Karthika Deepam 2 January 16th:దాస్ మిస్సింగ్..జ్యోత్స్నపై కార్తీక్‌ అనుమానం, సుమిత్రకు నిజం చెప్పిన జ్యోత్స్న

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న నీ కూతురు కాదని నా కూతురని సుమిత్రకు దాస్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. బిడ్డలు మారిపోయారని.. నీ కూతురిగా ఉన్నది నా కూతురని, నీ కూతురు అనాథగా ఎక్కడో పెరుగుతోందని చెబుతాడు. ఆ మాటలు విన్న శివన్నారాయణ.. అసలు బిడ్డల్ని మార్చింది ఎవరు? అని ప్రశ్నించగా... నా తల్లి పారిజాతం అని చెప్పడంతో పెద్దాయన గన్ తీసుకొచ్చి కాల్చేస్తానని అంటాడు. దాంతో భర్త కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగుతుంది పారు. అసలు పాపాత్మురాలు జ్యోత్స్న అని.. ఈ నిజం ఎక్కడ చెప్పేస్తానో అని నన్ను చంపాలని చూసిందని, దశరథ అన్నయ్య బతికించాడని చెబుతాడు. ఆ మాటలు విన్న పారిజాతం.. నా కొడుకునే చంపాలని అనుకున్న నిన్ను చంపేస్తానని జ్యోత్స్నని కాల్చేస్తుంది.

ఆ వెంటనే ఉలిక్కిపడ్డ జ్యోత్స్న జరిగింది కల.. అని రేపు దాస్ నిజం చెబితే ఇదే జరుగుతుందని భయపడి.. తండ్రి ముఖంపై స్ప్రే కొట్టి కిడ్నాప్ చేయిస్తుంది. ఇంతలో దాస్‌ని వెతుక్కుంటూ కార్తీక్ రాగా... అతనిని డైవర్ట్ చేస్తుంది జ్యోత్స్న. కార్తీక్ అర్ధరాత్రి బయటకు వెళ్లడంతో కాంచన, దీపలు కంగారుపడతారు. దాస్‌ని కిడ్నాప్ చేసిన జ్యోత్స్న తన డెన్‌లో దాచిపెడుతుంది. కాశీకి నేనే అక్కని అని నిజం చెప్పేస్తానని అనడంతో దాస్ కంగారుపడతాడు. ఇంతలో కార్తీక్ నుంచి ఫోన్ రావడంతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 16వ తేదీ 569వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 569 January 16th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దాస్‌ని కిడ్నాప్ చేయించిన జ్యోత్స్న... ఫోన్‌ని సిటీ మొత్తం తిప్పమని తన అనుచరులకు ఇస్తుంది. మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి... నేను వదిలేయమని చెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండాలని అంటుంది. చావు అంటే నాకు భయం లేదు.. కానీ బతుకంటే నువ్వు భయపడుతున్నావు, ఇక మీదటే భయపడుతూనే ఉంటావు. నీ టైం దగ్గర పడిందని చెబుతాడు దాస్. నువ్వు ఇలాగే జాతకాలు చెబుతూనే ఉండు... నేనే ఏం చేయాలో అది చేస్తానని అంటుంది జ్యోత్స్న. వాడు ఎవడిని వదిలిపెట్టడని అనుకుంటాడు దాస్. మరోవైపు... దాస్ కలవకపోవడం, సమయానికి అక్కడ జ్యోత్స్న ఉండటం ఏదో తేడాగా ఉంది. దాస్ మావయ్య తాతయ్య వాళ్ల ఇంటికే వెళ్లాలి.. ఆయన అంత ఆవేశంగా మాట్లాడటం ఇదే తొలిసారి అని అంటాడు కార్తీక్. తన నిజం ఎక్కడ బయటపడుతుందోనని జ్యోత్స్ననే దాస్ బాబాయ్‌ని ఏమైనా చేసిందా అని దీప అనుమానిస్తుంది.

నాకు ఫోన్ చేసినట్లే జ్యోత్స్నకి కాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దాస్ మావయ్యని ఏదో చేసే ఉంటుంది. కానీ పారు ఉండగా మాత్రం ఏం చేయలేదు.. ఎందుకంటే పారుకి తన కొడుకంటే ఎంతో ప్రేమ. అందుకే బిడ్డల్ని మార్చేసిందని చెబుతాడు కార్తీక్. దాస్ మావయ్యని జ్యోత్స్న ఏదో చేసుండాలి, లేదా నా మాటలకు ఆయన ఆలోచనలో పడి వెనక్కి తగ్గాడేమో అని అనుకుంటాడు కార్తీక్. ఉదయాన్నే దీప, కార్తీక్‌లు శివన్నారాయణ ఇంటికి వస్తారు.. అత్తకి నిజం చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లమని అడుగుతాడు కార్తీక్. ఆమెకు నేను నిజం చెప్పలేనని బాధపడతాడు. నువ్వు మాత్రమే మా అమ్మకి భయపడకుండా నిజం చెప్పగలవని దీప అంటుంది. మనం లేట్ చేసే కొద్దీ అత్తకు సీరియస్ అవుతుందని కంగారుపడతాడు కార్తీక్. మావయ్య ఎలా అయితే నాటకం ఆడి టెస్టులు చేయించాడో అలాగే నేను కూడా అత్తని ఆసుపత్రికి తీసుకెళ్తానని దీపకి చెబుతాడు కార్తీక్. హాస్పిటల్‌లో నిజం చెప్పి అత్తకు ట్రీట్‌మెంట్ చేయిద్దామని అంటాడు.

