Karthika Deepam 2 January 9th: సుమిత్రను చంపాలని జ్యోత్స్న కుట్ర... రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న శివన్నారాయణ

Photo Courtesy: JioHotstar

దీప ఇంటికొచ్చి ఏడుస్తూ కుప్పకూలడంతో ఏం జరిగింది? మా ఇంట్లో ఎవ్వరికీ ఏం కాలేదు కదా అని అడుగుతుంది కాంచన. స్వామిజీ చెప్పిన గండం సుమిత్రమ్మ గారికేనని చెబుతుంది దీప. చెల్లెమ్మకు బ్లడ్ క్యాన్సర్ అని శ్రీధర్ చెప్పడంతో కాంచన, అనసూయలు షాక్ అవుతారు. నువ్వే మీ అన్నయ్యకి ధైర్యం చెప్పాలని.. దీపని జాగ్రత్తగా చూసుకోమని కాంచనకి చెప్పి వెళ్లిపోతాడు శ్రీధర్. తన గుట్టు బయటపడేలా ఉండటం, పరిస్థితులు వ్యతిరేకంగా ఉండటంతో జ్యోత్స్నకి పిచ్చెక్కిపోతుంది.

నిజం తెలిసేలోగా ఇళ్లు వదిలి వెళ్లిపోవాలని భావించి అర్ధరాత్రి లగేజ్ సర్దుకుని జ్యోత్స్న నెమ్మదిగా బయటకు వస్తుండగా కార్తీక్ ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు. ఇంతలో శివన్నారాయణ, దరరథలు రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మీ అమ్మని ఈ ప్రపంచంలో కాపాడగలిగేది నువ్వు ఒక్కదానివే.. ఇలాంటి పరిస్ధితుల్లో మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోతున్నావని దశరథ అడుగుతాడు. ఇంతలో పారిజాతం రాగా.. జ్యోత్స్న వెళ్లిపోవడానికి కారణం నువ్వేనా అని మండిపడతాడు శివన్నారాయణ. కన్నతల్లి తనకు ఎక్కడ దూరమైపోతుందోనని దీప కంటతడి పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 9వ తేదీ 563వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 563 January 9th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న కన్నకూతురు కాదు... ఆ విషయం వాళ్లు బయటపెట్టలేరు, కానీ బయటపడక తప్పదు. అప్పుడు మా అమ్మ పరిస్ధితి ఏంటి? మా అమ్మ బతకాలి.. దాని కోసం నేను ఏమైనా చేస్తానని కార్తీక్‌తో అంటుంది దీప. అత్తకి వ్యాధి ఉన్న సంగతి చెబితేనే తట్టుకోలేదు.. అలాంటిది జ్యోత్స్న కన్నకూతురే కాదని చెబితే అసలు తట్టుకోలేదు. నువ్వు తొందరపడితే అత్త ప్రాణాలతో దక్కదని దీపని హెచ్చరిస్తాడు కార్తీక్. ఈ గండం నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోవాలని చూసింది... సమయానికి నేను అక్కడే ఉండటంతో దొరికిపోయిందని చెప్పడంతో దీప షాక్ అవుతుంది.

ఏదో చేస్తానని చెప్పి భయంతో పారిపోతావా? శివన్నారాయణ గారి మనవరాలు భయపడి పారిపోయిందని తెలిస్తే జనం ఏమనుకుంటారని జ్యోత్స్నపై మండిపడుతుంది పారిజాతం. ఈ విషయం నాకు ముందే తెలిస్తే నేను కూడా చిన్న బ్యాగ్ తీసుకుని నీ వెంట వచ్చేసేదానిని అంటుంది. అసలు కార్తీక్‌కి ఇన్ఫర్మేషన్ ఎలా లీకైంది... నువ్వు అసలైన వారసురాలివి కాదని కార్తీక్ గాడికి తెలుసు, ఇంట్లో జరిగిన రచ్చకి భయపడి నువ్వు పారిపోతావని వాడు ముందే ఊహించాడు. అందుకే పెళ్లాన్ని ఇంటికి పంపేసి వాడు మాత్రం ఇంటికి కాపలా కాశాడని పారిజాతం అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

బావకి మన గురించి ఎలా తెలుసు? ఎవరు చెబుతారు? అని ఆలోచిస్తుంది జ్యోత్స్న. నీకు సుమిత్ర మీద ఏ ప్రేమ లేకపోయినా.. కార్తీక్ గాడు మాత్రం నిన్ను వదిలిపెట్టడు. నువ్వు ఎక్కడికి వెళ్లినా వెతికి మరి తీసుకొస్తాడు. బావని చూస్తుంటే నేనే అసలైన వారసురాలిని కాదనే విషయం బావకి తెలిస్తే.. దీపని ఈ ఇంటి వారసురాలిగా పరిచయం చేసేందుకు స్కెచ్ గీస్తున్నాడని అర్ధమవుతోందని అనుకుంటుంది జ్యోత్స్న. నువ్వు అత్త దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఏమాత్రం ఏడ్చినా మీ అమ్మకి అనుమానం వస్తుందని దీపపై సీరియస్ అవుతాడు కార్తీక్. మీ అమ్మ ఎవరు? ఏం మాట్లాడుకుంటున్నారని శౌర్య అడగటంతో దీప కోప్పడుతుంది. నేను కూడా మా నాన్న ఇంటికి వస్తానని కాంచన అడగటంతో వద్దని కార్తీక్ చెప్పడంతో కొడుకుపై సీరియస్ అవుతుంది. తనకి క్యాన్సర్ అని తెలిస్తే అత్తకి తట్టుకోలేదని అంటాడు కార్తీక్.

