇంతలోనే సుమిత్ర రావడంతో ఆగిపోతాడు. ఎవరికైతే నిజం తెలియకూడదని అనుకున్నానో ఆమె ఉంటే ఎలా బయటపెట్టగలనని అనుకుంటాడు కార్తీక్. ఏం జరిగింది? అని సుమిత్ర అడగ్గా.. నువ్వు దశరథ టెస్టులు చేయించుకున్నారు కదా? మీ ఇద్దరిలో ఒకరికి సమస్య ఉంది, అది కార్తీక్ గాడు మన దగ్గర దాచాడని అంటుంది పారిజాతం. నాకు నీ మీద నిన్నే అనుమానం వచ్చింది. హాస్పిటల్‌కు వెళ్లింది మీ మావయ్య గురించి.. నువ్వు ఏం లేదంటే ఎలా అని ప్రశ్నిస్తుంది సుమిత్ర. నేను ఏ నిజం దాయలేదని కార్తీక్ అనగా.. మాతో ఆటలు ఆడుకుంటున్నావా? అని శివన్నారాయణ ఫైర్ అవుతాడు.
నిజం లేదు అబద్ధం లేదు.. మనం తర్వాత మాట్లాడుకుందామని అంటాడు కార్తీక్. మీరిచ్చిన చనువు వల్ల మీరు వాడికి అంత లోకువ అయిపోయారని అంటుంది పారిజాతం. అందుకే వాడు నిజం చెప్పడం లేదని మండిపడుతుంది. ఇంతలో ఫైల్స్ తీసుకుని కోపంగా శివన్నారాయణ ఇంటికి వస్తాడు శ్రీధర్. ఇన్నిరోజులు నువ్వు నా కొడుకుతో ఆడుకున్నావా కదా? ఈరోజు నేను నీతో ఆడుకుంటానని జ్యోత్స్న గురించి అనుకుంటాడు. బావ అబద్ధం చెబుతున్నాడు.. డాడీకి ఏదో అయ్యిందని జ్యోత్స్న ఇంకా సుమిత్రను రెచ్చగొడుతుంది. దాంతో సుమిత్ర బాగా దగ్గుతుంది. ఎవరికీ ఏం కాలేదు.. దయచేసి నన్ను ఏం అడగొద్దని అంటాడు కార్తీక్. నిజం చెప్పకపోవడంతో కార్తీక్‌పై చేయి చేసుకుంటాడు శివన్నారాయణ. దాంతో అంతా షాక్ అవుతారు. మా ఆయనకి ఏం జరిగిందో చెబుతావో లేదా అని సుమిత్ర టెన్షన్ పడి దగ్గుతూ కిందపడిపోతుంది. ఇదంతా చూసిన శ్రీధర్ షాక్ అవుతాడు. సుమిత్ర కిందపడిపోయి నోట్లో నుంచి రక్తం రావడంతో కుటుంబం మొత్తం నివ్వెరపోతుంది.
మరోవైపు.. కార్తీక్ అన్న మాటలు గుర్తొచ్చి కాంచన ఆలోచిస్తుంటుంది. ఎంత పిలిచినా కాంచన పలకకపోవడంతో అనసూయ గట్టిగా అరుస్తుంది. కార్తీక్ ఏదో విషయం చెప్పడానికి మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు.. అది ఖచ్చితంగా మంచి విషయం కాదని అంటుంది కాంచన. వాడు ఆనందాన్ని అందరికీ పంచుతాడు. ఏదైనా బాధ కలిగించేది అయితే అస్సలు చెప్పడు అంటుంది కాంచన. కార్తీక్ బాబు చెప్పేంత వరకు వినడానికి ప్రిపేర్‌గా ఉండమని అంటుంది అనసూయ. సుమిత్ర పడిపోవడంతో డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేస్తుంది. నా భార్య గురించి నా దగ్గర ఏ నిజం దాచావు? అని కార్తీక్‌ని నిలదీస్తాడు దశరథ. నువ్వు కంగారు పడొద్దని దశరథను శాంతపరుస్తాడు శ్రీధర్. నా భార్య రక్తం కక్కుకుంటూ కిందపడిపోయింది. నేను లేనప్పుడు డాక్టర్ గారు వీడితో మాట్లాడారు.. కానీ వీడు మాత్రం నా దగ్గర అబద్ధం చెప్పాడని అంటాడు దశరథ.
