Karthika Deepam 2 January 10th: జ్యోత్స్నని కాపాడటానికి పారిజాతం స్కెచ్.. శ్రీధర్‌కి దాస్ క్షమాపణలు
Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న కన్నకూతురు కాదు.. ఈ విషయాన్ని వాళ్లు బయటపెట్టలేరు, మరి మా అమ్మని కాపాడటం ఎలా? అని కార్తీక్‌ని ప్రశ్నిస్తుంది దీప. నువ్వు తొందరపడి జ్యోత్స్న నీ కూతురు కాదని చెబితే అత్త ప్రాణాలతో దక్కదని కార్తీక్ హెచ్చరిస్తాడు. నిజం ఎక్కడ బయటపడుతుందోనని పారు, జ్యోత్స్నలు వణికిపోతున్నారు. జ్యోత్స్న ఇంట్లో నుంచి పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని కార్తీక్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది.
మరోవైపు... శివన్నారాయణ గారి మనవరాలు ధైర్యంగా ఉండాలని, ఇలా భయపడి పారిపోకూడదని జ్యోత్స్నతో అంటుంది పారిజాతం. నువ్వు సుమిత్ర కూతురివి కాదని కార్తీక్‌కి తెలుసని, అందుకే నువ్వు ఇంట్లో నుంచి పారిపోతావని ఊహించి పట్టుకున్నాడని అంటుంది పారు. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అటు కాంచనని తన పుట్టింటికి తీసుకెళ్లడానికి శ్రీధర్ రావడంతో కార్తీక్, దీపలు సంతోషిస్తారు. ఈ గండం నుంచి మనం బయటపడాలంటే సుమిత్రకు క్యాన్సర్ అని చెప్పాల్సిందేనని పారు వద్దు అంటున్నా తల్లికి చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో ఆమె గాఢ నిద్రలోకి జారుకోగా... ఇదంతా చూసిన శివన్నారాయణ, కార్తీక్, కాంచన, దీపలు రగిలిపోతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 10వ తేదీ 564వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇంట్లో ఉన్న వాళ్లందరికీ వదినకి నిజం చెప్పడం చేతకాదని అనుకున్నావా? నిన్ను చెప్పమని ఎవరైనా చెప్పారా అని జ్యోత్స్నపై కాంచన మండిపడుతుంది. మమ్మీకి జ్యూస్ ఇద్దామని వెళ్లాను నాకు ఏమైంది? నన్నెందుకు అలా చూస్తున్నారో చెప్పమని అడగటంతో అని జ్యోత్స్న చెప్పబోతుండగా... శివన్నారాయణ, దీపలు మండిపడతారు. తనకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిస్తే మీ అమ్మ తట్టుకోగలదా? అవన్నీ ఆలోచించే కదా నిజం చెప్పకుండా ఆగిపోయాను అంటాడు పెద్దాయన. ఇంతలో దశరథ వచ్చి ఎవ్వరూ ఆమెను ఏమీ అనొద్దని చెబుతాడు. ప్రాణాలు కాపాడాల్సిన కూతురు అర్ధరాత్రి జబ్బుపడ్డ తల్లిని వదిలేసి వెళ్లిపోవడానికి సిద్ధమైనప్పుడే జ్యోత్స్న తల్లి గురించి ఆలోచించదని అర్ధమైంది, నేను ఈ ఇంట్లో ఉండను అని దశరథ అనడంతో అంతా షాక్ అవుతారు.
నా వాళ్లంతా నాతో ఉన్నారని చిన్న ఆశ.. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. మీరంతా చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటే నిజం తెలిసిన నా భార్యను నేను ఏం చెప్పి ఓదార్చాలని అంటాడు దశరథ. కూతురు పెళ్లి కోసం సుమిత్ర కలలు కంటుంటే... కూతురు మాత్రం తల్లి చావు కోసం ఎదురుచూస్తోందని బాధపడతాడు. నేను అంత కసాయి దానిని చేయొద్దు.. మీరు కూడా ఏదో ఒకరోజు చెబుతారు కదా అని అంటుంది జ్యోత్స్న. చెప్పే విధానం ఇది కాదని దీప, కార్తీక్‌లు మండిపడతారు. నాకు తెలిసి సుమిత్రకు నిజం చెప్పమని సలహా ఇచ్చింది పారిజాతమే అని అంటాడు శివన్నారాయణ. తప్పు చేసిన ప్రతిసారి నువ్వు వెనకేసుకొస్తే అది జీవితంలో మారదని అంటాడు పెద్దాయన. కొద్దిరోజులు నేను సుమిత్రను తీసుకుని దూరంగా ఎక్కడికైనా వెళ్తానని చెబుతాడు దశరథ.
మీ అందరికీ అంత ఇబ్బందిగా ఉంటే నేనే వెళ్లిపోతానని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎక్కడ నిజం చెప్పి మా వదినని చంపేస్తావోనని మా అన్నయ్య భయపడుతున్నాడు. అసలు తల్లి మీద కొంచెమైనా బాధ్యత ఉందా? కొంచెమైనా ప్రేమ ఉందా? అసలు నువ్వు మా వదిన కూతురివేనా? అని అడుగుతుంది కాంచన. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పెంచుకున్న బిడ్డకైనా మమకారం ఉంటాయి.. కానీ నీకు అవి కూడా లేవు. నువ్వు ఏనాడైనా మా వదిన మనసుని అర్ధం చేసుకున్నావా? ఏదో ఒక తప్పు చేయడం ఎవరో ఒకరిని బాధపెట్టడం అని కాంచన నిలదీస్తుంది. పిల్లల్ని ఎందుకు కన్నామా అని బాధపడేలా చేస్తోందని దశరథ బాధపడతాడు.
