Karthika Deepam 2 January 7th: పారిజాతానికి దీప వార్నింగ్ ... నిజం బయటకు రాకుండా జ్యోత్స్న కుట్ర
Photo Courtesy: JioHotstar
నా దగ్గర ఏ నిజాలు దాచావు? ఎందుకంత కంగారు పడుతున్నావని కార్తీక్‌పై సీరియస్ అవుతాడు శివన్నారాయణ. ఎంత అడిగినా నిజం చెప్పకపోవడంతో మనవడిపై చేయి చేసుకుంటాడు పెద్దాయన. దాంతో అంతా షాక్ అవుతారు. ఆ వెంటనే దశరథ కూడా వచ్చి కార్తీక్ కాలర్ పట్టుకోవడంతో డాక్టర్ హారిక పరిగెత్తుకుంటూ వచ్చి అతను మీకు నిజం చెప్పలేడని అంటుంది. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ చెప్పడంతో శివన్నారాయణ కుటుంబం ఉలిక్కిపడుతుంది. ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని కార్తీక్ మీ అందరి దగ్గరా మాటలు పడ్డాడని అంటుంది డాక్టర్ హారిక.
సుమిత్ర గారిని కాపాడుకునే ఛాన్స్ ఉందని.. ఆమె కన్నకూతురు జ్యోత్స్న శరీరం నుంచి బోన్ మారో తీసి దానిని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే సుమిత్ర గారు బతుకుతారని అంటుంది డాక్టర్ హారిక. ఆ మాటలతో జ్యోత్స్న, పారిజాతంలకు చెమటలు పడతాయి. ఈసారి దేవుడు కూడా మమ్మల్ని కాపాడలేడని అనుకుంటారు. నిజం తెలియక నీ మీద చేయి చేసుకున్నందుకు క్షమించాలని శివన్నారాయణ, దశరథలు కార్తీక్ వద్ద కంటతడి పెడతారు. కార్తీక్ నా దగ్గర ఏదో విషయం దాస్తున్నాడని అనసూయతో అంటుంది కాంచన. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 7వ తేదీ 561వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సుమిత్రను ఇలా చూడలేకపోతున్నా... నా భార్య ఏం తప్పు చేసింది? తనకే ఎందుకు ఇలా జరగాలని బాధపడతాడు దశరథ. తనను అర్ధం చేసుకోకుండా మాటలతో హింసించి ఇంట్లో నుంచి వెళ్లిపోయేల చేశాను, తను వెళ్లిపోయాక కానీ తన విలువ తెలియలేదు. ఇప్పుడు తనకే ముప్పు వచ్చింది ఎలా తట్టుకోగలను అని బాధపడతాడు దశరథ. ఈ కాలంలో ఉన్న ట్రీట్‌మెంట్‌కి ఏ జబ్బయినా నయం అవుతుందని ధైర్యం చెబుతాడు కార్తీక్. నాకు ఏదో అయిపోతుందని తను అందరి మీదా విరుచుకుపడిందని, తనకు ఇంత పెద్ద వ్యాధి వచ్చిందని తనకు ఎలా చెప్పగలను అని బాధపడతాడు దశరథ. ఇంతలో సుమిత్ర స్పృహలోకి వచ్చి అందరూ ఏడుస్తుండటంతో ఏం జరిగిందని అడుగుతుంది.
నువ్వయినా నిజం చెప్పమని దీపని, దశరథని అడుగుతుంది సుమిత్ర. అందరూ నన్ను చావుకు దగ్గరయిన మనిషిలా చూస్తున్నారని అనగా.. కార్తీక్ కోప్పడతాడు. నువ్వు పడిపోతే డాక్టర్ గారు వచ్చి ట్రీట్‌మెంట్ చేశారని చెబుతాడు. మీరంతా నా దగ్గర ఏదో విషయం నా దగ్గర దాచి పెడుతున్నారని సీరియస్ అవుతుంది సుమిత్ర. నాకు నిద్రకూడా పట్టడం లేదు.. నిద్రలో పాడు కలలే వస్తున్నాయి, మీరంతా నాకు దూరం అవుతారని, మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతున్నాయని కలలు వస్తున్నాయని అంటుంది. నా కూతురు జ్యోత్స్న ఎక్కడ? అని అడుగుతుంది సుమిత్ర. అది నన్ను ఇలా చూస్తే తట్టుకోలేదు. జ్యోత్స్న పెళ్లి నా కల... తన పెళ్లయ్యే వరకు నేను బతికే ఉంటాను, ఒకవేళ నాకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా... నా కూతురికి చెప్పొద్దని మాట ఇవ్వమని అడుగుతుంది సుమిత్ర.
