Karthika Deepam 2 January 17th: సుమిత్ర కోసం జ్యోత్స్నకి మెడికల్ టెస్టులు.. పారిజాతానికి ముచ్చెమటలు

Photo Courtesy: JioHotstar

దాస్‌ని తన మనుషులతో కిడ్నాప్ చేయించిన జ్యోత్స్న... జాగ్రత్తగా చూసుకోమని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో కార్తీక్ ఫోన్ చేయడంతో దాస్ ఫోన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచమని చెబుతుంది. దాస్ మావయ్య ఏమయ్యాడో అర్ధం కావడం లేదని.. జ్యోత్స్న మీదే అనుమానంగా ఉందని దీపతో అంటాడు కార్తీక్. సుమిత్ర అత్తకి నిజం చెప్పి ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని.. టైం లేదని దీప, కార్తీక్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు.

ఉదయాన్నే నిద్రలేచిన సుమిత్రకు కళ్లు మసకబారడం, విపరీతంగా దగ్గురావడంతో నడుచుకుంటూ వస్తూ మెట్లపై నుంచి జారిపోతుండగా దీప పట్టుకుంటుంది. నాకేం జరిగింది? ఇంట్లో వాళ్లంతా ఎందుకు అలా ఉన్నారు? అని అందరినీ నిలదీస్తుంది సుమిత్ర. ఎవ్వరూ సమాధానం చెప్పకపోవడంతో జ్యోత్స్న దగ్గరికి వెళ్లి తలపై ఒట్టు పెట్టి.. నువ్వు నా కన్నకూతురివి అయితే నిజం చెప్పమని అనడంతో దీప వద్దని సైగలు చేస్తున్నా నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేస్తుంది జ్యోత్స్న. ఆ మాటలతో సుమిత్ర షాక్ అయి సోఫాలో కుప్పకూలుతుంది. దాంతో ఆమెకు ఏం జరిగిందోనని శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 17వ తేదీ 570వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 570 January 17th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

తల మీద చెయ్యి పెడితే నిజం చెప్పేస్తావా అని జ్యోత్స్నపై సీరియస్ అవుతుంది దీప. అదే నీ మీద పెడితే నువ్వు చెప్పవు కదా? జ్యోత్స్న నా కూతురు.. నేను ఎక్కడ చనిపోతానో అని నిజం చెప్పేసింది.. అదే నువ్వు అయితే నేను చచ్చిపోయినా కూడా నిజం చెప్పవు కదా అని సుమిత్ర అనడంతో దీప కంటతడి పెట్టుకుంటుంది. నీకేం కాదని దశరథ అన్నప్పటికీ నా ఆరోగ్యం నాకు తెలుస్తోందని ఏం జరగబోతుందో అర్ధమవుతుందని అంటుంది సుమిత్ర. మాట్లాడుతూ... మాట్లాడుతూ దశరథ మీద సుమిత్ర కుప్పకూలడంతో అంతా షాక్ అవుతారు.

స్వప్నకి కాశీ ఫోన్ చేసి నా బ్యాగ్‌తో పాటు నువ్వు కూడా రెడీగా ఉంటే మనం వేరే ఇంట్లో ఉందామని చెబుతాడు. మనిద్దరం ఒకే ఇంట్లో ఉండటం కలిసుండటం కుదరదని తేల్చేస్తుంది స్వప్న. మన పెళ్లితో సహా జరిగినదంతా మరిచిపోమ్మని చెబుతుంది. కాశీ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తుంది స్వప్న. నువ్వు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావాల్సిందేనని అనుకుంటాడు కాశీ. నువ్వు ఎలా రావో నేను కూడా చూసుకుంటానని అనుకుని కోపంగా వెళ్లిపోతాడు.

సుమిత్రను క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్ కోసం ధైర్యం చెబుతుంది డాక్టర్. ప్రాణం పోయేంత వ్యాధి ఉన్నప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందని సుమిత్ర ప్రశ్నిస్తుంది. వ్యాధి కంటే భయం చాలా ప్రమాదకరమని చెబుతుంది డాక్టర్. మీ సమస్యకు పరిష్కారం మీ కూతురే.. మీకొచ్చిన వ్యాధికి నయం చేయాలంటే బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి. మీకున్న ఒకే ఒక్క రక్త సంబంధీకురాలు మీ కన్నకూతురు. మీ బిడ్డే మీ ప్రాణదాత అంటుంది డాక్టర్. ఈరోజు మిమ్మల్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలి.. దానికంటే ముందు మీ అమ్మాయి జ్యోత్స్నకు కొన్ని మెడికల్ టెస్టులు చేయాలని చెబుతుంది డాక్టర్. ఆ మాటలు వినగానే జ్యోత్స్న, పారులు వణికిపోతారు. దాంతో జ్యోత్స్న, పిన్నిలను తీసుకుని ఆసుపత్రికి వెళ్లమని చెబుతాడు దశరథ.

