Karthika Deepam 2 January 12th: జ్యోత్స్న, పారిజాతం డ్రామాలకు క్లైమాక్స్... శివన్నారాయణకి నిజం చెప్పనున్న దాస్

Photo Courtesy: JioHotstar

సుమిత్రకు నిజం చెప్పి ఆమెను భయంతో చంపేయాలని పారిజాతం, జ్యోత్స్నలు అనుకుంటారు. అయితే సుమిత్ర నిద్రలోకి జారిపోవడంతో వారి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇంతలో వీరిద్దరూ కార్తీక్, శివన్నారాయణ, కాంచన, దీపలకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతారు. తల్లి మీద కొంచెమైనా ప్రేమ ఉందా? తల్లి మీద అభిమానం ఉందా? అసలు నువ్వు మా వదిన కూతురివేనా అని జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది కాంచన. ఆ మాటలతో జ్యోత్స్న వణికిపోతుంది. ఇప్పుడు కాకపోయినా రేపయినా అమ్మకి నిజం చెప్పాలి కదా? లేదేంటే ఆసుపత్రికి ఎలా తీసుకెళ్తారని అడుగుతుంది జ్యోత్స్న. నిజం చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయని.. కానీ ఒకేసారి చెబితే మా అత్త పరిస్ధితి ఏంటని సీరియస్ అవుతాడు కార్తీక్.

ఇంతలో దశరథ ఏడుస్తూ వచ్చి నా కూతురిని ఎవరూ ఏమి అనొద్దు... తల్లిదండ్రులను గాలికి వదిలేసి తప్పించుకోవాలని నా కూతురు చూస్తోందని బాధపడతాడు. కనీసం నీ పెళ్లి చూసేవరకైనా మీ అమ్మని బతకనివ్వమని వేడుకుంటాడు. మనం ఈ గండం నుంచి బయటపడేలా నేను ఏదో ఒక మార్గం ఆలోచిస్తానని జ్యోత్స్నకి నచ్చచెబుతుంది పారు. అసలు కూతురు ఎవరన్న నిజం తెలిసిపోతుందని అమ్మని పారు, జ్యోత్స్నలు చంపాలని అనుకున్నారని దీప అనుమానించి కార్తీక్‌కి చెబుతుంది. మరోవైపు శ్రీధర్ ఇంటికి వచ్చిన దాస్.. కాశీ చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి నా కొడుకుని నువ్వే దారిలో పెట్టమని తన బావని బతిమలాడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 12వ తేదీ 565వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 565 January 12th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జీవితంలో నిజం చెప్పడం చాలా కష్టం... వాటిని మోయడం ఇంకా కష్టం. అలాంటివి మోసి మోసి ఈ గుండె రాటుదేలిపోయిందని బాధపడతాడు కార్తీక్. సుమిత్ర అత్త నా తల్లి.. ఆమె దగ్గరే పెరిగాను. అత్తకి కొడుకు లేడన్న లోటు మేనల్లుడి ద్వారా తీర్చుకుంది. ఇప్పుడు అత్తను ఈ పరిస్ధితుల్లో చూస్తుంటే లోపల ఎలా ఉంటుందో ఆలోచించు అని అంటాడు కార్తీక్. అత్తకి ఏం కాదని మనం నమ్మితేనే... తర్వాత అత్తని నమ్మించగలమని చెబుతాడు. వదినకి ఏం కాదు... నిండు నూరేళ్లు మీ ఇద్దరూ బాగుంటారు, కూతురి పెళ్లి చూడటమే కాదు.. మనవళ్లు వారి ఎదుగుదలను కూడా చూస్తారని దశరథను కాంచన ఓదారుస్తుంది.