అత్త ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని కార్తీక్ చెప్పగా... దీప ఏడుస్తూ బయటకు వచ్చేస్తుంది. ఆమెను చూసిన పారిజాతం, జ్యోత్స్నలు.. ఈ ఇంట్లో సగం దరిద్రాలకు కారణం ఇదేనని ముందు దానిని ఇంట్లో నుంచి గెంటేయాలని కోపంతో ఊగిపోతారు. ఇంత ఓవరాక్షన్ ఎందుకు చేస్తున్నావు.. నీ కన్నతల్లికి ఏదో రోగం వచ్చినట్లు గుక్కపెట్టి ఏడుస్తున్నావు ఎందుకు. నీ ఓవరాక్షన్ వల్ల వచ్చిన డాక్టర్ కూడా నువ్వే సుమిత్ర కూతురు అనుకుంటుందని మండిపడుతుంది పారిజాతం. అనుకుంటే తప్పేంటీ? అని దీప ప్రశ్నించడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు.
నువ్వు ఎలా కూతురు అవుతావు? ఈ ఇంటి పేరుతో కానీ? ఈ ఇంటి రక్తంతో కానీ నీకు ఏమైనా సంబంధం ఉందా? అని జ్యోత్స్న నిలదీస్తుంది. విసిరేసిన విస్తరాకులాంటి అనాథవి, మా ఫ్యామిలీకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. ఉండకపోతే అని దీప అడగటంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. సుమిత్రమ్మగారు ఎన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాలేక ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసు.. నువ్వు ఏ రోజైనా గమనించావా? ఏ రోజైనా పట్టించుకున్నావా? అని ప్రశ్నిస్తుంది. నేను అడుగుతానో లేదో నీకు అనవసరమని అంటుంది జ్యోత్స్న. మా ఇంటికి దరిద్ర్యం మొదలైందే నీ వల్ల.. నీ కారణంగానే సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఏకంగా పైకే పోతుందని అంటుంది పారు. సుమిత్రమ్మ గారిని ఏమైనా అన్నారంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తుంది దీప.
సుమిత్రమ్మగారికి ఇంత పెద్ద జబ్బు చేసిందని ఎందుకు దాచారు అని అడుగుతుంది పారు. మీకు ఎవరి మీదా ప్రేమలు ఉండవు, ఎవరి ప్రాణాలు పోయినా మీరు పట్టించుకోరని మండిపడుతుంది దీప. మీ కోడలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంటే మీరేం చేశారు? మీ మనవరాలికి బుద్ధి చెప్పలేదు. మరి నీ ఇంట్లోనే సుమిత్రను ఎందుకు దాచుకున్నావని ప్రశ్నిస్తుంది పారు. ఈ ఇంట్లో వాళ్లు బాగుండాలనే అలా చేశానని చెబుతుంది దీప. ఇప్పుడు సుమిత్రమ్మ గారికి వచ్చిన వ్యాధి ఎంత ప్రమాదకరమైనది అయినా, మనిషి సంకల్పం ముందు చావు కూడా తల వంచాల్సిందే అంటుంది దీప. నా తల్లి గురించి కోరుకోవడానికి నేనున్నాను... పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకున్న అనాథవి నువ్వు, నీలాంటిది కోరుకుంటే ఏం జరుగుతుందో తెలుసని జ్యోత్స్న అనడంతో దీప కోపంతో మీదకి వెళ్తుంది. తల్లిపైనా కన్నప్రేమ లేకపోయినా పెంచిన ప్రేమ ఉండాలి కదా అని దీప అనడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు.
ఇప్పుడు నేను చేసిన మోసం బయటపడే సమయం వచ్చిందని అది తలచుకుంటేనే భయంగా ఉందని అంటుంది పారు. అకౌంట్స్‌లో నేను చేసింది మోసం.. పిల్లల విషయంలో నువ్వు చేసింది పాపం.... దానికి ఎంత పెద్ద శిక్ష ఉంటుందో ఊహించలేవని చెబుతుంది. శివన్నారాయణ గారి కాళ్ల మీద పడైనా నిజం చెప్పి క్షమించమని అడుగుతానని అంటుంది పారు. నేను మా అమ్మని కాపాడాలంటే నేనే తన కన్నకూతురిని అయ్యుండాలి. అలాగని నేను సైలెంట్‌గా ఉంటే రేపు టెస్టులు చేశాకైనా నిజం తెలిసిపోతుందని అంటుంది జ్యోత్స్న. నేనొక నిర్ణయం తీసుకోబోతున్నాను అని చెప్పి.... దేనికైనా సిద్ధంగా ఉండమని అంటుంది. ఆ మాటలతో షాకైన పారిజాతం మనవరాలు ఏం చేయబోతుందోనని భయపడుతుంది.
