Karthika Deepam 2 January 15th: తనపై హత్యాయత్నం బయటపెట్టిన దాస్... జ్యోత్స్న‌ని కాల్చిపారేసిన పారిజాతం

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న చేష్టలు, దాని ఆలోచనలు చూస్తుంటే అది అసలు మా వదినకి కూతురేనా అని కార్తీక్‌ను అడుగుతుంది కాంచన. సుమిత్ర అత్తను ట్రీట్‌మెంట్‌కి ప్రిపేర్ చేయాలని, మనకి టైం లేదని రేపే అసలు నిజం చెప్పేస్తానని దీపతో అంటాడు కార్తీక్. స్వప్న మాటలతో బాధపడుతున్న కాశీని మరింత ట్రాప్ చేస్తుంది జ్యోత్స్న. నా ఫైల్స్ అన్నీ ఎక్కడ అని అడగ్గా.. అవి మావయ్యగారి దగ్గరే ఉన్నాయని కాశీ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. స్వప్న పోతే పోయింది నీకు మరో పెళ్లి చేస్తా, టాప్‌కి తీసుకెళ్తానని చెబుతుంది జ్యోత్స్న. ఈ మాటలన్నీ విన్న దాస్.. కొడుకుని లాగిపెట్టి కొడతాడు. నీలాంటి చేతగాని తండ్రి వల్లే ఇలా అయిపోయానని నానామాటలు అంటాడు కాశీ.

జ్యోత్స్న కారణంగా కుటుంబాలు నాశనం అయిపోతుండటంతో ఆమె ఎవరనే నిజం చెప్పేయాలని అనుకుంటాడు దాస్. అర్ధరాత్రి ఈ విషయం కార్తీక్‌కి ఫోన్ చేసి చెప్పగా అతను షాకై బయల్దేరతాడు. శివన్నారాయన ఇంటి దగ్గర దాస్‌కి జ్యోత్స్న ఎదురై నానామాటలు అంటుంది. ఈరోజు ఏం జరిగినా సరే నువ్వు నా కూతురివేనని నిజం చెప్పేస్తానని లోపలికి వెళ్తాడు. అర్ధరాత్రి దాస్ రావడంతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 15వ తేదీ 568వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 568 January 15th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న నీ కూతురు కాదు వదిన .. నా కూతురు అని చెబుతాడు దాస్. ఆ మాటలతో శివన్నారాయణ ఫ్యామిలీ, జ్యోత్న్న, పారిజాతంలు షాక్ అవుతారు. నా మనవరాలు నీ కూతురు ఎలా అవుతుందని శివన్నారాయణ ప్రశ్నించగా... బిడ్డలు మారిపోయారు, నా కూతురు నీ కూతురి స్థానంలోకి వచ్చిందని చెబుతాడు దాస్. నీ కూతురు ఈ ఇంటికి దూరంగా అనాథలా బతుకుతోందని, కానీ ఇప్పుడు అనాథ కాదని చెబుతాడు. బిడ్డలు మారిపోయారని నీకెలా తెలుసని సుమిత్ర ప్రశ్నించగా.. ప్రత్యక్ష సాక్షిని నేనే అని అంటాడు దాస్. నీ బిడ్డ స్థానంలో నా బిడ్డను పడుకోబెట్టి.. నీ బిడ్డను చంపడానికి తీసుకెళ్లానని చెబుతాడు. కానీ బిడ్డ ఆయుష్సు గట్టిది.. బ్రతికే ఉంది. నా బిడ్డ ఎవరు? అని సుమిత్ర ప్రశ్నిస్తుంది.

