Karthika Deepam 2 January 14th: జ్యోత్స్న పుట్టుకపై నిజం చెప్పిన దాస్.. షాక్‌లో కార్తీక్, దీప

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న పుట్టుక గురించి దాస్ నిజం చెప్పాలని అనుకుంటుండగా దశరథ, కార్తీక్, జ్యోత్స్నలు వణికిపోతారు. కాశీ బెయిల్ గురించి జ్యోత్స్నని హెల్ప్ అడిగావా అంటూ కార్తీక్ కవర్ చేసే ప్రయత్నం చేయగా అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నీ ముఖం చూసి కాశీని క్షమిస్తున్నా.. రేపే శ్రీధర్‌తో మాట్లాడి బెయిల్ ఇప్పిస్తానని అంటాడు శివన్నారాయణ. దాస్ వెళ్లిపోతుండగా... అసలు ఎందుకొచ్చావు? ఏం చెప్పాలని అనుకున్నావని కార్తీక్ అడుగుతాడు. ఈ ఇంటి వారసురాలు ఎవరన్నది తెలుసుకోవాలని మా అమ్మే చెప్పిందని దాంతో నిజం చెప్పాలని అనుకున్నానని అంటాడు దాస్. ఈ నిజం ఎప్పుడో చెప్పాలో నేనే చెబుతానని అంటా కార్తీక్. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారోనని జ్యోత్స్న‌కు చెమటలు పడతాయి.

కాశీని విడిపించి ఇంటికి తీసుకొస్తాడు శ్రీధర్. భర్తని చూడగానే రగిలిపోయిన స్వప్న.. కాశీని గుమ్మం దగ్గరే ఆగమని రంకెలు వేస్తుంది. నువ్వు తప్పు చేసుంటే క్షమించేదానిని కానీ నువ్వు మోసం చేశావని మండిపడుతుంది. ఈ మనిషితో బతకాలని నాకు లేదు... విడాకులు తీసుకుంటానని స్వప్న చెప్పడంతో కాశీ, కావేరి, శ్రీధర్, దాస్‌లు షాక్ అవుతారు. స్వప్న మాటలతో కాశీ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు.. శివన్నారాయణ గారింటికి వెళ్లొద్దని దీపకు చెబుతుంది కాంచన. నేను వెళ్లకపోతే ఆ ఇంట్లో మనషులకు అన్నం పెట్టేవారు కూడా లేరని దీప బాధపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 14వ తేదీ 567వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 567 January 14th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న అసలు మా వదిన కూతురేనా అని కాంచన అడుగుతుంది. దానిలో మా అన్నయ్య లక్షణాలు లేవు, మా వదిన లక్షణాలు లేవని అంటుంది. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. సుమిత్ర అత్తకు రేపు నిజం చెప్పేస్తానని ఎక్కువ టైం లేదని... నువ్వు ప్రిపేర్‌గా ఉండమని దీపతో అంటాడు కార్తీక్. అక్కడ నువ్వు ఏమాత్రం ఏడ్చినా అత్త తట్టుకోలేదని అంటాడు. జైలు నుంచి విడుదలైన కాశీకి జ్యోత్స్న కంగ్రాట్స్ చెబుతుంది. నన్ను ప్లాన్డ్‌గా ఇరికించి నువ్వు మాత్రం సైడ్ అయిపోయావని మండిపడతాడు కాశీ. నేను నిన్ను ఇరికించలేదని వైరా కదా అని అంటుంది జ్యోత్స్న. నువ్వు చెప్పకుండానే వైరా ఫుడ్ కల్తీ చేశాడా? అని ప్రశ్నిస్తాడు కాశీ. నీ పేరు చెప్పినా, చెప్పకపోయినా నాకు శిక్ష తప్పదు.. కానీ నువ్వు నా కోసం నిలబడతావని అనుకున్నాను, కానీ నువ్వు వదిలేశావని ఫైర్ అవుతాడు కాశీ.

నేను ఆఫీసులో చేసిన స్కామ్ తాలూకా ఫైల్స్ నాకు ఇవ్వమంటే జాయినింగ్ రోజున సర్‌ప్రైజ్ ఇస్తానని అన్నావు.. ఇప్పుడు ఏమైంది? మీ బావ గట్టిగా అడగటంతో వైరా పేరు చెప్పి దొరికిపోయావు అని అంటుంది జ్యోత్స్న. నువ్వు మీ బావ దగ్గర నోరు జారకపోయుంటే ఈరోజు నీ లైఫ్ మరోలా ఉండేదని అంటుంది. అయినా నీకు కోర్ట్ బెయిల్ ఇప్పించింది ఎవరు.. మా తాతతో మాట్లాడి నేనే ఇప్పించానని చెబుతుంది జ్యోత్స్న. నేను మళ్లీ శ్రీధర్ మావయ్య ఇంటికి వెళ్లను... స్వప్న నాకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పిందని కాశీ అంటాడు. పోతే పోయింది వదిలేసేయ్.. నువ్వు ఈ కేసు నుంచి బయటపడిన వెంటనే మనమే సొంతంగా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం.. దానికి నువ్వే సీఈవో అని చెబుతుంది జ్యోత్స్న.

