Karthika Deepam 2 January 8th: భయంతో అర్ధరాత్రి జ్యోత్స్న జంప్... రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కార్తీక్

Photo Courtesy: JioHotstar

సుమిత్రను ఆ పరిస్ధితుల్లో చూసి దశరథ బాధపడుతుండగా కార్తీక్ ఓదారుస్తాడు. ఆమెకు ఈ నిజం ఎలా చెప్పాలి? ఎలా ట్రీట్‌మెంట్‌కు ఒప్పించాలి? అని కంటతడి పెడతాడు దశరథ. తల్లిదండ్రుల పరిస్ధితి చూసిన దీప బయటికొచ్చి కుమిలిపోతుండగా పారు, జ్యోత్స్నలు ఆమెను నానామాటలు అంటారు. నువ్వే కూతురిలా ఓవరాక్షన్ చేయొద్దని జ్యోత్స్న వార్నింగ్ ఇవ్వడంతో దీప రగిలిపోతుంది. ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో మనుషుల కోసం ఎందాకైనా వెళ్తానని వార్నింగ్ ఇస్తుంది దీప. కన్నవాళ్లు కాకపోయినా పెంచిన ప్రేమైనా ఉండాలని దీప అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

నేను కన్నకూతురిని కాదు కాబట్టి ... సుమిత్రకు నా బోన్ మారో మ్యాచ్ కాదు, అప్పుడు అసలు నిజం బయటపడిపోతుందని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. ఈ గండం నుంచి కాపాడుకోవడానికి నేను తెగించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నానని జ్యోత్స్న అనడంతో పారు షాక్ అవుతుంది. జ్యోత్స్న పాపాల చిట్టా బయటపెట్టాలని వచ్చానని, కానీ ఇక్కడి పరిస్థితి చూసి ఏం చేయలేక తలపట్టుకున్నానని కార్తీక్‌తో అంటాడు శ్రీధర్. ఇప్పట్లో వీటి అవసరం రాదని, వాటిని నీ దగ్గరే ఉంచమని శ్రీధర్‌తో అంటాడు కార్తీక్. వెళ్తూ వెళ్తూ దీపని ఇంటి దగ్గర దించమని తండ్రికి చెబుతాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 8వ తేదీ 562వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 562 January 8th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దీప ఇంటికొచ్చి ఏడుస్తూ కుప్పకూలిపోవడంతో కాంచన, అనసూయలు టెన్షన్ పడతారు. కార్తీక్ రాకుండా దీపని ఇక్కడ దిగబెట్టడానికి మిమ్మల్ని ఎందుకు పంపించాడని శ్రీధర్‌ని అడుగుతుంది కాంచన. పంతులుగారు చెప్పిన గండం ముంచుకొచ్చింది. సుమిత్రమ్మ గారిని చుట్టుముట్టిందని చెబుతుంది దీప. మా వదినకి ఏమైందని కాంచన అడగ్గా... చెల్లెమ్మకి బ్లడ్ క్యాన్సర్ అని శ్రీధర్ చెప్పగానే కాంచన, అనసూయలు షాక్ అవుతారు. దానికి వైద్యం లేదా? అని అనసూయ అడుగుతుంది. రోగం ఎంత బాధపెడుతుందో? చికిత్స కూడా అంతే బాధపెడుతుందని అంటాడు శ్రీధర్. తట్టుకుని నిలబడటం చాలా కష్టం అని చెబుతాడు. ఈ విషయం మీ వదినకు తెలియదు.. మావయ్యకి, బావకి ధైర్యం చెప్పడానికి కార్తీక్ అక్కడే ఉండిపోయాడని అంటాడు శ్రీధర్. ఈ విషయం కార్తీక్‌కి ముందే తెలుసు.. ఉదయం వాడి మాటల్లోనే అర్ధమైందని అంటుంది కాంచన.

సుమిత్రమ్మ గారికి ఏం కాదు కదా అని ప్రశ్నిస్తుంది దీప. మా వదిన ఎంతో పుణ్యం చేసుకుంది. ఎలాంటి బంధం లేకపోయినా తన కన్నతల్లికి కష్టం వచ్చినట్లుగా వణికిపోతోందని అంటుంది కాంచన. నువ్వే మీ అన్నయ్యకి ధైర్యం చెప్పాలని కాంచనకి చెబుతాడు శ్రీధర్. నువ్వు సుమిత్ర గురించి ఎక్కువగా బాధపడకు అని దీపకి జాగ్రత్తలు చెబుతాడు. నా బాధ మీకు అర్ధం కాదు.. కూతురిగా నేను అక్కడ ఎందుకు లేను, జ్యోత్స్న ఎందుకున్నది అనే నా బాధ అంటుంది దీప. డాక్టర్ గారు చెప్పిన విషయంతో పాటు దీప అన్న మాటలతో జ్యోత్స్నకి పిచ్చెక్కినట్లుగా ఉంటుంది. ముందు ఇంట్లో నుంచి బయటపడాలని బట్టలన్నీ సర్దుకుంటుంది జ్యోత్స్న. ఎవరూ లేని టైంలో లగేజ్‌ తీసుకుని కిందకి వస్తుండగా జ్యోత్స్నకి కార్తీక్ ఎదురవ్వడంతో ఆమె షాక్ అవుతుంది.

