Karthika Deepam 2 January 19th: జ్యోత్స్న‌కు మొదలైన కౌంట్‌డౌన్.. దీప బిడ్డకు పొంచిఉన్న గండం

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న నిజం చెప్పడంతో సుమిత్ర రక్తం కక్కుకుంటూ సోఫాలో కుప్పకూలుతుంది. దాంతో డాక్టర్‌ను పిలిపించి సుమిత్రకు టెస్టులు చేయిస్తాడు దశరథ. మీ కోసం ఇంతమంది ఉన్నారు.. మీకు ఏం కాదని, భయం మనిషిని చంపేస్తుందని డాక్టర్ ధైర్యం చెబుతుంది. మిమ్మల్ని కాపాడే మీ అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది అంటుంది. దీపను చూడగానే మొదట్లో నాకు మీ కూతురే అనిపించింది అని చెబుతుంది. బోన్‌మారో ఇవ్వాల్సింది మీ కూతురే కాబట్టి... ఆమెకు కొన్ని టెస్టులు చేయాలని డాక్టర్ చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతంలు నిజం ఎక్కడ బయటపడుతుందోనని టెన్షన్ పడతారు. కార్తీక్‌తో కలిసి హాస్పిటల్‌కు వెళ్లమని దశరథ చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతంలు ఉలిక్కిపడతారు.

హాస్పిటల్‌కు వెళితే మన గుట్టు బయటపడిపోతుందని... ఎలా తప్పించుకోవాలా అని పారిజాతంతో మాట్లాడుతుంది జ్యోత్స్న. ఇంతలో దీప రావడంతో ఇద్దరూ కంగారు పడతారు. బావ మీ కోసం వెయిట్ చేస్తున్నాడని దీప చెప్పడంతో మేం వచ్చేస్తున్నామని పారు కవర్ చేస్తుంది. స్వప్నకు కాశీ ఫోన్ చేసి మన కోసం వేరే ఇల్లు చూశాను... లగేజ్ తీసుకుని అక్కడికి వచ్చేయమంటాడు. దాంతో ఆమె సీరియస్‌గా ఫోన్ పెట్టేస్తుంది. నువ్వు ఎలా రావో నేను కూడా చూస్తానని మనసులో అనుకుంటాడు కాశీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 19వ తేదీ 571వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 571 January 19th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

ఆసుపత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించుకోవడానికి బ్లడ్ ఇవ్వమని కార్తీక్ కంగారుపెట్టడంతో జ్యోత్స్న, పారిజాతంలు వణికిపోతారు. నాకు బ్లడ్ తీస్తే చాలా భయమని రేపు ఇస్తానని నాటకాలు ఆడుతుంది జ్యోత్స్న. ఈలోపు దాస్‌కి ఫోన్ చేసి అసలు కూతురిని కనుక్కునే పని ఎక్కడి వరకు వచ్చిందని అడుగుదామని అనుకుంటుంది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుపడుతుంది పారిజాతం. బ్లడ్ శాంపిల్స్ మా ఇంట్లో ఎవరైనా ఇవ్వొచ్చా? వేరే మార్గం ఏదైనా ఉందా? అంటూ జ్యోత్స్న రకరకాలుగా మాట్లాడుతూ ఉండటంతో నువ్వు అసలు సుమిత్రగారి కన్నకూతురివేనా? అని డాక్టర్ అడగటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

మీరు శాంపిల్స్ ఈరోజే ఇస్తేనే బోన్‌మారోలో ఏదైనా ఇబ్బంది ఉందో లేదో తెలుస్తుందని డాక్టర్ అంటుంది. మీరు ఇక్కడే ఉంటే జ్యోత్స్న ఇబ్బందిపడుతుందని కార్తీక్‌ని బయటకు పంపించేస్తుంది డాక్టర్. ఇంటి దగ్గర సుమిత్ర ఆరోగ్యం గురించి శివన్నారాయణ ఏడుస్తుండగా దీప వచ్చి కాఫీ ఇస్తుంది. సుమిత్రమ్మ గారికి ఏం కాదని పెద్దాయనకు ధైర్యం చెబుతుంది. నీ కళ్లలోనూ నీళ్లు తిరుగుతున్నాయని ఓదారుస్తాడు శివన్నారాయణ. నా కళ్ల ముందే నా భార్య చనిపోయింది.. ఏం చేయలేక చూస్తూ చూస్తూ పొగొట్టుకున్నాను అని ఏడుస్తాడు. ప్రతి గండం దాటడానికి ఆ దైవం అండగా ఉంటుందని దీప ధైర్యం చెబుతుంది. జ్యోత్స్న ఉండగా సుమిత్రకు ఏం కాదని శివన్నారాయణ కాస్త చల్లబడతాడు. ఒకసారి గురువుగారిని కలవాలని ఆయనకు ఫోన్ చేసి కారు పంపిస్తాడు.