మరోవైపు... సుమిత్రకు బాగా దగ్గు రావడంతో పాటు కళ్లు మసకబారినట్లుగా కనిపించడంతో టెన్షన్ పడుతుంది. మెట్లు దిగుతూ కళ్లు తిరిగి కిందపడిపోతూ ఉండటంతో దీప పట్టుకుంటుంది. దాంతో శివన్నారాయణ కుటుంబం మొత్తం కంగారుపడుతుంది. నిన్ను రూమ్‌లోనే ఉండమని చెప్పాను కదా? నువ్వెందుకు కిందకు వచ్చావని మండిపడతాడు దశరథ. అత్తను హాస్పిటల్‌కు తీసుకెళ్దామని కార్తీక్ చెప్పగా... నాకేం కాలేదు, నేనెందుకు వెళ్లాలని అడుగుతుంది సుమిత్ర. హెల్త్‌ను అశ్రద్ధ చేయొద్దు డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెబుతాడు కార్తీక్. అసలు నాకేమైంది? వారం రోజుల నుంచి మీరంతా తేడా బిహేవ్ ఇస్తున్నారు? ట్యాబ్లెట్స్ వాడమంటున్నారు, డాక్టర్స్‌ని పిలుస్తున్నారు? ఒక గ్లాస్ మంచి నీళ్లు కూడా ఇవ్వని నా కూతురు కూడా జ్యూస్ చేసుకుని వచ్చింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది సుమిత్ర.

నాకు నా ఆరోగ్యం మీద ఎప్పుడూ అనుమానం రాలేదు.. కానీ మీ అందరినీ చూస్తుంటే ఇప్పుడు అనుమానం వస్తుంది. నాకు ఏం జరిగింది? హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత ఏం చెప్పాలని అనుకుంటున్నావని కార్తీక్‌ను ప్రశ్నిస్తుంది. మీతో చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయానని, నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు.. దీని వెనుక ఏదో కారణం ఉందని దశరథను నిలదీస్తుంది. మా నాన్నకి నేను కొడుకుని, నువ్వు కోడలివి మనిద్దరినీ ఎప్పుడూ ఒకేలా చూశారని చెబుతాడు దశరథ. కార్తీక్ నా మేనల్లుడు, జ్యోత్స్న మన కూతురు.. వీళ్లిద్దరినీ కూడా మనం ఒకేలా చూసుకున్నామని అంటాడు. మనం ఎలా అయితే వాళ్ల క్షేమాన్ని కోరుకుంటున్నామో... వాళ్లు కూడా మన క్షేమాన్ని కోరుకుంటారు..కార్తీక్ అడిగిన వెంటనే నువ్వెందుకు ఆసుపత్రికి వెళ్లను అంటున్నావని నిలదీస్తాడు దశరథ.

మీరు కూడా నా ప్రశ్నలకు సమాధానం చెప్పరని అర్ధమైంది? ఇప్పటి వరకు నాలో భయం కొంచెమే ఉండేది.. భయంతోనే చచ్చిపోతానేమో అనిపిస్తదని అంటుంది సుమిత్ర. ఆ మాటలతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. మీకు ఏం కాదని దీప చెప్పగా... సుమిత్ర సీరియస్ అవుతుంది. కడుపుతో ఉన్న పిల్లవి.. ఇంటి దగ్గర ఉండమంటే నువ్వు విన్నావ అని నిలదీస్తుంది. నా సమస్య వేరు, మీ సమస్య వేరని దీప చెప్పబోతుండగా కార్తీక్ వద్దని సైగలు చేస్తాడు. నా సమస్య నువ్వు చెప్పవని నాకు తెలుసు... ఎవరితో చెప్పించాలో నాకు తెలుసని జ్యోత్స్న దగ్గరికి వస్తుంది సుమిత్ర. నువ్వు నా కూతురివే కదా? నా మీద ఒట్టేసి నాకు ఏం జరిగిందో చెప్పమని తలపై చేయి పెట్టుకోవడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పకపోతే నువ్వు నా కూతురివి కానట్లే అని అంటుంది. దాంతో వద్దు అని దీప సైగలు చేస్తుంది. నిజం చెబుతావా? భయంతోనే నన్ను చావమంటావా? అని సుమిత్ర అడుగుతుంది. చెబుతావా? అందరిలాగే నిన్ను కూడా వదిలేయమంటావా? అని సుమిత్ర అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

దాంతో నీకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది.. నీకు బ్లడ్ క్యాన్సర్ అని జ్యోత్స్న చెప్పడంతో సుమిత్ర ఉలిక్కిపడుతుంది. నిజం తెలియడంతో శివన్నారాయణ కుటుంబం కంగారు పడుతుంది. నాకు బ్లడ్ క్యాన్సర్ అంటే నేను చచ్చిపోతాను, నా కూతురి పెళ్లి చూడకుండానే నేను చచ్చిపోతానని కంగారుపడుతూ కుర్చీలో కూలబడిపోతుంది. దగ్గుతుండగా నోటి వెంట రక్తం రావడంతో సుమిత్ర కంగారుపడుతుంది. నాకు ఇంత పెద్ద వ్యాధి ఉందని నా దగ్గర చెప్పకుండా దాచారా? అని సుమిత్ర అడగ్గా.. మీరు ఇలా అయిపోతారనే మీకు చెప్పలేదని అంటుంది దీప. ఈ మనిషికి బుద్ధి లేదు, ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదని జ్యోత్స్నపై మండిపడుతుంది దీప. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X