పెద్ద మేడం గారు ఎక్కడికో పారిపోతున్నట్లుగా ఉందని అంటాడు కార్తీక్. మన అదృష్టం బాగుండి బయటపడాల్సినవి బయటపడవు.. లేదంటే లెక్కలు, వాటితో వచ్చే చిక్కులు అన్ని బయటపడేవి అంటాడు కార్తీక్. కొన్ని మనం డిలీట్ చేసేశాం, మనల్ని ఎవ్వరూ చూడటం లేదు, మనం సేఫ్ అనుకుంటాం. అనుకున్నంత మాత్రాన సేఫ్ అవ్వం.. భగవంతుడు మన పాపాల చిట్టా అంతా భ్రదంగా దాస్తాడని చెబుతాడు. ఏ తప్పు చేయకపోతే దొంగల పారిపోవాల్సిన అవసరం లేదని అంటాడు కార్తీక్. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావని కార్తీక్ ప్రశ్నిస్తాడు. నేను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని అంటుండగా శివన్నారాయణ, దశరథలు వస్తారు. బావ నన్ను అడ్డంగా ఇరికించేశాడు.. ఒక సమస్య నుంచి బయటపడదామంటే మరో సమస్యలో ఇరుక్కున్నానని వణికిపోతుంది జ్యోత్స్న. నువ్వు ఇలాంటిది చేస్తావనే నేను దీపను ముందు పంపించేసి ఇంటికి కాపలాగా ఉన్నానని అనుకుంటాడు కార్తీక్.

మీ అమ్మ పరిస్ధితి తెలిసి కూడా నువ్వు పారిపోతున్నావంటే నిన్ను ఎలా అర్ధం చేసుకోవాలి. అసలు నువ్వు సుమిత్రకి కూతురివా? కాదా? అని నిలదీస్తాడు పెద్దాయన. ఇంతలో పారిజాతం వచ్చి ఈ టైంలో కబుర్లు చెప్పుకుంటున్నారు అని సెటైర్లు వేస్తుంది. జ్యోత్స్నని ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని సలహా ఇచ్చి ఇక్కడికి వచ్చి మాట మారుస్తున్నావా? అని శివన్నారాయణ అడుగుతాడు. పెద్ద మేడం గారు బ్యాగ్ సర్దుకుని ఇళ్లు వదిలి పారిపోతుంటే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని చెబుతాడు కార్తీక్. పెద్ద మేడం గారు దొరికిపోయే సరికి మీరు సేవ్ అవుదామని చూస్తున్నారా? అని మండిపడుతుంది. అయినా నువ్వు ఇంటికి వెళ్లకుండా ఈ టైం వరకు ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తుంది పారిజాతం. వాడు ఉన్నాడు కాబట్టే ఎవరేం చేస్తున్నారో తెలిసిపోయింది.. లేదంటే జ్యోత్స్న వెళ్లిపోయిన విషయం రేపొద్దున తెలిసేది అంటాడు కార్తీక్.

నా కూతురు ఇలా తయారైంది? కనీసం తల్లి బాగుండాలని కోరుకోవాలి కదా అని అంటాడు దశరథ. నీ తల్లి ప్రాణాన్నే నువ్వే కాపాడగలవని డాక్టర్ చెప్పారు.. ఇప్పటి వరకు మీ అమ్మని బాధపెట్టడం తప్పించి ఆమె కోసం ఏం చేయలేదని అంటాడు దశరథ. ఈ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందంటే దానికి కారణం నువ్వే అయ్యుంటావు, మీ అమ్మ ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకుంటే దానికి కారణం నువ్వే అంటాడు దశరథ. నీకు పెళ్లి చేయడం నిమిషం పని.. ఈ ఇంటికి అల్లుడయ్యే కుర్రాడి కోసం మేం వెతుకుతూనే ఉన్నాం. వచ్చే రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, అప్పుడే నీ పెళ్లి చేయాలని మీ అమ్మ నేను అనుకున్నామని చెబుతాడు దశరథ. కానీ ఈలోగా మీ అమ్మకి భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆమెకు వచ్చిన వ్యాధికి పరిష్కారం లేదంటే ఈపాటికే నా గుండె ఆగిపోయేది. కానీ దానికి పరిష్కారం నువ్వని తెలిసి నా భార్య బతుకుతుందని నమ్మకం కుదిరిందని అంటాడు దశరథ. మమ్మల్ని ఇలాంటి పరిస్ధితుల్లో వదిలేసి వెళ్లిపోతున్నావంటే ఏం అర్ధం చేసుకోవాలి? మీ అమ్మ బతకడం నీకు ఇష్టం లేదా? అని ప్రశ్నిస్తాడు దశరథ.

పిల్లలంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల్ని తీసుకోవడమే కాదు.. వాళ్ల బాధ్యతల్ని కూడా తీసుకోవాలని చెబుతాడు పెద్దాయన. అసలు నువ్వు వెళ్లిపోవడానికి కారణం ఏంటీ? అని నిలదీస్తాడు శివన్నారాయణ. అసలు నువ్వెందుకు వెళ్లిపోవాలని అనుకున్నావని దశరథ కూడా మండిపడతాడు. మమ్మీ గురించి ఆలోచిస్తూ భయంగా ఉండలేకపోయాను అందుకే లగేజ్ సర్దుకుని వచ్చేశానని అంటుంది జ్యోత్స్న. నువ్వు లేకపోతే ఈ రోజు నా కూతురు వెళ్లిపోయేది.. ఆమెను వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చేదని అంటాడు దశరథ. సుమిత్ర గురించి తలచుకుంటూ దీప బాధపడుతుంది. చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా పెరిగానని, ఇప్పుడు నా తల్లి దూరం కాబోతోందని ఏడుస్తుంది. నేను పొందలేని ఆనందం నా పిల్లలు పొందాలని అనుకున్నానని బాధపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X