టెస్టులు చేయించుకోవడానికి జ్యోత్స్న రెడీగా లేదని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వను అంటోందని కార్తీక్‌కు చెబుతుంది డాక్టర్. అయితే రేపు తీసుకొస్తానని చెబుతుంది పారిజాతం. జ్యోత్స్న ఈరోజే శాంపిల్స్ ఇస్తుందని చెప్పి లోపలికి వెళ్లి... శాంపిల్స్ ఇస్తావా? తాతకు ఫోన్ చేయనా అని బెదిరిస్తాడు. అత్త ఏ పరిస్ధితుల్లో ఉందో తెలిసి కూడా శాంపిల్స్ ఇవ్వనని చెబుతావా? అని మండిపడతాడు. దాంతో శాంపిల్స్ ఇవ్వడానికి జ్యోత్స్న ఒప్పుకుంటుంది. ఈ విషయాన్ని డాక్టర్ గారికి చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. కార్తీక్ దెబ్బకి జ్యోత్స్న శాంపిల్స్ ఇస్తుంది. శివన్నారాయణ ఇంటికి గురువుగారు వచ్చి.. ఈ ఇంటికి గండం ఉందని నేను అప్పుడే చెప్పానని అంటుంది.

పూర్ణాహుతి నేలపాలు అయ్యుంటే గండం అలాగే ఉండేదని.. కానీ అది నేలపాలు కాకుండా దీప కాపాడిందని చెబుతాడు గురువుగారు. ఆ రోజు దీప చేతుల మీదుగా పూర్ణాహుతి పడకపోయుంటే మా ఇంటికి ఈ అరిష్టం వచ్చి ఉండేదే కాదని జ్యోత్స్న అంటుంది. మనవరాలిని ఆపాలని పారు ఎంత చెబుతున్నా జ్యోత్స్న వినిపించుకోదు. నా భార్య తప్పు చేస్తే మరి నువ్వు చేసింది ఏంటీ? పూర్ణాహుతి నీ చేతుల మీదుగానే వేయాలి.. మరి నువ్వు ఎందుకు వదిలేశావని కార్తీక్ నిలదీస్తాడు. మా మమ్మీని పట్టుకుని హోమం చుట్టూ తిరగమని నేను చెప్పానా? మంచి అనిపించుకోవడానికి ప్రతి దానిలో దూరిపోవడమేనా? ఇంటి వారసురాలు చేయాల్సింది.. ఇంటి పనిమనిషి చేస్తే ఒక్కరు కూడా ప్రశ్నించలేదని మండిపడుతుంది జ్యోత్స్న.

ఈ సమస్యకు పరిష్కారం నువ్వేనని గురువుగారు చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పెద్ద మేడం గారు నోరువిప్పి నిజాలు చెప్పారంటే సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని కార్తీక్ అంటాడు. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మీరు చేయి చూసి కాకుండా, మొహం చూసి కూడా జాతకం చెబుతారు కదా? మా పెద్ద మేడం గారు దేనికో ఈ మధ్య చాలా భయపడుతున్నారు.. మీరు ఆవిడ ముఖం చూసి తర్వాత ఏం జరగబోతుందో చెప్పమని అంటాడు కార్తీక్. నీ భవిష్యత్ కాస్త ఇబ్బందికరంగానే ఉంది, సాలెగూడులో చిక్కుకున్న జీవిలా ఇబ్బందిపడుతున్నావు... ఆ గూడు నుంచి నువ్వు బయటపడే సమయం వచ్చింది. రాబోయే కాలం మరింత కష్టంగా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని చెబుతాడు గురువుగారు. ఆ మాటలతో జ్యోత్స్న, పారిజాతంలు షాక్ అవుతారు.

నా భార్య గర్భవతి, తనని చాలా సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను.. కానీ చుట్టూ ఉన్న పరిస్ధితులు అందుకు అనుకూలంగా లేవని.. నా భార్య ముఖం చూసి ఆవిడ భవిష్యత్ ఎలా ఉందో చెప్పమని అడుగుతాడు కార్తీక్. నీ భవిష్యత్ కూడా ఇబ్బందిగానే ఉంది. నువ్వు కావాలని అనుకునే దాని కోసం... నువ్వు కోరుకున్నది వదులుకునే పరిస్ధితి వస్తుంది. కాకపోతే నీకు శుభం జరగబోతోంది.. నువ్వు సొంతగూటికి చేరుకునే సమయం వచ్చింది అని చెప్పడంతో దీప, జ్యోత్స్నలు షాక్ అవుతారు. మీరు అన్నది జరగదు గురువుగారు.. ఒక మనిషికి సొంతగూడు అంటే పుట్టిల్లు, అమ్మనాన్న లేరు అంటే సొంతగూడు లేనట్లే అంటుంది పారిజాతం. చచ్చిపోయిన వాళ్లు ఎలాగూ లేరు.. కాబట్టి దీపకి సొంతగూడు లేనట్లే అంటుంది పారిజాతం. దీపకు కన్నవాళ్లు ఎవరో త్వరలోనే తెలుస్తుంది... కలవాలని రాసున్నప్పుడు కాలం మనుషుల్ని కలుపుతుంది, దానిని ఎవ్వరూ ఆపలేరని గురువుగారు చెబుతారు. వెళ్తూ వెళ్తూ బిడ్డ జాగ్రత్త అని గురువుగారు చెప్పడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఆసుపత్రిలో బ్లడ్ శాంపిల్స్ ఎప్పుడు వస్తాయో కనుక్కోమని దశరథకు చెబుతాడు శివన్నారాయణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X