ఇంతలో శ్రీధర్ వచ్చి కాంచనను తీసుకెళ్తానని చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. మా నాన్న ఇంటికి తీసుకెళ్లమని మీ అమ్మ నాకు మెసేజ్ పెట్టిందని చెబుతాడు శ్రీధర్. మా అమ్మ పెద్ద ప్లానే వేసిందని అంటాడు కార్తీక్. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా భార్యకి టైం కేటాయించే భర్తలు కొందరే ఉంటారని దీపతో చెబుతాడు కార్తీక్. మీ అమ్మకి ఏం కాదు.. కష్టాలకు తలవంచొద్దని ధైర్యం చెబుతాడు. నేను శివన్నారాయణ గారి మనవరాలిని కాదని తెలియకూడదంటే నేనొక పనిచేయాలని పారిజాతంతో చెబుతుంది జ్యోత్స్న. నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది.. నువ్వు ఎన్నో ఏళ్లు బతకవు అని చెబుతానని అంటుంది జ్యోత్స్న.

అలా చెబితే సుమిత్ర చచ్చిపోతుందని పారు అనగా.. మనం సేఫ్‌గా ఉంటామని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలతో మనవరాలిని లాగిపెట్టి కొడుతుంది పారు. నువ్వు ఎన్ని తప్పులు చేశావు.. ఎంతమందిని చంపావు అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నేను ముందుజాగ్రత్త కోసం చంపానని పారు చెప్పగా... నిజం బయటకు రాకుండా, నన్ను నేను కాపాడుకోవడానికి మనం చేయాల్సింది చేయాలని అంటుంది జ్యోత్స్న. భయంతో పోయేకంటే నేనే ఆ భయాన్ని చంపేయాలని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంట్లో వాళ్లు కూడా భయంతోనే సుమిత్ర పోయిందని అనుకుంటారని అంటుంది. నిజం బయటపడితే మన పరిస్ధితి ఏంటీ? అనేది ఊహించుకోవడానికే భయంగా ఉందని చెబుతుంది పారు.

పారు ఎంత చెబుతున్నా వినకుండా సుమిత్ర దగ్గరికి వచ్చి ట్యాబ్లెట్ వేసుకోమని చెబుతుంది జ్యోత్స్న. నాకేమైంది? నేనెందుకు ట్యాబ్లెట్ వేసుకోవాలి? అని అడుగుతుంది సుమిత్ర. నువ్వు కూడా మీ నాన్నలా తయారయ్యావు? ఆయన కూడా రెస్ట్ తీసుకోమని చెబుతున్నారని ప్రశ్నిస్తుంది సుమిత్ర. నాకు ఏమైందో చెబుతావా? అని అడగ్గా.. చెబుతానని అంటుంది జ్యోత్స్న. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్లకి ఏమైనా అయితే తట్టుకోలేం.. అలాంటిది మనిషే బతకడని తెలిస్తే అది ఒక నరకం.. నేను అలాంటి బరువునే మోస్తున్నానని అంటుంది. ఈ అందమైన కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా మరొకరు తట్టుకోలేరు.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని చెబుతుంది జ్యోత్స్న. నీకు బ్లడ్ క్యాన్సర్ .. ఈ నిజం నీతో చెబితే నువ్వు ఏమైపోతావోనని భయపడి ఇంట్లో ఎవరూ నిజం చెప్పడం లేదు. కానీ నువ్వు ధైర్య వంతురాలివి. నీకొచ్చిన వ్యాధి ప్రాణాంతకమైనది అయినా తట్టుకుని నిలబడతావని చెబుతుంది జ్యోత్స్న.

జ్యోత్స్న నిజం చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. అయితే జ్యోత్స్న చెప్పింది వింటూ సుమిత్ర నిద్రలోకి జారుకుంటుంది. మమ్మీ నేను చెప్పింది విన్నదా? లేదా? అని అనుకుంటుంది జ్యోత్స్న. ఇదంతా శివన్నారాయణ, కాంచన, దీప, కార్తీక్‌లు చూసి కోపంతో రగిలిపోతుంటారు. నువ్వేంటో? నువ్వు చేస్తున్న పనులేంటో నాకు అర్ధం కావడం లేదు. నీకు మనసు అనేది ఉందా అని మండిపడతాడు శివన్నారాయణ. నీ దగ్గర మనిషి ప్రవర్తనే లేదని ఫైర్ అవుతాడు. దీనికి దెయ్యం పట్టింది.. అది వదిలేంత వరకు దీని ప్రవర్తన మారదని మండిపడుతుంది కాంచన. నువ్వు నిజం చెబితే మా వదిన చచ్చిపోతుంది... తల్లి మీద కొంచెమైనా ప్రేమ ఉందా? తల్లి మీద కొంచెమైనా బాధ్యత ఉందా? అసలు నువ్వు మా వదిన కూతురివేనా? అని ప్రశ్నిస్తుంది కాంచన. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X