దాస్‌ని ఇంటికి పిలిపిస్తుంది పారిజాతం, జ్యోత్స్న. సుమిత్ర ఆరోగ్యం బాలేదన్న సంగతి చెబుతుంది. నువ్వే ఇప్పుడు నన్ను, నీ కూతురిని కాపాడాలని అడుగుతుంది పారిజాతం. జ్యోత్స్న నిక్షేపంలా ఉంది, తల్లికి ఆరోగ్య సమస్య అన్న బాధ ముఖంలో కనిపించడం లేదని అంటాడు దాస్. మెడికల్ టెస్టులు చేస్తే ఎక్కడ నిజం బయటపడిపోతుందోనని జ్యోత్స్న కంగారుపడుతోంది. మనం కోరుకున్నది ఆ భగవంతుడే చేస్తుంటే నాకు కంగారు లేదని అంటాడు దాస్. నీలాంటి తండ్రిని నేను ఎప్పుడు చూడలేదు.. కూతురు కష్టాల్లో పడుతుందంటే ఏ తండ్రయినా అల్లాడిపోతాడు, కానీ నువ్వు మాత్రం పోతే పోతుందిలే నాకెందుకు అని వదిలేస్తున్నావని జ్యోత్స్న సీరియస్ అవుతుంది.

నా కూతురు కష్టపడుతుంటే తండ్రిగా నేను ఆదుకుంటాను. రోడ్డు మీద పడితే నా ఇంట్లో చోటిస్తాను. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లోటు లేకుండా చూస్తానని దాస్ అంటాడు. అలాంటి దిక్కుమాలిన బతుకు బతకడం కంటే ఇంత విషం తాగి చావడం నయమని అంటుంది జ్యోత్స్న. మన బతుకు మీద మనకే విరక్తి కలిగేలా మాట్లాడుతున్నాడని మండిపడుతుంది. నిన్నెప్పుడు ఏ సాయం అడగలేదు.. ఈసారి మాత్రం నువ్వు సాయం చేయాల్సిందేనని అడుగుతుంది పారిజాతం. మన ముగ్గురం ఒక ఫ్యామిలీ అని చెప్పగా.. మరి కాశీగాడిని ఎందుకు వదిలేశారని దాస్ అడగటంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. నువ్వు కూతురిని కాపాడు.. ఇది కాశీగాడిని కాపాడుతుందని అంటుంది పారు.

సుమిత్రని కాపాడాలంటే అసలైన కూతురు ఉండాలట. ఇది అసలైన వారసురాలు కాదు... రేపు టెస్టులకు వెళ్లిందంటే నిజం తెలిసిపోతుంది. అసలైన వారసురాలు బతికే ఉంది అన్నావు కదా అది నిజమేనా? ఆ వారసురాలు ఎక్కడ ఉంది? అని అడుగుతుంది పారిజాతం. ఇంతలో దీప కాఫీ తీసుకుని వస్తుండగా ఇక్కడే ఉందని ఆమె వైపు చూస్తాడు దాస్. నేను వస్తానని నీకు ముందే తెలుసా అని దాస్ అడుగుతాడు. పారిజాతం గారు కాఫీ అడిగారని, అది మీకేనని అర్ధమైందని అంటాడు. నువ్వు అన్ని అర్ధం చేసుకుంటావు.. కానీ కొందరు మాత్రం ఏం అర్ధం చేసుకోలేరని సెటైర్లు వేస్తాడు దాస్. ఆ కొన్ని కూడా అర్ధమయ్యే రోజులు దగ్గరిలోనే ఉన్నాయని చెబుతాడు. వదినకి ఏం కాదు... ఇంటి కూతురు ఉంది కదా, తల్లిని కాపాడుకుంటుందని దాస్ అనడంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. అమ్మని నాన్నే కాపాడమని బాబాయ్ చెబుతున్నాడని దీప అనుకుంటుంది. అయినా బాబాయ్‌ని పారు నిలబెట్టి ఏం మాట్లాడుతుందని అనుమానం వస్తుంది.