అకౌంట్స్‌లో ఫ్రాడ్ గురించి బయటపెట్టకుండా బాధపడుతున్న శ్రీధర్‌ని కలుస్తాడు కార్తీక్. సుమిత్రకి క్యాన్సర్ అని చెప్పగానే నా బ్రెయిన్ పనిచేయలేదు.. కానీ సుమిత్రను కాపాడగలిగింది జ్యోత్స్నే అని డాక్టర్ చెప్పడంతో భగవంతుడు జ్యోత్స్న జాతకాన్ని ఇంత గొప్పగా ఎలా రాశాడా? అని అనిపించింది అంటాడు. తను అదృష్టవంతురాలు అని అంటాడు శ్రీధర్. జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ తాలూకా ఆధారాలు ఇవేనని శ్రీధర్ చెప్పగా... ఇవి ఎక్కడ దొరికాయని కార్తీక్ అడుగుతాడు. ఇంటి దొంగని నా కూతురు పట్టుకుంది.. ఆ దొంగ ఎవరో కాదు నా అల్లుడు. నా క్యాబిన్‌లో ఫైల్స్ కొట్టేశాడు.. ల్యాప్‌టాప్‌లో జ్యోత్స్న చేసిన స్కామ్ మొత్తం ఈ పెన్‌డ్రైవ్‌లో పెట్టాడని అంటాడు శ్రీధర్.
ఏం జరిగిందో నాకు మొత్తం క్లారిటీ వచ్చింది... నువ్వు అరెస్ట్ కావడానికి కారణం వైరా కాదు జ్యోత్స్న అని చెబుతాడు కార్తీక్. తను చేసిన తప్పుల్ని నువ్వు బయటపెట్టబోతున్నావని కాశీ ద్వారా తెలుసుకున్న జ్యోత్స్న... కాశీని రెచ్చగొట్టి వైరా దగ్గర జీఎం పోస్ట్ ఇప్పించింది. అందుకు కృతజ్ఞతగా ఈ డేటాని జ్యోత్స్నకి ఇవ్వాలని అనుకున్నాడు. కానీ జ్యోత్స్న అసలు ప్లాన్ ఇది కాదు.. నిన్ను సీఈవో పోస్ట్ నుంచి తప్పించాలని అనుకుంది. జ్యోత్స్న తెలివిగా తప్పించుకుంది.. కానీ వైరా, కాశీలు ఇరుక్కుపోయారని అంటాడు కార్తీక్. అసలు దోషి ఈ ఇంట్లోనే ఉంది... ఇలాంటి మనిషిని ఎలా క్షమించాలని అడుగుతాడు శ్రీధర్. ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి ఏవేవో జరుగుతున్నాయి.. అయినా ఇక జ్యోత్స్నని వదిలిపెట్టేది లేదు. పెద్దాయనకి నిజం చెప్పేస్తానని శ్రీధర్ ఆవేశంగా వెళ్తుండగా కార్తీక్ అడ్డుకుంటాడు.
అత్తకొచ్చిన వ్యాధి గురించి ఇంట్లో వాళ్లంతా భయంతో ఉన్నారు... పైగా కూతురే తల్లిని కాపాడాలని డాక్టర్ చెప్పారు కదా. ఇప్పుడు తాత ఏ నిర్ణయం తీసుకుంటాడు. ఆ ఆధారాల్నీ నీ దగ్గరే ఉంచు వీటి అవసరం ఇప్పట్లో ఉండకపోవచ్చని అంటాడు. అత్తకి బోన్ మారో ఇవ్వాల్సింది జ్యోత్స్న కాదు.. దీప. ఇప్పుడు ఖచ్చితంగా తను అసలు కూతురు కాదన్న నిజం బయటపడుతుందని అనుకుంటాడు కార్తీక్. దీపని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని తండ్రికి చెబుతాడు కార్తీక్. తల్లిని చూస్తూ దీప ఏడుస్తూ ఉంటుంది. ఈ ఫైల్స్ గురించి ఎవరికీ చెప్పొద్దని తండ్రికి చెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