మమ్మీ నోట్లో నుంచి బ్లడ్ వచ్చిందంటే సీరియస్ కండీషన్ అయ్యుంటుంది, మనిషి పోయే వరకు నిజం చెప్పకుండా ఉందామని అనుకున్నావా అని జ్యోత్స్న సీరియస్ అవుతుంది. అసలు నా భార్యకు ఏం జరిగిందని కార్తీక్ చొక్కా పట్టుకుంటాడు దశరథ. ఇంతలో డాక్టర్ గారొచ్చి.. మీరు ఎంత అడిగినా కార్తీక్ మీకు నిజం చెప్పడని అంటుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.. సుమిత్ర గారి రిపోర్ట్స్ వచ్చిన రోజున దశరథ గారిలో భార్య పట్ల ప్రేమను, భయాన్ని చూశాను. నేను నిజం చెబితే దశరథ గారు తట్టుకోలేరని అనిపించి.. కార్తీక్‌కి మాత్రమే నేను సుమిత్రగారి హెల్త్ కండీషన్ గురించి చెప్పడం జరిగిందని అంటుంది. సుమిత్ర గారిని రెండ్రోజుల్లో అడ్మిట్ చేయాలి.. ఈ విషయం గురించి ఇంట్లో వాళ్లందరినీ ప్రిపేర్ చేయమని అంటుంది. ఇంతకీ నా భార్యకు వచ్చిన వ్యాధి ఏంటీ డాక్టర్ అని అడుగుతాడు దశరథ.
సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ గారు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. చాలా చిన్నసమస్య అని చెప్పావని కార్తీక్‌పై మండిపడుతుంది దీప. అంటే మా సుమిత్ర బ్రతకదా? అని పారిజాతం అడగ్గా.. దశరథ సీరియస్ అవుతాడు. ట్రీట్‌మెంట్ చేస్తే నయమయే కండీషన్‌లోనే వ్యాధి ఉందని డాక్టర్ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. కార్తీక్‌కి కూడా తెలియని విషయం మీతో చెబుతున్నాను.. సుమిత్ర గారికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి మనం కాపాడుకోవచ్చని డాక్టర్ అంటుంది. సుమిత్ర గారికి సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ ఉన్నారా? అని డాక్టర్ అడుగుతుంది. ఎవరు లేరని కూతురు ఉందని దశరథ అనడంతో దీపని చూడగానే సుమిత్రగారి కూతురే అయ్యుంటుందని అనుకున్నానని అంటుంది డాక్టర్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. తను సుమిత్ర గారి కూతురు కాదని పారిజాతం చెబుతుండగా.. తన పేరు దీప.. కార్తీక్ భార్య అంటాడు శివన్నారాయణ.
మీ కోడలిని కాపాడితే మీ మనవరాలేనని చెబుతుంది డాక్టర్. బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలంటే రక్తసంబంధీకులే అయ్యుండాలి, జ్యోత్స్న కన్నకూతురు కాబట్టి తనే వాళ్లమ్మని కాపాడాలని అంటుంది. సుమిత్రగారికి అవసరమైన బోన్‌మారోని ఆవిడ కన్నకూతురైన జ్యోత్స్న ఇవ్వాలని చెబుతుంది డాక్టర్. నేను కన్నకూతురిని కాదు కదా? ఎలా ఇరుక్కుపోయానని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. డాక్టర్ చెప్పింది విని శివన్నారాయణ వెక్కివెక్కి ఏడుస్తాడు శివన్నారాయణ. సుమిత్ర గారికి నిజం చెప్పి ట్రీట్‌మెంట్‌కి ప్రిపేర్ చేయమని అంటుంది డాక్టర్. ఒకేసారి నిజం చెబితే సుమిత్ర గారు బతకదు.. వీలైనంత త్వరగా నిజం చెప్పమని అంటుంది. నేను ఏమనుకుని వచ్చాను.. ఇక్కడ ఏం జరిగిందని శ్రీధర్ బాధపడతాడు. నీ మీద అనవసరంగా చేయి చేసుకున్నాను.. క్షమించమని అంటాడు శివన్నారాయణ. మాకే ఇంత బాధగా ఉంటే ఇప్పటి వరకు ఈ నిజాన్ని ఎలా మోశావు.. నీ కళ్లలో నీళ్లు ఎవ్వరికీ కనిపించకుండా ఎలా దాచావు అని మేనల్లుడిని హత్తుకుంటాడు దశరథ. అత్తకి అప్పుడే నిజం చెప్పొద్దని ధైర్యంగా ఉందామని అంటాడు కార్తీక్. ఇక నేను లోపలికి వెళ్లలేనని శ్రీధర్ ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