ఈ ఇంటి వారసురాలు ఒకప్పుడు ఇక్కడే ఉండేది కానీ వెళ్లిపోయిందని దాస్ చెప్పడంతో పారుకి ఏం అర్ధం కాదు. నువ్వు అసలు వారసురాలిని తీసుకురావాలని చెబుతుంది పారిజాతం. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దాంతో తీసుకురమ్మంటావా? అని జ్యోత్స్నని దాస్ అడుగుతాడు. దాస్ వచ్చినట్లు కార్తీక్‌కి దీప చెబుతుంది. ఏదో జరుగుతోంది... ఏదో ప్లాన్ మొదలుపెట్టారని అంటుంది. జ్యోత్స్న అసలైన వారసురాలన్న విషయం తెలియకుండా ఆపడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకి నిజం తెలిసినా పారుకు చెప్పదు... దాస్ మావయ్యకి నిజం తెలిసినా కూతురికి మాటిచ్చాడు కాబట్టి తల్లికి నిజం చెప్పడు అంటాడు. మనవరాలి కోసం పారు సకల ప్రయత్నాలు చేస్తోందని చెబుతాడు కార్తీక్. ఆ జ్యోత్స్న తప్పించుకోవడానికి ఏం చేస్తుందోనని భయంగా ఉందని.. దీనిని ఆపాలంటే మా అమ్మకి నిజం చెప్పాలని అంటుంది దీప. ఆ మాటలతో కార్తీక్ షాక్ అవుతాడు.

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నువ్వే ఈ ఇంటి వారసురాలివి కాదన్న నిజాన్ని దాచలేరు... జ్యోత్స్న ద్వారానే నిజం చెప్పించాలని అంటాడు కార్తీక్. జ్యోత్స్న నిజం ఒప్పుకోకుండా వేరే దారి లేదని చెబుతాడు. వేరే దారి కూడా వెతుకుతూ ఉండొచ్చని దీప అనడంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు. అసలైన వారసురాలు రావాలని నువ్వు కోరుకుంటున్నావా? అని పదే పదే జ్యోత్స్నని అడుగుతాడు దాస్. నీ బిడ్డ క్షేమాన్ని నువ్వు కోరుకుంటావు... నిన్ను నమ్ముకున్న వాళ్లకి న్యాయం చేయాలని దాస్‌ని బతిమలాడుతుంది పారు. నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగొస్తుంది.. నువ్వు మంచి చేస్తే మంచి, అన్యాయం చేస్తే అన్యాయాన్నే ఇస్తుందని అంటాడు దాస్. అసలైన కూతురిని నేను తీసుకురాలేనని చెబుతాడు దాస్.

అసలైన కూతురిని తీసుకొస్తే దానితో మాట్లాడి, అడిగినంత డబ్బుచ్చి సీక్రెట్‌గా దీనికి బదులు ఆపరేషన్ గదిలో పడుకోబెడదామని అంటుంది పారు. ఈ ఇంటి వారసురాలిని వెతుకుదామా అని దాస్ అడగటంతో జ్యోత్స్న నీతో రాలేదని చెబుతుంది పారిజాతం. సుమిత్ర వదిన బతకాలన్నా? మీరు ఆపదలో నుంచి బయటపడాలన్నా జ్యోత్స్న ఎవరో చెప్పేయాలని అంటాడు దాస్. నేనే ఈ నిజం శివన్నారాయణ గారికో, దశరథ గారికో చెప్పేస్తానని దాస్ అంటుండగా శివన్నారాయణ ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాక్ అవుతారు. నువ్వు ఏం నిజం చెప్పాలని అనుకుంటున్నావని శివన్నారాయణ ఇంట్లోకి పిలిపించి అడుగుతాడు. దాంతో నిజం చెప్పొద్దని జ్యోత్స్న దండం పెడుతుంది. నాన్నతో చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే నాతో చెప్పమని అంటాడు దశరథ. దీప ఖచ్చితంగా ఇక్కడే ఉండాలని దాస్ చెప్పడంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. దాస్‌ని వెళ్లిపోమ్మని పారిజాతం గొడవ పడుతుంది. నేను నీకు ద్రోహం చేశానని దశరథతో అంటాడు దాస్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X