ఎవరు నిన్ను చంపబోతుంటే నీ ప్రాణాలు కాపాడుతూ నీ జీవితంలోకి వచ్చిన నీ ప్రాణదాత దీపే నీ కన్నకూతురు అని చెబుతాడు దాస్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. బస్టాండ్‌లో వదిలేసిన బిడ్డను కుబేర్ తీసుకెళ్లి పెంచుకున్నాడు. మీ దగ్గర వదిలేసిన నా బిడ్డను మీరు నా కూతురుగా పెంచుకున్నారని చెబుతాడు దాస్. ఆ మాటలతో సీరియస్ అయిన శివన్నారాయణ... బిడ్డలను మార్చిందెవరు అని నిలదీస్తాడు. మా అమ్మ పారిజాతం... మీ మీద పగతోనే ఈ పని చేసిందని అంటాడు దాస్. ఆ మాటలతో శివన్నారాయణ షాక్ అవుతాడు. నీ కొడుకుని ఈ ఇంట్లో నుంచి గెంటేశానని.. ఈ ఇంటి పనిమనిషి కూతురిని ఈ ఇంటి వారసురాలిని చేశావు, ఈ ఇంటి వారసురాలిని ఈ ఇంటి పనిమనిషిని చేశావని మండిపడతాడు. తెలియక చేశానని.. క్షమించాలని అడుగుతుంది పారిజాతం.

పారిజాతాన్ని బతకనివ్వకూడదని తుపాకీ తీసుకుని వస్తాడు శివన్నారాయణ. ఇక్కడ ప్రక్షాళన చేయాల్సిన పాపాలు చాలా ఉన్నాయి, నేనెక్కడ నిజం చెబుతానో అని నా కూతురే నన్ను చంపే ప్రయత్నం చేసిందని దాస్ అనడంతో అంతా షాక్ అవుతారు. దశరథ అన్నయ్య బతికించాడు కానీ లేదంటే చచ్చిపోయే వాడినని అంటాడు దశరథ. ఆ మాటలతో పారిజాతం రగిలిపోతుంది. నీ కోసం నా జీవితాన్ని ధారపోస్తే... నువ్వు నా కొడుకునే చంపాలని అనుకుంటున్నావా? అంటూ శివన్నారాయణ దగ్గర తుపాకీ లాక్కుని జ్యోత్స్నని కాలుస్తుంది. దాంతో ఉలిక్కిపడుతుంది జ్యోత్స్న. ఇదంతా నా కల అనుకుంటుంది. నేను నిజం చెబితే జరగబోయేది తలచుకుంటున్నావా? అని అడుగుతాడు దాస్.

నీకు దండం పెడతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో.. కావాలంటే నేను కాశీతో మాట్లాడటం మానేస్తాను అంటుంది జ్యోత్స్న. నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు, నేను కూడా నీ తండ్రినే కదా? నేను కూడా నిలబడనని వెళ్లిపోతుండగా.. దాస్‌ ముఖంపై స్ప్రే కొడుతుంది. నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని అనుభవించు అంటూ మండిపడుతుంది. ఆ వెంటనే తన మనుషుల్ని పిలిపించి దాస్‌ని వేరే ప్లేస్‌కి తీసుకెళ్లమని చెబుతుంది. ఇంతలో కార్తీక్ రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతలో పారిజాతం వచ్చి ఈ టైంలో ఎందుకు వచ్చావని కార్తీక్‌ని అడుగుతాడు. దాస్ మావయ్య కోసం అని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నిజం చెబుతానని నాకు ఫోన్ చేశాడని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న ఉలిక్కిపడతాడు.

దాస్ మావయ్య ఇక్కడికి రాలేదని.. నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నానని జ్యోత్న్న కవర్ చేస్తుండగా.. దాస్ చేయి కనిపించడంతో ఆమెకు ముచ్చెమటలు పడతాయి. దాస్ ఉన్న వైపు... కార్తీక్ వెళ్లబోతుండగా జ్యోత్స్న గట్టిగా పిలిచి నువ్వు బయల్దేరితే మంచిదని అంటుంది. ప్రతిదానికి అనుమానించడం, మనింటి దగ్గరే కాపలా కాయడం బావకి అలవాటైపోయిందని అంటుంది జ్యోత్న్న. డ్రైవర్ డ్యూటీతో పాటు వాచ్‌మెన్ డ్యూటీ కూడా చేస్తున్నావా అంటూ పారిజాతం సెటైర్లు వేస్తుంది. నేను అన్ని డ్యూటీలు చేస్తాను.. ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్లకి చేస్తానని కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కార్తీక్ ఇంటికి వెళ్లిపోవడంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది.