ఇంతకీ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతుంది జ్యోత్స్న. అవి నా దగ్గర లేవు.. మా మావయ్యగారి దగ్గర ఉన్నాయని చెబుతాడు కాశీ. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నా జీవితం నాశనం చేశావని మండిపడుతుంది. ఆ ఫైల్స్‌ని వాళ్లు బయటపెట్టేవాళ్లే అయితే ఈపాటికే మొత్తం బయట పెట్టేవారని అంటాడు కాశీ. సరే జరిగింది జరిగిపోయింది.. నువ్వు నాతో టచ్‌లో ఉండు.. మీ బావకు ఏం చెప్పొద్దని వెళ్లిపోతుంది. కాశీ లోపలికి వెళ్తుండగా దాస్ ఎదురై కొడుకుని లాగిపెట్టి కొడుతాడు. స్వప్న అకౌంట్స్ గురించి మాట్లాడుతుంటే శ్రీధర్ ఆపాడని... అనుమానం వచ్చి నేను నిన్ను ఫాలో అయ్యానని అంటాడు దాస్. నువ్వు చేతగాని తండ్రివి.. ఏనాడు నన్ను నమ్మింది లేదు, నా కోసం నిలబడింది లేదు.. పుట్టగానే మా అక్క చచ్చిపోయింది అంటే నీలాంటి వాడికి కూతురిగా ఉండేకంటే చచ్చిపోవడమే మంచిదని ఆమె చనిపోయిందని నానామాటలు అంటాడు కాశీ.

నువ్వు జ్యోత్స్న గురించి శివన్నారాయణ గారికి నిజం చెప్పేయమని బతిమలాడతాడు దాస్. నువ్వు జ్యోత్స్న ట్రాప్‌లో ఉన్నావని కొడుక్కి నచ్చచెబుతాడు. నా కంటికి జ్యోత్స్న అక్క తప్ప ఎవరూ కనిపించడం లేదు, ఇక నుంచి నీ బతుకు నువ్వు బతుకు అని కోపంగా వెళ్లిపోతాడు కాశీ. నీ తమ్ముడి జీవితాన్ని నాశనం చేయడంతో పాటు తండ్రి కొడుకుల్ని కూడా విడదీశావు.. నిన్ను ఇక క్షమించలేనని జ్యోత్స్నపై రగిలిపోతాడు. ఏం జరిగితే అదే జరిగింది జ్యోత్స్న నా కూతురేనని నిజం చెప్పేస్తానని అనుకుంటాడు దాస్. వెంటనే ఈ విషయాన్ని కార్తీక్‌కి ఫోన్ చేసి చెబుతాడు. ఆ మాటలతో కార్తీక్ షాక్ అవుతాడు. కాశీ మనసును కూడా చెడగొట్టి శ్రీధర్‌ మీదకి ఉసిగొల్పిందని దాస్ బాధపడతాడు. మనం కలుద్దాం.. మాట్లాడుకుందామని కార్తీక్ ఎంత చెబుతున్నా వినిపించుకోడు దాస్. ఈ విషయాన్ని దీపకు చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది.

శివన్నారాయణ ఇంటి దగ్గర దాస్‌కి జ్యోత్స్న ఎదురవుతుంది. నువ్వు కాశీతో మాట్లాడటం నేను చూశాను.. నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి వస్తావని నాకు తెలుసు, అందుకే నీకోసం ఎదురుచూస్తున్నానని అంటుంది జ్యోత్స్న. నీ ఎదుగుదలకి నీ తెలివితేటల కోసం వాడుకుని ఉంటే నువ్వు చాలా గొప్పదానివి అయ్యేదానివి అంటాడు దాస్. సొంత తండ్రినే చంపాలని అనుకున్న దానివి తమ్ముడిని ఎందుకు వదులుతావని మండిపడతాడు. విలువల్ని వదిలేసి మోసాలతో బతకడం కరెక్ట్ కాదని దాస్ చెబుతాడు. బాగున్న పిల్లల్ని నువ్వు రోడ్డు మీద పడేస్తున్నావని మండిపడతాడు దాస్. ఈ ఇంటి వారసురాలిగా నీలాంటి పాపాత్మురాలు ఉండకూడదు.. అందరినీ చంపుతావు కానీ, నీ ప్రాణాలు నీకు కావాలి కదా అని అంటాడు దాస్. ఇప్పుడే నిజం చెప్పేస్తానని జ్యోత్స్న వద్దు అంటున్నా వినిపించుకోకుండా లోపలికి వెళ్లి అందరినీ పిలుస్తాడు దాస్.

అర్ధరాత్రి దాస్ రావడంతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. వదిన రావాలని, నిజం చెప్పాలని అంటాడు దాస్. ఇంతలో సుమిత్ర రావడంతో ఏం జరిగిందని అడుగుతుంది. కొన్నేళ్ల క్రితం జరిగిన అన్యాయం నా కళ్లముందు కనిపిస్తోందని చెబుతాడు దాస్. నాకు కూతురు పుట్టింది.. ఒక చావు అంటే సైదులు గాడు చచ్చిపోయాడు. ఓ బ్రతుకు అంటే ఈ ఇంటి వారసురాలు చావు నుంచి తప్పించుకుని బతికి దూరంగా వెళ్లిపోయిందని అంటాడు దాస్. ఆ మాటలతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. ఈ ఇంటి వారసురాలు చావుకు దూరంగా వెళ్లిపోవడం ఏంటీ? నా కూతురు నా కళ్ల ముందే ఉంది కదా అని అంటుంది సుమిత్ర. జ్యోత్స్న నీ కూతురు కాదు వదిన.. నా కూతురు అంటాడు దాస్. ఆ మాటలతో అంతా ఉలిక్కిపడతారు. పారిజాతం అడ్డుపడుతుండగా నువ్వు నాకు అడ్డొస్తే నేను చచ్చినంత ఒట్టు అంటాడు దాస్. మరి జ్యోత్స్న ఎవరి కూతురు అని దశరథ అడగ్గా.. నా కూతురు అంటాడు దాస్. ఈ మాటలతో జ్యోత్స్న, పారిజాతంలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X