ఈ సమస్యకు పరిష్కారం ఏంటని పెద్దాయనని అడుగుతాడు దశరథ. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని.. ఏం చేయాలో అందరికీ అర్ధమైందని అంటాడు కార్తీక్. నీ పెళ్లి చూడాలన్నది మీ అమ్మ కోరిక.. మీ అమ్మని అప్పటి వరకైనా ఉంచమని చెబుతాడు దశరథ. ఇది పొరపాటున జరిగినది కాదని.. జ్యోత్స్న కావాలనే ఇది చేసిందని కార్తీక్‌తో అంటుంది దీప. మా అమ్మని చంపాలని అనుకున్నారు.. మా అమ్మని కాపాడాలంటే కన్నకూతురి వల్లే అవుతుందని డాక్టర్ చెప్పారు. జ్యోత్స్న కన్నకూతురు కాదు... అలాగని ఊరుకుంటే రేపు టెస్టులు చేసినప్పుడు నిజం బయటపడుతుంది. అప్పుడు జ్యోత్స్న పరిస్ధితి ఏంటీ? పిల్లల్ని మార్చేసిన పారిజాతం గారి పరిస్థితి ఏంటీ? అక్కడి నుంచి పారిజాతం గారు చేసిన పాపం దగ్గర ఈ కథ ఆగుతుంది. అప్పుడు నష్టం పారిజాతం, జ్యోత్స్నలకి అంటుంది దీప.
ఈ అనుమానం నాక్కూడా ఉంది.. కానీ జ్యోత్స్న అంతకు తెగించదు, అత్తకి ఏమైనా అయితే దాస్ మావయ్య ఊరుకోడని అంటాడు కార్తీక్. అయితే నువ్వే అసలైన కూతురవని మా అత్తకి నిజం చెప్పమని కార్తీక్ అనడంతో దీప షాక్ అవుతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు... తన కన్నకూతురు కాదని తెలిస్తే అమ్మ తట్టుకోలేకపోతుందని చెబుతుంది దీప. మనకి టైం లేదు.. ఎవరైతే బోన్‌మారో ఇవ్వాలని అనుకుంటున్నారో? వాళ్లు మెడికల్ టెస్టులు చేయించుకోవాలి. అన్నింటికి మించి అత్తని కాపాడాల్సింది నువ్వేనని అంటాడు కార్తీక్. నువ్వే కన్నకూతురన్న నిజం చెప్పకుండా ఇదంతా ఎలా చేయాలో అర్ధం కావడం లేదని చెబుతాడు.
ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో జ్యోత్స్నపై మండిపడుతుంది పారిజాతం. తప్పు చేసింది నువ్వయితే అందరూ నన్నే అంటున్నారని ఫైర్ అవుతుంది. దీప కనుక నిజం చెప్పుంటే సుమిత్ర అంటే తనకి చాలా ఇష్టం అందుకే నిజం చెప్పి ధైర్యాన్ని నింపిందని అంటారని చెబుతుంది జ్యోత్స్న. మా మమ్మీకి ఏ రోజైనా నిజం తెలియాలని అంటుంది. నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు... మనం ఈ గండం నుంచి ఎలా బయటపడాలో నేను చూసుకుంటానని చెబుతుంది పారిజాతం. శ్రీధర్ ఇంటికి దాస్ వస్తాడు. మన పిల్లల తప్పులకి బాధ్యత నాదే... నా కొడుకు చేసిన తప్పుకి క్షమాపణలు అడుగుదామని వచ్చానని చెబుతాడు దాస్. అల్లుడికి ఉద్యోగమిచ్చి దారిలో పెట్టాలని అనుకున్నావు, కానీ వాడు మిమ్మల్ని మోసం చేశాడు. ఇప్పుడు విలువల్ని కోల్పోయాడని కాశీపై మండిపడతాడు. నువ్వు, స్వప్నలు నన్ను క్షమించాలని అడుగుతాడు దాస్.
నేనొక చేతగానీ తండ్రిగా మిగిలిపోయాను అనేకంటే ఓడిపోయాను. కొంతకాలం క్రితం వరకు వాడు బాగానే ఉన్నాడు... వాడిని నువ్వే దారిలోకి తీసుకురావాలని శ్రీధర్‌తో చెబుతాడు దాస్. కాశీని నేను పెళ్లి చేసుకోకపోయినా మీరు నాకు మావయ్యే, మీరు ఎక్కడికి వెళ్లొద్దు ఇక్కడే ఉండండి అని దాస్‌ని అడుగుతుంది స్వప్న. అన్నయ్య బాధ్యత మీదే అంటున్నాడు.. కాశీ గురించి ఏం ఆలోచిస్తారని అడుగుతుంది కావేరి. నేనొక నిర్ణయం తీసుకున్నాను రేపు సాయంత్రం చెబుతానని అంటాడు శ్రీధర్. సుమిత్ర పరిస్ధితి చూసి దశరథ, శివన్నారాయణ బాధపడుతుండగా కాంచన ఓదారుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