మీకు ఏం కాకూడదని దీపగారు బలంగా కోరుకుంటున్నారు... ఆవిడకి, మీకు ఏ బంధమైతే ఉందో.. నేను మొదటిసారి దీపను చూసినప్పుడు ఆవిడ కళ్లలో ఏ కన్నీళ్లు ఉన్నాయో ఇప్పటికీ కూడా ఆ కన్నీళ్లు అలాగే ఉన్నాయని అంటుంది డాక్టర్. తను కార్తీక్ భార్యగానే పరిచయమా? తనకి మీకు ఏమైనా పరిచయమా? అని అడగ్గా.. కార్తీక్ భార్య కాబట్టి వరుసకు కూతురు అవుతుందని చెబుతుంది సుమిత్ర. అయితే మీకు ఇద్దరు కూతుళ్లు.. వాళ్లిద్దరే మిమ్మల్ని కాపాడుకుంటారని అంటుంది డాక్టర్. హాస్పిటల్‌కు ఎలా వెళ్లాలో అర్ధంకాక జ్యోత్స్న, పారిజాతంలు వణికిపోతారు.

నాకు ప్రోణం పోయడానికే నీకు జన్మనిచ్చినట్లుగా ఉన్నాను.. తల్లి రుణం ఈ రూపంలో తీర్చుకుంటున్నావా? అని జ్యోత్స్నతో అంటుంది సుమిత్ర. నీ కన్నకూతురికి నీ రుణం తీర్చుకోవాల్సిన టైం వచ్చింది.. నీ కూతురు గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారని అంటాడు కార్తీక్. నిజం బయటపడితే మా గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారని జ్యోత్స్న, పారిజాతంలు వణికిపోతారు. హాస్పిటల్‌లో ఏం చేయాలో ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? అని పారు, దీపలు మాట్లాడుకుంటూ ఉండగా దీప వచ్చి అన్ని వింటుంది. ఆమెను చూడగానే వారిద్దరూ షాక్ అవుతారు. దేనికో మీరిద్దరూ కంగారుపడుతున్నారని దీప అనగానే ఇంకా షాక్ అవుతారు. నిజాలు బయటపడకూడదని మీరెంత ప్రయత్నించినా.. ఆ టైం వచ్చినప్పుడు నిజాలు బయటపడకుండా ఉండవని అంటుంది దీప. తల్లిని కాపాడాల్సిన బాధ్యత మీదే కాబట్టి మీరు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది.

అమ్మ దూరమై నాన్నపడే బాధ కళ్లారా చూశాను.. ఇప్పుడు అన్నయ్యకి కూడా ఇదే పరిస్ధితి వస్తుందా? నాన్నతో ఒకసారి మాట్లాడాలని శివన్నారాయణకు ఫోన్ చేస్తుంది కాంచన. ఇంట్లో కష్టాలు, గండాలు వస్తున్నాయి, పాతుకుపోతున్నాయి... పంతులుగారు ఎప్పుడో చెప్పారు, ఈ ఇంటి ఆడపడుచు కన్నీళ్లు శాపంగా మారి ఉండొచ్చు. నేను నీ విషయంలో చేసిన పొరపాటు ఇలా వెంటాడుతోంది. నా అనుకున్నవాళ్లు ఎప్పుడూ నా దగ్గర ఉండరు, నాకు దూరమవుతూనే ఉంటారు. సుమిత్రను ఎప్పుడూ కోడలిగా చూడలేదు.. నాకిద్దరు కూతుళ్లనే అనుకున్నాను, ఇప్పుడు తనకి కష్టం వచ్చింది. ఎంత దాచిపెడదామని చూసినా ఈరోజు తను తెలుసుకుందని శివన్నారాయణ చెప్పడంతో వదినకి నిజం తెలిసిపోయిందా అని కాంచన షాక్ అవుతుంది.

జరిగినదంతా కాంచనకి చెబుతాడు శివన్నారాయణ. మాయదారి రోగం అమ్మని వెంటాడింది.. ఊహించని విధంగా అమ్మని మాకు దూరం చేసింది. నువ్వుపడ్డ బాధ ఇంకా మాకు కళ్లముందు కనిపిస్తోందని బాధపడుతుంది కాంచన. ఇప్పుడు ఆ పరిస్ధితే మీ అన్నయ్యకి వస్తుందని భయంగా ఉందని శివన్నారాయణ వెక్కి వెక్కి ఏడుస్తాడు. తను దూరమైపోతే అన్నయ్య ఏమైపోతాడోనని ఊహించడానికే భయంగా ఉందని, వదిన బతకాలి, ఏం చేసైనా సరే తనని కాపాడుకోవాలని చెబుతుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి, మమ్మల్ని ముందుండి నడిపించాలని తండ్రికి ధైర్యం చెబుతుంది కాంచన. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X