కార్తీక్ ఇంటికి రాకపోవడంతో అతని కోసం వెయిట్ చేస్తుంది దీప. ఇంతలో కాంచన వచ్చి కార్తీక్ ఎక్కడ? అని అడుగుతుంది. దాస్ బాబాయ్ ఫోన్ చేస్తే హడావుడిగా వెళ్లాడని దీప చెప్పడంతో.. ఈ టైంలో దాస్ ఎందుకు ఫోన్ చేశాడు? నాకు తెలియకుండా ఏమైనా దాస్తున్నావా? అని మండిపడుతుంది కాంచన. ఇంత రాత్రివేళ మీ ఆయన వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావని సీరియస్ అవుతుంది. మా ఆయన నా మాట ఎందుకు వింటాడని అంటుంది దీప. ఇంతలో కార్తీక్ రావడంతో దాస్ అన్నయ్యని కలిశావా? అని అడుగుతుంది కాంచన. దాస్ మావయ్యని కలుద్దామనే వెళ్లాను, కానీ ఆయన నాకు కలవలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని చెబుతాడు కార్తీక్.

అంత పెద్ద సమస్య దాస్ అన్నయ్యకి ఏమొచ్చిందని కాంచన అడుగుతుంది. కాశీ జైలు నుంచి విడుదలయ్యాడు కదా? ఇంటి దగ్గర ఏదైనా గొడవ జరిగిందేమోనని అంటుంది దీప. ఆ కాశీగాడి వల్ల దాస్ అన్నయ్యకి కష్టం వచ్చింది.. వాడిని ఏదో ఒకటి చేసి దారిలోకి తీసుకురమ్మని చెబుతుంది కాంచన. దాస్ మావయ్య ఏమైపోయాడు, జ్యోత్స్న నా కాల్ ఎందుకు ఎత్తడం లేదని కార్తీక్‌కి అనుమానం వస్తుంది. దాస్‌కి తాళ్లతో కట్టి బంధిస్తుంది జ్యోత్స్న. అసలు నీకు ఈ ఖర్మ ఎందుకు? నీ మానాన నువ్వు ఊళ్లు పట్టుకుని తిరగొచ్చు కదా? నిన్ను చంపను నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి నువ్వు వేసిన ప్లాన్స్ అన్నింటిని దాటుకుని నేను ఎలా గెలుస్తానో నువ్వు చూడాలని అంటుంది జ్యోత్స్న.

ఇది నాతోనే ఆగిపోకూడదు.. నా తమ్ముడిని కూడా నేను కలుపుకుంటాను, వాడికి నేనే సొంత అక్కని అని చెబుతాను. వాడిని చాలా గొప్పస్థాయికి తీసుకొస్తాను ఇవన్నీ నువ్వు చూడాలని అంటుంది. ఆ మాటలతో దాస్ నవ్వేస్తాడు. నీకు టైం దగ్గర పడింది.. తప్పులు చేసే స్థాయి నుంచి పాపాలు చేసే స్థాయికి ఎదిగావు, నీ పతనం మొదలైంది, నువ్వు అనుకున్నది ఏది జరగదు అని అంటాడు దాస్. ఇంతలో కార్తీక్ నుంచి ఫోన్ రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ ఫోన్‌ ఎప్పుడూ ఆన్‌లోనే ఉండాలి.. ఈ ఫోన్ తీసుకుని ఊరంతా తిరగమని రౌడీలకు చెబుతుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X